"చెప్పానుగా- పుట్టింటికి."
"కానీ....."
"మరింకేం చేయను? పోనీ మీ ఇంటికి రానా?" నవ్వుతూ అడిగాను.
ఆనంద్ జవాబు చెప్పలేదు. తల వంచుకున్నాడు.
"చూశావా? మాటవరసకైనా రమ్మనలేదు నువ్వు. సంఘంలో పరువు, మర్యాద, ప్రతిష్ట, భార్య- ఇంకా వున్న రకరకాల సంబంధాలను నాకోసం వదులుకోలేవ్."
అతను ఏమీ మాట్లాడలేకపోయాడు.
దూరంగా బస్సు వస్తోంది.
"వెళ్ళొస్తాను ఆనంద్. నువ్వు నాతో మాట్లాడిన మొదటి వాక్యం ఏమిటో తెలుసా? స్త్రీలంతా మంచివాళ్ళేనని. కానీ నేను నీతో అంటున్న చివరి వాక్యం ఏమిటో ఊహించగలవా? పురుషులంతా చెడ్డవాళ్ళేనని."
ఏడుపు ముఖం పెట్టాడు ఆనంద్. అతన్ని అలా చూడడం ఇష్టం లేక "అయితే ఆ పురుషుల్లో నువ్వు లేవులే" అన్నాను.
బస్సు వచ్చి ఆగింది. ఒక్క ఉదుటున అందులోకి ఎక్కేశాను.
* * *
ఆ తరువాత ఓ ఆర్నెల్లకు అనుకుంటాను నా భర్త పాముకాటుకు చచ్చిపోయాడు.
ఆ బంధం అలా శాశ్వతంగా తెగిపోయింది.
విలాసిని చెప్పడం పూర్తి చేసి అలా ప్లాట్ గా ఆకాశంవైపు చూసింది. నిండు చంద్రుడు ఆకాశం మధ్యలో నిలబడి వున్నాడు.
గోపాలకృష్ణ వెంటనే ఏమీ కామెంట్ చేయలేకపోయాడు. తన వల్ల అవమానం పొందిన వ్యక్తిని ఓదార్చడానికి తనను తానే అర్పించుకొని, పుట్టింటికి చేరిన ఆమెను చూస్తుంటే పయ్యెద తొలగించి సయ్యాటలు ఆడాలనిపించలేదు పాదాలకు వినమ్రంగా నమస్కరించాలనిపిస్తోంది.
కానీ ఆచారం మేరకు ఆమెను ఎంటర్ టెయిన్ చేయక తప్పదు.
మౌనంగా ఆమె చేతిని పట్టుకుని పైకిలేపి పడక దగ్గరికి నడిపించు కొచ్చాడు.
ఇద్దరూ పడుకున్నారు.
ఆమె జీవితంలోని విషాదాన్నంతా క్షణమైనా లాగెయ్యాలని అనుకొని ఆమె చెప్పినదంతా తాత్కాలికంగా మరిచిపోయాడు. ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఆమె ఓ క్షణం ఉలిక్కిపడి తరువాత సర్దుకుంది.
పెదవులమీద బలంగా ముద్దు పెట్టుకుని పైట తొలగించబోయాడు. ఆమె సిగ్గుతో కుంచించుకుపోయి అతని ప్రయత్నాన్ని అద్దుకుంది.
ఆమెలో బెరుకుతన్నాని పోగొట్టాలనుకున్నాడు. చాలారోజుల తరువాత పురుషుడి సాన్నిహిత్యం లభించడం వల్ల ఆమె ఎక్కువ సిగ్గు పడుతున్న విషయాన్ని గ్రహించాడు.
ఆమె మీద వాలి "సరదాగా మనం ఓ ఆట ఆడుకుందామా?" అని అడిగాడు.
ఆమెలో ఉత్సుకత "ఏమిటా ఆట?"
"నీకు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెబుతాను."
"చూడకుండానే" ఆశ్చర్యపోతూ అడిగింది.
"ఊఁ"
"అయితే కానివ్వండి" అంది విలాసిని.
"నీ మెడ వెనక పెద్ద పుట్టుమచ్చ వుంది. అవునా?" అడిగాడు గోపాలకృష్ణ.
