అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
"నాకోసం నువ్వు పడ్డ అవమానం......" ఏడుపు తన్నుకు రావడంతో ఆపై మాటలు పెగలక, అలానే చూస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకుని నన్ను నేను అదుపులో పెట్టుకుని- "ఇంతకంటే ఎలా ఓదార్చాలో తెలియడంలేదు....." అంటూ ఆనంద్ చేతులు పట్టుకుని నా దగ్గరికి లాక్కున్నాను.
నా తలమీద పడ్డ వర్షం ధారకట్టి భగీరధుడి గంగ దుమికినట్లు ముక్కు మీదకు దూకి, అక్కడినుంచి ఏడుకొండల్లో పుట్టి కపిలేశ్వరుడి పాదాలపై వాలిన కపిలతీర్థం జలపాతంలా పెదవుల మీదపడి సోయగాల కృష్ణవేణమ్మ అయి, అక్కడి నుంచి వక్షస్థలం మధ్యకు జారి పాపికొండల నడుమ ప్రవహించే గోదావరై పారి బొడ్డును తడిపి. సముద్ర గర్భంలో కలిసేందుకు పరుగులుతీసే కావేరి అవుతోంది.
నావైపు చూస్తున్న అతను చలించిపోయాడు. ఏదో తెలియని ఆవేశం నన్ను ఊపేస్తుంటే మీదికి లాక్కున్నాను.
"ఇక్కడే కదా నా భర్త కర్రతో కొట్టింది" అంటూ పిచ్చిపట్టిన దానిలా ముద్దులతో అక్కడంతా తడిపాను.
"ఇక్కడే కదా..... ఇక్కడే కదా..... ఇక్కడే కదా...." నా భర్త తన్నిన చోటల్లా నోటిని అద్దాను.
తట్టుకోలేని నా అభిమానానికి, నా వాత్సల్యానికి, నా ప్రేమకు, ఎంతో విలువైన ఆ ఓదార్పుకు కృతజ్ఞతలు చెప్పడానికన్నట్లు పాదాల దగ్గర ఆగిపోయిన నన్ను పైకి లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు.
"అందుకే స్త్రీలంతా మంచివాళ్ళే" అదే అతను నాతో మాట్లాడిన మొదటి వాక్యం.
అనుమానపు మొగుడిమీద కసి తీర్చుకోవాలంటే అతనితో పూర్తి సుఖాన్ని అనుభవించాలనిపించి తలను పైకొత్తి అతని పెదవులను సుతిమెత్తగా కొరికాను.
"అబ్బా" అన్నాడు. సుఖమైన బాధ ఎలా వుంటుందో అతని ముఖం చూసి తెలుసుకున్నాను.
ఇక తమకం భరించలేనట్లు తన రెండు చేతుల్లో నన్ను బంధించి, పెదవులపై నోటిని గట్టిగా అదిమి, కోరిక విజృంభిస్తుండగా నన్ను అలానే పైకి లేపాడు.
ముని కాళ్ళమీద లేచి అతని ముఖంపై నాలుకతో రాశాను. నాలుకను అతని నోట్లోకి జొనిపాను. వక్షస్థలాన్ని బలంగా అతని ఛాతీకి అదిమాను.
నా వీపు చుట్టూ అల్లుకున్న అతని చేతులు ఇంకాస్త కిందికి దిగి నడుం ముడతల దగ్గర ఆగిపోయాయి.
వర్షం జోరుగా కురుస్తోంది. చిల్లుల గొడుగులా వున్న చింతచెట్టు కింద అప్పటికే నీళ్ళు నిలబడిపోయాయి.
మేమిద్దరం పూర్తిగా తడిసిపోయాం. కానీ అది పూర్తి ఆరుబయలు ప్రదేశమనిగానీ, చినుకులకు తడిసి ముద్దయి పోయామనిగానీ, మేమిద్దరం ఎదురెదురు ఇళ్ళవాళ్ళమణి గానీ గుర్తుకురాలేదు.
ఒకరినొకరు గాఢంగా కోరుకుంటున్న స్త్రీ, పురుషులం అన్న ఒక్క భావన తప్ప ఇంకో ధ్యాసలేదు. అద్వైతం అంటే ఇదే కాబోలనిపించింది నాకు.
చినుకులతోపాటు గాలి కూడా కొడుతుండడంతో చలి పుడుతోంది.
కాని నా ముఖంలో ముఖంపెట్టి వున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెచ్చగా తగులుకున్నాయి. అతని వక్షస్థలం అగ్నిగుండంలా అనిపిస్తోంది. అతని నడుం చలిమంటలా తోస్తోంది. నాకు ఒరుసుకుంటున్న అతన్ని కాళ్ళు కాలుతున్నట్లు భ్రమ కలుగుతోంది.
