భూపతిరాజు పోయాక నా తెలివితేటలన్నీ ప్రదర్శించి వాళ్ళ భూములు లాక్కున్నాను. వాళ్ళ బంగారం దోచుకున్నాను. కానీ గోపాలకృష్ణను మాత్రం ఏం చేయలేకపోయాను.
అప్పటికి "వాడికి చేతబడి చేసి చంపెయ్యవయ్యా" అని నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాను. కానీ నువ్వు ఆ పని చేయలేకపోయావు. శత్రు శేషం వుంటే నాకు నిద్ర పట్టదు. శత్రువు అడ్డు తొలగించుకుంటే వుండే ఆనందం అంతా ఇంతా కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా మొదటి శత్రువు అదే నా భార్యను చంపినా రోజు నా ఆనందాన్ని మాటలలో వర్ణించలేను" అనిఒ ఎంతో సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ వెనక్కి వాలాడు.
"ఊరులో జనానికి- ఆ గోపాలకృష్ణకూ మీరు వాళ్ళ ఆస్తిని కాజేశారని తెలుసుగానీ మీరే భూపతిరాజు దంపతులను చంపినట్లు తెలియదు. ఇది తెలిసిన రోజున గోపాలకృష్ణ వూరుకుంటాడా? మీమీద పగ సాధించడా?" పులిరాజు తన అనుమానాన్ని వెలిబుచ్చాడు.
"అందుకే కదా శత్రుశేషం ఉంచుకోకూడదంట."
"మరి వాడ్ని మనం చంపకూడదు. ప్రతిక్షణం చచ్చేట్లు చేయాలి. అందుకు మంత్రం నాది తంత్రం మీది."
"అయితే దానికి ఒక్కటే మార్గం" అని కాసేపాగి ఏం చేయాలో చెప్పడం ప్రారంభించాడు.
వింటున్న పులిరాజు సైతం ఆ దుష్ట పథకానికి జడుసుకున్నాడు. వెంకట్రామయ్య ఒక్కోమాట చెబుతుంటే తన శరీరం మీద వాడి ముళ్ళు మొలుస్తున్నట్టు అనిపించింది. ఇక ఇప్పుడు గోపాలకృష్ణతో తలబడితే అతని జీవితం రక్తసిక్తం కావడం ఖాయమనిపించింది. అందుకే పులిరాజు పెదవులమీద ఓ విషపు నవ్వు మెరిసింది.
11
ఆరోజు పౌర్ణమే అయినా ఆకాశమంతా దట్టంగా మబ్బు పట్టింది. అప్పుడప్పుడు చందమామ వాటి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ విఫలమౌతోంది. ఈ సమయంలో లోకంమీది వెలుగు పాము కుబుసంలా మెరిసి మాయమౌతోంది.
చల్లటి గాలి స్పర్శకు పులకరించిన మేఘం తన ఆనందాన్ని చినుకుల రూపంలో తెలియజేస్తున్నట్లు వర్షం మొదలయింది.
ముక్కుమీద చినుకు పడడంతో నడుస్తున్న తిలోత్తమ ఓ క్షణం ఆగింది.
తల పైకెత్తి చూసింది.
ఆకాశంలో పొర్లుతున్నట్లు మేఘాలు మెలి తిరుగుతున్నాయి. మరి కాసేపట్లో వర్షం ఎక్కువవుతుందనిపించి ఆమె వడివడిగా నడవడం మొదలెట్టింది.
ఆమె ఆ ఊరి ఆడబడుచే. వయసు ముప్ఫై ఏళ్ళుంటాయి.
జర్మన్ల జాత్యహంకారమంతా ముక్కు రూపం దాల్చినట్లు ఆమె ముక్కు కొనదేలి ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నట్లుంది. తాత్విక చింతనంతా కాళ్ళల్లో నిక్షిప్తమైనట్లు ఆమె కళ్ళు చూస్తున్నట్లు కాకుండా దర్శిస్తున్నట్లు వుంటాయి. మిసిసిపి నదిలా ఆమె కంఠం పొడవుగా సాగినట్లుంటుంది.
అక్కడినుంచి కిందకు దిగితే ఉత్తర అమెరికాలోని రెండు పెద్ద ద్వీపాల్లా ఆమె ఎద సంపద ఎత్తుగా వుంటుంది. ఆఫ్రికన్ ల నలుపంతా కేంద్రీకృతమైనట్లు మొనలు గరుగ్గా ఉంటాయి. అమెరికన్ ల సుప్రమసీలా నడుం విస్తరించి వుంటుంది. ఆ సుప్రమసీకి చిల్లుపెట్టిన వియత్నాంలా బొడ్డు కనిపిస్తుంటుంది. అంతుబట్టని జపనీయుల శ్రమలా ఆమె వెనక భాగం అనంతంగా వుంటుంది.