తనకు అక్కడ పుట్టుమచ్చ వుందో లేదో ఆమెకి తెలియదు. ఎప్పుడూ అద్దం వెనక పెట్టుకుని చూసుకోలేదు. ఎవరూ చెప్పనూలేదు. అందుకే అవుననీ, కాదనీ అనకుండా ప్లాట్ గా చూసింది.
"నిజంగానే వుంది. కావాలంటే చూసుకో."
"ఎలా చూసుకోను?"
"నేను చూసి చెబుతాను" అని మెడ మీదకి వంగి ఇదిగో ఇక్కడుంది నేను గెలిచాను. ఆట ప్రకారం ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పినట్లు ఎదుట వ్యక్తి వినాలి" అన్నాడు.
సరేనన్నట్టు తల వూపింది.
"నీ జుట్టు ముడి విప్పేయి"
ఓస్ ఇంతేనా అన్నట్టు ఆమె జుట్టు ముడి విప్పింది.
ఒక్కసారిగా చందమామను కదికొద్దీ నల్లమబ్బు కమ్మేసినట్టు జుట్టు పరుచుకుంది.
"మరి రెండో మచ్చ ఎక్కడుందో చెప్పుకో? ఈసారి ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావ్" అంది.
"నీ వక్షస్థలం మీద"
అతను ఓడిపోయినందుకు ఆమెకు చాలా సంతోషంగా వుంది.
"నాకు అక్కడ మచ్చలేదు" అంది స్థిరంగా.
"ఏదీ చూపించు"
తను గెలిచినట్లు నిరూపించుకోవాలన్న తహతహలో ఆమె గబగబా తన జాకెట్టు విప్పింది.
ఆచ్ఛాదనలేని ఆ భాగం సముద్రపు కెరటాలు పొంగుతున్నట్టు వుంది. వెన్నెల సైతం కుచాగ్రాల మీద నల్లగా మారిపోయింది.
అతను పరిశీలించి చూసి "కరక్టే. నువ్వు గెలిచావ్. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను" అన్నాడు.
ఆమె ఓ క్షణం ఆలోచించి "స్త్రీలు ఎప్పుడంటే అప్పుడు వరాలు తీర్చమని అడగరు. సమయమూ, సందర్భమూ వచ్చినప్పుడు మాత్రమే వాటిని అడుగుతారని మన పురాణ కథలు చదువుతుంటే తెలుస్తుందికదా. అందువల్ల నేను కూడా నా వరం తీర్చమని సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను" అంది.
"ఓ.కే- అలానే"
"తరువాత ఇంకెక్కడ మచ్చ వుందో చెప్పుకో?"
"కుడికాలు- మోకాలుకి దిగువన."
"కరెక్టుగా చెప్పావే" ఆమె థ్రిల్లింగ్ గా ఫీలయ్యింది.
"మరి గోపాలకృష్ణ అంటే ఏమిటనుకున్నావ్?" అతను కాలర్ ఎగరేశాడు.
"ఎలా చెప్పగలిగావ్?" కళ్ళను బండి చక్రాల్లా దొర్లిస్తూ అడిగింది.
"అంతా తాయత్తు మహిమ" అని తమాషాగా కన్ను గీటాడు.
"మరి కోరిక కోరనా?"
"తప్పదు కదా అడుగు"
"వెంటనే పసిపాపవు అయిపో."
ఆమెకు అర్థం కాలేదు. "ఎలా?"
"ఇలా" అంటూ అతను చీరకొంగు పట్టుకుని లాగాడు.
మరుక్షణంలో ఆమె అప్పుడే పుట్టిన పసిపాప అయిపోయింది. వెన్నెల్లో ఆమె శరీరం మందారాల పూలపొడిని రాసుకున్నట్లు ఎర్రగా మెరిసిపోతోంది.
అతను కాంక్షతో జ్వలిస్తూ ఆమెలో కలిసిపోవాలని ముందుకు వంగాడు.
ఆమె ఇదేమీ పట్టించుకోకూండా "అవునూ! నా మోకాలుమీద మచ్చ వుందని ఎలా తెలుసుకున్నావ్?" అనడిగింది.
ఇక ఆ రహస్యం చెప్పకపోతే ఆమెలోని రహస్యాలను శోధించేందుకు సహకరించదని గ్రహించాడు.