గ్రామం చేరుకున్నారు. దినమొలలతో ఉన్న మొగపిల్లలు, చింపిరి తలలతో ఉన్న ఆడపిల్లలు, రావికలు లేకుండా కొందరు, ఉండి కొందరు ఆడవాళ్ళు దరిద్రం ఉట్టిపడుతోన్న వాతావరణం, తాటాకుపాకలు.....
అక్కడ అలా నిలబడిపోయాడు శర్మ. అతని అడుగు ముందుకు పడలేదు ఎంత దరిద్రం పేరుకుపోయి ఉంది! ఈ దేశంలోని దరిద్రంతో పాటుమురికి, బయటా, మనుషుల లోపలా-అంతులేనంత మురికి!
"పంతులమ్ముందా?" ఎవరినో అడుగుతోంది శామి.
"ఆ! ఉంది బళ్ళో ఉంది."
ఎంతో ఆశతో, శామితో పాటు బడి అనబడే పాకలోకి అడుగు పెట్టారు తండ్రీ కూతుళ్ళు.
చిన్న చిన్న పిల్లలకూ, పెద్దవాళ్ళకూ, కూడికలూ, తీసివేతలూ చెప్తున్న పంతులమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆవిడ విమల కాదు.
"ఎవరు మీరు? ఏం కావాలి?"
పదునుగా ఉంది ఆవిడ కంఠం.
శకుంతల తడబడింది___
"పంతులమ్మ! ఇదివరకు ఇక్కడుండే పంతులమ్మ.
ఆవిడ మాటలు నిజం కావచ్చు. నటన కావచ్చు. ఏమైనా చెయ్యగలిగిందేమీ లేదు.
ముగ్గురూ నిరాశగా వెనుతిరిగారు. దారిలో శామిని అడిగాడు శర్మ.
"ఇప్పుడు చదువు చెప్తున్నావిడ పేరేమిటి?"
"పంతులమ్మ!" అమాయికంగా చెప్పింది శామి.
శకుంతల, శర్మ ఒకరి నొకరు చూసుకున్నారు. భారంగా నిట్టూర్చాడు శర్మ.
27
శామి కంగారు పడుతూ వచ్చింది. దాని ముఖంనిండా చెమటలు, చేతులు వణకటం....స్పష్టంగా కనపడుతోంది.
"ఏమిటది? ఎందుకలా అయిపోతున్నావ్?" అడిగింది శకుంతల.
"ఏ....ఏంలేదు" దాని మాటకూడా తడబడసాగింది. నిలబడలేక కూలబడింది.
"ఉండు కొంచెం మంచినీళ్ళు తాగు!" తనే స్వయంగా గ్లాసుతో మంచినీళ్ళందించింది. ఆ నీళ్ళందుకుంటున్న శామి కళ్ళనిండా నీళ్ళు.......
"ఏయ్ పిచ్చీ! ఎందుకేడుస్తున్నావ్? నీకు నేనున్నాను, ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాను - చెప్పు."
శామి మరింత బావురని ఏడ్చేసింది.
"ఊరుకో! ఊరుకో!" అని శకుంతల భుజంతట్టి ఓదార్చాక కొంత సేపటికి కళ్ళు తుడుచుకుంది.
"శకుంతలా! ఒక్కటడుగుతాను___ కోపం తెచ్చుకోకుండా నిజం చెపుతావా?"
శకుంతల ప్రయత్నంవల్ల శామి నాగరికుల్లాగే మాట్లాడుతోంది.
"అడుగు?"
"కోపం తెచ్చుకోకూడదు."
"తెచ్చుకోను."
"నీకు..... నీకు.....రమేష్ తండ్రి అటగా!"
శకుంతల ముఖం ఎర్రబడిపోయింది.
"అలా చూడకు. నాకు భయం వేస్తోంది. నిజం చెప్పు__ నిజం చెప్పు" మళ్ళీ ఏడుపు ప్రారంభించింది శామి.
"ఏమిటిది? ఊరుకో! నా జన్మకు అతడు కారకుడట! అంతే. దానికీ నీ ఏడుపుకీ ఏం సంబంధం?"
శామి మంత్రించినట్లు ఏడుపు మానేసింది.
"చెప్పు! నీ ఏడుపుకీ, రమేష్ నా తండ్రి కావటానికీ ఏం సంబంధము?"
శామీ తడబడుతూ __ "బయట రమేష్ నీకేదైనా అపకారం చేస్తాడని చెప్పుకొంటున్నారు. నీ తండ్రి అయితే చెయ్యడుగా" అంది.
"వాడు ఏం చేసినా నాకు ఆశ్చర్యం కలగదు" అంది చికాకుగా శకుంతల.
"ఇకమీదట అతడి పేరు నా దగ్గర ఎత్తకు" అని హెచ్చరించింది.
"నేను వచ్చింది అందుకు కాదు. మరో రహస్యం చెప్పటానికి."
"ఏమిటి?"
"ప్రభాకర్ తో మాట్లాడటానికి ఆయన ఆ రోజు రాత్రి నీతో మాట్లాడిన గురూగారు వస్తున్నారు."
ఇప్పటికీ శామికి రాజుపేరు తెలీదు. ఒక్కసారిగా శకుంతల మనసు కుతూహలంతో నిండిపోయింది.
"మీ గురువుగారు వస్తున్నారా? నిజంగానా? ఎక్కడికి? ప్రభాకర్ తో మాటలు దేనికి? ఎప్పడు?"
శకుంతల ఉత్సాహానికి తగినట్లుగా తానూ ఉత్సాహం చూపలేదు శామి. ఎదురుగా దాని ముఖం మరింత వడిలిపోయింది.
"ప్రభాకర్ గారు రమేష్ బాబు ఇంట్లో ఉంటున్నారుగా! గురూగారూ ఆడికే వస్తారుట.....రాత్రి పదిగంటలకి."
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
"డాడీతో చెప్పివస్తాను" అంది శకుంతల- రమేష్ పేరు వినగానే ఉత్సాహం నీళ్ళు కారిపోగా.
"వొద్దుద్దు. గురూగారూ ఎవరితోనూ చెప్పొద్దన్నారు. నా పీక తెగిపోద్ది."
శకుంతల ఆలోచనలో పడింది లోలోపల ఏదో ధ్వని వెళ్ళొద్దని హెచ్చరిస్తోంది. రమేష్ పేరు అణువణువునా ఏదో వ్యతిక్తతను నింపుతోంది. అయినా రాజూ వస్తున్నాడు. అతడిని మరొక్కసరి చూడగలిగితే....మనసుని విప్పి మాట్లాడగలిగితే......
"సరే! రాత్రి పదింటికి ఇద్దరం వెళ్దాం." అనేసింది.
శామి వెంటనే అక్కడనుంచి కదలలేదు. దిగాలుగా కూర్చుంది. కొంచెం సేపాగి "పోనీ! వెళ్ళొద్దు- మానేద్దాం" అంది-తెగించి నిశ్చయానికి వచ్చినట్లు.
"మేమంతా ఒకటే! ఏం కావాలో నన్నడగండి. ఇదివరకుండే పంతులమ్మ అంటే ఎవరూ చెప్పలేరు"
శర్మ తొందరపడ్డాడు.
"విమల ఎక్కడున్నారో మీరు చెప్పగలరా?"
ఆవిడ కనుబొమలు చిట్లించి శర్మను పరీక్షగా చూసింది.
"ఆ పేరుగల వాళ్ళెవరూ నాకు తెలీదు." నిర్లక్ష్యంగా అంది.