Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 35


                    పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉండడం వల్లనే
                     గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగా ఉన్నారు

                                                * రచన:? *

ప్రభూ! ఎప్పుడు నువ్వు సుఖంగా ఉండటం చూశాం....
మత్తయి సువార్త 25:37
నేను ఆకలితో ఉన్నాను
నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు
నన్ను పీడిస్తున్నారు
నువ్వు ఓపిక బోధిస్తున్నావు
నాకో ఆశ్రయం లేదునువ్వు విచారణ సంఘాన్ని నియమించావు
నేను తిండిలేక నీరసిస్తున్నాను
నాకు వాగ్దానాలు మేపుతున్నావు
నాకు చదువులేదు
నువ్వు "అయ్యో పాపం, అలాగా?
కూడదు, కూడ" దన్నావు
నాకు కట్టగుడ్డలేదు
నువ్వు నాపాం బాంబులి బిల్లులు చెల్లిస్తున్నావు
నేను నిరుద్యోగినయినాను
"ఆ పనులిప్పుడు యంత్రాలు చేసేస్తున్నా" యన్నావు
నేను జబ్బుపడిపోయాను
శాంతిభద్రతలు నీ మొదటి సమస్య అన్నావు
నేను దరిద్రుణ్నయాను
దరిద్రం ఈనాటిది కాదన్నావు
సాయం చెయ్యమన్నాను
దేవుడు చేస్తాడులే' అన్నావు
నాకు కోపం వచ్చింది
కారణం కమ్యూనిస్టుల మీదికి నెట్టావు
నాకు ఆకలి వేసింది
'రేపు మరోమారు ప్రయత్నించు' అన్నావు   
                                                          ముద్రణ: సృజన మాసపత్రిక - జూన్, 1972

1. ఈ కవిత మూల రచయిత ఎవరో తెలియదు.

                                     విసిగిన వలయాలు
                                    *  రచన : CESA VALLEJO *

ఉంటాయి కోరికలు తిరిగి రావాలని, ప్రేమించాలని, మళ్లీ వెళ్లిపోరాదని,

ఉంటాయి కోరికలు చనిపోవాలని,
పోరాడే విరుద్ధ జలాలు భూసంధిగా మారలేనప్పుడు,

ఉంటాయి కోరికలు జీవితం మీద ముసుగుకప్పే,
ఆఫ్రికాలో ఒక అగ్నివేదనలో మగ్గిపోయే ముద్దుకోసం,
ఆత్మహత్య!

ఉంటాయి కోరికలు..... కోరికలే కోర కూడదని, దేవుడా,
దేవుణ్ని హత్యచేసే నా అంగుళి చూపిస్తున్నాను నీవైపు
ఉంటాయి కోరికలు హృదయమనేదే ఉండకూడదని

వస్తుంది వసంతం మళ్లీ; వచ్చి మళ్లీ వెళ్లిపోతుంది. దేవుడు

కాలంలో వంకర్లు తిరుగుతూ తనకు తానే పునరుక్తిగా కదలి పోతాడు,

కదలిపోతాడు తన భుజంమీద విశ్వం వెన్నెముకతో-

నా కూతలు తమ విషాద మృదంగం మోగించేవేళ,
కత్తిమీద చెక్కిన నిద్ర నన్ను గాయపరిచే వేళ
కత్తిమీద  చెక్కిన నిద్రనన్ను గాయపరిచే వేళ
ఉంటాయి కోరికలు ఒక్క అంగుళం మేరయనాఈ గీతానికి
దూరం కాకూడదని!                                      

                                ముద్రణ: అంధ్రజ్యోతి వారపత్రిక, 1 సెప్టెంబర్ - 1972.

1. సెజార్ వల్లేజో (1895 - 1938) పెరూ దేశస్థుడు శ్సానిష్ భాషలో అత్యున్నతమైన అధివాస్తవిక కవిత్వం చెప్పినవాడు, "వాన కురుస్తున్న ఒకానొక రోజు పారిస్ లో మరణిస్తాను" అని ఒకప్పుడు వ్రాసి లాగే చనిపోయాడు. అన్నట్టు "జన ఘోష" అనే శీర్షిక క్రింద ఇటీవల సి. నారాయణ రెడ్డి పేరుతో వెలువడ్డ గీతం వల్లేకో MASS(జనం) అనే ఇది శ్రీశ్రీ ఇచ్చిన ఫుట్ నోట్.

 Previous Page Next Page