Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 41

    అతడి కదలికలు లోహ రాక్షసుల పద ఘట్టనలంత వివశత్వాన్ని కలిగిస్తూంటే దేవి గొంతునుంచి జాలువారే మూలుగు ఢంకాధ్వానాలై ఆ గదిని వేడి సెగలతో నింపుతున్నాయి.    
    అయిదు నిముషాలు గడిచింది...    
   భుజంగం విషం కక్కింది.    
    కదం తొక్కిన తురగం సొమ్మసిల్లిపోయింది.    
    చల్లారిన కుంపటిలా పైకిలేచిన దేవి ఇప్పుడు కొంత ఉపశమించిందేమో "కృషి ముందు మనం ఓడిపోకూడదు చౌదరీ" అంది...    
    "నమ్మలేకపోతున్నాను దేవీ"    
    "ఏమిటీ"    
    "హత్య చేసిన వ్యక్తుల్ని సైతం రక్షించే శక్తిగల నువ్వు యిప్పుడిలా ఓ ఆడపిల్లని చూసి భయపడుతున్నందుకు."    
    "నేనూ ఆడదాన్నే చౌదరీ. ఓ ఆడపిల్ల శక్తి తెలిసిన దాన్ని"    
    "కాని కృషి నీలాగా పదిమందితో సంబంధం పెంచుకోలేదు. ఒంటరిగా పోరాడే అమ్మాయి"    
    "ఒంటరిగానే నీ సామ్రాజ్యాన్ని కుదిపేసిన కృషి సామాన్యురాలై వుండదు చౌదరీ. ఒకనాడు నువ్వు చేయించిన మోహన్గాంధీ హత్యని తప్పకుండా నిరూపించి తీరుతుంది."    
    "ఎలా" అసహనంగా చూసాడు చౌదరి "ఆధారం ఏముందని...ఉపాధ్యాయ ఫ్యాక్టరీకి ఎదురుగా నిరాహారదీక్ష చేస్తూ టెంట్ లో కూర్చున్న మోహన్ గాంధీని నేను హత్య చేయించాను.....నువ్వు ఇదే బెడ్ రూంలో ముఖ్యమంత్రితో ఐక్యమై అది నేను చేయించిన హత్యని పోలీసులు కేసుపెట్టకుండా ఆపగలిగావు."    
    "అదే ముఖ్యమంత్రి ఆ తర్వాత మోహన్ గాంధీది ఆత్మహత్యని ఉపాధ్యాయ నిరూపించటానికి సహకరించాడు."        
    నవ్వేడు చౌదరి "పార్టీ కోసం కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చేది నేనొక్కడ్నే కాదు దేవీ...ఉపాధ్యాయ కూడా యిస్తుంటాడుగా....అందుకే ముఖ్యమంత్రి అతడ్నీ కాపాడాలనుకున్నాడు కాపాడేసాడు. అయితే బయట ప్రపంచం మోహన్ గాంధీది హత్యే అంది...ఆ అవసరం ఉన్నది ఉపాధ్యాయకి కాబట్టి హత్య చేయించింది ఉపాధ్యాయ ఆత్మహత్యగా నిరూపించాడని అతడ్ని తప్పుబట్టింది."   
    క్షణం ఆగి అన్నాడు చౌదరి "మోహన్ గాంధీ కొడుకు విస్సు కూడా ఇప్పటివరకూ ఉపాధ్యాయ హత్య చేయించాడు అని నమ్ముతుంటే కృషి కాదని ఎలా నిరూపించగలదు. పైగా అది నేను చేయించిన హత్య అని ఆమె అన్నా నీ ద్వారా నాకు సహకరించిన ముఖ్యమంత్రీ సంబంధిత పోలీసులూ అంతా ఇరుక్కున్నట్టేగా."    
    రిలాక్స్ డ్ గా చూసింది దేవి నిజమే ఇన్ని గంటలుగా తను చాలా అలజడి చెందింది కాని ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏం చేయగలరని...    
    ఓ సమస్య గట్టెక్కినట్టుగా అంది దేవి "జీవితనే ఆడపిల్లని మీ వాడు హత్య చేయించిన విషయాన్నీ కృషి పరిశోధిస్తోందట."    
    "అసంభవం దేవి...ఎందుకంటే అది చాలా పకడ్బందీగా అమలుచేయబడిన హత్య కాబట్టి" చెప్పాడు వివరంగా.....    
    దేవి మృదువుగా నవ్వేసింది.... ఇప్పుడు ఆమెకు అసలు ఏమీ జరగనంత ఆహ్లాదంగా వుంది.
