Previous Page Next Page 
మధుకీల పేజి 5

    తన తమ్ముడి, కుమారుడి తప్పులు ఎత్తిచూరటంతో తెలుగు లెక్చరర్ గారి ముఖం మాడిపోయి గొంతు తడారిపోయింది. అంతలో దైవం రక్షించాడా అన్నట్టుగా బెల్ అయింది.
    పోలోమంది క్లాసు. తర్వాతక్లాసు హిస్టరీక్లాసు. క్లాసు క్లాసంతా ఎందుకంత ఉత్సాహంగావుందా అని చూశాడు. క్లాసులో అమ్మాయిలు కూడా ముకాల్లో ఫ్లోరోసెంట్ లాంపుల్ని వెలిగించుకున్నారు.
    సుదాకర్ అతని సీట్లు కూర్చున్నతనికి స్థానభ్రంశం కలిగించి తనసీటుని ఆక్రమించుకున్నాడు-అంతలో ద్వారం వద్ద ఎవరో కొత్తయువతి రావటంచూశాడు సుధాకర్.
    ఆమె!
    నిన్నతను మ్యాట్నీకి ఆహ్వానించిన స్త్రీ.
    ఓహో!
    తన క్లాస్ మేట్ అన్నమాట.
    "ఈ క్లాసుకాగానే వెళ్ళి ఫలకరించాలను"కున్నాడు.
    క్లాసంతా లేచి నిలుచుంది.
    'గార్డాఫ్ ఆనరు కాబోలు'అని అతనూ నించున్నాడు.
    కానీ ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చోవటంతో అతనుతెల్లబోయాడు. కొత్తహిస్టరీ లెక్చరరా! అవుకున్నాడు. ఈ లేత బుగ్గలవేమ లెక్చరరా? అనుకున్నాడు మళ్ళీ,
    అతనికి క్లాసులో కూర్చోబుద్ధి కాలేదు. బయటికి వెళ్ళే చొరవా కలగలేదు. ఏదో తెలియని భయం ఆవహించినట్టుగా నిలుచుండిపోయి క్లాసంతా కూర్చున్నా అతను నిలుచునేవుండిపోయాడు లెక్చరర్ సిడౌన్ అనేవరకూ.
    ఇక అతనికి ఆక్లాసు జరిగిన గంటా నరకంలో వున్నట్టుగా ఫీలయ్యాడు.
    క్లాసైపోయి ఆమె బయటికి వెళుతోంటే తనూ గబ గబా వెళ్ళి "క్షమించండి మేడమ్" అనేశాడు గబగబా.
    నవ్విందామె ఇంకేమీ అనకుండా.
    అంతలో ఇంకో లెక్టర్ రావటంతో అతనికి యింక మాట మాటాడటానికి అవకాశం చిక్కలేదు.
    ఒకవారం రోజుల తర్వాత సాయంకాలంపూట ఆఫీసునుంచి వచ్చిన సుందర్రావుగారు ఆరుబయట పడక కుర్చీలో కూర్చుని ఇంటిముందున్న మురుగుకాలవమీద మూగుతోన్న చీకటీగల్ని చూసి మునిసిపాలిటీ వాళ్ళని తిట్టుకుని చేతిలోవున్న వీక్లీవేపూ బజారూవేపూ చూస్తూ వీక్లీచదవటం అనే పనిని నిర్వర్తిస్తున్నాడు.
    వంటింటిపని ముగించిన జయప్రద పక్కింటి వసుంధర వెంటగుడికి వెళ్ళిపోయింది. పక్కింటివసుంధర భర్త ఎ.ఎ.ఒగా పనిచేస్తున్నాడు- పెళ్ళయ్యేనాటికి టెన్తుచదివిన వసుంధర ఇద్దరుపిల్లల తల్లి అనే హోదాతో పాటు రెండక్షరాల డిగ్రీ కూడా సంపాదించు కుంది-ఇప్పుడు మళ్ళీ గర్భవతి ఆమె. ఎం.ఏ ప్రీవియస్ కి చదువుతూవుంది. ప్రతిరోజూ మారుతీమందిరానికి వళ్ళిరావటం ఆమె దినచర్యల్లో ఒకటి-
    భర్త పక్కనే కూర్చుని అడిగింది అన్నపూర్ణ "విశాలాక్షివద్దకి ఎపుడు వెళ్లివస్తారు?"
    చేతిలోని క్లీమడిచి కళ్ళద్దాలు తీసిపై పంచతో తుడుచుకుని "ఊరకే వెళ్లొస్తే ఏమవుతుంది? వాళ్ళు వూ అంటే మనం సిద్ధంగా వుండొద్దూ" అన్నాడు.
    "బావుంది- వెళ్ళి వూ అనిపించుకుని వచ్చేస్తే అన్నీ అవే సిద్ధమవుతాయి."
    "ఆకాశం నుంచి వూడిపడతాయా ఏమిటి?"
    "ఎవరో ఓమహానుభావుడు చేయివేయకపోడు. 'కార్యం జరిగిపోకపోదు"
    "మంచిమాటే! నమ్ముకుని చేస్తే- నెరవేరిఫర్లేదు. తప్పితే అభాసుపాలు కావాలికదా?"
    "మీదంతా చాదస్తం, ముందురేపు వెళ్ళిరండి"
    "మంచిరోజు చూసుకుని__"
    "రేపు మంచి రోజే__"
    "నీవు అన్ని చూసే వుంచావన్నమాట."
    "మధ్యాహ్నం శాస్త్రిగారు వచ్చివెళ్ళారు. ఆయన్నడిగేరు."
    "అలాగే! హోంమినిష్టర్ గారి ఆజ్ఞ."
    నవ్వింది అన్నపూర్ణ.
    అంతలో అటుగావచ్చిన సుధామయిని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ-
    "ఎక్కడి కొచ్చావ్ సుధా? వేళగానివేళ వస్తున్నావు' చేతిలో ఏమీలేదు__"
    "భయపడకండి అత్తయ్యా! నేను ఈ వూరొచ్చి వారం అయింది-నేనిక్కడ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాను. వర్కింగ్ వుమెన్ హాస్టల్లో వుంటున్నాను. మిమ్మల్నీ మావయ్యనీ చూసిపోదామని వచ్చాను" అని నమస్కారాలు చేసింది.
    సుధ అన్నపూర్ణ పుట్టింట్లో వాళ్ళపక్కింటి ఆచార్లగారమ్మాయి. అక్కడ ఆరెండు కుటుంబాలకే చాలా సన్నిహితంవుంది- కులమతాలకీ అక్కడ అతీతమయిన స్నేహబంధఘం అది- సుధ అమ్మగారు ప్రసన్నలక్ష్మి అంటే అన్నపూర్ణకి ఆరో ప్రాణం.
    ఆ కబుర్లూ ఈ కబుర్లూ అయ్యాక ఎంత బలవంతం చేసినా భోజనానికి ఆగకుండా మరో ఆదివారం తీరిగ్గావస్తానని వెళ్ళిపోయింది. సుధామయి.

 Previous Page Next Page