Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 31


                                   చిన్నగీతం: పెద్ద సందేహం

 

 

ఎంతచిన్నదై పోయిందీ భూలోకం!
ఎంత చేరువై పోయిందీ అకాశం!
భూతలంలో ఎక్కడ వున్నా
ఏ చోటయినా ఇంకో చోటికి

ఇరవయి నాలుగు గంటల కన్నా ఎక్కువ దూరంలో లేదు
టెల్లీలో ఢిల్లీ, రాయబరెల్లీ కనిపిస్తాయి
బల్లిపలుకులూ నత్తనడకలూ
స్పష్టంగా వినిపిస్తాయి

క్షీరాబ్ధి ద్వాదశి
మానవ మానస రోదసి!

ఇక్కడ కనిపించని ఒక్కొక్క నక్షత్రం
ఇంకా జనియించని ప్రపంచం
ఎంత చిన్నది భూలోకం!
ఎంత చేరువ ఆకాశం!

ఆకాశంలో మనిషి మనిషితో    
కరచాలనమే చేస్తాడా?
జయదుందుభి మ్రోగిస్తాడా?
లేదా, చస్తాడా?

                                 ముద్రణ: ఆంధ్రజ్యోతి వారపత్రిక- దీపావళి స్మచిక- నవంబరు,1982

 Previous Page Next Page