Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 35


     "చదువుకుని ఉద్యోగాలు చేయ్యాలా? ఊళ్ళు ఎలారా?" అని నాకు నేను సర్దుకున్నాను.

    చదువుకోవడం కేవలం ఉద్యోగం చెయ్యడానికే నన్న కాన్సెప్ట్ మహా ఘెరమైంది.

    చదువుకు ఉద్యోగం పరమావధి కానేకాదు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అది ఉద్యోగానికి పనికిరావచ్చేమోగాని దాని మొదటి ప్రయోజనం అదికాదు.

    చదువుకోవడంవల్ల మన అలోచనాపరిధి విస్తరిస్తుంది. మన లైఫ్ స్టయిల్ మారుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఏ సమస్యను ఎలా టాకిల్ చేయాలో తెలుస్తుంది.

    ఆత్మవిశ్వాసం అలవడడంవల్ల నిర్మొహమాటంగా, నిర్భయంగా వ్వవహరించగలం. సంఘంలో మన భాద్యతలు, మన హక్కులు ఏమిటో తెలుస్తాయి. ఆనందాన్నైవిషాధాన్నైనా గాఢంగా  అనుభవించడాన్ని చదువు నేర్పుతుంది. మనం ఎంతోకొంత మెచ్యూరిటి సాధిస్తాం.

    ఆరోజుల్లో ఇవేమీ నాకు తెలియవు. ఇప్పుడు నేను నీకుి చెబుతున్నట్లు అప్పుడు నాకెవరూ చెప్పలేదు. అందుకే టెన్తా క్లాస్ ఫెయిలవగానే పీడా వదిలిందని సంబరపడ్డాను. పైపెచ్చు రమణను ఎప్పుడూ చూడవచ్చని ఆనందించాను.

    పద్దెనిమిదేళ్ళు వచ్చినా జీవితంపట్ల నాకో అవగాహన ఏర్పడలేదు. గాలి ఎటువీస్తే అటు ఎగిరిపోయే గడ్డిపరకలా నా హృదయం ఎగిరిపోతోంది. అ ది  అప్పుడప్పుడు రమణకు తగులుకుపోతోంది.

    రమణ నాకేవిధంగా కావాలో తెలియదు. అతన్ని చూస్తుండాలనీ, మాట్లాడాలనీ, ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దొంగచాటుగా ముద్దాడాలని మాత్రం మనసు పీకేది. అంతకుమించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వ్యక్తిమీదగానీ, లేదా ఏ విషయంలోగాని మనకు ఏ నిర్థిష్టమైన అవగాహన వుంటే దానిపట్ల, లేదా ఆ వ్యక్తిపట్ల ఖచ్చితంగా వ్యవహరించగలం.

    పదతరగతి ఫెయిలైన నేను అంత అవగాహనతో ప్రవర్తించలేక పోయాను.

    సాయంకాలం కాగానే వీధితిన్నెమీద మగవాళ్ళు కూర్చుండేవాళ్ళు. మెట్లమీద దస్తీలు కబుర్లాడేవాళ్ళు. మరీ చెవి పెట్టివింటే తప్ప ఒకరిమాటలు ఒకరికి వినపడవు.

    రోజూ అక్కడికి రమణ రావడం మొదలుపెట్టాడు.

    నాకోసమే అతను అక్కడికి వస్తున్నాడని తెలుసు. లేకుంటే కుర్రకారంతా దేవాలయం దగ్గరే చేరేవాళ్ళు. అంతకుముందు పార్లమెట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓ అభ్యర్దిచేత ఆ టేప్ రికార్డర్, రెండు లౌడ్ స్పీకర్లు కొనిపించారు. ఆవి తీసుకుని ఊర్లోని ఓట్లను ఆ అభ్యర్ధికి వేశారు.

    సాయంకాలమైతే అందులో సినిమాపాటలు పెట్టి ఎంజాయ్ చేసే వాళ్ళు. దేవాలయంముందే మంచినీళ్ళుబావి వుండేది. అక్కడకు వచ్చే అమ్మాయిల్ని చూస్తూ లవ్ పాటలు పెట్టి ఖుషీ చేసేవాళ్ళు.

    అలాంటి అద్భుతమైన కాలక్షేపం వదిలిపెట్టి రమణ అలా వీధితిన్నే మీద సెటిల్ అవుతున్నాడంటే దానికి వేరే కారణం.

    మద్య మధ్యలో మా చూపులు తోసినప్పుడు నా శరీరమంతా పుచ్చపువ్వులా వి్చ్చుకునేది. గుండె బయటికి వచ్చి కొట్టుకున్నట్లు వుండేది.

    ఏదో మాటలసందర్భంగా నా దగ్గరికొస్తే అతను నన్ను తన చేతుల్లో చుట్టేస్తున్నట్టు అనిపించేది. అప్పుడప్పుడు  అతను నా లోనెక్ జాకెట్టు లోకి తన చూపుల్ని వదిలిపెట్టినట్లు తోచేది. ఒళ్ళంతా ఏదో మైకం లాంటిది అవరించేది.

    అలాంటప్పుడు నన్ను నేను కంట్రోలే చేసుకోవడం కష్టంగా అనిపించేది.

    ఓరోజు ఏవో సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రమణ వచ్చి మాతో కలిశాడు.

    తిన్నెచివర కూర్చుని మాతో కబుర్లలో పడ్డాడు. అప్పటికింకా మగవాళ్ళు ఎవరూ రాలేదు.

    నేనూ, వేదవతి, భానుమతి వున్నాం.

    అప్పుడే శేఖర్ వెంకటగిరినుంచి బండ్లో బియ్యాన్ని దంపుకొని వచ్చాడు. ఆ బస్తా పట్టడానికి వేదవతి, భానుమతి వెళ్ళారు.

    నేనూ , రమణ మాత్రం మిగిలిపోయాం.

     "నీతో మాట్లాడుతుంటే నాకో ఐడియా వస్తోంది. ఊర్లో జనమంతా షడన్ గా మాయమైపోయి మనిద్దరమే మిగిలితే ఎంత బావుండు " అన్నాడు నా దగ్గరిగా కొద్దిగా వంగుతూ.

    నేనేమీ మాట్లాడలేదు.

    చీకట్లను ముఖానికి రాసుకుంటున్న సాయంకాలం, నిశ్శబ్ధంగా వీస్తున్న గాలి, మేమిద్దరం తప్ప మరెవరూ లేని ఏకాంతం, నాకే వినపడేట్టు మాట్లాడుతున్న రమణ. ఎందుకనో ఈ చిత్రం చెరిగిపోకుండా వుండాలని కోరుకున్నాను.

     "బావుంటుంది గాని వేదవతి వస్తోంది " అన్నాను.

 Previous Page Next Page