'లోకం ఏమనుకుంటుంది?'
'లోకం ఏం అనుకోదు. దానికేం తెలుసు?'
'మినీ- నాతో వచ్చేస్తావా?' ఇంట్లో శతాబ్దాలుగా ఖాళీగా వున్న పూజా మందిరంలోదేవీ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని తపస్సి చేస్తూ ఫలించి కోరిక కోరినట్టుగా అడిగాడు.
"ఎ జన్మలో ఏ పాపం చేసుకున్నానో మీకు దూరమై యీ బ్రతుకులాక్కొస్తున్నాను. వద్దు.
మళ్ళీ ఒకరికి అన్యాయం చేసి పాపం మూటకట్టుకోనా?'
నిట్టూర్చాడు అతను
'రఘూ! నా దొక్కటే కోరిక- చివరి ఘడియల్లో నీ ఒడిలో తలదాచుకుని నీకళ్ళలోకి చూస్తూ నా చూపులు నీ చూపులతో కలసిపోయి ప్రాణం ఆవిరైపోవాలి. అప్పటికీ ఇద్దరికీ వయసైపోయి వుంటుంది. మనవాళ్ళకి ఎవరికీ అనుమానాలు వుండవు. విషపుచూపులు చూడరు.'
"మినీ-ఎక్కడున్నా ఎలా వున్నాయీ నీ కోరిక తీరుస్తాను. బ్రతుకు పంచుకోలేకపోయినా చావునయినా పంచుకుందాం."
'రఘూ! యీ మాట నిలుపుకోవాలి.'
'ఎన్నిజన్మల బంధం ఇది'
'మనకి వియోగం ఎక్కడిది మినీ- అతనో క్షణం ఆగేడు. "నీవులేని ఊహలేదు. నిన్ను ఊహించని క్షణంలేదు. ప్రతిదానికీ తీపి తలపు. ఎంతపోగొట్టుకున్నాను. తెలిసిన బాధ. అయినా ఈ మనస్సు- ఈ మమత- ఈ గుండె చప్పుడు నాదే అన్న తృప్తి రాక్షసులతో జీవిస్తోన్నా దేవతాభావన అమరమవుతున్నది.
"చాలురఘూ"
'టెలిగ్రాం యిచ్చి వస్తాను' మురళిపాదాలు కఠినంగా నేలనితాకుతూ కదలుతున్న శబ్దానికి కళ్ళు విప్పింది రుక్మిణి.
"రుక్కూ!"
ఏ భావమూ ప్రకటించని చూపుపాతికేళ్ళుగా అలాగే చూస్తోంది. ఎన్నడూ అసంతృప్తి ప్రకటించలేదు. కానీ ఆ మనిషికి తృప్తిలేదని తెలుసు. దేనికీ అడ్డు చెప్పలేదు. కానీ దాన్లోనూ యిష్టం లేదని తెలుసు. శత్రువులు జీవితం పంచుకున్నట్టుగా బ్రతికారు ఇద్దరూ- ఇది ఎందరికి తెలుసు-'
"టెలిగ్రాం యివ్వటానికి మురళివెళ్ళేడు-" రుక్మిణిఅదోలా చూసింది. నమ్మీనమ్మని స్థితి.
"రాఘవగారికి." ఆమె కళ్ళు మూసుకున్నది.
ఎదలోతీపి తలపులు....సంగీత ఝరులు......ప్రణయసాగర సంగమ వేళలో పరువులెత్తేనదీ కన్య పరవళ్ళు.
"రాఘవా! ఇంత నిర్మొహమైనమోహం- ఇంత నిర్మలమైనప్రేమ ఇంత నిస్వార్ధమైన ఆరాధన- ఎన్ని జన్మలతపః ఫలితమో! నేను అదృష్టవంతురాలిని."
"మినీ!" అతనిగొంతు ఆర్ద్రమైంది. "ఇది...... యిది..... ఒకరికి చెపితేతెలిసేది కాదు. వెన్నెల చల్లదనం- పూల కమ్మదనంవలపు తీయదనం-ఇవన్నీ అనుభవపరిమళాలు."
"రఘూ! నేను జాబ్ వదిలేస్తున్నాను.....నీకు ట్రాన్స్ ఫర్ అవుతుంది కదా!" ఆమె కంఠం రుద్దమైంది. "మన వృత్తి అందరిలా కాదు. డెబికేటెడ్గా లేకపోతే ఎన్నో ప్రాణాలు పోతాయి."
"మినీ!" అతని కంఠం రుద్దమైంది. "నా వల్ల ఎన్ని బాధలు-"
అతని మాటలు పూర్తికాలేదు. ఆమె దీనంగా చూసింది. "ఇది బాధా నాకు ఈ జన్మలో భగవంతుడు ప్రసాదించిన వరం! నిన్ను చూసేదాకా నేనేం పోగొట్టుకున్నానో తెలీలేదు. నిన్ను
చూశాకానా కెంత సౌభాగ్యందక్కిందో తెలుసుకున్నాను. రఘూ మనల్ని లోకంకొలతలో కొలవద్దు. వేయి వాకిళ్ళు తెరుచుకొని గుండె ఎదురుచూసింది. నీ కొలువు కోసం. శతపత్రాల్లాగా యీకళ్ళు విరిసేది నీ చూపుకోసం.....అంతే!'
"మినీ-" ఆమెవైపు ఆర్తి ఆరాధన అనురాగం నిండే కళ్ళలో చూస్తూ అన్నాడు. "మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో! చివరి చూపులకోసం తప్పక వస్తాను. అంతదాకానువ్వు యీ గుండెల్లో సజీవ మూర్తిగా వుంటావు మనకి వియోగం లేదు. విరహం లేదు."
"ఒకపాట"
"పాడుమినీ..... ఎప్పుడూ నీ పాట నాచెవుల్లో చల్లనిసంగీతం వినిపించేలా పాడు......"