కానీ ఆ సందులో ప్రారంభమైన మొదటి యిల్లు నూట పదహారు , నూట పదమూడేక్కడో తెలియలేదు. అక్కడ చాలా సండులున్నాయి. ఒక సందులో రెండొందల మీదున్నాయి నంబర్లు. వేరొ సందులో నాల్గొందల మీదున్నాయి. మూడో ప్రయత్నంలో విజయం సాధించాను. నూట యిదో నంబరింటి పక్క నూటారో నంబరిల్లు ఉంది. వరసలో ఇంకా పాతికిళ్ళకు పైగా ఉన్నాయి.
పది నిముషాల తక్కువ ఒంటిగంట కు నూతపదమూదో నంబరు ఇంటి మున్డున్నాను. ఇల్లు చాలా అందంగా ఉంది. చిన్న బంగళా అది, చుట్టూ గోడ ఉంది. ఇంట్లోకి వెళ్ళడానికి గేటు తలుపులు తీసుకుని వెళ్ళాలి. గేటుకు పెద్ద బోర్డు తగిలించి ఉంది. "కుక్కలున్నాయి జాగ్రత్త."
నేను గేటు తీసుకొని లోపల అడుగు పెట్టి మళ్ళీ గేటు వేశాను. చిన్న పడవ లాంటి ఇంటి అరుగు మీదకు వెళ్ళాను. ఇల్లు బాగా నీటుగా గొప్పగా ఉంది. చుట్టూ పరికిస్తున్నాను. గుండెలు కొట్టుకుంటున్నాయి.
3
నా చూపులు వాచీ మీదకూ, ఇంటి తలుపు మీదకూ మారుతున్నాయి. నా వాచీ సరిగ్గా ఒంటి గంట. చూసినప్పుడు చిన్న శబ్దం వినబడింది. అంతలోనే ఆ ఇంటి తలుపులు తెరచుకున్నాయి. నేను హడావుడిగా లోపలకు వెళ్ళాను. లోపల మనుషులెవ్వరూ కనబడలేదు. అటూ ఇటూ చూస్తున్నాను.
ఇంతలో తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి.
గది కాస్త చీకటిగా వుంది. ఇంట్లోకి వెలుతురూ అంత బాగా రావడం లేదు. ఎక్కడైనా స్వేచ్ ఉన్నదేమో చూసి దీపం వేయాలనుకున్నాను. కానీ గోడకు స్వేచ్ లున్నట్లు కనబడలేదు.
ఇంతవరకూ అనుకున్నట్లే జరిగింది. చిత్ర చెప్పిన విధంగా నేను మసలుకున్నాను. ఆమె చెప్పినట్లుగానే జరిగింది. మరిప్పుడెం జరుగుతుంది? నేనెలా లక్షాధికారిని కాబోతున్నాను?"
దూరంగా ఎవరో నడిచివస్తున్న అలికిడి అవుతోంది. మరో క్షణంలో గదిలో వెలుతురూ నిండింది. నాకళ్ళు ముందు చిత్ర అందంగా, ఆకర్షణీయంగా ఒక అందమైన సూట్ కేసుతో నిలబడి వుంది.
"ఇంతవరకూ చీకటిగా వున్న ఈ గది నీ రాకతో వెలుగును నింపుకుంది చిత్రా!' అన్నాను కాస్త కవితా ధోరణిలో.
"అందుక్కారణం చాలా సింపుల్! నాకు స్వేచ్ ఎక్కడుందో తెలుసు. నీకు తెలియదు" అంది చిత్ర ఇంచుమించు నా ధోరణిలోనే.
నేను నవ్వాను. "చాలా సస్పెన్సు లో పెట్టావు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ బడ్డ క్షణం వరకూ నేనేటువంటి ఉద్వేగాన్ననుభావించానో మాటల్లో చెప్పడం కష్టం" అన్నాను.
"అప్పుడే అయిపోయినట్లు మాట్లాడుతున్నావేమిటి? ఇంకా ముందున్నది అసలైన కధ" అంది చిత్ర కాస్త సీరియస్ గానే.
"అంటే?' అన్నాను కాస్త అనుమానంగా.
"నా పేరు గుండూ రావు" అన్న మాటలు విని వెనక్కు తిరిగాను.
