Previous Page Next Page 
షా పేజి 48

 

    "మా డిపార్టుమెంటుకి నువ్వు అడ్డు రానంతవరకూ---"
    "తాంక్యు సర్"
    బయటకు నడిచాడు సృజన్.
    ఇప్పుడతనికి కొంత దైర్యం వచ్చింది. రాహి తనను కొంత వరకూ పట్టించుకోకపోవచ్చు. కనుక తను తన సొంత పరిశోధన ప్రారంభించవచ్చు. తనకేలాగూ ఈ పోలీస్ వాళ్ళ పరిశోధన మీద నమ్మకం లేదు. బయట మెడికల్ షాపులోనించి భారతికి ఫోన్ చేశాడతను.
    "హలో" అందామె.
    "హలో భారతి గారూ! నేను సృజన్ ని-----"
    "మీరా! ఎక్కడినుంచి?"
    "ఇప్పుడే యస్పీగారిని కలుసుకున్నాను."
    "ఏమయినా ఉపయోగం ఉందా-"
    "కొంత ఉండవచ్చు-----"
    "మరి ఇప్పుడు ఇంటికొచ్చెస్తున్నారా"
    "అది చెప్దామనే మిమ్మల్ని పిలిచాను. మీరు ఇంటికి వెళ్ళిపొండి. పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఎక్కడయినా హోటల్లో భోజనం చేసేయండి. నేను ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యం అవవచ్చు."
    "మళ్ళీ ఎక్కడికేళ్తున్నారు."
    "ఈశ్వర్ వర్మ దగ్గరకు......"
    "ఈశ్వర్ వర్మ దగ్గరకా --" నమ్మలేనట్లు అడిగిందామె.
    "అవును"
    "ఎందుకు -"
    "మా అన్నయ్యను వాళ్ళ కంపెనీ అపాయింట్ చేసుకున్నదీ లేనిదీ తెలుసుకోవటానికీ."
    "కానీ అయన మీతో మాట్లాడతారా అని........."
    "చూద్దాం! మాట్లాడితే నష్టమేమీ ఉండదుగా! మాట్లాడకపోతే నష్టం వుండవచ్చు."
    ఆమె నవ్వింది.
    "సృజన్! ప్రయత్నించండి......" అందామె ఫోన్ డిస్కనెక్ట్ చేస్తూ.
    "సరే" తిన్నగా ఈశ్వర్ వర్మ ఇంటికి చేరుకున్నాడు. టెలిఫోన్ డైరెక్టరీ అతని అడ్రస్ తెలుసుకోవటం చాలా తేలికగా జరిగిపోయింది. వైజాగ్ లో ఎవర్నడిగినా అతని పేరు చిరునామా చెప్పగలుగుతున్నారు. ఇంటి బయట యిద్దరు ఘుర్కాలు నిలబడి వున్నారు.
    "క్యాహొనా" అడిగాడోకతను.
    "అర్జంటుగా ఈశ్వర్ వర్మగారిని చూడాలి అన్నాడతను."
    "అప్ కా నామ్ క్యాహై?"
    "సృజన్?"
    ఒకడు లోపలికెళ్ళి ఎవరితోనో మాట్లాడివచ్చి సృజన్ జేబులు చెక్ చేశాడు. సృజన్ కి ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా పెద్ద వర్క్ షాప్స్ దగ్గర గానీ, మరీ ప్రాముఖ్యత ఉన్న రాజకీయ నాయకుల  ఇళ్ళ దగ్గర గానీ ఇలాంటి తనిఖీ జరుగుతుంటుంది.
    "అందర్ జావ్" అన్నాడతను.
    సృజన్ లోపలకు నడిచాడు. నాలుగంతస్తులున్న విశాలమైన భవనం అది. మొదటి గదిలోనే ఓ కళ్ళజోడు వ్యక్తీ విశాలమయిన టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు.........చుట్టూ చాలామంది విజిటర్స్ కూర్చుని ఉన్నారు.
    "ఈశ్వర్ వర్మ గారితో ఏమిటిపని?" కళ్ళజోడు వ్యక్తీ సృజన్ ని పరీక్షగా చూస్తూ అడిగాడు.
    "పర్సనల్"
    "అదేమిటో చెప్పందే ఇంతర్య్వు దొరకదు.
    "ఆయనతోనే చెప్తాను."
    "కుదరదు . ముందు నాతొ చెప్పాల్సిందే."
    "మా అన్నయ్య అంటే శ్రీధర్ -----అనే పేరుగల వ్యక్తిని ఎవరో వారం రోజుల క్రితం వైజాగ్ లో హత్య చేశారు."
    "అయితే"
    "మా అన్నయ్య మీ 'ఈశ్వర్ ఫార్మానుటికల్స్ ' కంపెనీలో ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చాడు -----కనుక మీకున్న కంపెనీల్లో ఎందులో అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చారు -? ఆయనకిచ్చిన ఉద్యోగం ఏమిటి? అన్నయ్యను చంపినా వారి గురించి అన్నయ్య తోటి ఉద్యోగస్తులేవరయినా ఏమయినా వివరాలు ఇవ్వగలరా\" అనే విషయాలు కనుక్కోటానికి వచ్చాను.
    అతను నివ్వెరపోయాడు.
    "మా కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు ఎవరు చెప్పారు మీకు?"
    "మా అన్నయ్యే" అబద్దమాడాడు సృజన్.
    "ఏమని చెప్పాడు?"
    "ఉదయంలో మీరు వేసిన అడ్వర్టైజ్ మెంట్ గురించి చెప్పి  వైజాగ్ బయల్దేరాడు."
    "ఏమి ప్రకటన అది?"
    "ఈశ్వర్ ఫార్మన్యుటికల్స్ కి సేల్స్ ఆఫీసర్ కావాలి అని."
    "అయితే అక్కడికే వెళ్లి అడగండి"
    "వెళ్ళాను. వాళ్ళెవ్వరూ సరయిన ఇన్ ఫర్మేషన్ ఇవ్వటం లేదు...."
    "అందుకు మేము చేయగలిగిందేమీ లేదు"
    "ఉంది ! మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కరెక్టుగా రికార్డు చెక్ చేసి వివరాలు ఇవ్వవచ్చు -- " కరుకుగా అన్నాడు సృజన్.
    "అదంతా మాకు సంబంధించినా వ్యవహారం కాదు మీరింక వెళ్ళవచ్చు."
    "నేను వెళ్ళటానికి రాలేదు....." అతని కెదురుగా ఉన్న కుర్చీ విసురుగా లాక్కుని అందులో కూర్చున్నాడు సృజన్. అతను గట్టిగా మాట్లాడే సరికి హాల్లో ఉన్నా విజిటర్స్ అందరూ అతనివేపే చూడసాగారు.

 Previous Page Next Page