Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 32

  

      అతని నోట్లోంచి వస్తున్న విస్కీ వాసన ఆమె ముక్కుపుటాలకు తాకింది. గబుక్కున ముక్కు మూసుకుంది మయూష.
   
    "చెడు వినకు చెడు మాట్లాడకు...చెడు మాట్లాడకు....చెడు చూడకు....అని విన్నాను తప్ప, చెడుని వాసన చూడకు అని నేను వినలేదు. చూసావా నా చెడు ఎలా ఉంటుందో ఇలాంటి ఇన్ సిడెంట్ ను జీవితంలో ఫస్ట్ టైమ్ చూసుంటావ్ కదూ.....కళ్ళు బైర్లు కమ్ముతున్నాయా?" నవ్వుతూ లిక్కర్ కాబినేట్ టేబిల్ మీదున్న విస్కీగ్లాస్ ను అందుకున్నాడు జ్వాలాముఖిరావు.
   
    ఆ అమ్మాయి చీర, జాకెట్టు వేసుకుని అతని ముందుకొచ్చింది డ్రాయర్ లోంచి చేతికందిన నోట్ల కట్టల్ని ఆమె చేతికందించాడు.
   
    "గుడ్ నైట్ డార్లింగ్....." నవ్వుతూ వెళ్ళిపోతున్న ఆమె వేపు విచిత్రంగా చూసింది మయూష.
   
    అతని స్వరూపం ఒక్కసారిగా తెలియడంతో మయూషకు అతని పట్ల ద్వేషం, అసహ్యం, కోపం ఒక్కొక్కటి పెరిగిపోతున్నాయ్.
   
    "నువ్వు పశువ్వని రుజువు చేసుకున్నావ్" అని అంది అసహ్యంగా.
   
    ఆ మాటకు జ్వాలాముఖిరావుకి కోపం వచ్చింది. చేతిలోని గ్లాస్ ను విసిరికొట్టాడు.
   
    "నోటికొచ్చినట్టు వాగుతున్న నీ నోటిని ఒక్క క్షణంలో మూయించగలను. నిన్ను ఒక్క నిమిషంలో ప్రాణంలేని శవంగా మార్చగలను. కానీ చెయ్యను. ఎందుకో తెలుసా? కక్ష....పగ......అందుకే....అందుకే.... చూసావా....ఒక్కసారి నీ ముఖాన్ని నువ్వు మిర్రర్ లో చూసుకో. నువ్వు చూసిన సెక్స్ దృశ్యం నీలోరేపిన భావాలు నీకు కనిపిస్తాయి.
   
    నన్ను నువ్వు నలుగురిలో సవాల్ చేసి సెక్స్ స్కాండల్ ని నా మీద రుద్ది నన్ను అవమానపర్చకపోతే ఏ కుర్రాడి కౌగిట్లోనో నువ్విలాగే వుండేదానివి కదూ. పాపం...అడవిలో వెన్నెల కాయడమంటే ఇదేనేమో...." ఆ జోక్ కి తనే నవ్వేసుకుంటున్నాడతను. కసిగా, కక్షగా పెగ్గుమీద పెగ్గు తాగేస్తున్నాడు.
   
    కాసేపయ్యాక నవ్వు తగ్గాక అడిగాడు.
   
    "నేను మగాడ్నని రుజువయిపోయింది గదా" మళ్ళీ అన్నాడు.
   
    మయూష అసహ్యంగా అతనివేపు చూసింది.
   
    "డబ్బిస్తే ప్రొస్టిట్యూట్ కొజ్జానికూడా మగాడివి అంటుంది."
   
    ఆ మాటకు జ్వాలాముఖిరావు ముఖం అవమానంతో ఎర్రగా అయిపోయింది చేతిలోని గ్లాస్ ని విసిరికొట్టి విసురుగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యివేసాడు. ఆ పట్టు బలంగా, దృఢంగా వుంది.

    ఒక్కక్షణం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసాడు.
   
    "తెలివైనదానివే....ఏమో అనుకున్నాను. ప్రొస్టిట్యూట్ దగ్గర నువ్వు పడుకున్నావో లేదో నాకేమిటి నమ్మకం అని అంటే....నీ దగ్గర పడుకుంటానని.....నీ వెధవాలోచన కదూ....ఆహా...ఇంటెలిజెంట్ యంగ్ లేడీ.....నీ కొచ్చిన అనుమానాన్ని తీర్చడం నా ధర్మం కదూ......అంటే నేను ఒకమ్మాయి సంతృప్తి చెందేటట్లు అనుభవించానని నువ్వు తెల్సుకోవాలి.....ఈ ప్రొస్టిట్యూట్స్ ని నువ్వు నమ్మవ్ కదూ....."
   
    కథ యిలా అడ్డం తిరుగుతుందని ఊహించలేదు మయూష. తలదించుకుంది. అక్కడనుంచి ఎలాగోలా బయటపడాలని ఆమె తాపత్రయం.
   
    అదే సమయంలో బాటిల్ ని అందుకుని బాటిలంతా గబగబా తాగేసాడు. పావుగంట తర్వాత ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ, అరుస్తూ కుప్పకూలిపోయాడు జ్వాలాముఖిరావు.
   
    ఆ తర్వాత ఆ బిల్డింగ్ లోంచి బయటికొచ్చింది మయూష.
   
    "వాడు.....లోపల తాగి పడిపోయాడు.....నువ్వెళ్ళు" అందామె చీత్కారంగా.
   
