Previous Page Next Page 
షా పేజి 34

 

    "ఏయ్.......ఎందుకేడుస్తున్నావ్? ఏమయింది? అడిగాడతను గాబరాగా.
    ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె దుఖం మరింత ఎక్కువయింది.
    ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద ఆప్యాయంగా చేయి వెశాడు అతను.
    "ఎందుకేడుస్తున్నావ్? నేనేమయినా నీ మనసు నొప్పించానా?" ప్రేమగా అడిగాడు.
    ఆమె సృజన్ భుజం మీద వాలిపోయింది ఏడుస్తూనే.
    "నన్ను చెల్లీ అని పిలిచి నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు తెచ్చావన్నయ్యా! మా అన్నయ్య కూడా నన్నెంతో ప్రేమగా చెల్లాయ్ అని పిలుస్తుండేవాడు. వాడు బొంబాయ్ పారిపోకుండా ఉన్నట్లయితే ఇవాళ నా బ్రతుకు యిలా అయేది కాదు. నన్నేప్పటికీ యింత దిక్కులేనిదాన్ని చేసేవాడు కాదు.'
    సృజన్ హృదయమంతా ఆమె మీద జాలితో నిండిపోయింది.
    "ఇంకావెళ్దామా మనం?"
    ఆమె కన్నీరు తుడిచేసుకుని, తన జాకెట్ లో నుంచి వందనోటు తీసి అతనికిచ్చెయబోయింది.
    "ఇది తీసేసుకో అన్నయ్యా! ఇవాళ నన్నోకసారి గతంలోకి తీసుకెళ్ళిపోయావ్ నన్ను. అందమయిన నా చిన్ననాటి రోజులన్నీ నా కళ్ళముందు కనిపించేలా చేసావ్" సృజన్ ఆ డబ్బు తీసుకోలేదు.'
    "వద్దమ్మా! పోనీ నేను నీ అన్నగానే నీ కిస్తున్నాననుకో........"
    హటాత్తుగా ఎడ్చేయసాగిండామే మళ్ళీ.
    "అన్నయ్యా! నేను మహా అయితే యింకో రెండు మూడేళ్ళు బ్రతుకుతానెమో! నేను కాదు.ఈ హోటల్లో వళ్ళుమ్ముకుని పొట్ట పోసుకుంటున్న మా వాళ్ళందరూ అంతే! నలభై ఏళ్ళు రాకముందే దిక్కు లేనిచావు చనిపోతారు. మా శవాలను మునిసిపల్ కార్పోరేషన్ వాళ్ళు తీసుకెళ్ళి తగలెయ్యాల్సిందే.
    అసలు రమేష్ ని కలుసుకున్నప్పుడే నా జీవితం మలుపు తిరగాల్సింది . కానీ నా దురదృష్టం అంతే!" మధ్యమధ్యలో ఏడుపు ఆపి మాట్లాడిందామె.
    "రమేష్ ఎవరు?" కుతూహలంగా అడిగాడు సృజన్.
    "డాక్టర్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో హోస్ సర్జెన్ గా వచ్చినప్పుడు నేను జ్వరంతో ఫిమేల్ వార్డ్ లో చేరాను. నాకోసం ప్రత్యేకంగా రోజూ వచ్చి నాతొ కాసేపు మాట్లాడేవాడు. జ్వరం పూర్తిగా తగ్గిపోయాక అతని గదికి వెళ్ళాను. ఆరోజు స్వర్గమంటే ఏమిటో చూపించానతనికి. అంతే! అక్కడినుంచి నన్ను వదిలేవాడు కాదు. నేనప్పటికింకా ఈ వృత్తిలోకి దిగలేదు. నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. ఈ సంఘం ఈ గోంగూర తో తనకు పనిలేదన్నాడు. ఇద్దరం ఇంచుమించు భార్యభర్తల్లాగానే వుంటున్నాం. ఇంకొద్ది రోజులు అలాగే గడిచి వుంటే రిజిస్ట్రాఫీస్ లో పెళ్ళి కూడా చేసుకునేవాళ్ళం. కానీ ఈలోగా ఆ రాక్షసి తన్నుకుపోయింది రమేష్ ని. అందుకే నాకు జీవితం మీద కసి ఎంత త్వరగా చద్దమా అన్న కోరిక........."
    "రమేష్ ని తన్నుకు పోయిన రాక్షసి ఎవరూ?"
    "సుమతీ దేవి అనీ ఒక రాజకీయ నాయకురాలు వుందిలే. అది మొగుడిని వదిలేసింది. దానిని యింకోడు ఉంచుకున్నాడు గానీ, దానికి మాత్రం బాగా అందంగా ఉన్న కుర్రాడు కావలసి వచ్చాడు. ఓసారి హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఉన్నప్పుడు రమేష్ ని చూసింది. దాని కళ్ళన్నీ రమేష్ మీద పడ్డాయి. స్పెషల్ రూమ్ లోనే తలుపులు వేసేసింది. రమేష్ ని లోపల వుంచి!
    తెల్లారాక తీసిందంట మళ్ళీ. ఆ తర్వాత రమేష్ ని రుచి మరిగింది.........ఇంకెక్కడా వదులుతుంది? నిజం చెబుతున్నాను. రమేష్ ని ఓసారి ఏ అడదయినా రుచి చుసిందంటే ఇంక జన్మలో వదలదు. అంత రసికుడు.
    నేను రమేష్ తో ఏడ్చి మొత్తుకొని చెప్పాను. అది రాక్షసి అనీ దాని జోలికి పోవద్దనీనూ. కానీ రమేష్ దాని డబ్బుకీ, దాని కున్న పరువు ప్రతిష్టలను వాడదల్చుకుని దానినే అంటిపెట్టుకుని వుండిపోయాడు. అయినా నేనంటే ఇప్పటికీ ప్రేమే రమేష్ కి. అప్పుడప్పుడు రహస్యంగా దానికి తెలియకుండా నా దగ్గర కొచ్చి వెళ్తూనే వుంటాడు. కిందటి సారి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా! నాకు లక్ష రూపాయలిస్తాడట! నేనీ వృత్తి మానేసి ఓ ఇంట్లో పతివ్రతలా ఉండిపోవాలట! నాకు వళ్ళు మండింది. ఆ సుమతీదేవి దగ్గర సంపాదించిన డబ్బుతో నేనెందుకు బ్రతకాలి! అందుకని రమేష్ ని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాను.
    ఇల్లిస్తావ్ - సరే రోజూ రాత్రిళ్ళు సంగతేమిటి? నువ్వెళ్ళి సుమతీదేవి దగ్గరుంటే నాకేవరుంటారిక్కడ? అందుకే వేరే ఎవర్నయినా ఏర్పాటు చేస్తావా అనడిగాను. అంతే కోపం వచ్చి వెళ్ళిపోయాడు. పది హేనురోజులయిపోయిందిసారి. అయినా నా కోసం కారు పంపలేదు. నేను బెట్టుగానే ఉన్నాన్లె.

 Previous Page Next Page