Previous Page Next Page 
మనస్విని పేజి 32


    
    "ఔను"
    
    "ఎలా?"    

 

    "ఇదిగోఇది కెమేరా.....దీన్ని మనకేదికావాలనుకుంటామోదాని కెదురుగా పెట్టినొక్కితే అది దీంట్లోకివచ్చేస్తుంది"
    
    "వెంటనే"
    
    "ఊ"
    
    "అయితే"
    
    "ఊహూ అలా ఒక్కటీ రారాదు......ఎనిమిదికావాలి ఇంకా ఒకటి తక్కువుంది"
    
    ఒక్కక్షణం ఆగాడు.
    
    "అయితే నీకు కావాలి"
    
    తనవి కెమెరా చేతికి ఇస్తూ బటన్ ఎలా నొక్కవలసిందీ చూపింది.
    
    "సరిగానిలుచో"
    
    "......."
    
    "ఆ అలా చూడు"
    
    "......."
    
    "ఒకటి......రెండు......మూడు........!"
    
    కెమెరాక్లిక్ మనిపించాడు.
    
    తిరిగి కెమెరా అందుకుంది.
    
    "మరితీసి ఇవు"
    
    "ఇంటికి వెళ్ళాక"
    
    "నిజం"
    
    "నిజం"
    
    "సరే"
    
    ఎగుడుదిగుడుగా వున్నదారి--
    
    సరిగాలేని ప్రదేశాలు--
    
    ఎలాగోతుప్పలూ పొదలూదాటుకుంటూ వెడుతున్నారు
        
    దారివెంట అక్కడక్కడాటికెట్సు వసూలు చేస్తున్నారు.
    
    ఓ చోట ఓ చెంచులగుంపు ఎదురుగా నిలవేసింది.
    
    "ఏం?"
    
    "పైసలివ్వండి బాబయ్యా"
    
    "ఎందుకు"
    
    "కట్నం"    

 

    గీత ఇవ్వబోయింది.
    
    ఆమెచేయి లాగి తీసుకుంటూ అన్నాడు.
    
    "ఇవ్వవద్దు"  

 

    "ఎందుకు బాబయ్యా?"
    
    "నేనెందుకు ఇవ్వాలోయ్?"
    
    "మాకుకట్నం బాబూ అది"
    
    "ఎందుకో"
    
    "మా అక్కని మా బావ ఎత్తుకుని పోయాడు"
    
    గట్టిగా నవ్వాడు.
    
    ఎవరోకాదు బాబయ్య మా నర్సిమ్ముడు బావ మా అక్కని ఎత్తుకునిపోయాడు"
    
    "మీ అక్క ఎవరు?"  

 

    "లచ్చిందేవి"
    
    అర్ధంకానట్టు చూశాడు ఆమెవైపు.
    
    వివరంగా చెప్పింది గీత:
    
    "శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించటానికి అవతారమెత్తి నృశింహసామియై హిరణ్యకశ్యపుని సంహరించాక ఆ ఉగ్ర నరసింహావతారంతో శాంతం రాక కోపం అణగక వస్తుంటే ఎవరూ ఆపలేక పోయారాయన్ని శ్రీమహాలక్ష్మి కళతో జన్మించిన చెంచులక్ష్మి అతని ఆపివేసింది. ఉగ్రనరసింహమూ రెండు వేరై సామి-శ్రీపతి-శ్రీసతినిమరిచి చెంచులక్ష్మి కరగ్రహణంతో ఆమె బంధంలో చిక్కిపోయాడు-గూడెంనుండి మాయమై వచ్చి ఇక్కడ అహోబిలంలో కాపురం పెట్టారు. అదీ కథ"
    
    విరగబడినవ్వాడు.
    
  "ఏదీఏదీ మళ్ళీ చెప్పు......మళ్ళీచెప్పు......మీ అక్కని.....మీ బావ-ఎ-త్తు-క-పో-యా-డా" 

   

    "అవునుబావయ్యా"
    
    బిక్కమోగంవేసి అన్నాడు అతని నవ్వుచూసి.
    
    చేతినిండాడబ్బు తీసుకుని వాళ్ళకి గుమ్మరిస్తూ అన్నాడు:
    
    "వెళ్ళండి పాపం......వెతుక్కోపోండి మీ అక్కని"    

 

    హిరణ్యకశిపుని శిల!
    
    దానితోనే నృసింహస్వామి హిరణ్యకశ్యపుని చీల్చి వేశాడట-
    
    ఎంతో ఎత్తున వుంది.
    
    ఆ పైకీ వెళ్ళారు.
    
    ఎక్కటానికి బండలు దాటటానికి ఎంతో ఇబ్బంది.  

 

    దప్పికవేస్తే మంచినీళ్ళూ కూడా వుండవు-పట్టవు-
    
    తిరణాలసమయంలో తప్ప ఇలాంటి సమయంలో జనం కూడా తక్కువే
    
    అక్కడక్కడ నివసించే చెంచులుతప్ప--
    
    ఆపైకివెళ్ళి శిలను పట్టుకుని తిరగబోతూ అగాధమైన లోయలోనికి చూస్తూ అన్నాడు.
    
    "అబ్బ ఎంత అందంగా వుందిగీతా! ఇలాగే.......ఇలాగే......ఇక్కడినుంచి దూకితేనో?"
    
    గుండె ఝల్ మంది.
    
    "వద్దంటే?"
    
    "......."
    
    "అసలేమొండి"
    
    "......"
    
    "దూకేస్తాడు-ఎలా?"
    
    బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది.  

 

    "దూకేద్దామా"
    
    "ఊ"
    
    "నిజంచెప్పు"
    
    "నిజం"
    
    "ఊ......పట్టు......"
    
    చేయిచాచాడు.
    
    చేయి అందించింది.
    
    "కళ్ళు మూసుకో"
    
    మూసుకుంది.
    
    "ఒకటి.......రెండు....."    

    "......"
    
    "మూడంటేనే దూకెయ్యాలి"

 Previous Page Next Page