వెచ్చగా అనిపిస్తున్న అతన్ని ఇంకా పూర్తిగా నాలోకి ఇముడ్చుకోవాలన్న కాంక్షతో మరింత గట్టిగా అదుముకున్నాను.
ఇక అలా వీలు కాదనిపించినట్లు అతను అటూ ఇటూ చిన్నగా కదిలి, నన్ను వదిలి, ఆ తర్వాత చెట్టు మొదట్లో కూర్చుని, నా చేతులను పట్టుకుని కిందకి గుంజాడు.
కిందంతా నీళ్ళు లేపిన బురదతో చిత్తడిగా వుంది. ముందే చెప్పానుగా ఇలాంటి ధ్యాస లేదని. అందుకే ఏమీ సంకోచించకుండా అతని పక్కన అతను పూర్తి అదుపు సాధించాడు.
ఆ తరువాత పదినిముషాలపాటు వాన కురిసిందో, లేదో నాకు ఇప్పటికీ గుర్తు లేదు.
నా చుట్టూ గమ్మత్తుగా ఆవరించుకున్న మత్తు నుంచి తేరుకుని ఆనంద్ దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయల్దేరాను.
ఇంటి కొచ్చానన్న మాటేగానీ ఆ అందమైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చే వానలో తడుస్తూ వుండాలనిపించింది.
* * *
సాయంకాలం ఆరుగంటలప్పుడు నా భర్త ఇంటికొచ్చాడు. చెప్పులు వదలనైనా లేదు. అప్పుడే ప్రారంభించాడు.
"వాడు ఏమంటున్నాడు? దెబ్బలు తిన్నా అలాంటివాడికి బుద్ధి రాదు. నువ్వూ వెధవకి మద్దతు నిస్తున్నట్లే నాకనిపిస్తోంది. లవ్ లెటర్ లు ఏమైనా రాశాడా?"
నేను అడ్డు తగిలాను. "లవ్ లెటర్ ఏం రాయలేదు గానీ, మాట్లాడు కోవాల్సినవన్నీ మా శరీరాలు మాట్లాడేసుకున్నాయ్" అన్నాను.
అప్పుడు ఆయన ముఖం చూడాల్సిందే.
"నీలాంటి అనుమానపు మొగుడికి ఇలాంటి మాటలు అర్థం కావులే. మొత్తానికి అనుమానం నిజమైంది. పెళ్ళాం చెడిపోవడం కన్నా, అనుమానం నిజమైందన్న ఆనందమే నీలాంటివాడికి ఎక్కువనుకుంటాను. మీ అనుమానం నిజమయ్యేవరకూ మీరు ఏదో ఒక విధంగా భార్యల్ని రెచ్చగొడుతూనే వుంటారు.
నా విషయంలో కూడా అదే జరిగింది. నువ్వే ఆ ఆనంద్ ని చూసేటట్లు చేశావ్. సైగలు చేసే కోరికను కలిగించావ్. చివరికి సుఖం పంచుకోవాలన్న వెర్రి కోరిక కూడా పుట్టేట్టు చేశావ్. ఇక నువ్వు ఎలాగైనా చావు - నాకు అనవసరం. ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను. సెలవ్' అని అలానే కట్టుబట్టల్తో బయల్దేరాశాను.
ఊరు దాటాక ఎక్కడికెళ్ళాలో తోచలేదు. అలాంటివాడితో బతకడం దుర్లభమని బయల్దేరానుగానీ ఎక్కడికెళ్ళాలో అంతుబట్టలేదు. పుట్టింటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాను. ఇక వడివడిగా అడుగులు పడ్డాయి.
బస్టాండ్ చేరుకున్నాను.
బస్సు కోసం చూస్తూ కూర్చున్నాను.
కాసేపటికి ఎవరో వస్తున్నట్లనిపించి ఊరివైపు తిరిగాను.
వగర్చుకుంటూ వస్తున్న ఆనంద్ కనిపించాడు. భర్తను వదిలేసి వెళ్ళిపోతానన్న వార్త అప్పటికే ఊరంతా పొగలా లేచినట్టుంది.
విషయం తెలియగానే పరిగెత్తుకొచ్చినట్లున్నాడు. ఇంకా ఆయాసం తగ్గలేదు.
"ఎక్కడికి?" ఆందోళనగా అడిగాడు.
"పుట్టింటికి."
"అంటే?"
"శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. పెళ్ళి బంధం తెంచుకుని."
"ఎక్కడి కెళుతున్నావ్?"