Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 41


     అంత తమకంలోనూ దాని అర్థం ఏమిటా అని ఆలోచించాను. బ్రహ్మ పీఠం  అంటే ఏమిటి? నా   టెన్త్ క్లాస్ బుర్రకు తట్టడంలేదు.అయినా పట్టు విడవలేదు. మరు నిమషంలో ప్లాష్ అయింది. బ్రహ్మ పీఠం అంటే తామరపువ్వు.

     నా బొడ్డు ఎర్రగా శతసహస్ర రేకుల తామరపువ్వులా వుందన్న మాట. అతని కళ్ళు రెండు తుమ్మెదలైపోయి.  ఆ  కమలంలోని మాధుర్యాన్ని తన చూపులతో తాగుతున్నాయన్న మాట.

      ఇదంతా తప్పని మొదటినుంచి హెచ్చరిస్తున్న నీతినియమాల గొంతుని   ఎప్పుడో నులిమేశాను.  అందుకే అతని స్పర్శతాలూకు అనుభూతిని నా శరీరంలోని ప్రతి అణువులోనూ నింపుకుంటున్నాను.

     అతని ముఖం మళ్ళీ కదిలింది.

      ఈసారి చీరకుచ్చిళ్ళు అతన ముఖానికి  పూల చెండుల్లా తగులుతున్నాయి.

     " మార్నింగ్ గ్లోరి మీద పడుతున్నప్పుడు నువ్వు  మీ ఇంటి ద్వారం దగ్గరున్న మెట్లమీద కూర్చుని నీ చీర కుచ్చిళ్ళు లెక్కబెట్టాలని చాలాసార్లు అనిపించింది. కానీ నన్ను చూస్తూనే నువ్వు ఠక్కున లేచేసేదానివి. అందుకే ఆకోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు లెక్కబెడతాను'  అని పెదువులతో చీర కుచ్చిళ్ళను తోస్తున్నాడు.

    గులాబీకున్న  రేకుల్ని సున్నితంగా  విడదీస్తున్నట్టు అనిపించింది  ఆసమయంలో నేను ముళ్ళు లేని  గులాబీలా ఫీలయ్యాను.

      " మొత్తం పధ్నాలుగు" అన్నాడు.

       "నేనెప్పుడూ లెక్క  పెట్టలేదు. నేను అన్ని కుచ్చిళ్ళే పోసుకుంటానేమో నాకు తెలియదు.     అతను కుచ్చిళ్ళు లెక్కబెడుతున్నాననిచెప్పి ఏం చేశాడో నాకు తెలిసిపోయింది.  రెండువందలా  ఏభైరూపాయల  విమల్ చీర నాశరీరానికి టాటా చెప్పేసింది. బైబై చెప్పేసిన జాకెట్టుపైన చేరిపోయింది. నాకు సిగ్గేసి చటుక్కున కిందకి వాలిపోయాను.

     పందిరే కిందకు  దిగిపోయినప్పుడు దాన్ని ఆధారం చేసుకునిపాకుతున్న పూలతీగ నిటారుగా నిలబడగలుగుతుందా? అతనూ నాతోపాటే అయ్యాడు.

     అతను మరింత వంగీ '  శ్రీహరి నివాసం- వైకుంఠం' అన్నాడు.

     రమణ ఎప్పుడు ఆ  మాట అన్నాడో తెలిసేసరికి సిగ్గుతో చితికి పోయాను. రెండుచేతుల్ని వింజామరలంత వెడల్పుచేసి ముఖం దాచుకున్నాను.

    'ముల్లోకాలు నీలో కనిపిస్తున్నాయి' అన్నాడు ముఖం పైకెత్తి.

    అప్పటికీ నేను చేతుల్ని తొలగించలేదు.

      " కైలాసం బ్రహ్మలోకం- వైకుంఠం" అని మళ్ళీ వేటికి ఆ పేర్లు పెట్టాడో నా చెవిలో చెప్పాడు.

     సిగ్గుతో అవిరైపోతే ఎంత బావుండోననుకున్నాను.  నేనలా నలిగిపోతుంటే రమణ నన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

     అంతవరకు పరిగెట్టిన  కాలం ఘనీభవించినట్టు అతని ముఖంలో చెమట బిందువులు లేస్తున్నాయి రొటీన్ నెస్ తో తిరుగుతున్న భూమి ఏదో సుఖానికి గుద్దుకొని దుమ్మురేణువులకింద విడిపోతున్న భావన. మల్లెమొగ్గలు అకాశం మెత్తదనంలోంచి రాలుతున్న ఫీలింగ్ ఆ సుఖం మరికో దొరకదన్నట్టు  అతన్ని గట్టిగా బిగించాను.

     అతను నాలోని అత్మను వెదుక్కుంటున్నట్టు  కదలికలు, సుతిమెత్తని పూలపొరలను మంచు తన కాఠిన్యంతో చీల్చుతొంది. శరీరం సుఖంలో మునిగి సంతోషంలో తేలుతోంది. అవయవాల సాంద్రత గుండెకు తగులుతోంది.

      మా ఇద్దరి సమాగమానికి చీకటి కాపలాకాస్తున్నట్టు తోచింది. కాలం మామధ్య చిట్లి క్షణాల్లా విస్తరిస్తోంది. నేను నేను  కాను. అతను  అతను కాడు. మాకు పేర్లు లేవు. ఊర్లు లేవ్. భాష తెలియదు. అనాదిగా ఇద్దరం ఒకర్నొకరు వెదుక్కుంటూ ఇప్పటికి కలుసుకున్నాం. ఒకరిని ఒకరు స్పృశించాలన్న కోరిక వేళ్ళ కొసల్లో ప్రాణం  పోసుకుని శరీరమంతా పాకుతోంది.

      సరిగమపదనిసల్ని ఒళ్ళంతా నొక్కుతున్నట్టు అతనివేళ్ళు చలిస్తున్నాయి. మనసు రాగాలాపన చేస్తోంది. రజ్వలిత హృదయం అతని ఛాతీలో విచ్చుకుంటోంది. పిడికెడు గుండెలో సముద్రం అలలై లేస్తోంది.ఆకాశం  కనుగుడ్డులో మెరుస్తోంది.

     మేగాల  దొంతర పెదవులపై చిరునవ్వుగుంపులా సాగిపోతోంది. చెట్లలోని  పచ్చదనమంతా అవయవాల్లో లీనమైపోతోంది.

     ఎక్కడో  రెండు రసగోళాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. చల్లటి మంచుతుంపరలు ఒంట్లో  బిగుసుకుంటున్నాయి.

     ' సుఖం అస్తిత్వాన్ని పొందినట్టు ఈ చెమట' అన్నాడు. నాకు అర్థం కాకపోయినా హాయిగా నవ్వాను.ఆనందంతో పులిసిపోయిన శరీరం ఒక్కసారిగా  లేవనంటోంది.అలానే సుఘప్తిలోకి జారిపోతున్న ఆత్మను హృదయంలోకి నెట్టి ఆసరా ఇవ్వమన్నట్టు చేయిచాచాను. అతను  చేయి అందించాడు.

 Previous Page Next Page