    "అయితే కృషి నన్ను సాధించగలిగేది ఒకే ఒక్క విషయంలో అది నా చాక్ లెట్ ఫ్యాక్టరీకి సంబంధించిన గొడవలో. నిజానికి నన్ను ఇబ్బంది పెట్టింది కృషి కూడా కాదు విస్సూ. అయినా జంకాల్సింది ఆలోచించాల్సింది కృషి విస్సూల గురించి కాదు దేవి. నన్ను ఇరుకున పెట్టబోతున్న ప్రభుత్వం గురించి.....ఈ విషయంలో నీ సహాయం కావాలి"    
    అభయం యిస్తున్నట్టుగా చౌదరిని నేలపైకి నెట్టి ఉత్సాహంగా ఐక్యం కావాలనే కార్యక్రమంలో నిమగ్నమైంది దేవి. "నీ సమస్యకి సంబంధించిన వ్యక్తులంతా కేంద్రప్రభుత్వంలోని వాళ్ళే అయితే ఎవరెవర్ని కలుసుకోవాలో వివరంగా మాకు తెలియచేయి చౌదరీ. కొంత కాలం దేశ రాజధానిలో మకాం వేసి మొత్తం సాధిస్తాం..."   
    "నువ్వా హామీ యివ్వు దేవీ - మిగతాది నాకు వదిలెయ్..." ఉద్విగ్నంగా అన్నాడు జ్వలిస్తున్న నాదంలా.    
    "ఇంత వయసులో కూడా నీ వేడి నిట్టూర్పులు మాకు అమితమైన ఆనందాన్ని అందిస్తున్నాయి చౌదరీ" ఆమె లేచింది బడలికగా "మాకు అమితమైన ధైర్యాన్ని అందించావు    చౌదరీ. అందుకే ఈ రాత్రంతా మీతో ఐక్యమౌతూ ఉల్లాసంగా గడపాలనుకుంటున్నాం."    
    "సాధ్యం కాదు" వాచీ చూసుకుంటూ పైకిలేచాడు....    
    దేవి భ్రుకుటి ముడివడింది. తమ కటాక్షం కోసం అనుక్షణం తపించే ఏ వ్యక్తికైనా ఇలా 'వలదూ' అనటం తొలిసారి.    
    "ఏమైంది నీకు..."    
    "అయ్యేది నాకు కాదు దేవీ మరో అరగంట దాటితే మీకూ ఏదయినా అయ్యే ప్రమాదముంది."    
    అర్ధం కానట్టు చూసింది.    
    "ప్రమాదం ఇంత దూరం దాకా వ్యాపించక పోవచ్చు దేవీ ఐనా మనం ఈ రాత్రికి ఓ యాభై కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి విశ్రమించడం నయం"   
    "ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది."    
    రగులుకుంటున్న రాక్షసి బొగ్గులా చౌదరి నేత్రాల్లో ఎరుపు జీరలు చోటుచేసుకున్నాయి "నన్ను ఓడించటానికి తన మనవరాలు కృషిని ఓ అణ్వాయుధంలా సంధించిన ఉపాధ్యాయ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా సమాధిచేయబోతున్నాను దేవి...దానికి సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకి ముహూర్తం నిర్ణయించాను."   
    రణరక్త ప్రవాహసిక్తమైన నరజాతి చరిత్రకి చివరి పుటలా చౌదరి పెదవులపై నవ్వు మెరిసింది. భీభత్సరస ప్రధానమైన ఆఖరి అంకం గురించి చెప్పాడు చౌదరి ఉన్మాదిలా "బోపాల్ లోని ఓ అర్దరాత్రి అంతా ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఓ మందుల కంపెనీలో గ్యాస్ లీకై కొన్ని వేలమంది ప్రాణాలు బలితీసుకుంది దేవీ - ఆ గ్యాస్ పేరు మిథైల్ ఐసో సైనేడ్ ...... ఆ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అదెంత అలజడిని సృష్టించిందో నీకు తెలుసుగా...."    
    దారుణాలు చేయటం అలవాటైన దేవి మొహంలో సైతం అలజడి పేరుకుంది.    
    "ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి ఉపాధ్యాయ మందుల కంపెనీలోని అలాంటి గ్యాస్ టాంకర్ బరస్ట్ కాబోతూంది. సెకండ్ల వ్యవధిలో అది మైళ్ళ తరబడి వ్యాపిస్తుంది. ఫ్యాక్టరీ కార్మికులతో బాటు ఆదమరిచి నిద్రపోతున్న నగరంలోని చాలా మంది జనం ఆ గ్యాస్ కి ఆహుతి కాబోతున్నారు."    
    ఈర్ష్య స్పర్ధ వైషమ్యం స్వార్ధ పరత్వాలు ఎలాంటి నరమేధానికి కారణమౌతున్నదీ చెప్పిన చౌదరి ఇక ఆలస్యం చేయలేదు "నాతో బయలుదేరుతున్నావా...."    
