Previous Page Next Page 
పాదాభివందనం పేజి 34

"లేదమ్మా లేదు" నేనే పాపం చేశాను. కన్నతల్లిని, జన్మభూమిని ఇంత దాకా గుర్తించ లేకపోయాను. ఈ ఊరికి వచ్చేదాకా నాకు నా ఉద్యోగం నా బ్యాంక్ బాలెన్స్ నేను మద్రాసులో హైదరాబాదులో కుట్టించుకున్న యిల్లు.

నా హొదా, నా స్టేటస్ నా సర్కిల్ లోని మనుషులూ యివే గుర్తున్నాయి. అదే లోకం అనుకున్నాను. అదే నిజం అనుకున్నాను. ఎవరి బతుకు వాళ్ళు పొరుగింటిని కూడా పట్టించుకోకుండా జీవించడమే మంచిదనుకొన్నాను.

కానీ యీ ప్రేమానురాగాలు, పొరుగుమనిషి కోసం పడే తపనలోని నిస్వార్ధం చూశాక నాలో ఎంత స్వార్ధం వుందో తెలుస్తుంది. నేను నా జీవితాన్ని నా గమ్యాన్ని చూసుకుని నా తల్లిని ఎంత నిర్లక్ష్యంగా చూశానో తెలుసుకున్నాను.

నీ మనసు నా కోసం, నా కుటుంబం కోసం, మాతో ఆత్మీయంగా మెలగడం కోసం ఎంత తపించిందో తెలుసుకున్నాను.

"నువు ఇక కష్టపడనక్కర లేదు. మనసు కష్ట పెట్టుకో నక్కరలేదు. నేను యింకో ఆరు నెలలకి రిటైర్ అవుతాను. మంజు చదువు పూర్తయింది. ప్రియతమ్ కు చదువు పూర్తయి స్టేట్స్ నుంచి వస్తున్నాడు. వాడి ఇష్టం ఎక్కడైనా సెటిల్ కానీ, మంజు పెళ్ళి చేస్తాను. నేను, శశి యిక్కడికే వచ్చేస్తాము.

ఈ ఇంటికి క్రొత్త కళ తెస్తాను. ఈ దేవుళ్ళకి పూజాపునస్కారాలు చేస్తాను. ఈ యింటిని పాడు పెట్టనివను. తోట బాగు చేస్తాను. నీ చివరిరోజులు తృప్తిగా హాయిగా గడిచిపోయేలా చూస్తాను. ఆవేశంగా అన్నాడు. సిన్సియర్ గా అన్నాడు. ఆలోచనతో అన్నాడు. కాంతమ్మగారి మనస్సుకి తృప్తి లభించింది.

తప్పిపోయిన పుత్ర ప్రేమ తిరిగిదొరికినట్టుంది. "రామచంద్రా" అంది ఆమె. ఆ నాలుగక్షరాలు మాతృ ప్రేమకి దర్పణం పట్టాయి. ఎనలేని తృప్తి ద్వనించింది ఆ గొంతులో. "అమ్మా" అన్నాడు రామచంద్ర. యుగయుగాలుగా అనుస్యుతంగా వస్తోన్న తల్లీకొడుకుల రాగభావన మరో మొగ్గ తొడిగింది.

                                                           పదబంభరం

సీరియస్ గా పాఠం చెబుతున్నాడు ఆచార్య. విద్యార్ధిని విద్యార్ధులంతా రస నిమగ్నులై పాఠం వింటున్నారు. ఎందుకు వినరు? చెబుతున్నది వరుధుని వలపాయె! ప్రవరుడిపై వరుధుని ఎలా కన్ను వేసింది. ఆ కన్ను ఎలా ఆమె గుండె లోతుల్లో వలపు నాటింది వివరంగా చెబుతున్నాడాయె!

అందాలు హరివిల్లు లాటి వరూధిని అసలే కుర్రకారు. కధ వలపు హొరు. చెబుతున్నది మాంచి పసందైన జోరు. పద్యాన్ని రాగచ్చాయతో స్పష్టంగా మృదు మధురమైన కంఠంతో చెబుతున్నారు. పశువులు, శిశువులు, పాములు కూడా సంగీతానికి తల ఆడించవలసిందే!

రస భంగం చేస్తూ వచ్చాడు అటెండర్. తన ధోరణిలో ఆచార్య గమనించే లేదు.

"సర్!" ఎవరో విద్యార్ధి లేచాడు.

"ఏమిటి, సుందరశాయి! సందేహమా?

"ఏం లేదు, సర్! జయకర్ వచ్చాడు. " చప్పున గది తలుపు వైపు చూశాడు. "లోపలికి రా!

అతను దగ్గరగా వచ్చి "సర్! మీకు ఫోన్ " అన్నాడు.

ఆచార్య ముఖంలో ప్రశ్నార్ధకం కనిపించింది.

