జ్యోతిర్మయి పిన్ని కూడా మా ట్రాక్టర్ లోనే వుంది. నేను గమనించలేదు.
"ఎప్పుడు ఆ పల్లెటూళ్ళో పరుండమంటే మహా బోర్ కొడుతోంది. ఇలా ఏ పెళ్ళిళ్ళకో పట్నాలకో తప్ప ఇంట్లో అడవాళ్ళను బయటికి తీసుకురారు ఈ మగాళ్ళు. పెళ్ళిళ్ళన్నా, పేరంటాళ్ళన్నా అందుకే మనం సంతోషపడతాం " అంది వేదవతి.
ఊళ్ళో ఎంత దిగులుగా వుంటుందో, ఊరి పొలిమేరలు దాటితే అంత ఖుషీగా వుంటుంది అమె.
"జ్యోతిర్మయి పిన్నీ మన ట్రాక్టర్ ఎక్కిందే " నా సందేహాన్ని బైట పెట్టాను.
" ఇక్కడుంటే హాట్ హాట్ సీన్ లు చూడచ్చని " అంది మూతివిరుస్తూ వేదవతి.
కొంపదీసి రమమ వేళ్ళు తాకించడం చూస్తుందేమోనని చేయి పక్కకి లాక్కున్నాను. ట్రాక్టర్లు ముచ్చివోలుదాటి అక్కుర్తి రైల్వే స్షేషన్ దగ్గరికొచ్చాయి.
దూరంగా శ్రీకాళహస్తి గుడి గోపురం మబ్బుల్లో కనిపిస్తోంది. సూర్యుడు పడమటి కొండల్ని పట్టుకుని అవతలి ప్రపంచంలోకి జారిపోతున్నాడు. గాలి కన్నెపిల్లలా హుషారుగా వీస్తోంది. పచ్చటిచెట్లు రాత్రిని తను చేతులతో అహ్వానిస్తున్నట్టు ఊగుతున్నాయి.
పెళ్ళికాని అమ్మాయివి, అబ్బాయిల పక్కన నిలబడకపోతే నా పక్కకి రాకూడదూ " నన్ను ఉద్దేశించి జ్యోతి పిన్ని అరిచింది.
వెళ్లడమా మానడమా అన్నట్టు వేదవతివైపు చూశాను.
"అంటే పెళ్ళయిన అడవాళ్ళు మగవాళ్ళ పక్కన నిలుచోవచ్చునా? అదే పెళ్ళయిన ఏ అడపిల్లో నీ స్ధానంలో వుండుండే పెళ్ళయిన అమ్మాయి అలా అబ్బాయిలపక్క నిలుచేకపోతే ఇలా రాకూడదూ " అనేది. నరంలేని నాలుక కదా- ఎలాగైనా మాట్లాడవచ్చు. నువ్వు వెళ్ళకు. ఏం చేస్తుందో చూద్దాం " అంది వేదవతి.
కానీ నాకంత ధైర్యంలేదు. అమ్మతో లేనిపోనివి కల్పించి చెబుతుందని భయం. అందుకే లేచి వెళ్ళి పిన్ని పక్కన నిలుచున్నాను.
ట్రాక్టర్లు టౌన్ కి చేరుకున్నాయి.
గుడి పక్కనున్న సత్రంలో పెళ్ళి.
అందరం ట్రాక్టర్ దిగాం. దేవస్దానం సత్రంలో పది రూమూలదాకా తీసుకున్నారు. మగపెళ్ళివాళ్ళకి మూడు గదులు కేటాయించారని చెప్పి ఓ వ్యక్తి తాళాలు ఇచ్చాడు. వేదవతి పేచీపెట్టి ఇంకో గది తాళాలు కూడా తీసుకుంది.
"నీకేం స్పెషలా?" "సుందరి అడిగింది.
"అవునే అక్కా- ఆ పల్లెటూళ్ళో మా ఇంట్లో గాలి అడని ఆ ప్రదేశంలో రాత్రిని ఏమి ఎంజాయ్ చేయ.లేకపోతున్నా. ఇక్కడ ఫ్యాన్ లూ- అవీ ఇవీ వుంటాయిగా. మా శేఖరంతో ఈ రోజన్నా ఆ గదిలో బాగా ఎంజాయ్ చేద్ధామని " అని చెప్పింది వేదవతి సిగ్గుసిగ్గుగా నవ్వుతూ.
"అయితేై మా మరిది శేఖరానికి ఈరోజు నిద్రలేనట్టేనా?" ఎగతాళి పట్టించింది సుందరి.
గదుల్లోకి వెళ్ళి మళ్ళీ ఓమారు స్నానాలుపూర్తి చేసి తయారయ్యాం. సత్రం దగ్గరికి వెళ్ళాను.
నేనూ, మరికొందరు మిత్రురాళ్ళం కలిసి పెళ్ళి ఏర్పాట్లలో పడ్డాం.
అప్పటికే పెళ్ళికూతురువాళ్ళు వచ్చేశారు.
సాయంకాలం ఓసారి వెళ్ళి చూసొచ్చాం.
పెళ్ళికూతురి పేరు భానుమతి. సన్నగా వున్నా బాగానే వుంది. ఎదను చూస్తే స్కూల్ వెనుకనున్న పుట్ బాల్ ప్లే గ్రౌండు లాగా చదునుగా వుంది.
కానీ కనుముక్కుతీరు అందంగా ఉండడంవల్ల ఆ లోపం పెద్దగా తెలియడంలేదు.
రాత్రి ఏడుగంటలయ్యేసరికి బంధువులు రావడం మొదలుపెట్టారు. నేను వడ్డనలో పడ్డాను.
మూడో బంతికి పాయసం వడ్డిస్తుండగా రాధ నా దగ్గరకొచ్చి "అందరం కలిసి సెకండ్ షో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. నువ్వు త్వరగా భోజనం చేయ్. వెళదాం " అని హుషారుగా చెప్పింది.
"భలే భలే " అని పాయసం పాత్ర అక్కడపడేసి ఓ మూల బంతిలో కూర్చున్నాను.
అమ్మతో చెప్పి మిత్రురాళ్ళతో కలిసి సినిమాకు బయల్దేరాను. బ్రిడ్జి దాటాక వచ్చే సినిమా థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయిన సినిమా కాబట్టి అక్కడికే వెళ్ళడానికి నడుస్తున్నాం. మేం థియేటర్ కి వెళ్ళేటప్పటికి అబ్బాయిలంతా అక్కడ హజరుగా వున్నారు.
"మనం తప్పకుండా ఈ సినిమాకే వస్తామని వీళ్ళకెలా తెలుసు? అడిగాను నేను.