   సిద్దమౌతూనే అంది దేవి "మీ వాళ్ళంతా...."    
    "నా వాళ్ళనుకున్న మనుషులంతా ఇప్పటికే నగరం వదిలి వెళ్ళిపోయారు దేవీ..... పాతిక లక్షల రూపాయల డబ్బుకాశంచిన ఆత్మహత్యాదళం మాత్రం ఈ పాటికే ఫ్యాక్టరీని చేరుకుని వుంటుంది. మరో అరగంటలో మొత్తం ఆపరేషన్ పూర్తి చేస్తారు."    
    సన్నగా కంపిస్తూనే దేవి అతడితో బయలుదేరబోయింది కాని అదిగో అప్పుడు వినిపించింది కేకలు.    
    ఉద్విగ్నంగా దేవి, చౌదరి ఇద్దరూ గది బయటకి వచ్చారు.    
    "అమ్మా...అతను...." శిష్యుల బృందం ఆందోళనగా చెబుతుంటే అప్పుడు చూసాడు చౌదరి...    
    విస్సు ప్రహరీ వేపు పరుగెడుతున్నాడు చేతిలోని ఓ కేసెట్ తో.    
    అదిరిపడ్డాడు చౌదరి.    
    అంతే...    
    ఇంతసేపూ జరిగిన కార్యక్రమం చర్చ అంతా రికార్డ్ చేసాడా...   
    అది కాదు....ఆ కేసెట్ లో తను సృష్టించాలనుకున్న మారణ హోమపు వివరాలు కూడా రికార్డ్ చేయబడి వుంటాయి.    
    అదే తన బ్రతుకు యితిహాసంలో ఆఖరి చీకటి కోణం అనిపించిందేమో గాభరాగా ఫోన్ అందుకున్నాడు గుండె కొట్టుకుంటుంది మృదంగనాదంలా "కేసెట్ తో పారిపోతున్న విస్సూ బ్రతక్కూడదు. అది మాత్రమే కాదు. వాడి చేతిలోని కేసెట్ ని లాక్కోవాలి.... అది కేసెట్ కాదు..... నా సామ్రాజ్యాన్ని పేల్చేసే అణ్వాయుధం...మన వాళ్ళనందర్నీ అలర్ట్ చెయ్...పోలీసు స్టేషన్ ల కెళ్ళే మార్గాల్తో బాటు ముఖ్యంగా ఉపాధ్యాయ ఫ్యాక్టరీ రూట్స్ లో కాపలా వుండండి....కనిపించగానే కాల్చేయండి....వెంటనే...."    
    చౌదరి ఫోన్ లో ఎవరికి ఆదేశిస్తున్నదీ దేవికి అర్ధం కాలేదు.    
    ఇప్పుడు దేవి కూడా వణికిపోయింది... ఏ కేసెట్ గురించి చౌదరి భయపడుతున్నాడో అదే కేసెట్ తన చరిత్ర కాఫిన్ బాక్స్ ని మూసేయగల చివరి మేకు అవుతుంది.    
    చౌదరి ఆదేశించిన అయిదు నిముషాలలో నగరం రగిలిన చితాగ్ని గుండమైంది.    
    కొన్ని దశాబ్దాలుగా అతడు పెంచిన ముష్కరులు యమకింకరుల్లా రంగంలోకి దిగారు.    
    సాయుధులైన చౌదరి గూండాలు అన్ని వేపుల నుంచి విస్సూని చుట్టుముట్టడానికి సిద్దపడ్డా ముఖ్యంగా కాపలా కాసింది ఉపాధ్యాయగారి ఫ్యాక్టరీకి వెళ్ళే మార్గాల్లో...    
    కారణం అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటల నలభై నిముషాలు....    
    అంటే చౌదరి అనుకున్న నరమేధానికి మిగిలిన వ్యవధి కేవలం ఇరవై నిముషాలు మాత్రమే.    
    విస్సూలాంటి వ్యక్తి మిగిలిన గడువులో ఉపాధ్యాయ ఫ్యాక్టరీకి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు తప్ప పోలీసుల్ని కలుసుకోవటానికి ప్రయత్నించడు...    
    చౌదరి అంచనా తప్పు కాలేదు.    
                                     *    *    *    *    
    ఆందోళనగా చీకటిలో దూసుకుపోతున్న విస్సూ టైం చూసుకున్నాడు. రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిముషాలు మిగిలింది పదమూడు నిముషాలు....    
    ఉపాధ్యాయ ఫ్యాక్టరీ వున్నది సరిగ్గా తొమ్మిదిన్నర కిలోమీటర్లు దూరంలో...    
    అంతే...    
    చౌదరి ఆత్మాహుతి దళం ఈపాటికే ఫ్యాక్టరీని సమీపించి వుంటుంది...    
