Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 44


    ఎప్పుడైతే ఆమె సంపాదనపరురాలవుతుందో అప్పట్నుంచీ ఇంట్లో మిగిలిన కుటుంబసభ్యుల పెత్తనం కూడా కొంతవరకూ తగ్గుతుంది.

     ఏ పాతికేళ్ళకో వివాహం జరిపిస్తారు. అమ్మాయి. అత్తగారింటింకి వెళుతుంది. అక్కడా కూలీపనికిపోవడం తప్పదు. అత్తగారింట తనకు కలిసొచ్చిన సౌకర్యం ఒక్కటీ కనిపించదు. మూడుముళ్ళు పడ్డ ముచ్చట మూడునెలల్లో ఇగిరిపోతుంది.

     ఇక  మిగిలిన కుటుంబసభ్యులు ఎలా వున్నా మొగుడు ఎంతో కొంత అధికారం ప్రదర్శించడం గుర్తిస్తుంది.

    పుట్టింట్లో లేని సంకెళ్ళు ఇక్కడ తగులుకుంటున్నట్టు గుర్తిస్తుంది. ఇంతకుముందు లేని ఆ సంకెళ్ళు ఇప్పుడు తనకు ప్రతిబంధకంలా తయారయ్యాయని తెలుస్తుంది.

     వాటిని తెంచుకోవాలని నిశ్శబ్ద పోరాటం సాగిస్తుంది. కానీ లాభంవుండదు. పైపెచ్చు సంకెళ్ళు  ఇంకా   బిగుసుకుంటున్నాయన్న సత్యం బోధపడుతుంది. పుట్టింట్లో అయినా, అత్తింట్లో అయినా కష్టం తప్పనప్పుడు  ఇంకా  భర్త దగ్గర  ఎందుకుండాలో బోధపడదు.

     పుట్టింట్లో వున్న స్వేచ్ఛ రా రమ్మని పిలుస్తుంటుంది.అందుకే ఏదైనా చిన్న వ్యవహారం వచ్చినా భర్తను వదిసేలి పుట్టింటికి చేరిపోతుంది.

     ఆమె పొట్టకూటికి ఎలానూ ఆమె సంపాదించుకుంటుంది గనుక కుటుంబానికి పెద్ద భారంగా తోచదు.

     ఇలా  వాళ్ళు చాలా సులభంగా పుట్టింట్లో  సెటిలైపోతారు. సత్యవతి కూడా  అలా వుట్టింటికి వచ్చేసిందే.

     ఆమెకి ఈ సమస్య ఎప్పుడో  వచ్చుంటుంది.అందుకే ఆమెను సలహా అడగాలని అనుకున్నాను.

     సాయంకాలం నాలుగు గంటలకే పొలం వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి  నూర్ఫిళ్ళు జరుగుతున్నాయి.

     ధాన్యన్నంతా బస్తాల్లోకి  ఎత్తేటప్పటికి చీకట్లు పడుతున్నాయి నేనూ సత్యవతి ఇంటికి బబయల్దేరాం.

     ఆమెతో ఏవేవో కబుర్లు చెప్తూ అసలు విషయంలోకి దిగాను.

     "పేరు అడగొద్దు. మా వీధిలోని ఓ పిల్ల నెలతప్పింది. దాన్ని పోగొట్టుకోవాలి. ఏం చేయాలి?"

    చీకట్లో  సత్యవతి రియాక్షన్ తెలియడంలేదు. మిణుగురు పురుగులు ఆమె మీద వాలడంతో ఆమె నడుస్తున్న వెలుగు పూలచెట్టులా వుంది.

     గాలిపొలాల్లో పడి పట్టారని ఆనందంతో దొర్లుతున్నట్టు తెరలు తెరలుగా వీస్తోంది. మబ్బుల ఆకాశం నా మీదకి ఒంగినట్టు అనిపిస్తోంది.

     "మీ క్కాదు గదా" చాలా నెమ్మదిగా అంది సత్యవతి ఏదో రహస్యం అడుగుతున్నట్టు నామీదకి వంగి.

    "ఛీ ఛీ.... ఒట్టు. మా వీధిలో  పిల్లకి"

    "ఆస్పత్రి పద్ధతులు మాకు తెలియదు. మేం ఎప్పడైనా ఇలాంటి పరిస్థితి వస్తే చెంగమ్మ ఇచ్చే ఆకుపసరు తాగుతాం" అంది సత్యవతి.

     " అది నాకూ తెచ్చిస్తావా?" ప్రాధేయ పడుతున్నట్లుగా  అడిగాను.

     " అలానే" అంది ఆమె

     మరుసటి రోజు సత్యవతి ఓ సీసాలో పచ్చటి ద్రావకాన్ని తెచ్చి ఇచ్చింది. టిఫిన్ చేశాక బాత్రూమ్ లో స్నానానికి వెళ్ళినప్పుడు దాన్ని తాగేశాను. 

    ఆరోజంతా కడుపులో ఏదో దేవినట్లు అనిపించింది. వాంతులు వచ్చినట్టు ఫీలింగ్. రెండోరోజుకంతా సమస్య తీరిపోతుందని సత్యవతి చెప్పిందిగానీ నాకైతే ఏమీ లాభం కనిపించలేదు. పై పెచ్చు కడుపునొప్పి ప్రారంభమైంది.

     గంట గంటకు నొప్పి ఎక్కువ అవుతోందే తప్ప దగ్గడంలేదు. బాధతో మెలికలు తిరిగిపోతున్నాను.

     మరొకరికి సందేహం రాకుండా ఆ కడుపునొప్పిని నాలో నేను భరించడం నరకమైపోయింది.

     రెండో రోజుకి కడుపు నొప్పి తగ్గింది. కొద్దిగా స్థిమితపడ్డాను. ఇక ఈ సమస్య తీరేది ఒక్క రమనవల్లనే.
    నా అదృష్టం కొద్దీ  ఆరోజు సాయంకాలం తను అఊర్లోకి వచ్చాడు.   

    "మీ హీరో వచ్చాడే" అని విషయం మొదట చెప్పంది వేదవతి. మరోమాట కూడా వినలేదు. తూనీగ లాగా ఎగిరి ఇంట్లోకొచ్చి పడ్డాను.  నాకోసం వచ్చి ఇంట్లో లేనని వెళ్ళిపోతాడేమోనని నా భయమంతా.

     ఆ పూటకి వంట పూర్తయిపోయింది కబట్టి అమ్మ చుట్టుపక్కల ఎక్కడికో బాతాఖానీకి వెళ్ళినట్టుంది. నాన్న ఇంకా పొలంనుంచి రాలేదు. నిశ్శబ్దం అక్కడ కొంత సేపు విశ్రాంతి తీసుకుంటున్న్టట్టు అనిపించింది.

     తలుపు తీసుకుని లోపలికెళ్ళాను. రమణకోసం చూస్తూ ఖాళీగా ఊరకనే వుండలేకపోయాను.

     కాలం తేలుకొండిలాగా భయపెడుతోంది.ఏమీ తోచక ఏదో చేతికందిన వీక్లీ చూస్తూ కూర్చున్నాను.

 Previous Page Next Page