    "మిమ్మల్ని వచ్చిన చోటుకు చేర్చడమే నా రెస్పాన్స్ బిలిటీ" మరేం మాట్లాడకుండా కారు డోర్ ఓపెన్ చేసాడు డ్రయివర్.
   
    ఎక్కి కూర్చుంది మయూష.
   
    కారు కదిలింది తలను సీటుకి ఆన్చుకుని కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి పీల్చిందామె.
   
    ఆమె కళ్ళముందు జ్వాలాముఖిరావు కామక్రీడ కదలాడుతోంది ఎంత వద్దనుకున్నా.
   
                                                                              *    *    *    *
   
    నలభై ఎనిమిది గంటల తర్వాత-
   
    మేడమీద వరండాలో నిలబడిన మయూషను కింద గార్డెన్లో తిరుగుతున్న జిమ్మీ చూసి పరుగు పరుగున పైకొచ్చేసి ఆమె కాళ్ళ దగ్గర నిలబడింది.
   
    మధ్యాహ్నం తనకోసం తెచ్చిన ప్రాణ్ పకోడీని జిమ్మీ వస్తే పెట్టాలని దాచింది మయూష. వెంటనే ఆమె లోనికెళ్ళి ప్లేటుని జిమ్మీ ముందు వుంచింది జిమ్మీ ఆబగా వాటిని తినేసింది.
   
    జిమ్మీని చేతిలోకి తీసుకుని తనచీర కొంగుతో దాని మూతిని ప్రేమగా తుడుస్తుండగా-
   
    "గుడ్.....మొత్తంమీద ఒక ఫ్రెండ్ ని సంపాదించావన్న మాట" ఆ గంభీరమైన గొంతువిని తల తిప్పింహ్ది మయూష. కుర్తా పైజమాలో మెరిసిపోతున్నాడు జ్వాలాముఖిరావు.
   
    గబుక్కున జిమ్మీని వదిలేసింది మయూష. ఆ కుక్కవేపు సీరియస్ గా చూసాడతను. వెంటనే కార్డేలెస్ అందుకుని బటన్ ని ప్రెస్ చేసి "కుటుంబరావ్ కమ్ హియర్ ఒన్స్" అని అపరిచితంగా అన్నాడు.
   
    మరొక మూడు నిమిషాల్లో ఎస్టేట్ మేనేజర్ కుటుంబరావు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
   
    "దీని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళకిచ్చెయ్. దీన్ని ఈ సిటీ లోంచి దూరంగా ఎక్కడికయినా పంపించెయ్యమను లేదా చంపేయమను" శాసించాడు జ్వాలాముఖిరావు.
   
    ఏం జరిగిందో అర్ధంకాలేదు కుటుంబరావుకి.
   
    "ఓ.కే. సార్. ఇప్పుడే తీసికెళ్ళి అప్పగించేస్తాను" గొలుసును పట్టుకుని లాగి జిమ్మీని తనతో తీసుకుని గబగబా మెట్లుదిగి కిందకు వెళ్ళిపోయాడు. సగం దూరంవరకూ మౌనంగా వెళ్ళిన కుక్క ఆ తర్వాత అరవడం ప్రారంభించింది.
       
    ఆ అరుపు కాసేపయ్యాక కనుమరుగైపోయింది.

    "నువ్వు త్వరగా నీకిష్టమైన డ్రెస్వేసుకో బయటకు వెళుతున్నాం" ఆ మాట చెప్పేసి పక్కగదిలో కెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు.
   
                                              *    *    *    *
   
    పదినిమిషాల తర్వాత కారు బంజారాహిల్స్ చౌరస్తాతో మలుపు తిరిగింది.
   
    "ఆ జిమ్మీని నేను జర్మనీనుంచి పదిహేను వేలకి కొనితెచ్చాను. ఐ లవ్ హెర్......బట్.... ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరకు ఎందుకు పంపించేసానో తెలుసా?" సిగార్ వెలిగిస్తూ అన్నాడు జ్వాలాముఖీరావు.
   
    "నాకు మచ్చిక అయిపోతుందని....నాకు చేరువయ్యే ఆ కుక్క వల్ల ఎప్పుడయినా నీకు ప్రమాదం ఏర్పడుతుందని" ధైర్యంగా అంది మయూష.
   
    "నాకా? ఆ కుక్క వల్ల ప్రమాదమా? నన్నెపుడూ నువ్వుతక్కువ గానే అంచనా వేస్తున్నావు  ఆ రోజు కృష్ణా ఓబ్రాయ్ లో కాన్ఫరెన్స్ నుంచి ఈరోజువరకూ....." అని నవ్వి-
   
    "ఎందుకు పంపించేసానో చెప్తాను విను. నువ్వు లేడీస్ హాస్టల్ లో ఎప్పుడయినా వున్నావా? లేవు. కనీసం ఫారిన్ మాగజైన్స్ ఎప్పుడయినా చూసావా చదివావా కోరికను ఆపుకోలేని వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ తో స్నేహం చెయ్యడానికి భయపడేవాళ్ళు, భర్తలు పోయినవాళ్ళు కుక్కల్ని పెంచుకుంటారు ఎందుకో తెలుసా? వాటిద్వారా తమ కోర్కెను తీర్చుకోడానికి-ఆ రకంగా శారీరక సంతృప్తిని పొందుతారు. నువ్వు ఆ రకమైన ఆలోచనతో జిమ్మీని మచ్చిక చేస్తున్నావేమో? నా ఆలోచన తప్పంటావా? నో.....జ్వాలాముఖీరావు ఈజ్ ఆల్వేస్ రైట్" కులాసాగా నవ్వుతూ అన్నాడతను.

 Previous Page Next Page