    నగరం ఆదమరిచి నిద్రపోతున్న నిశిరాత్రి...ఒకటి అరా వెళ్ళే కార్ల రొద తప్ప అంతా ప్రశాంతంగా వుంది...    
    మృత్యువు కబళించటానికి మిగిలింది స్వల్పకాలం.    
    పరుగెడుతున్న విస్సు కనీసం ఒక్క టాక్సీ అయినా దొరుకుతుందేమో అని చూసాడు.    
    ప్రయోజనం లేకపోయింది....    
    ఆర్తితో ఊపిరి ఆగిపోయినట్టయింది...    
    దూరంగా ఓ జీపు వేగంగా దూసుకువస్తుంటే ఆపటానికి ప్రయత్నించబోయి అనుమానంగా చీకటిలోకి తప్పుకున్నాడు.   
    విస్సూ ఆ క్షణంలో చేసిన తెలివైన పని అదే అయితే చౌదరికి చెందిన ఆ వ్యక్తుల్లో ఒకడు విస్సుని గమనించాడు అనుకోకుండా.    
    అది ఊహించిన విస్సూ ఆ జీపుని పట్టించుకోకుండా ఓ మూలనున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి ప్రవేశించాడు.    
    టెన్షన్ లో కృషి ఫోన్ నెంబర్ గుర్తుకు రాలేదు.... తేరుకోవడానికి ఇంకో రెండు నిముషాలు పట్టింది.   
    కౌంట్ డౌన్ మొదలైనట్టు రిస్టు వాచీ పదకొండు యాభై సూచిస్తూంది.    
    "కృషీ" ఆయాసంతో రొప్పుతూ అన్నాడు. "నేను విస్సూని మాట్లాడుతున్నాను."   
    "చెప్పండి" అతడికన్నా ఉద్వేగంగా అడిగింది కృషి అవతల వేపునుంచి.    
    టెలిగ్రాఫిక్ కోడ్ లా చెప్పాడు అంతా...    
    "చౌదరి నేరస్థుడని నిరూపించే బలమైన ఆధారం కేసెట్ రూపంలో నా దగ్గరుంది కృషీ. కాని యిప్పుడు మనకి అది అవసరం కాదు.....లక్షల మంది ప్రాణాలు మిగలాలి అంటే నేను ఫ్యాక్టరీని చేరుకోవాలి. అది నాకు సాధ్యమయ్యే పని అవునో కాదో నాకూ తెలీదు. అయినా ప్రయత్నిస్తాను. ఈ లోగా నువ్వు పోలీసుల్ని, ప్రజల్ని అలర్ట్ చేయటానికి ప్రయత్నించు. ఉన్న గడువులో అది నీకు సాధ్యమయ్యేపని కాకపోవచ్చు. బట్.... తప్పదుగా.... చివరిగా ఒక్కమాట..."  
    కృషి కళ్ళనుండి నీళ్ళు రాలుతున్నాయి ఆందోళనగా.
    "నేను నిన్ను మళ్ళీ కలుస్తానో లేదో చెప్పలేను. కాని నా పరంగా జరిగిన పొరపాట్లకి మాత్రం నన్ని మన్నించమని చివరిసారిగా అభ్యర్దిస్తున్నాను.... బై కృషీ" కంపించిపోతున్నాడు విస్సూ కూడా "ఐ లవ్యూ...."   
    స్వేదంతో తడిసిపోతున్న విస్సూ అప్పుడు చూసాడు....ముందు జీపు హెడ్ లైట్స్ కనిపించాయి. అది తను నిలబడి వున్న బూత్ వేపే దూసుకు వస్తుందని గ్రహించటానికి పెద్ద టైం అవసరం లేకపోయింది. కాని అప్పటికే ఆలస్యమైంది...    
    అతడు అప్రతిభుడై చూస్తూండగానే టెలిఫోన్ బూత్ ని గుద్దించి బలంగా... ఓ ఆర్తనాదం తో నిశిరాత్రి ప్రతిధ్వనించింది.    
                                                               *    *    *    *    
    అర్దరాత్రి పదకొండు గంటల ఏభై రెండు నిముషాలు...
    కృషి కారులో ఫ్యాక్టరీ వేపు దూసుకువస్తూంది.    
    ఆమె కళ్ళ నుంచి నీళ్ళు ధార కడుతున్నాయి. రోడ్డు సరిగ్గా కనిపించలేదు. అప్పటికే ఆమె కమీషనర్ కి ఫోన్ చేసింది.... హోం సెక్రట్రీకి, డి.జి.పి.కి, ఫైర్ సర్వీస్ ఇన్ చార్జికి, ముఖ్యమంత్రి యింటికి విడిచిపెట్టకుండా జరగబోయే అనర్ధం గురించి తెలియచేసింది.  

 Previous Page Next Page