Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 32


    అదా.....అదీ.....మందు పార్టీ జరుగుతూ వుండు" ముందు తటపటాయించినా చివరికి చెప్పాడు ఆ యువకుడు.
    "సరే.... నువ్వెళ్ళి చెప్పు నువ్వు ఏ విషయమూ చెప్పే తలుపులు మూసుకున్నాయి.
    జగదీష్ బృందం పిచ్చాపాటీలో పడింది.
    దాదాపు పావుగంట గడిచాక ఆ యువకుడు తిరిగి బయటకొచ్చాడు అతన్ని చూడగానే వాళ్ళకు వూపిరొచ్చింది.
    "ఏమైంది? రామ్మూర్తిని రమ్మన్నారా?" మనోహర్ ఉత్సాహంగా అడిగారు.
    "లేదయ్యా బాబూ పాపానాయుడుపేట రామ్మూర్తి వచ్చారని చెప్పమన్నారండి అంటే నాయుడుగారు బండబూతులు తిట్టాడు. ఎవడ్నీ లోపలకు రానివ్వద్దని గట్టిగా చెప్పారండీ. రామ్మూర్తి అంటే ఎవరో తెలీదని అన్నారండీ."
    రామ్మూర్తివైపు మిత్రులంతా విస్మయంతో చూశారు ఏమిటీ దారుణం అన్నట్లు కళ్ళతోనే అడిగారు.
    "మందు పార్టీ కదా అలా అనుంటారు. అందుకే ఇప్పుడు వద్దు. రేపు వెళ్ళి తిరుపతిలో మాట్లాడతాను" రామ్మూర్తి సర్ది చెప్పబోయాడు.
    జగదీష్ కు మాజీ మంత్రి మీద కోపం వచ్చింది. "అదేం కుదరదు. ఈ రోజు ఇక్కడే నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. నా అంత క్లోజ్ ఫ్రండ్ వస్తే మాట్లాడకుండా పంపిస్తాడా! పైపెచ్చు రామ్మూర్తి అంటే తెలియదని పనిమనిషి దగ్గర చెప్పి బయటకు రాకుండా తలుపులు బిడాయించుకుని కూర్చుంటాడా! ఇది నీకే కాదు మనందరికీ అవమానం." రామ్మూర్తి తో అని పనిమనిషి వైపు తిరిగి "నాయుడిగారికి మరోసారి చెప్పు. లేదంటే ఎమ్మెల్యే గారికి చెప్పు. వాళ్ళిద్దరికీ కాదు-మండలాధ్యక్షుడికి కూడా చెప్పు.....వచ్చింది పాపానాయుడు పేట రామ్మూర్తి అని "పౌరుషంగా చెప్పి నిర్లక్ష్యంగా ముందుకొచ్చి పడుతున్న క్రాప్ ను సవరించుకున్నాడు.
    ఇదేదో పెద్ద వ్యవహారం అయ్యేట్టు వుందని అనిపించడంతో పని మనిసి భయపడ్డాడు. "అలానే సార్" వినయంగా అని వెళ్ళాడు.
    ఇంతకు ముందులాగా మిత్రులు మాట్లాడలేక పోయారు. లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తూండిపోయారు.
    ఈ సారి చాలా త్వరగా వచ్చాడు పనిమనిషి.
    ఏమైందా అని అడక్కుండా అందరూ బింకంగా వుండిపోయారు.
    అతను దగ్గరగా వచ్చి "పాపానాయుడు పేట రామ్మూర్తి అంటేనే వాళ్ళు ఎవడారాస్కెల్ అంటున్నారు. మరోసారి రామ్మూర్తి అన్నావంటే నాలుక చీరేస్తానని నాకు కూడా వార్నింగ్ ఇచ్చారండీ. ఇక నేను చెప్పను" అని వచ్చినంత స్పీడ్ గానే వెనక్కి వెళ్ళిపోయాడు.
    రామ్మూర్తి తల వంచుకున్నాడు తప్ప నోరుతెరిచి ఓ మాట మాట్లాడలేక పోయాడు.
    "అదేమిటి రామ్మూర్తి అలా అయిపోయావు. నువ్వే స్వయంగా వెళ్ళు! వాళ్ళంతా నీకు చాలా క్లోజ్ గా అయినప్పుడు ఈ రాయబారాలు ఎందుకు? నువ్వే డైరెక్టుగా వెళ్ళు" మనోహర్ సీరియస్ గా చెప్పాడు.
    "అవును అదే బెస్ట్. బిక్షగాళ్ళలా గేటు దగ్గర కాపలా ఏమిటి?" జగదీష్ కూడా ప్రోత్సహించాడు.
    ఇక తప్పదని తెలిసిపోతోంది రామ్మూర్తికి. తను ఏ పరిస్థితులైతే రాకూడదనుకుంటున్నాడో ఆ పరిస్థితులు వాటంతటవే వచ్చేస్తున్నాయి ఇప్పుడయినా నిజం చెప్పెయ్యాలనిపించింది అతనికి. కానీ ఇన్ని రోజులూ ఎంతో కష్టపడి కట్టుకున్న సాధాన్ని కూలగొట్టుకోలేక పోయాడు.
