అమ్మాయిలంతా అమె చుట్టూ చేరి "టౌన్లో మీ రాత్రి బాగా జిరిగిందా?" అని ప్రశ్నించాం.
పాపం అమె దిగులుగా ముఖంపెట్టి, ఆ విషయం ఎందుకడుగుతారులే. మా ఇంట్లో ఓ డొక్కు ఫ్యాన్ వుంది. దాని గాలి వదిలించినట్టువుందిగానీ వీచినట్టు వుండదు. అందుకే దోమలు తరుముకుంటూనే ఈగల్ని తోలుకుంటునో ఓ అరగంటైనా మెలకువగా వుండేవాడు శేఖరం.
దేవస్ధానం సత్రం వాళ్ళకి బాగా డబ్బులున్నాయోమో గదిలో రెండు సీలింగ్ ఫ్యాన్ లు వేశారు. గాలి బ్రహ్మండంగా వుండడంతో మంచంమీద పడుకున్నాడో లేదో నిద్రపట్టేశాడు. ఓ అరగంట క్రితం నిద్రలేపి ముహుర్తానికి టైమైందని వెంటబెట్టుకొచ్చా, ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే నాలాంటిది సుఖపడాలంటే మార్చాల్సింది గదనికాదు..... " అని అగింది.
మరి మార్చాల్సింది ఏమిటని ఎవరూ దైర్యంగా అడగలేకపోయారు. వేదవతి ఏ జంకూ గొంకూ లేకుండా జవాబు చెప్పగలదు.
అంతలో జ్యోతిర్మయి పిన్ని పెళ్ళిమండపం నుంచి పిలిస్తే అందరం కలసి అక్కడికి వెళ్ళాం. నాలుగున్నరకి పెళ్ళి తంతు మొదలైంది.
అయిదు గంటలకి అబ్బాయిలంతా వచ్చారు.
మరో అయిదు నిముషాల్లో మంగళసూత్రధారణ జరగపోతుందనగా అబ్బాయిలు తమ చేతుల్లోని కరపత్రాలను పంచడం ప్రారంభించారు.
వాటిని చదువుతున్న వాళ్ళంతా ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతకీ ఏముంది అందులో?
పెళ్ళిమంటపానికి దగ్గరగా వున్న మా దగ్గరికి రమణ వచ్చి ఒక్కొక్కరికి ఒక్కో కరపత్రాన్ని ఇచ్చాడు.
నేను చదవడం మొదలుపెట్టాను.
తొలివలపుల కంబైన్స్ సమర్పించు " పాణిగ్రహణం " అన్న టైటిల్ పైన వుంది.
పెళ్ళిని సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి అన్వయించి ముద్రించిన కరపత్రం అది.
నిజంగానే తమాషాగా వుంది.
హీరో- సురేష్ హీరోయిన్- భానుమతి, కథ- మద్యవర్తులు, అలంకరణ- ముత్తయిదువులు, సంగీతం- మేళగాళ్ళు, ఫైట్స్- మగపెళ్ళివారు, స్పెషల్ ఎఫెక్ట్స్- పెళ్ళి కాని అమ్మాయిలు- ఇలా వుంది.
పెళ్ళికాని అమ్మాయిల పక్కన "ముఖ్యంగా శతరూప " అని నాకిచ్చిన కరపత్రంలో ముందే రమణ అలా రాశాడని గ్రహించాను. దాని కింద సమర్పణ- రమణ అని ముద్రించి వుంది.
అంటే ఈ ఐడియా అంతా రమణదే. అందరూ అతడ్ని పొగిడారు. నేనూ సమయం చూసుకుని " నీ పాంప్లెట్ బావుంది " అన్నాను. అతను పొంగిపోయాడు.
పెళ్ళి హడావుడంతా పది గంటలకు ముగిసిపోయింది. అందరం ఫస్ట నైట్ ముచ్చట చూడడానికి మరవలి కోసం భానుమతి ఊరుకి బయల్దేరాం.
భానుమతివాళ్ళ ఊరు శ్రీకాళహస్తి దగ్గర్లో పేరూరు.
అక్కడికి మేం వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం రెండైంది.
పెళ్ళి బడలికవల్ల భోజనం చేయగానే నిద్రపోయాం.
జ్యోతిర్మయి పిన్ని రాకపోవడంవల్ల మా అల్లరికి అడ్డేలేకపోయింది. సాయంకాలం నిద్రలేచి తయారయ్యేటప్పటికి అరయింది. కొత్త ఊరు. కొత్త వాతావరణం. అహ్లాదకరంగా వుంది. అంతవరకు మండిపడ్డ సూర్యుడు శాంతించినట్లు చల్లదనం అలుముకుంది. సాయంకాలం లోకం మీదకి జారిపోయింది.
పెళ్ళి వారిల్లు కావడంతో ఇంటిముందు భాగమంతా నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. మట్టివాసన కమ్మగా తగుల్తోంది. నాకైతే చిన్న పిల్లయిపోయి ఆడుకోవాలనిపించింది.
అబ్బాయిలంతా బావికి వెళ్ళి స్నానం ముగించుకుని వచ్చారు. ఫ్రెష్ గా యవ్వనం కండలు తిరిగినట్టు కనిపిస్తున్నారు. వాళ్ళ శరీరాలు గుండ్రంగా సునుపుతేలి అడపిల్లల్లో గుబులు పుట్టిస్తున్నట్లు తోచింది. రమణ నైవైపు గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. అవి చూపుల్లా లేవు. నా శరీరాన్ని నిలువెల్లా తాకుతున్న పూలబాణాల్లా వున్నాయి.
రాత్రి తొమ్మిది గంటలకు ఫస్ట్ నైట్ కార్యక్రమం మొదలుకావాలి. అప్పటికి భోజనాలు ముగించాం. అందరం పురోహితుడి కోసం చూస్తున్నాం.