"అర్జంట్ ట! ఎవరో ఆడవాళ్ళు....." విద్యార్ధిని విద్యార్ధులకి వినిపించకుండా చెప్పాడు ఆచార్య ముఖంలో ఆశ్చర్యార్ధకం! తనకి కాలేజికి ఫోన్ చేసేదేవరబ్బ అనుకున్నాడు అంతా క్షణంలోనే.

విద్యార్ధుల వైపు తిరిగి 'క్షణంలో వస్తాను' అని కదిలాడు.

ఆయనటు కదలగానే క్లాస్ రూమ్ కడలి తరంగం అయింది.

"హలో!" అటూ ఇటూ హంగ్ అవుతున్న పోనందుకుని అన్నాడు.

"మీ చుట్టూ ఎవరూ లేరా?" ఏదో తీయదాన్నాన్ని ఎదలో నించి నేరుగా రసనాగ్రం ద్వారా ఫోన్ ఆ చివర పలికించిందా అమ్మాయి.

గుండె ఝాల్లనిపించే తీయదనం. చప్పున అటూ ఇటూ చూశాడు. ప్రిన్సిపాల్ గారు ఏవో పేపర్స్ చూస్తున్నారు. గదిలో ఇంకెవరూ లేరు. ఇటూ చూస్తే కిటికీ లోంచి విశాలమైన బయలు.

"ప్రిన్సిపాల్ ఒక్కరేనా?"

"ఆ" అప్రయత్నంగా అన్నాడు.

"ఆచార్య! వరుధుని ఎలా ఉంటుంది?"

ఆ కంఠంలో వలపు పచ్చిదనంతో పాటు కొంటె దానం కూడా తొంగి చూసింది.

"ఎవరూ మీరు?"

"ఆ విషయం తెలిస్తే, ఇంకేముంది? కోపం అనేదానికి అర్ధం తేలికే పద్దెనిమిది పురాణాలు, నాలుగు వేదాలు, పన్నెండు ఉపనిషత్తులు, గీత ఇంకా తరచి చూస్తున్నారు మీరు. ఆంధ్రా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ పైగా అలాంటి మీకే తెలినిది- ఒక అర్భకురాలీని నాకు నేనెవరో అంత సులువుగా తెలుస్తుందా?"

ఆచార్యకి ఆమె కొంటేదనం అర్ధమైంది.

అంతలో బెల్ అయింది. క్లాసుల్లోంచి పిల్లలు బయటికి వస్తున్న సవడి, టపాసులు పెలెంత శబ్దం ప్రిన్సిపాల్ గారు క్లాసుకు బయల్దేరారు. అయన ఫోన్ చేస్తున్న ఆచార్యని గమనించనే లేదు. 'ఫామిలి టాక్' అనుకున్నాడాయన.

"ప్రిన్సిపాల్ గారూ క్లాసు కెళ్ళారా?"

"మీకు దివ్యద్రిష్టి ఉందా?"

"ఇంతకీ పోనేందుకు చేశారు?"

"ఏమిటండి ఈ ప్రశ్న! ఫోనెందుకు చేస్తారో తెలిదా? ఇలాంటి మీరు మా నంద్యాల కుర్రాళ్ళకి చదువెం చెబుతారు?" అందులో సున్నితమైన హాస్యం!

"మహాతల్లి" కొద్దిగా కోపంగా అన్నాడు. "నీవెవరో నాకు తెలిదు. నువు చెప్పవు. ఎందుకు మాటాడేది చెప్పవు"

"మాష్టారు! ఎంతసేపు నిలబడతారు! చెయిర్లో కూర్చోండి ఇప్పుడిప్పుడే ఎవరూ రారులెండి. పైగా మీకు ఈ అవర్ లీజర్- తర్వాత లంచ్ బ్రేక్. ఈవినింగ్ సెకండ్ అవర్ సేకండియర్స్ కి డ్రామా క్లాసు- మీరు బాగా చెబుతారని పిల్లలు క్లాసు ఎగవేయరు."

"చూడండి! మీకు నా గురించి ఏమేం తెలుసు?"

"యువర్ బయోడేటా! హబిట్స్ టెస్ట్స్ చెప్పనా? మీ కాసెట్స్ లో బాలమురళిని బంధించారు. సుబ్బలక్ష్మి తో అన్నమయ్య గీతాలాపన చేయించారు. మొహిది హస్సేన్ గజల్స్- అబ్బా మ్యూజిక్- డిస్కో సాంగ్స్ - సంగీత రాజేశ్వరావు అదే రసాలూరు వారు గీతాలు- ఘంటశాల వారి కమనీయ కంఠం, బాలూ శివాష్టకం- జానకి త్యాగయ్య కీర్తనలు ఇంకా చెప్పనా?" 

 Previous Page Next Page