"నా దగ్గర మహిమలేం లేవు గెస్ చేసి చెప్పాను. బట్టలు విప్పేందుకు సిగ్గుపడుతున్న నిన్ను ఏదో మిషమీద దాన్నుంచి తప్పించాలని ఆ గేమ్ ఆడాను."
అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తను నగ్నంగా వున్నానని. ఠక్కున కాళ్ళను వెనక్కు లాక్కొని గువ్వలా ఒదిగిపోవడానికి ప్రయత్నించింది.
"ఇదిగో ఈ సిగ్గుని పోగొట్టడానికే ఇంత ప్రయాసపడ్డాను. స్త్రీ చేష్టలవల్ల ఆమె ఎలాంటిదో, ఏం కావాలని కోరుకుంటుందో సులభంగా గ్రహించవచ్చంటాడు వాత్సాయనుడు కామసూత్రాలలో."
ఆమె కాస్త ఈజ్ కావటానికి ప్రయత్తిస్తున్నట్టు కదిలింది.
అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. పెదవులు విడివడ్డాక ఆమె "సంపుటిక" అంది.
ఏమిటన్నట్టు కళ్ళెగరేశాడు.
"మీ గురువు వాత్సాయనుడు చెప్పిందే- బిగికౌగిలిలో ఇచ్చే ముద్దును 'సంపుటిక' అని అన్నాడు ఆయన. మా ఇంట్లో వుండే ఏకైక పుస్తకం కామసూత్రాలు. మా శ్రీవారు టూర్ వెళ్ళినప్పుడు తెచ్చారు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలా పేజీలు తిప్పేదాన్ని."
"మొత్తం పదహారు రకాల ముద్దులుంటాయని చెప్పాడాయన. అందులో నీకు ఎలాంటి ముద్దంటే ఇష్టం?" అడిగాడు అతను.
"పదహారు రకాల ముద్దులకంటే - పదహారులోని ఆరు అంటే చాలా ఇష్టం."
"ఆ సంఖ్య అంటే?'
"ఊఁ" అంటూ కంఠాన్ని మూడొంపులు తిప్పి చిన్నగా నవ్వింది.
"వెన్నెల్లో నీ నవ్వు ఎలా వుందో చెప్పనా?"
"ఎలా వుంది?"
"సప్తవర్ణాల చాపం మీద కూర్చున్న అష్టవిధ నాయికల్లో ఒకరైన విరహోత్కంఠిత మెడలోని నవరత్న ఖచితహారం అలా గాలికి ఊగినట్టుంది."
ఆ కాంప్లిమెంట్ కు ఆమె గుండెలు మరింత పొంగాయి.
"నవరత్నాల హారం ఎలా వుంటుందో నాకు తెలియదే" అంది.
"అద్దం ముందు నిలబడి నవ్వుకో. నీ నవ్వు ఎలా వుంటుందో ఆ హారం కూడా అలా వుంటుంది. నవరత్నాల హారం అంటే ఇష్టమా?"
"నవరత్నాలకన్నా ఆ తొమ్మిది సంఖ్య అంటే ఇష్టం" అంది.
"ఇంతకు ముందు ఆరంటే ఇష్టమన్నావు. ఇప్పుడు తోమ్మిదంటే మక్కువ అంటున్నావ్. ఏమిటి దానర్థం?"
"శృంగారమంతా ఆ రెండు అంకెల్లోనే వుంది. ఇంతకు ముందు గెలిచినప్పుడు నేను ఓ కోరిక కోరవలసి వుంది. దానికి ఇప్పుడొచ్చింది సమయం కోరుకో మంటావా?" చిలిపిగా చూస్తూ అడిగింది.
"ఆఁ"
"ఆరూ, తొమ్మిది సంఖ్యల్ని ఒక దగ్గర చేర్చు.... ఇప్పుడే" అని ఆ తరువాత అతని కళ్ళల్లోకి చూడడానికి సిగ్గు అడ్డం పడటంతో తల పక్కకు తిప్పుకుంది.
అతనికి అర్థమై ఆమె కోరిక తీర్చాడు.
10
"అయితే గోపాలకృష్ణను ఏం చేయబోతున్నావ్? చేతబడి చేసి చంపేస్తున్నావా? బాణామతితో వాడి బతుకును కాల్చేస్తున్నావా? ఇన్ని రోజుళు ఆలోచించి ఏం నిర్ణయించుకున్నావ్?" దివాన్ వెంకట్రామయ్య చాలా కూల్ గా కుర్చీలో జారగిలబడుతూ అడిగాడు పులిరాజును.
అప్పుడు రాత్రి తొమ్మిదయి వుంటుంది. చుట్టూ చీకటి భయంకరంగా వుంది. పౌర్ణమి వెళ్ళి వారమో, పదిరోజులో అయినట్టు గుర్తుగా చీకటి మందంగా పేరుకుని వుంది.
