Previous Page Next Page 
మహాశక్తి పేజి 15

    లైబ్రరీ అటెండర్ కి ముందే వార్నింగ్ యిచ్చాడు అక్కడికి రావద్దని.


    చిత్ర లోపలే ఉంది. కానీ ఏ మూల వున్నదో ఏం చేస్తున్నదో.

    ఆమె గొడవలో ఆమె ఉంది.

    జెన్నీ చేతులు మెల్లగా జారుతున్నాయి.

    ఆమెని తడుముతున్నాయి అతని చేతులు.

    "చెప్పావుగా. చేస్తను. యింకేమిటి?" అంది చీదరగా.

    సమాధానంగా ఆమెని గభాల్న కౌగిలిలో బిగించేశాడు.

    "ఛీ..... నాకు అసహ్యం" మొహాన్ని పక్కకి తిప్పేసుకుంది స్వర్ణ.

    "ఇప్పుడలాగే అంటావుకానీ తరువాత నువ్వే నా వెంట పడతావు."

    "షటప్. నీకు అక్కలు, చెల్లెళ్ళు లేరా"

    "ఉన్నారు. కానీ వాళ్ళు అక్కలు..... చెల్లెళ్ళు. కానీ యిలాంటి సరదాకి పనికొచ్చే నీలాంటి బొమ్మకాదు."

    కళ్ళలో ఎర్రని జీరలతో తోడేలులా చూస్తున్నాడు జెన్నీ. తన పీకని కొరికి రక్తం తాగడానికి సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నాడు.

    "ప్లీజ్ విడిచిపెట్టు" దీనంగా చేతులు జోడించింది. సరిగ్గా అప్పుడే ఆమె పవిట జారిపోయింది.

    ఎత్తుగా కనిపిస్తోన్న..... ఆమె గుండెలని రెచ్చిపోతూ చూసి ఒంగి ముద్దు పెట్టుకున్నాడు జెన్నీ.   

    ఆమెకి ప్రాణం పోతే బాగుండనిపించిందా క్షణంలో అసలేమనుకుంటున్నాడు తన గురించి.

    ఆమెలో ఉద్రేకం, కసి పెరుగుతున్నాయి. కానీ "అనువు కాని చోట" పద్యం గుర్తుకొచ్చింది.

    నిస్సహాయత.

    ఆమె నవనాడులూ కుంగిపోతున్నాయి.

    ఆమె కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.

    "జెన్నీ, ప్లీజ్, నన్నేం చేయకు. అల్లరి పెట్టకు. నువ్వు చెప్పినట్లే చేస్తాను.

    నిన్నెప్పుడూ నేను ఏమీ అనలేదు.

    నీ దారికి అడ్డురాలేదు. ప్లీజ్ ప్లీజ్ జెన్నీ నన్ను చంపకు."

    ఆమె నడుం కింద చుట్టూ పాము చుట్టుకున్నట్టుగా అతని చేతులు.....

    "నే నొచ్చింది ఒకందుకు. కానీ యిప్పుడు నా మనసు నీతో అనుభవాన్ని కోరుతోంది. నీకు స్వర్గం ఎలా వుంటుందో తెలీదు. చూపించనా"

    "నాకు స్వర్గం కాదు. నరకం చూపిస్తున్నావు. నేను చచ్చిపోతాను."

    "ఇంత అందం ఎవరూ పొందకుండా మట్టిపాలు కావడం అన్యాయం స్వర్ణా! ఐ వాంట్ యూ."

    "జెన్నీ! నా సంగతి నీకు తెలీదు నేను ఆత్మహత్య చేసుకుంటాను" బెదిరించింది ఆఖరి అస్త్రంగా.

    జెన్నీ నవ్వాడు.

    "ఆత్మహత్య చేసుకోవడం అంటే కూల్ డ్రింక్ తాగినంత తేలికనుకొంటున్నావు కాబోలు. దానికి బోలెడంత ధైర్యం కావాలి స్వర్ణా..... నీలాంటి పిరికివాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు.

    బతుకంటే పిరికివాళ్ళకి అంత తీపి.

    అందుకే నీలాంటి దాన్ని నోరు నొక్కి అనుభవించినా నోరెత్తి ఎవరికీ చెప్పుకోలేరు."

    "విడిచిపెడతావా, లేదా?" ఆవేశంగా అంది స్వర్ణ.

    ఆమెకి కొంచెం ధైర్యం వచ్చింది.

    "సరే ఈ కార్యక్రమానికి తరువాత ముహూర్తం పెట్టుకుందాం. నీకు తెలిసిన పురోహితుడుంటే నువ్వే కనుక్కో. ఈలోగా ఈశ్వర్ గాడి చరిత్ర ఫినిష్ చేస్తాను.

    రేపు నీకు లెటరిస్తాను.

    పిచ్చి వేషాలేశావో నిన్ను కిడ్నాప్ చేసి, రేప్ చేసి, చంపి ఏ చెరువులోనో పారేస్తాను. సో. మనం రేపిక్కడే కలుసుకుందాం. ఓ.కే." అన్నాడు.

    ఆమె నడుంకింద గట్టిగా నలిపి విడిచిపెట్టాడు జెన్నీ. వస్తున్న ఏడుపుని ఆపుకొంటూ అక్కడి నుంచి పరిగెత్తుకొంటూ వెళ్ళిపోయింది స్వర్ణ.           
   

 Previous Page Next Page