ఎత్తుగా, బలంగా, కండలు తిరిగి వున్న ఆ వ్యక్తీ, నున్నని గుండు వల్ల కాబోలు చాలా భయంకరంగా వున్నాడు.
"ఎవరు మీరు?' అనడిగాను కాస్త భయంగా.
"నా పేరు నల్లయ్య" అన్న మాటలు వినబడగా మళ్ళీ వెనక్కు తిరిగాను.
చిత్ర పక్కగా ఒక నల్లని మనిషి నిలబడి వున్నాడు. అతని రంగు అతని రూపాన్ని భయంకరంగా తీర్చి దిద్దడానికి కొంతవరకూ మాత్రమే సహకరించింది. అతను సహజ భయంకరుడు.
"వీళ్ళెవరు చిత్రా!" అన్నాను భయపడుతూ.
"యమభటులను మించిన వాళ్ళం" అన్నాడు గుండూ రావు.
"నువ్వలా కుర్చీలో కూర్చో" అంది చిత్ర నన్ను.
నిలబడ్డం కష్టంగానే ఉంది. వెంటనే వెళ్ళి అక్కడున్న సోఫా కుర్చీలో కూర్చున్నాను. చాలా కంఫర్టబుల్ గా వుంది. ఒక్క క్షణం ధైర్యం వచ్చింది. "ఎవరు మీరు?' అన్నాను మరోసారి. ఈసారి నా ప్రశ్న కాస్త హుందాగా అడిగాను.
"యమభటులను మించిన వాళ్ళం" ఈసారి నల్లయ్య అన్నాడు.
"అయితే ఫరవాలేదు. నేను యముడ్ని అనుకోండి" అన్నాను.
ఫక్కున నవ్వింది చిత్ర. సూట్ కేసుతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సూట్ కేసు టీపాయ్ మీద పెట్టి, నా పక్కన కూర్చుంది. "గోపాల్! లక్షాధికారివి కావడానికి కింక కొద్ది క్షణాలు కూడా పట్టదు. సూట్ కేస్ తెరచి చూడు" అంది.
లేచి నిలబడ్డాను. టీపాయ్ మీద సూట్ కేస్!
వణుకుతున్న చేతులతో సూట్ కేసు తెరిచాను. కళ్ళు జిగేల్ మన్నాయి. మిలమిల మెరిసే రాళ్ళు, బహుశా అవి వజ్రాలయుంటాయి.
"ఈ సూట్ కేస్ విలువ కొట్లలో వుంటుంది. నువ్వు లక్షాధికారివి కావాలంటే ఈ సూట్ కేస్ మరొకరిది కావాలి . అది నీ ద్వారా?" అంది చిత్ర.
"నాకేమీ అర్ధం కాలేదు" అన్నాను చిరాగ్గా.
"ఈసూట్ కేసు నువ్వు తీసుకో. నీ దగ్గరుంచుకో నేను చెప్పిన రోజున చెప్పిన వ్యక్తీ కివ్వాలి. ఆ పని చేసినందుకు నీకు మొత్తం మూడు లక్షలు ముడుతుంది. అడ్వాన్స్ గా ఈ రోజు లక్ష ఇస్తాను!" చిత్ర చాలా గంబీరంగా అంది.
"చిత్రా!" అన్నాను కొంచెం చిరాగ్గా. "నీ ఉద్దేశ్యం నా కర్ధం కావడం లేదు. నన్ను లక్షాధికారిని చేస్తానన్నావ్. నాతొ కాపురం పెడతానన్నావ్. మనిద్దరం హాయిగా ఉండొచ్చనన్నావ్!"
చిత్ర నవ్వింది. "నేనేమన్నానో నాకు తెలుసు. ఊహలను నా మాటలుగా మార్చకు. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. నాకూ నువ్వు కావాలి. అందుకు లక్షాధికారిని చేస్తానని చెప్పాను. అంతే కదా చెప్పింది. మిగతా దంతా నీ ఊహేగా!"
'ఈ వ్యవహారం నాకంత నచ్చలేదు. ఇందులో ఏదో తిరకసుందని పిస్తోంది. ఇవ్వదల్చుకుంటే ఉత్తినే లక్ష రూపాయలివ్వు. లేదా నా దారిన నే పోతా" అన్నాను.