"వాడికి నేను చెయ్యబోయేది చేతబడి కాదు- వాతబడి" కళ్ళల్లోని క్రూరత్వం ఒలుకుతుంటే అన్నాడు పులిరాజు.
"వాతబడా- అంటే?" వెంకట్రామయ్య అడిగాడు.
"అంటే వాడ్ని చంపను. చంపడం ఇష్టం లేదు నాకు. వాడు ఎందుకూ పనికిరాకుండా, ముష్టెత్తుకుని బతికేటట్టు..... పువ్వులాగా గుభాళించే వాడి బతుకు వాడిపోయేటట్టు వాతలు పెట్టాలి. దానికి నేను పెట్టిన పేరు వాతబడి."
పునర్వసు తనను ప్రేమించకపోగా గోపాలకృష్ణను ఇష్టపడుతున్నానని చెప్పడాన్ని పులిరాజు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏదో బాధ గుండెను ముక్కల కింద పగలగొడుతోంది.
పునర్వసు మీద అతనికి కోపం కలగడం లేదు. గోపాలకృష్ణ లేకుంటే ఆమె తనను ప్రేమించి వుండేదని బలంగా నమ్ముతున్నాడు. ప్రేమలో వుండే శక్తి అది. మనం ప్రేమించిన వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఆ వ్యక్తిని అసహ్యించుకోలేం. ఆ తప్పు ఇతర కారణాల వల్లే చేస్తూ వుందని నమ్మి , ఆ కారణాలకు కారణమైన వాళ్లను ద్వేషిస్తాం.
అయితే పులిరాజు మాత్రం అంతటితో ఆగక తమ ప్రేమ సఫలం కావడానికి గోపాలకృష్ణకు శత్రువైన వెంకట్రామయ్యతో చేతులు కలిపాడు.
వెంకట్రామయ్య గ్లాసులోని విస్కీనంతా ఒక్క గుటకలో తాగి మూతి తుడుచుకుంటూ "అయితే నీకూ ఒక బలమైన శత్రువు తయారయాడన్న మాట. అసలు శత్రువు అనేవాడు లేడంటే మనం ఎప్పటికీ ఇలాగే వుండిపోతాం. జీవితంలో రెట్టింపు కష్టం చెయ్యాలంటే శత్రువులుండాలి. మన లక్ష్యాన్ని, నిర్ణయించేది కూడా శత్రువులే. అంతే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినంత ఇన్స్ పిరేషన్ కూడా శత్రువులే ఇస్తారు మనకు. నేను ఇంతగా సంపాదించడానికి నాకు ఏర్పడ్డ మొదటి శత్రువే కారణం. ఆ శత్రువు ఎవరో తెలుసా? నా భార్య."
* * *
కళ్ళు కూడా ఆర్పకుండా పులిరాజు శ్రద్ధగా వింటున్నాడు.
"అవును. నా మొదటి శత్రువు నా భార్యే. అప్పట్లో నేను గోపాలకృష్ణ తండ్రి భూపతిరాజు దగ్గర దివానుగా పనిచేసేవాడ్ని. ఏదో వాళ్ళిచ్చిన దానితో సుఖంగా కాపురం చేసేవాడ్ని. నా భార్య అసంతృప్తి ప్రకటించడం ప్రారంభించింది. నా ఆదాయాన్నీ, నా బతుకునీ పరిహసించడం ప్రారంభించింది. ప్రతి పనిలోనూ నా చేతకానితనాన్ని చూపించి పాశవికంగా ప్రవర్తించేది.
ఇలా కొంతకాలం జరిగాక నన్ను సాధించడం ప్రారంభించింది. కుత్తుకలు కత్తిరించో, కుతంత్రాలు చేసో డబ్బు సంపాదించమని పోరు పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా చేసింది.
అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నాకు తెలిసి పోయింది. నాలోని సైతానును నిద్ర లేపాను. సమయం కోసం చూస్తున్నాను.
అదిగో అప్పుడే భూపతిరాజు భార్య సుమతీదేవికి నెలలు నిండాయి. టౌన్ లోని ఓ నర్శింగ్ హోమ్ లో ఆమె గోపాలకృష్ణను కన్నది. తిరిగి వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న కారును లారీ గుద్దేసేటట్లు ఏర్పాటు చేశాను. నేను, మరికొంతమంది పనివాళ్ళు వెనుక మరో కారులో బయలుదేరాం.
అనుకున్నట్లే యాక్సిడెంట్ జరిగింది. అయితే అనుకోకుండా గోపాలకృష్ణ బతికి బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగాక వచ్చి చూస్తే పెద్దవాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే రోజుల బిడ్డ అయిన గోపాలకృష్ణ బతికాడు. చుట్టూ జనం వుండటంతో వాడ్ని చంపలేకపోయాను. ఇక గ్రామస్థులంతా వాడి బాధ్యత తీసుకోవడంతో నాకు వాడ్ని చంపే అవకాశం రాలేదు.