Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 33


    
    అతన్ని లవర్ బోయ్ అనుకుంది. కానీ ఇప్పుడు ఆరాధింపదగినవాడు అనుకుంటున్నది.


    ఆమెకు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు.


    ఆమె చేతిని పట్టుకుని తోటలో ఓ దొరువులో కూర్చోబెట్టి అతను కూడా పక్కనే కూర్చున్నాడు. నరువుడు చెట్లు గీజురుమని శబ్దం చేస్తున్నాయి. సముద్రపు హోరు జోరుగా వినబడుతోంది.


    ఇద్దరిమధ్య కొన్ని క్షణాల మౌనం.


    ఆ నిర్లిప్తతని భంగపరుస్తూ పిలిచాడతను


    "గీతా!"


    "ఊఁ"


    ఆమెని ఒడిలోకి లాక్కున్నాడతను


    "నిన్ను కౌగలించుకోనా?" అన్నాడు.


    గీత కళ్ళతోనే నవ్వింది.


    "మనసుపడి వచ్చిన ఆడపిల్లని ఇది చెయ్యనా, అది చెయ్యనా అని అడగకూడదు కావాల్సినవి తీసుకోవాలి. అడిగితే యిష్టమయినా కాదంటుంది. అప్పుడు సీను మొత్తం గోవిందా అవుతుంది."


    "ఏమో! మళ్లీ పోలీసులొచ్చి....." అతని మాటల్ని పూర్తి కానివ్వలేదు గీత.


    "నీకింకా నా మీద కోపం పోలేదన్నమాట. నువ్వే చెప్పు. ఏ ఆడదయినా ఊహించని ఆ సంఘటనకి ఏం చేస్తుంది.?


    కానీ నాకిప్పుడనిపిస్తోంది.


    నువ్వే ఆ సాహసం చేసి ఆ ముద్దుని నాకు కానుకగా యివ్వకపోతే నేనిలా నీకు దగ్గరయ్యేదాన్ని కాదుగా! అప్పుడు జీవితంలో నేనెంతో 'మిస్' అయ్యుండేదాన్ని."


    అతను వంగి ఆమె పెదవుల్ని అందుకున్నాడు.


    "మ్చ్"

    
    "ఈ ముద్దెలా వుంది?" అడిగాడతను.


    "ముద్దుల్లో ఇన్ని రకాలుంటాయని, ఇంత మధురంగా వుంటాయనీ నాకు తెలీదు.


    నువ్విలా ఎదురుగా వుండి ముద్దుల వర్షం కురిపిస్తానంటే నాకు నిద్రాహారాలు అవసరం లేదు అభీ!" ఆమె అతని భుజాల చుట్టూ చేతులని వేసింది. అతను ఆమె చేతులకిందగా తన చేతులను పోనిచ్చి వీపుని నిమురుతూ తన గుండెకి ఆమెని గట్టిగా వొత్తుకున్నాడు.


    మెత్తని ఆమె గుండెలు అతని ఛాతీకి తగిలి నలిగిపోతున్నాయి.


    ఆమె వీపుని సవరదీస్తూనే అతని చేతి వేళ్ళు చురుగ్గా ఆమె బ్లౌజ్ హుక్స్ తీసేసినాయి.


    ఆమె మెడమీద, మొహంమీద ముద్దులతో నింపేస్తున్నాడు.


    ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది.


    బ్లౌజ్ పైకి తొలగి బ్లాక్ బ్రాసియర్ పైనించి సగం పైగా బయటపడి మొదటిసారిగా మగాడి కంటపడిన ఆమె అసమాన సౌందర్యానికి అతను అచ్చెరువొందాడు. పర్వత శిఖరాలని నల్లని మేఘం కమ్మినట్టున్న బ్రా పైన చేత్తే నిమిరి బటన్ తీశాడతను.


    ఆమె మొహాన్ని పక్కకి తిప్పుకుంది.


    "నీకేమీ రాదనుకున్నాను" అంది.


    "రాకపోతే ఏం చేసేదానివి?" కొంటేగా అడిగాడు.


    "ప్రయత్నాలన్నీ నావే అయివుండేవి!"


    అతను ఆమె గుండెలని మొహానికి రుద్దుకున్నాడు.


    ఆమె నడుముని గట్టిగా పట్టుకుని నలిపి విడిచిపెట్టాడతను.


    "అమ్మా!" అంది గీత.


    ఆమె విడుస్తోన్న ఊపిరి వెచ్చగా అతని మొహానికి తగులుతోంది.


    "నన్నేం చేస్తున్నావు?" అడిగింది చెవిలో.


    "నీ అందాన్ని తాగేస్తున్నాను!" అన్నాడతను బొంగురుగొంతుతో.


    "నాకేమీ తెలీడంలేదు!" ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె నడుంమీదనించి చేతులు పిరుదుల మీదకి పాకినాయి.


    "ప్లీజ్ అభీ! నన్ను చంపేయి!" ఆమె గొంతులో వణుకు.


    అతను ఆమె మీద పడ్డాడు. బలంగా ఆమెని కౌగిలించుకున్నాడు.


    ఆమె గుండెలు అతని ఛాతీకి తగిలి నలుగుతున్నాయి.


    ఆ క్షణం అక్కడే ఆగిపోవాలి!


    కాలం ముందుకి కదలకూడదు.


    రేపు ఏమిటీ నా భవిష్యత్తు అని ఆమె ఆలోచించటం లేదు.


    అతన్నించి ఏదో కావాలని ఆరాటం....


    అనుభవంలోని రహస్యాన్ని తెలుసుకోవాలని సాగిస్తోన్న ఇన్ వెస్టిగేషన్ అది.


    ఆ ఇన్ వెస్టిగేషన్ లో తనని పూర్తిగా మర్చిపోయింది.


    చలిగాలి తిరిగింది.


    వాన ప్రారంభమయింది.


    కానీ... ఈ ప్రపంచాన్ని మరచి సాగిస్తోన్న పరిశోధనలో ఇద్దరూ ఒకరిలో ఒకరు ఏదో వెదుక్కుంటున్నారు.


    పరిశోధన ముగిసింది.


    అతని గుండెలమీద వాలిపోయింది గీత. అతని జుత్తులోకి చేతివేళ్ళని పోనిచ్చి వంగి అతని పెదవులమీద ముద్దాడింది గీత.


    "అభీ! నాకేమనిపిస్తుందో తెలుసా?"


    నీ రూపం ఓ సమ్మోహనాస్త్రంలా ఆడవాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తుంది.


    నీ చూపు మన్మధ బాణంలా ఆడపిల్లల గుండెని తాకుతోంది అందుకేనేమో?


    పెళ్ళయినవాళ్ళు శీలం గురించి మరచిపోయినా, కన్నెపిల్లలు నీకు సరెండర్ అయినా ఆశ్చర్యపడనవసరం లేదు.


    నేను నీతో పొందిన ఈ అనుభవాన్ని తప్పుగా భావించడం లేదు.


    కోరి కోరి నీ కోసం వచ్చాను. నీతో ఈ అనుభవాన్ని కోరుకున్నాను. ఇప్పుడు నాకెంతో తృప్తిగా వుంది.

 Previous Page Next Page