Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 43


    ఆ సమయానికి నాన్న పొలానికి వెళ్ళుండేవాడు. అమ్మగాని అప్పుడు లేకుంటే మీద పడేవాడు. వారం  రోజుల విరహమంతా అతని గాఢమైన ముద్దుల్లో, ఊపిరాడని కొగిలింతల్లో కొట్టుకుపోయేది.

     ఇంత జరిగాక అలవాటు పడిన శరీరాలు ఊరుకుంటాయా? నేరుగా మంచం దగ్గరికిలాక్కెళ్ళేవి. అందుకే ఇలాంటి వాటిని రుచి చూడకుడదు.ఇద్దరి మధ్యా వుండే ప్రేమభావం స్థానంలోనే సెక్స్ ప్రవేశిస్తుంది. శారీరక కలయిక లేకముందు ప్రేమ కేంద్రబిందువులా వుండి సెక్స్, రొమాన్స్ అభిమానం,ఇష్టం- దానిచుట్టూ పరిభమిస్తూ వుంటాయి.

     ఎప్పుడైతే ఇద్దరూ కలుసుకుంటారో ఆక్షణం నుంచి సెక్స్ కేంద్ర బిందువై మిగిలినవన్నీ దాన్నించి ఉద్భవించే బై ప్రోడక్ట్సు అవుతాయి.

    మేమిద్దరం ఎంత యావతో వ్యవహరించే వాళ్ళమంటే  అమ్మ ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన పూజకు కూర్చుంటుంది. దాదాపు అరగంట ఆమె పూజ చేసేది. ఆదివారం కరెక్టుగా ఆ వేళకి రమణ హాజరై పోయేవాడు.

     అమ్మ పూజగదిలో పూజ ప్రారంభించగానే అవతిలి గదిలో మేమిద్దరం రోమాన్స్ లో దిగిపోయేవాళ్ళం.అమ్మ చివరగంట కొట్టడం మాకు సిగ్నల్  అన్నమాట. ఆ పాటికి అన్నీ ముగించి అయిపోయిన  మాశరీరాల్ని తృప్తిగా చూసుకునేవాళ్ళం.

     ఒక్కోక్కప్పుడు మా ఇంట్లో  వీలుకాకపోతే రమణ నన్ను తన ఇంటికి రమ్మనేవాడు.

     అతనితల్లి వీధి చివరిలో వుండే బావిదగ్గరికి పళ్ళు తోముకోవడానికి వెళ్లేది. పళ్ళు తోముకుని , బావిలోంచి  నీళ్ళు తోడుకుని ముఖం కడుక్కొనేప్పటికి పావుగంట పైగానే పట్టేది. ఈ సమయంలో మేమిద్దరం మన్నథసామ్రాజ్యాన్ని ఏలేవాళ్ళం. ఇలా కాలం గజ్జెల గుర్రంలా పురగులు పెడుతున్నట్టుండేది. నాకు శనివారం ఎప్పుడొస్తుందా అని  అతను వెళ్ళిన మురక్షణం నుంచి  ఊహల్లో పడిపోయేదాన్ని వారంలో ఆదివారం రావడం అంటే పండగలా  వుండేది.

    ఎప్పుడైనా  మేం శారీరకంగా కలుసుకోలేకపోయే వాళ్ళం. ఎంత దిగులుగా వుడేదో,ఏదో వెలితి హృదయాన్నంతా ఆక్రమించుకుని మొత్తం ఆస్తిత్వాన్నంతా పోగొట్టుకున్నట్టు అనిపించింది. నిద్రను లాగి కాళ్ళతో తన్నినట్టు నిద్రొచ్చేదే కాదు. ఆకలి వేసేది కాదు. అందుకే వచ్చినప్పుడు ఎంత రిస్క్ అయినా ఫేస్ చేసి దాన్ని సాధించుకునేవాళ్ళం.

     అతనికి  పరీక్షలు దగ్గరపడ్డాయి. ఆ ఆదివారం రాలేదు. నాకు మొత్తం ప్రపంచమే  ఇరుకుగా  అనిపించింది. రాడని తెలిసినా ఊరికే అలా వీధిలోకి వెళ్ళి నిలబడేదాన్ని. అతనింటికివెళ్ళి అతని తల్లితో కబుర్లాడే దాన్ని. అయితే ఏదీ ఆలోటును భర్తీచేయడం లేదు. దిగులుదిగులుగా అనిపించింది.

