Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 32


    
    "ఇష్! అబ్బ!" అంది శశి నొప్పికి కొద్దిగా కళ్ళు మూసుకుంది. "వదలండీ!" అంది ప్రాధేయపడుతున్నట్లు.
    
    "ఉహూ! నిన్నూ..." అన్నాడు సుధీర్ ఇంకొద్దిగా గట్టిగా కొరికి.
    
    "అబ్బా!" అంటూ చేతిలో ఉన్న టొమాటో కెచప్ బాటిల్ వదిలేసింది శశి. ఎర్రగా ఉన్న కెచప్ చూస్తే కుక్క రక్తం గుర్తొచ్చింది సుధీర్ కి. కెచప్ శశి చీర నిండా పడి అది శశి రక్తంలా కనబడింది.
    
    షార్క్ చేపలు రక్తం చూస్తే చెలరేగిపోతాయి. నీళ్ళలో ఉన్న మనిషికి పొరబాటున గాయమై రక్తస్రావం జరిగితే మరుక్షణంలో ఆవురావురుమని ఆ రక్తాన్ని వెదుక్కుంటూ వచ్చి, మనిషిని ఎముకలు కూడా మిగలకుండా రంపాల్లాంటి పళ్ళతో ముక్కలు చేసి తినేస్తాయి.
    
    శశి చీరమీద రక్తపు మరకలా కనబడుతున్న కెచప్ ని చూసి సుధీర్ షార్క్ చేపలా అయిపోయాడు. ఆమె నడుము మీద కూడా పడింది కెచప్. సొరచేపలా వున్న తన వేళ్ళతో ఆమె నడుముని గట్టిగా నొక్కి పట్టుకుని నాలికతో నాకేశాడు. ఆమెని ఎత్తుకెళ్ళి మంచంమీద పడేశాడు. డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు దొర్లిపోయాయి.    

 

    శశి చీర కుర్చీకి తగులుకుని. ఆమె మంచంమీద పడేసరికి వంటిమీద పరికిణీ జాకెట్ మాత్రం మిగిలాయ్. మంచం పక్కనే చిన్న బల్లమీద వున్న అలారం టైంపీసు పడి అద్దం పగిలి పోయింది. రొప్పుతున్నాడు సుధీర్.
    
    "శశీ! నిజంగానే నిన్ను తినేస్తాను. నిజంగానే నిన్ను....." ఆమె పెదిమలమీద పడ్డ గాట్లలో నుంచి వచ్చిన రక్తపు చుక్కలు ఉప్పగా తగిలాయి అతని పెదిమలకి.
    
    ఇరవై నిమిషాల సేపు ఆ గదిలో తుఫాను! ఆవేశం! భీభత్సం! సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులాగా వణికి పోయింది శశి. తుఫానులో చిక్కుకున్న పావురంలా అల్లల్లాడి పోయింది.
    
    ఆవేశం దిగిపోయి, కొద్దిగా నిస్సత్తువ ఆవహించాక అతనిలోని రాక్షసత్వం తగ్గి అతను మామూలు మనిషయ్యాడు. తరవాత ఆమె గుండెమీద తల పెట్టుకుని చిన్న పిల్లాడిలా పడుకున్నాడతను. అతని బుసా, క్రమం తప్పి రొప్పుతున్నట్లు అనిపిస్తున్న శశి ఉచ్చ్వాస నిశ్వాసాలు, తుమ్మెద ఝంకారంలాటి ఎయిర్ కండిషనర్ శబ్దం మాత్రమే వినబడుతున్నాయా గదిలో! ఆయాసంగా తలెత్తి శశి మొహంలోకి చూశాడు సుధీర్.
    
    "పెద్ద గొప్పే!" అంది శశి సిగ్గుగా.
    
    శృంగారంలో మొగాడు అప్పుడప్పుడు పాశవికంగా వేటగాడిలా ప్రవర్తిస్తే అది కూడా ధీరత్వంగా భావించి ఇష్టపడుతుందేమో స్త్రీ! అతని రాక్షసత్వాన్ని మొగతనంగా భావించింది శశి. ప్రేమా, అభిమానం కళ్ళకు రంగుటద్దాలైపోయి, మనుషుల నిజస్వరూపాలు సరిగా కనబడనీయవు. నిజం!
    
    సుధీర్ ని క్రీగంట కొద్దిగా గర్వంగా చూసుకుంది శశి. తనభర్త....సుధీర్! మొగతనం మూర్తీభవించినట్లున్న అందగాడు. తను వివశురాలైపోయి, 'దాసోహం' అనేలా చేసుకోగలిగిన మొనగాడు.
    
    అదంతా కొద్ది నిమిషాల క్రితం.
    
    ఇప్పుడో!
    
    అసహాయంగా తన గుండెలో తల పెట్టుకుని పసితనం వదలని పాపాయిలా అమాయికంగా! తనవైపు చూసుకుంది. అస్తవ్యస్తంగా ఉన్నాయి బట్టలు.
    
    "ఏమిటి చూస్తున్నావ్?" అన్నాడు సుధీర్.
    
    "నన్ను తినేస్తానన్నారు కదా! నేనింకా మిగిలి ఉన్నానా, అయిపోయానా? అని చూస్తున్నాను.
    
    "ఇవాళ కొంచెమే తిన్నాను నిన్ను. ఇంకో రోజు నిజంగానే నమిలేస్తాను..పూర్తిగా!" అన్నాడు డ్రాక్యులా లాగా చూస్తూ.
    
    నవ్వుతూ అతని జుట్టు ఇష్టంగా చెరిపేసింది శశి.
    
    మంచం మీద ఆకుపచ్చ బెడ్ షీట్ పరిచి వుంది. దానిమీద వాళ్ళిద్దరూ పచ్చిక బయలులో ఒకదాన్ని ఒకటి కవ్వించుకుంటూ ఆడుకుంటున్న కుందేళ్ళ జంటలా గున్నారు. కాని, ఆ ఆడ కుందేలుకి తెలీదు-తన జంటగా ఉంది కుందేలు కాదనీ, మతి చలించిన మగ తోడేలనీ!
    
    ఆ ప్రేమ తుఫాను వెలసిన తర్వాత శశి మనసులో దిగులు కొంచెం తగ్గినట్లయింది.    

 

    "శారద ప్రెగ్నెంటుటండీ!" అంది శశి, అతని మొహంలోకి చూస్తూ.
    
    "నీకెలా తెలుసు?" అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా. అతనింకా చనిపోయిన కుక్కని గురించే ఆలోచిస్తున్నాడు. 'ఆ కుక్క ప్రెగ్నెంటుటండీ!' అన్నట్లు వినబడింది అతనికి.
    
    "ఇవాళ వాళ్ళింటికి వెళ్ళాను నేను."

 

    "ఎవరి సంగతి నువ్వు చెప్పేది?"
    
    "శారదండి.....శంకర్రావు భార్య! తను ప్రెగ్నెంటుట!"
    
    చప్పరించేశాడు సుధీర్.
    
    "ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ప్రెగ్నెంటయితే మనకేం? ఇందాక సినిమానుంచి వస్తుంటే దారిలో ఒక చచ్చిపోయిన కుక్కపడి వుంది - ఆ కుక్క ప్రెగ్నెంటయితే మనకేం? నాక్కావలసింది నీ సంగతి? నువ్వెప్పుడు ప్రెగ్నెంటవుతావ్?
    
    "ఆ! అవుతాను!" అంది శశి గారంగా. ఆమె ఏమన్నా కొద్దిగా అల్లరిచేస్తే అతని దగ్గరే-సహజంగానే!

 Previous Page Next Page