"ఇందులో తిరకాసేమీ లేదు. చాలా సింపుల్ వ్యవహారం. ఈ సూట్ కేసు నీ గదిలో ఒక నాలుగు రోజుల పాటుంటుంది. ఆ నాలుగు రోజులూ దీన్ని జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత కూడా నీకు లేదు. నా మనుషులు వెయ్యి కళ్ళతో నీ గదిని భద్రంగా చూస్తుంటారు. నాలుగు రోజుల తర్వాత ఏం చేయాల్సుంటుందో నేను చెబుతాను" అంది చిత్ర.
నేను నవ్వాను. "మరి తిరకాసు లేదంటావేం? ఈ సూట్ కేసును నీ దగ్గరే దాచుకోవచ్చు గదా! నీ మనుషులు చాలా సమర్ధులు కదా! ఈ పని వాళ్ళ చేతనే చేయించవచ్చును గదా! వీటికి నేనెందుకు? నాకు పోలీసు లకు సంబంధించిన వ్యవహారాల్లో దూరడం ఇష్టముండదు. ఏ తప్పు చేసిన జైలు కెళ్ళని తప్పు చేయాలి...."
చిత్ర నా వైపు ప్రేమగా చూసింది. స్వరం కాస్త తగ్గించింది. "నన్ను నమ్ము. ఇది కేవలం నీ మంచి కోసమే చెబుతున్నాను. ఈ పని చేయడానికి నేను వేరే మనిషి వెన్నుకోవచ్చు. కానీ అప్పుడు నువ్వు లక్షాదికారివి ఎలా అవుతావు? ఏ పరిస్థితుల్లో నూ నీకు పోలీసుల భయం లేకుండా చూసే పూచీ నాది."
నేను మౌనంగా ఆలోచించసాగాను.
"చూడు గోపాల్! నిన్ను లక్షాధికారిని చేయడం నా ఆశయం. అందుకే ఈ పని నీకిచ్చి కొన్ని రిస్కులు కూడా తీసుకుంటున్నాను. సందేహించకు బంగారం లాంటి అవకాశాన్ని పాడు చేసుకోకు"
తటపటాయిస్తూ "ఈ ఒక్క సారికే . మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చెప్పవద్దు" అన్నాను.
"ఒక్క దెబ్బతో లక్షాధికారిని కాబోతున్నావ్, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేయవలసిన అవసరమే ముంది- ఇంకా డబ్బు కావాలనుకుంటే తప్ప" అంది చిత్ర చిత్రంగా నవ్వి.
ఆ నవ్వు అర్ధమేమిటో ? ఒక్కసారి డబ్బు రుచి మరిగేక నేనే కావాలని ఇలాంటి పనులకు ముందుకు వస్తానా?
నేను చిత్ర వంక అదోలా చూశాను. "చిత్రా ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు చేస్తుండే పని? ఎందుకు నువ్వు ఒక మామూలు భారత నారిగా గాక వింత రకం జీవితం గడుపుతున్నావ్?" అన్న ప్రశ్నలు నా చూపుల్లో వున్నాయి. వాటి అర్దాన్నామే గ్రహించిందో, లేదో తెలియదు గానీ, ఆమె కన్నులలో నీరు తిరిగినట్లు నా కనుమానం వచ్చింది.
"గూండూ రావ్!" అంది చిత్ర.
"యస్ మేడమ్"
"ఒక పదివేలు రూపాయల క్యాషూ , ఓ తొంభై వేలు విలువ చేసే బంగారం గోపాల్ గదిలో ఉంచాలి"
నేను చిత్ర వంకనే చూస్తున్నాను. ఆమె మాటలు మాములుగా లేవు. ఒక అధికారిణిలా వున్నది.
గుండూ రావ్ వెళ్ళిపోయాడు.
"నల్లయ్యా! నువ్వు కూడా వెళ్ళవచ్చు" అంది చిత్ర.
నల్లయ్య వెళ్ళిపోయాడు.
ఇద్దరూ వెళ్ళిపోయాక చిత్ర నాతొ అంది! "లక్షాధికారిని అభినందిస్తున్నాను."
"కానీ నాకు సంతోషంగా లేదు చిత్రా -- అడ్వంచరస్ లైఫ్ అంటే నా కింట్రస్ట్ లేదు. ఏదో సామాన్యంగా బ్రతకగలిగితే చాలు."