గీత భుజం మీద చేతిని వేశాడతను.
"నేర్పితే ఆ తర్వాత నా స్పీడు నీకు తెలుస్తుంది."
"నో, డ్రైవింగ్ అనేది మగాడే చేయాలి. నిజం చెప్పాలంటే ఆడపిల్లు మగాడి దగ్గరే డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆడపిల్ల దగ్గర అబ్బాయి నేర్చుకుంటే అది డ్రైవింగ్ కింద లెక్క కాదు."
"మరి?"
"స్విమ్మింగ్!" అది కింద పెదవిని మునిపంటితో నొక్కిపెడుతూ గీత.
"పోనీ అదే నేర్పు!" అన్నాడు అభినయ్.
గీత చెంపలు కెంపులయినాయి అతని మాటలకి.
కారుని బీచ్ ఒడ్డున ఆపింది గీత.
ఆమె కారు దిగి "కమాన్ అభీ!" అంది.
అభినయ్ కారు దిగి ఆమె పక్కకి వచ్చి నించున్నాడు.
సముద్రం మీంచి వీస్తున్న హోరుగాలికి ఆమె జుత్తు మొహంమీదికి పడి ఎగురుతోంది. భుజంమీద నుంచి పమిట జారిపోతోంది.
బీచ్ మొత్తం నిర్మానుష్యంగా వుంది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది.
గాలి చల్లగా వీస్తోంది.
అక్కడికి దూరంలో జాలరులు వలలు సరిచేసుకొంటున్నారు సముద్రంలో కొన్ని తెప్పలు లంగర్ వేసి వుండటంచేత అలల తాకిడికి అటూ యిటూ కదులుతున్నాయి.
ఆమె సముద్రానికి అభిముఖంగా నిలబడింది. సముద్రం మీంచి దూసుకొస్తున్న గాలికి ఆమె పవిట తెరచాపలా ఎగురుతోంది.
"సముద్రంలో దిగుతావా?" అడిగింది గీత.
"బట్టలు తడిసిపోతాయి" అన్నాడు అభినయ్.
"ఇంత దూరం వచ్చాక ఏమీ తడవకూడదంటే ఎలా?" అంది గీత.
"ఓ.కే. అయంతే పందెం కట్టు. మొత్తం సముద్రం ఈది లోతు ఎంతో చెపుతాను"
"అందుకోసమే మరి కష్టపడి నిన్నింత దూరం తీసుకొచ్చింది."
ఆమె ఒక్కో అడుగు వేస్తుంటే ఆమె అడుగులో అడుగు వేసి నడుస్తున్నాడతను.
ఆమె సముద్రతీరాన గల సరువుడు తోటవేపు నడుస్తోంది.
అభినయ్ ఆమె పిర్రమీద చరిచాడు.
"సముద్రంలో దిగమన్నావు, లోతు చెప్పమన్నావు మరి అటెక్కడికి?" అడిగాడు.
గీత పగలపడి నవ్వేసింది.
"అన్నింటికీ తొందరేనా స్వామీ! ఏదన్నా పరీక్షకి హాజరయ్యే ముందు ప్రిపరేషన్ కావాలని తెలీదా?"
గీత నవ్వుతుంటే పలువరస తళుక్కున మెరిసింది.
అభినయ్ ఒక్కక్షణం పాటు నఖశిఖ పర్యంతం ఆమెను చూసి ముగ్ధుడైపోయాడు.
ఆర్గండీ షిఫాన్ చీర కట్టుకుంది. మ్యాచింగ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుంది.
సన్నగా పొడుగ్గా వుంది గీత.
కోలమొహం, ఎరుపురంగు, బ్రౌన్ కలర్ కళ్ళు, సన్నని చెంపలు, పలుచని పెదిమలు, సన్నని ముక్కు, నల్లని నొక్కుల జుత్తు గాలికి ఎగిరిపడుతోంది.
సన్నని తెల్లని కంఠం.
ఆమె భుజం మీదనుంచి మాటిమాటికి జారిపడిపోతున్న పవిట, గుండ్రని భుజాలు ఆమె శరీర సౌష్టవాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి.
ఖరీదయిన పాడింగ్ బ్రాలో ఆమె అందాన్నంతా అతనికోసం మోసుకొచ్చినట్లుగా ఆమె ప్రతి కదలికతోను లీలగా కదులుతున్న శిఖర ద్వయంక మతిని పోగొడుతోంది.
మనసుని చెదరగొడుతోంది. వయసుని రెచ్చగొడుతోంది.
ఆమె అడుగు తీసి అడుగు వేస్తుంటే 'వయ్యారం' ఆమె రూపంలో కదులుతున్నట్టుగా అనిపిస్తోంది.
ఆమె అతని చేతిని పట్టుకొని నడుస్తోంది.
ఆమె నడుంచుట్టూ చేతిని వేశాడతను.
ఉన్నట్టుండి తోటలోకి నడిచాక ఆగిపోయింది గీత.
"అభీ!" పిలిచిందామె.
"ఏమిటి?"
ఆమె కళ్ళ్లల్లో కొట్టొచ్చినట్టుగా ఆరాధన కనబడుతోంది.
"అభీ! నీతో కలిసి నువ్వు చేతిని అందిస్తే ఈ తీరాలవెంట జీవితకాలమంతా ప్రయాణం చేయగలననిపిస్తోంది."
అతను ఆమె చెంపలమీద చేతులు వేసి నిమిరాడు.
"గీతా! అనుకొంటున్నావే కానీ..... ఒకరితో ఒకరు పూర్తిగా ప్రయాణం చేయలేరు.
రైల్లో ఎక్కిన ప్రయాణీకుల్లా ఈ భూమ్మీద పడ్డ మనం ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు.
ఇది కేవలం తాత్కాలికం.
ఒకరిమీద ఒకరికి గల అభిమానంచేత అలా అనిపిస్తుంది. అంతే గీతా!
ఈ సృష్టి ఒక అభూతకల్పన.
ఈ కాల్పనిక ప్రపంచంలో మనిషి మనిషితో రాజీపడి బ్రతుకుతాడు.
అటొక్కసారి చూడు.
ఆ పక్షి సముద్రం మీద స్వేచ్ఛగా ఎగురుతోంది.
ఈ అభినయ్ అంతే!
నేను పక్షిలాంటివాడిని.
శాశ్వతంకాని ఈ బ్రతుకుమీద ఆశలు పెంచుకుని వేలాడ్డం నా అభిమతం కాదు.
జీవితాన్ని దేవుడిచ్చింది అనుభవించడానికి.
అందుకే నేను సమయాన్ని బట్టి తోచినట్టు చేస్తున్నాను.
అంతేకాదు, నాకు తోచినంతలో ఎదుటి మనిషిని ఆదుకోవాలి, సాయపడాలి, ఉపయోగపడాలి. అది నా సిద్ధాంతం."
అతని మాటలకి క్షణంపాటు నివ్వెరపోయింది గీత.
అతని మాటల్లోగల అపురూపమైన సత్యాన్ని గ్రహించాక అతని వ్యక్తిత్వం మరింతగా పెరిగిపోయింది ఆమె హృదయంలో.