అక్కడక్కడా వున్న పంటిగాట్లకు ముఖమంతా ఎర్రబడి సాయంకాలపు పడమటి కొండల్ని గుర్తుకు తెస్తోంది. పైటకొంగు నలిగిపోయి ఎవరో పిల్లలు మల్లెపూలచెండును అటూ ఇటూ లాగినట్టు కనిపిస్తోంది. ఎద వుండాల్సిన కొలతలకన్నా ఎక్కువై జాకెట్టులోంచి తన్నుకొచ్చినట్టు కనపడాలిగానీ అమె ఎద ఎప్పటిలానే చదునుగా వుంది.
"అయ్యవారు రావడం లేటవుతోందని అన్నారుగా ఇక్కడ వుంటే నిద్రని కాయలేమని అటు ఏటి వరకు వెళ్ళాచ్చాం " అన్నాడు సురేష్.
"అంతేకదా, అయితే టైమైంది. మూడు నాలుగు మంత్రాలు చదవనివ్వండి. ఆ తరువాత గర్భాదానానికి వెళుదురు " అని పురోహితుడు జనం మధ్యనుంచి ముందుకొచ్చి అన్నాడు.
"అదేం వద్దులే అయ్యోరా. మంత్రాలు, చదవకపోయినా గర్భాదానానికి వచ్చిన నష్టం ఏమీలేదని నాకు ఇందాక ఏట్లోనే తెలిసిపోయింది " అన్నాడు సురేష్.
భానుమతి తల్లి కళ్ళు పెద్దవి చేసి అల్లుడివైపు చూసింది.
అలా వాళ్ళ మొదటిరాత్రి ప్రహసనం ముగిసిపోయింది.
రెండోరోజు అందరం మా ఊరికి వచ్చాం.
ఈసారి బస్సులో రావడంవల్ల ఉదయం పది గంటలకంతా చేరిపోయాం.
అప్పటికే మధ్యాహ్నం వంటలు జరుగుతున్నాయి.
సుందరి, వేదవతి, కుసుమ.... అందరూ బిజిగా ఉన్నారు. నేనూ వాళ్ళతో చేరిపోయాను.
పెళ్ళికూతురికి వడ్డిండానికి స్పెషల్ గా బొగ్గులు వేసిన వడలు చేశాం. పాయసంలో కూడా ఏదైనా కలుపుదామని నేను అన్నాను గానీ అది మరీ ప్రమాదమని ఎవరూ ఒప్పుకోలేదు.
రమణచేత పచ్చిమిరపకాయలు చేసిన వడ కొరికించాలని నాకు భలే సరదా పుట్టింది. అతని గురించి ఎక్కువ ఆలోచించడం నాకు తెలుస్తూనే వుంది. కానీ నా మనసు నా మాట వినడం లేదు. ట్రాక్టర్ లో వెళుతూ అతను నన్ను తాకినప్పుడు నా శరీరానికి కలిగిన పులకింత అప్పడప్పుడూ గుర్తొచ్చి నన్ను నిలవనివ్వకుండా చే్స్తోంది. అతను నేను కనబడుతూనే చూసే చూపులు నా మీద మల్లెపూల వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తోంది.
మధ్యాహ్నానికి అందరూ భోజనాలకి కూర్చున్నారు. పెళ్ళికొడుకు మరిది వరస అవుతాడు. కాబట్టి అతనికి వేదవతి రెండు వడల్ని వడ్డించింది పెళ్ళికూతురికి మరో రెండు వేసింది.
పళ్ళెంలో వున్న వాటిల్లో రెండింటిని తీసుకుని రమణ విస్తర్లో వడ్డించాను నే్ను.
సురేష్ తమ్ముడవుతాడు కాబట్టి బొగ్గులున్న ఆ వడల్ని తిననివ్వకుండా కుసుమ పరోక్షంగా అతన్ని హెచ్చరిస్తూ "ఒరే వెర్రినాగన్నా కొత్త పెళ్ళికొడుకువి కొంచం జాగ్రత్తగా వుండాలిరా.
అకులో వేసింది వేసినట్టు తినెయ్యడమేనా? లోపల ఏం వుందో చూసుకో " అని చెప్పింది.
భానుమతి అలర్ట్ అయిపోయింది గానీ సురేష్ ఆ మాటల అంతరార్ధం గ్రహించలేకపోయాడు. ఓ వడని తీసుకుని కొరికాడు. లోపలున్న బొగ్గులు పళ్ళమధ్య నంగడంతో రుచి చూసి ఛక్కున వూసేశాడు.
భానుమతితో పాటు అందరూ పడిపడి నవ్వారు.
కొత్త పెళ్ళికూతురు మాత్రం వడల్లో బొగ్గులున్న వడల్ని తీస పక్కన పెట్టి మిగిలిన వాటిని చక్కగా నమలడం మొదలుపెట్టింది.
రమణకు పెట్టిన వడల్లో బొగ్గులులేవుగాని వేలెడంత వున్న పచ్చిమిరపకాయల్ని పెట్టాను నేను.
అతను వడ కొరకగానే కారంపుట్టి కెవ్వున అరిచాడు. అతను అరవడం తరువాయి అందరూ ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడ్డాడు.
నేను మాత్రం నవ్వుతూ ఉండిపోవడంతో అ పని చేసింది నేనేనని తెలిసిపోయింది.
అతను చిరుకోపంతో నావంక చూస్తుంటే నాకు నవ్వాగింది కాదు.
అలా జీవితంలో మొదటిసారి ఓ అబ్బాయి ప్రేమలో పడిపోయాను నేను.
రెండు రోజులు పోయిన తరువాత పదో తరగతి ఫలితాలు వచ్చాయి.