Previous Page Next Page 
మనస్విని పేజి 31


    
    అసల్లేడు!
    
    మౌఢ్యమి కాబోలు!!
    
    హంపీ!
    
    ఒకనాటి ఆంధ్రులు మహోన్నత వైభవానికి తార్కాణం.
    
ఈ నాటికీమనుషుల మనసుల మీద మరిచిపోని మరువలేని ముద్రవేసే శిధిలరాజ్యశిధిలావశేషం--
    
    చూసేవాడు కరకు రాక్షసుడైనా కన్నీటినీటి చుక్కలు రాలక మానవు.
    
    సగంవిరిగిన విగ్రహాలూ--
    
    వాటిని చూస్తుంటే ఈనాడు ఇంత నాగరకుడినని విర్రవీగే మానవుడు తొలినాడు చర్యనితలచుకుని సిగ్గుపడతాడనిపిస్తుంది.
    
    సౌదర్యం ఈనాటికి చిప్పిల్లుతున్నపంపా సరోవరం-
    
    పద్మమహల్!
    
    "మహారాణులునివసించిన ఆ స్థలంలో పాదం మోపాలంటేనే భయం వేస్తోంది." 

   

    "తిరుమలదేవి చరణొత్పలలోకకల్ప" రాజితరజిజ ప్రసాదం--
    
    విరూపాక్షేశరుడు-
    
    శివమూర్తిప్రళయమూర్తి జడమూర్తి అయి కూర్చుని తమ ఎదుటే జరిగే ఘోరాలు చూడలేకకోపంతో శరీరమంతా వాడినల్లగా మారిపోయింది. కంఠం కాలకూట విషం నల్లనయినట్టు ఆ సామికి.    


    ఒకానొకనాడు-
    
    సకలసామంత మణిమకుట ధగద్దగాయ మానమై, వివిధ బాషా పాండితీప్రకర్షులైన కవులచే విరాజితమై, భారత్తీ దేవిముంజేతి కంకణరవళిని మృదువుగా మధురముగా వినిపించినకవిరాజు రాజకవి విరజితమైశోభిల్లిన భువనవిజయం--
    
    ఈనాడు--
    
    అనుకోవటానికే భయం వేస్తోంది.
    
    సరసనసంగీత సమరాంగణా సారభౌముడు-
    
    కృష్ణరాయుడు--
    
    కవులపాలిటికల్పవల్లి-
    
    రాజులపాలిటి రారాజు-
    
    శత్రురాజులగుండెల్లో చిచ్చు-    

 

    రసికహృదయ రాజ్యరమావిభుడు-    

 

    ఆయన అధిష్టించిన సింహాసనం-    

 

    చేతులారాతనివి తీరా ముట్టుకుని తడిమిచూసి ఆనందం అనుభవిద్దామని దగ్గరగా వెళ్ళింది గీతాంజలి.
    
    "ఆగుగీతా"
    
    భయంకరంగా
    
    కోపం అంతా మూర్తీభవించినట్టు--
    
    సముద్రం ఘూర్ణిల్లినట్టు--
    
    అతనువేసిన కేక-ఆపి వేసింది ఆమెను.
    
    దగ్గరగా వస్తూ అన్నాడు:
    
  "ముత్తుకోకు గీతా! ఎంతటి పుణ్యమూర్తులశరీరస్పర్సలతోనో పులకితమై పుణ్యవంతమైందా సింహాసనం-దాన్ని ఈ స్థితిలో చూడటం ప్రాప్తించటమేమన దురదృష్టం-అలాంటిదాన్ని ముట్టుకుని మళ్ళీ అపవిత్రంచేసి మరికొంత పాపంకట్టుకోకు"
    
    అతని సున్నితమైన హృదయంద్రవించింది.
    
    ఆ మాటలని అర్ధం చేసుకుంది ఆమె-
    
    ఏసుగుశాల--
    
    రామలయం--
    
    అహో!
    
    శిల్పకళలక్ష్మి చిగిర్చి శోభాయమానంగా శోభించింది ఇక్కడే!
    
    సప్తస్వరాలు-    

 

    ఆ సరిగమలు రాయలవారి రసిక హృదయతాగమగమలు.
    
    తుంగభద్రవేపుగా నడిచారు.
    
    దాన్ని చూస్తూనే అన్నాడు.
    
    "ఆనాటి వైభవం చూసింది. పండువెన్నెలలోరసిక ప్రభువు సాన్నిధ్యంతోధన్యమైంది. తిరిగి దుర్మార్గులచేతుల్లో అంతటిశోభా నశిస్తుంటే చూచి ఏడ్చింది.
    
    ఆ కలుష మానవుల రక్తంతో తానూ కలుషితమైంది. ఉన్నదాన్నికూడా భద్రపరుచుకోలేని తనవారి అశక్తతనిచూచి ఏడ్చింది.
    
    ఈనాటికీ నాటి శోభకై పాటుబడని ప్రయత్నమైనా చేయని నరులని చూచి ఏడుస్తోంది.
    
    కర్ణాట సామ్రాజ్యక్ష్మి-భారతదేశశకుంతలంలా వెలుగొందుతుంటేచూసి సంతోషించిన తల్లి-
    
    ఈమె దుఃఖం చూసే అన్నారు ఒకరు-
    
    "శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో
    
    ఇక్కడి శిలలే ఏడ్చాయి ఆ ఘోరానికి--
    
    ఏడుస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ ఘోరానికి-"
    
    అతని కంఠం దుఃఖంతో బూడుకపోయింది.
    
    మెల్లిగా అతని చేయి పట్టుకుని నడిపించుకుంటూ దిగిన గదివైపు దారితీసింది ఆమె.
    
    "ఇదిప్రహ్లాదుని బండ!"
    
    "ఏముందిక్కడ?"
    
    "ఏమో"
    
    "వెళ్ళిచూద్దాం!"
    
    "పదండి"
    
    మెల్లిగా ఆ బండలు పట్టుకుని అతికష్టం మీద ప్రాకి లోపలికి తొంగి చూశారు.
    
    "ఏమిలేదో ఏదో విగ్రహంతప్ప"
    
    "అవును"
    
    "మరి"
    
    "నాకు తెలియదు"
    
    "తెలుసుకొనిచెప్పాలి. తెలీదంటే ఎలా గీతా? ఈసారి ఇలా అంటే చంపేస్తాను తెలుసా?"
    
    "అలాగే"
    
    "ఆపైకి వెడదామా?"
    
    "వెళ్దామ్"
    
    "నడుస్తానా"
    
    "ఊ"
    
  "అబ్బ అలా చూడు! దివికీభువికీ లంగరు వేస్తున్నట్లు-ఆలోయలు ఆ వృక్షాలు.....అబ్బ....మనసు పరవళ్ళు వేస్తోంది ఎలా? ఈ సౌందర్యాన్ని తీసుకుని వెళ్ళి మనింట్లోపెట్టాలి? తెస్తావా?"
    
    "ఊ"
    
    "మరితీసుకుని రాపో......"
    
    ఒక్కక్షణంలో కెమెరా బయటకు తీసిచూసి ఫోటో తీసేసింది.
    
    "తెచ్చావా?"
    
    "ఊ"
    
    "అప్పుడే"

 Previous Page Next Page