Previous Page Next Page 
షా పేజి 43

 

    మధ్యాహ్నం రెండు గంటలకు దిగాలుపడి కూర్చుని ఉన్నాడతను. భారతి అతని దగ్గర కొచ్చింది నెమ్మదిగా.
    "సృజన్ ! మీకో సలహా ఇచ్చేదా?"
    అతను నిర్లిప్తంగా తలెత్తి ఆమె వేపు చూశాడు.
    "ఏమిటది?"
    "మీరు వెంటనే ఈ ఇల్లు అమ్మేసి వైజాగ్ వచ్చేయండి"
    అతనికి ఆమె మాటలు సరిగ్గా అర్ధం కావటం లేదు.
    "వైజాగ్ కా?"
    "అవును"
    వైజాగ్ పేరు వినగానే సృజన్ లో ఆవేశం ముంచుకొచ్చింది.
    ఎవరో ఒక దుర్మార్గుడి వల్ల తన కుటుంబం అంతా నాశనమయిపోయింది . అలాంటి వాడిని ఇంక ఏ పరిస్థితి లోనూ వదలదల్చుకోలేధతను.
    తనకెలాంటి ప్రమాదం ఎదురయినా , ఎవరు అడ్డుకున్నా - ఆ హంతకుడిని వదలడు. తనే వాడిని వెంటాడి వేటాడి చంపుతాడు.
    "అవును భారతీ! అక్కడికొచ్చేస్తాను-"
    "అక్కడయితే పిల్లలను నేను కనిపెట్టి ఉండటానికి అవకాశం ఉంది" అందామె.
    "ఆమె మాట నిజమే అనిపించిందతనికి. ఇప్పుడు పిల్లలకు తల్లీ తండ్రులను మరిపించెంత ప్రేమ కావాలి. యెవరిస్తారది? ఒక మగాడి వల్ల సాధ్యం కాని పని అది. అన్నయ్య తనెంత ప్రేమగా చూసుకున్నా, తనకు తల్లి ప్రేమను మరిపించెంత అనురాగాన్ని పంచింది తన వదినే"
    "మీరీ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నేను అంత వరకూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది -- పిల్లలు నన్ను వదిలి ఉండటం లేదు.అవతల నా ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది.....ఎక్కువ రోజులు నేనిక్కడుండిపొతే--"
    సృజన్ తన కర్తవ్యం అర్ధమయింది.
    వీలయినంత త్వరగా తనీ కార్యక్రమాలు చూడాలి. లేకపోతే తన వల్ల భారతికి సమస్యలు చుట్టుకుంటాయ్. లేచి బయటకు నడిచాడతాను.
    రంగా, స్వరూప్ భిన్నులయి కూర్చుని ఉన్నారు.
    వాళ్ళ భుజం మీద చేయి వేశాడతాను ఆప్యాయంగా.
    "ఒరేయ్ అర్జంటుగా మీరు వెళ్ళి మన లాయరుగారిని పిలుచుకురండ్రా! నేను రేపే వైజాగ్ వెళ్ళిపోవాలి."
    ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
    "రీపా?"
    "అవును"
    "ఎందుకు?'
    "కొంతకాలం అక్కడే ఉండాలనుకుంటున్నాను. అన్నయ్యను చంపినవాడు దొరికేవరకూ ---"
    "మేము కూడా నీతో వస్తాం రా!" అన్నాడు రంగా.
    "సారీ రా రంగా! మీరెవరూ వద్దు ప్రస్తుతం......కానీ నాకేప్పుడయినా మీ అవసరం ఉందనుకుంటే మాత్రం టేలిగ్రామిస్తాను......వెంటనే బయల్దేరి వచ్చెయ్యాలి? సరేనా?"
    "తప్పకుండా! మమ్మల్ని పిలుస్తానని ప్రామిస్ చేయి"
    సృజన్ ప్రామిస్ చేశాడు.
    "ఇప్పుడు లాయర్ ఎందుకు?"
    "ఇల్లు మీ ఇద్దరిలో ఎవరి పేరు మీదయినా పవరాఫ్ అటార్నీ రాసిచ్చేస్తాను .......ఇది అమ్మేసి ఆ డబ్బు నాకు పంపించే ఏర్పాటు చేయండి ......ప్రస్తుతం మన పేపర్స్ అన్నీ లాయర్ గారికిచ్చి అయన దగ్గర కొంత డబ్బు తీసుకెళతాను."
    రంగా స్కూటర్ తీసుకెళ్ళిపోయాడు.
    "ఒరే సృజన్! నువ్వెళ్ళిపోతానంటే మాకేమిటోగా ఉందిరా ---నువ్ పక్కన లేకుండా ఎలా ఉండాలో అర్ధం కావడం లేదు."
    "ఇంత దారుణం జరిగిన ఈ ఇంట్లో ఉండటం నాకూ ఇష్టం లేదురా! అన్నా వదినెలు లేని ఈ ఇల్లు స్మశానంతో సమానం నాకు......" అసలీ సిటీలోనే ఉండలేను.....ఇక్కడ ఏది చూసినా వాళ్ళే గుర్తు కోస్తారు-------
    సాయంత్రం ఏడు గంటలకు లాయర్ వచ్చాడు.
    "రేపు ఉదయం రిజిస్ట్రార్ ఆఫీస్ కొస్తే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్నాడతను.
    "రేపు రాత్రికే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను లాయర్ గారు. నాకు కొంత డబ్బు మీరివ్వగలిగితే సహాయం చేసిన వారవుతారు. ఇల్లు అమ్మకం అవగానే అప్పుల వాళ్ళకు ఇచ్చాక ఏమయినా మిగులుతేనే మళ్ళీ నాకిద్దురుగాని-----"
    లాయర్ సృజన్ తల ప్రేమగా నిమిరాడు.
    "మీ అన్నయ్య నాకు మంచి స్నేహితుడు సృజన్! తప్పకుండా నీకు సహాయం చేస్తాను. నువ్ నిశ్చింతగా వైజాగ్ వెళ్ళిపో. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చేంజ్ అన్ ప్లేస్ చాలా అవసరం. నీకు అయిదు వేల రూపాయలిస్తాను ప్రస్తుతానికి. చాలు కదా?"
    "చాలండీ.....!"
    "ఇంకా అవసరమయితే ఉత్తరం రాస్తే పంపిస్తాను. నా దగ్గర మోఖమాటపడాల్సిన అవసరం నీకు లేదు."
    "థాంక్యూ సార్"
    "రేపు రిజిస్ట్రార్ ఆఫీసు కోస్తావ్ కదా! అక్కడే నీకు డబ్బిస్తాను...."
    "అలాగే సార్....." ఆతను వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page