మొత్తానికి ఆమె అంతుబట్టని రహస్యాల ప్రపంచంలా వుంటుంది.
కొండ దగ్గరికి చేరుకునేసరికి చినుకులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తోచక అటూ- ఇటూ కంగారుగా చూసింది. వర్షం నుంచి తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. ఎక్కడా చెట్టుకూడా లేదు.
తనకోసమే గొడుగు పట్టుకొస్తున్నట్టు గోపాలకృష్ణ హడావుడిగా రావడం ఆమెకి కనిపించింది. హమ్మయ్య అనుకుని అతనికి ఎదురువెళ్లింది.
"వర్షం రాగానే నువ్వు గుర్తొచ్చావ్. మధ్యలో ఎక్కడ అవస్థ పడుతున్నావేమోనని గొడుగు పట్టుకొచ్చాను" అన్నాడతను.
ఆమె గొడుగు లోపలికి దూరింది. అతని మోచేయి ఖచ్చితంగా ఆమె నడుం మడతలకి తగులుతోంది. అక్కడినుంచి విద్యుత్ ఉత్పత్తి అయి శరీరమంతా సరఫరా అవుతున్నట్టనిపించింది. దాన్నుంచి డైవర్ట్ అవ్వాలని ఆమె మాట్లాడింది. "కొండ దగ్గరికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడా తల దాచుకోవడానికి కూడా వీలులేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావ్."
వర్షం ఎక్కువయింది.
వాన చెంపదెబ్బ కొడుతున్నట్టు అప్పుడప్పుడు రివ్వున శరీరాన్ని ముంచెత్తుతోంది.
ఇద్దరూ త్వరత్వరగా కొండ ఎక్కుతున్నారు.
"ఇలా రాత్రిపూట వర్షంలో ఒకే గొడుగుకింద నడవడం ఎప్పటికీ గుర్తుండి పోయే అనుభవం."
అవునన్నట్లు తల ఊపింది ఆమె. చాలారోజుల తరువాత మగవాడి సాన్నిహిత్యం ఫీలవుతున్న ఆమెకు మాటలు పెగలడం లేదు.
"నీకు ఎప్పుడో పెళ్ళయిపోయింది కదా. మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే వుంటున్నావ్. ఏం జరిగింది? నీ గురించి ఓరోజు మోహనను అడిగితే 'మొగుడు వదిలేశాడు' అని మాత్రం చెప్పింది."
"తమాషా ఏమిటో తెలుసా? ఆయన నన్ను వదిలేశాడో నేను ఆయనతో తెంపులు చేసుకున్నానో నాకు ఇప్పటివరకూ తెలీదు. ఇంత చిన్న విషయం కూడా నాకు బోధపడడం లేదంటే మా ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలు ఎంత సంక్లిష్టమైనవో తెలుస్తుందనుకుంటాను. మొత్తానికి మా ఇద్దరి దాంపత్య బంధం తెగిపోయింది. ఆరునెలలుగా నేను పుట్టింట్లోనే వుంటున్నాను" ఆమె కళ్ళలో ఏదో విరక్తిభావం మెరుపులా మెరిసి చీకటిలో అదృశ్యమైంది.
"ఏం జరిగింది?"
"ఎలాగూ ఆచారం మేరకు నీకు నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని సంఘటన గురించి చెప్పాలి కదా. అదే చెబుతాను. నేను పడ్డ టెన్షన్ నీ, దుఃఖాన్నీ ఆనందాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువయింది. ఉదయం నీ దగ్గర్నుంచి పిలుపు రాగానే నీతో ఈ రాత్రి గడపబోతున్నానన్న ఆనందం కన్నా, నాలో ఇన్ని రోజులూ నిక్షిప్తమైన ఆ సంఘటనలను నీతో చెప్పుకోవచ్చన్న సంతోషం ఎక్కువగా నన్ను ఊపేసింది."
ఇద్దరూ భవనం దగ్గరికి చేరుకున్నారు.
గోపాలకృష్ణ గొడుగు మడిచి బయటపెట్టాడు.
హాల్లో నరుడు నిద్రపోతున్నాడు.
ఇద్దరూ హాలు పక్కనున్న మరో గదిలోకి వెళ్ళారు. గది మధ్యలో ఓ పాత పందిరిమంచం అవసానదశలో వుంది. ఓ పక్క దండానికి గోపాలకృష్ణ బట్టలు వేలాడుతున్నాయి.
"ఇదే ఈ రాత్రి మనస్వర్గం. కాకుంటే స్వర్గం కాస్త పాతబడింది. ఎప్పుడో కటిన బిల్డింగ్ కదా" అన్నాడు నవ్వుతూ.
వర్షానికి తడవడంవల్ల ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయాయి. వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నడుం మడతల్లో నీళ్ళు నిలబడడంవల్ల ఆ భాగమంతా నునుపుగా చూపులుపడ్డా జారి పోయేటట్లుంది.