    "ఇంకా ఎందుకు ఆలోచన? ప్రొసీడ్. నిన్ను చూస్తూనే వాళ్ళు జరిగినదానికి సారీ చెప్పి లోపలికి ఆహ్వానిస్తారు" మరో మిత్రుడు సూరి అన్నాడు.
    గోకుల్ అనే ఇంకో యువకుడయితే ఏకంగా రామ్మూర్తిని ముందుకు నెట్టాడు.
    తూలిపడబోయి నిలదొక్కుకున్నాడు. అందరి వంకా దీనంగా చూశాడు. కసాయి వాడి దగ్గర మేక వెళుతున్నట్టే వుంది అతనికి.
    మెల్లగా అడుగులేసుకుంటూ వెళ్ళాడు.
    అక్కడున్న పనిమనిషి ఇక అడ్డు కోవడం తనవల్లకాదని నిర్ణయించుకుని లోపలికెళ్ళాడు.
    అక్కడ వాతావరణం విషాగా వుంది. ఫేము కుర్చీల్లో వి ఐ పీ లంతా చాలా ఖుషీగా కూర్చుని తాగుతున్నారు. వాళ్ళకు మధ్య నున్న తెల్లటి టేబుల్ మంచి నీటి సరస్సు గడ్డ కట్టుకున్నట్టుంది అందులో విరిసిన తామరలాగా విస్కీ బాటిల్ సరస్సు గడ్డ కట్టుకున్నట్టుంది అందులో విరిసిన తామరలాగా విస్కీ బాటిల్ మెరిసిపోతోంది. ఆ పువ్వు చుట్టూ వాలిన సీతాకోక చిలుకల్లా డిజైన్ లున్న గ్లాసులువున్నాయి. స్టీలు ప్లేట్లలో వున్న నాన్ వెజిటేరియన్ స్టప్ నోరు వూరిస్తోంది.
    అప్పటికి మూడు రౌండ్లు పూర్తవడం వల్ల వాళ్ళు మంచి రసకందాయంలో వున్నారు. వూరు రాజకీయాల నుండి ఐ ఎమ్ ఎఫ్ ఋణం వరకు ఘాటయిన డిస్కషన్స్ జరుగుతున్నాయి.
    సరిగ్గా ఈ సమయంలో వెళ్ళాడు పనిమనిషి.
    "ఏమిట్రా ఇటొచ్చావ్? ఎక్కడ నిన్ను వుండమన్నది?" భక్త వత్సలం కోపంగా ప్రశ్నించాడు.
    "అక్కడే వున్నాను స్వామీ. కానీ ఆ పాపానాయుడు పేట రామూర్తినేనని చెప్పినా వినకుండా మీతో మాట్లాడాలని లోపలికి వచ్చేస్తున్నాడు స్వామీ. దానిని చెప్పడానికే వచ్చాను స్వామీ." రెండు చేతులూ జోడించి చెప్పాడు వాడు.
    "ఎవడీ రామూర్తీ? నువ్వేమైనా ఎరుగుదువా?" సుధాకర నాయుడు ప్రశ్నించాడు మండలాధ్యక్షుడ్ని.
    "ఛీ ఛీ ఇలాంటి పెంటముందా కొడుకులతో నాకేం పని పాపానాయుడు పేట సర్పంచ్ తప్పమనకా వూర్లో ఎవరూ తెలీదు." అని "వుండుండి వాడి పని చెబుతాను" అని ఆయన ఉగ్రనరసింహుడిలా లేచాడు.
    ఇక అక్కడి నుంచి వూడిపోతున్న పంచెను సరిచేసుకుంటూ స్పీడ్ గా బయటకు వచ్చాడు.
    గేటు దాటి రెండు అడుగులు వేసిన రామ్మూర్తి ఆయన్ను చూసి ఆగిపోయాడు. మండలాధ్యక్షుడ్నిచూడడం అదే మొదటిసారి అతనికి పేపర్ లో ఫోటోలు రావడం వల్ల మనిషినైనా గుర్తుపట్టాడుగానీ లేకుంటే అదీ లేదు.
    "మండలాధ్యక్షుడు నీ కోసం వచ్చాడు. మాట్లాడు "గేటు బయటున్నమిత్రులు తొందర చేస్తున్నారు.
    "ఎవడ్రా నువ్వు" మండలాధ్యక్షుడు కటువుగా ప్రశ్నించాడు. జారిపోతున్నపంచెను తిరిగి గట్టిగా బిగించి మొలలో దోపుకున్నాడు.
    "నేనూ....."
    "అదే చెప్పు నిజం చెప్పకపోయావా నీ ప్రాణాలు తీస్తాను ఇవేళ" ఆయన కళ్ళు నిషాతోనూ, కోపంతోనూ ఎర్రగా రెండు సూర్యగోళాల్లో వున్నాయి.
    "పార్టీ కార్య కర్తవా?"
    కాదన్నట్టు తల ఊపాడు రామ్మూర్తి.
    అంతే మరుక్షణం అతని కళ్ళు బైర్లుకమ్మాయి. మండలాధ్యక్షుడు కొట్టిన దెబ్బకు శరీరం మొత్తం కదిలింది.

 Previous Page Next Page