    ఇలా  కాదని నాకు అలవాటైన ఓట్రిక్కును ప్లే చేశాను. అదేమి టంటే మా ఊర్లో పోస్టోఫీసు వుంది. అక్కడ ఎర్రటి పోస్ట్ డబ్బా ఒకటుంది. దాని చూసి ఎవర్ని చూడాలని మనసులో అనుకుంటా నేమో ఆ వ్యక్తి  కనిపిస్తాడు ఇది నా సెంటిమెంట్.

     ఆదివారం సాయంకాలం ఇక భరించలేక వీధి వెంబడి నడిచి పోస్టాఫీసు దగ్గరికెళ్ళాను.  పోస్ట్ డబ్బాను చూస్తూ రమణని పంపించమని వేడుకున్నాను.

     నా  సెంటిమెంట్ చూసి నవ్వక. ప్రేమలో ఇలాంటిది మామూలని  నువ్వూ ఓప్పుకుంటావు.

     కానీ  రమణ రాలేదు. ఆ రోజుతో మ ళ్ళెప్పుడూ పోస్ట్ డబ్బా సెంటిమెంట్ ను ప్లే చేయలేదు.

    భూమి సూర్యుని చుట్టూ. తిరిగినట్టు నా మనసంతా దిగులుచుట్టూ తిరిగుతున్నట్టు అనిపించింది.

     కొన్ని రోజులకు నాకు నెలతప్పినట్టు అనుమానం  మొదలైంది. ఏదో తెలియని భయం గుండెల్లో గూడుకట్టుకోవడం ప్రారంభిమైంది. ఏం చేయాలో తోచడంలేదు.అప్పుడే పరీక్ష రావాలా? రమణ చేపితే అతనే ఏదో చేస్తాడన్న నమ్మకం. కానీ అతనూ రాలేదు. పిరిరయాడ్సూ రాలేదు.

     అ సమస్యతప్ప మరేమీ గుర్తుకు రావడంలేదు.ఏదైనా సమస వచ్చినప్పుడు మన ఆలోచనా విధానమే మారిపోతుంది. అందుకేననుకుంటా వ్యక్తికన్నా పరిస్థితులు బలమైనవి. వాటిముందు మనిషి లొంగిపోకతప్పదు. ఒక  మనిషి ప్రవర్తన, నీతినియమాలు , విలువలు-అన్నీ పరిస్థుతులమీద ఆధారపడి వుంటాయి. ఇవన్నీ మనం ఆలోచించం.
     ఓ మనిషిని తప్పు  పట్టేస్తాం తప్ప   ఆ తప్పు చేయించే పరిస్థితుల గురించి ఆలోచించలేం.

    ఏం చేయాలో  నాకు తోటకుండా పోయింది. జీవితంలో  ఓకొత్త సమస్యని ఎదుర్కొంటున్నాను. అంతకుముందు దానిగురించి ఓ అవగాహన లేదు అనుభవం అంతకన్నాలేదు.

     ఏదోచెయ్యాలి. లేకుంటే ప్రమాదమని తెలుసు. ఆ పరిస్థితిలో నాకు దొరిగింది సత్యవతి ఆమెకు ముఫ్పై అయిదేళ్ళు వయసుంటుంది. మా పొలం పనులు చూసే సేద్యగత్తె. పెళ్ళయిన ఆర్నెల్లకే భర్తను వదిలి పట్టింటికి వచ్చేసింది.

     కూలీల్లో చాలామంది స్త్రీలు అంతే. భర్తతో కాపురం చేయరు.అలా గని  వాళ్ళు తిరుగుబోతులు కాదు. వాళ్ళ పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయనుకుంటా. పుట్టింట్లో వాళ్ళకు ఊహకు వచ్చినప్పట్నుంచీ పనులు చేస్తుంటారు. దానికి కూలీ వస్తుంటుంది.ఎప్పుడైతే తాము తమ కాళ్ళ మీద నిలబడగలుగుతారో అప్పట్నుంచీ  స్వతంత్ర మనస్తత్వం వచ్చేస్తుంది, తమ ఇష్టాలకనుగుణంగా ప్రవర్తిస్తుంటారు.

 Previous Page Next Page