"అందరికీ అలాగే ఉంటుంది గోపాల్ - కొందరికి సాగుతుంది. మరికొందరికి వీలుపడదు. జీవితంలోని మాధుర్యం అందరూ ఒకే రకంగా అనుభవించడం కుదరదు."
"కానీ నా జీవిత రధాన్ని నేను నిర్ణయించుకోగలను. అందుకు తగ్గ స్వతంత్రం నాకుంది...." అన్నాను.
చిత్ర బాధగా నవ్వి - "నీ మాటలకు నేనంగీకరించ;లేను. ఈ ప్రపంచంలో ఏ మనిషికీ స్వతంత్రం లేదు. మనిషి పరిస్థితులకు బానిస" అంది.
"కానీ నేను పరిస్థితులకు తల వగ్గను" అన్నాను గర్వంగా.
"ఓహ్! మరి ఆరోజున సింగిల్ టీ దుకాణం లో ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసరుగా నటించడం పరిస్థితులకు బానిసై కాదా?' అంది చిత్ర వ్యంగ్యంగా.
"తెలివైనదానివే" అనుకున్నాను మనసులో. పైకి మాత్రం ఏమీ అనలేదు. ముభావంగా వూరుకున్నాను.
"నేను నిన్ను వదలను. వదలలేను గోపాల్" అంది చిత్ర. "కానీ నువ్వు నాతొ మనస్పూర్తిగా అన్నీ చెబుతున్నావని తోచదు"
"నీ అనుమానమే నీకు శత్రువౌతుంది చిత్రా! నేను నీ దగ్గరేమీ దాచడం లేదు. ఇంకా నువ్వే నా దగ్గర అన్ని దాస్తున్నావు. నిజం చెప్పాలంటే నీ గురించి నాకేమీ తెలియదు. అసలు నువ్వెవరో, నీ పేరేమిటో కూడా నాకు తెలియదు."
"నాపేరు చిత్ర. - ఆ సంగతి నీకు తెలుసు."
"అది నీ నోట విన్నది. ఇంకా నాకెన్ని పెర్లున్నాయో నీ అసలు పేరేమిటో నాకు తెలియదు."
చిత్ర చురుకైన కళ్ళతో నా ముఖంలోకి చూసి, "నీ పేరు నిజంగా గోపాల్ కాదేమిటి?" అంది.
"ఏమో అది నేను చెప్పగా తెలుసుకున్నది కాదు గదా" అన్నాను.
"నిజమే - కానీ చెప్పకుండా విషయాలు తెలుసుకోగలడం నీకు చేతనైనట్లు కనబడుతోంది." అంది చిత్ర. ఒక్క క్షణం ఆగి, "ఈ సూట్ కేసు తీసుకుని బయల్దేరు. నీకే విధమైన అడ్డంకులూ రావు. ఎప్పుడే కష్టం వచ్చినా నన్ను తలచుకుని ధైర్యంగా ఉండు. మళ్ళీ ఎప్పుడూ ఈ ఇంటికి రావడానికి ప్రయత్నించకు" అంది.
నేను సూట్ కేసు తీసుకుని లేచాను. "వస్తాను చిత్రా!" అన్నాను.
"మంచిది." అంది చిత్ర. ఆమె ముఖంలో అట్టే ఉత్సాహం కనపడలేదు.
నేను నా గది చేరుకునే సరికి గదిలో ఒక క్రొత్త పెట్టె కనపడింది. అందులో పదివేలు రోపాఉఅల క్యాషూ , బంగారం బిస్కెట్లూ ఉన్నాయి.
4
"ఎక్కడిది నాయనా ఇంత డబ్బు!" అన్నారు నాన్న ఆశ్చర్యంగా.
"అదృష్టం తన్నుకు వచ్చింది. నేనేం దొంగతనం చెయ్యలేదు, నా బిజినెస్ బుర్రను మెచ్చుకుని ఒక కోటీశ్వరుడు స్నేహితుడయ్యాడు. ఇది మొదటి సంపాదన. చెల్లాయి కీ, అమ్మకీ ఈ బంగారంతో నగలు చేయించండి. క్యాషు తెనిమిది వేలూ చెల్లాయి పెళ్ళికి కట్నానికి పనికొస్తుంది. దగ్గరుంచండి. ఒక్కసారి బ్యాంకులో వేస్తె ఎక్కడ్నించి వస్తోందని అనుమాన మోస్తుంది. గాబట్టి డబ్బు ఇంట్లోనే వుంచండి" అన్నాను.
నాన్నగారి ముఖంలో డబ్బును చూసిన సంతోషమూ, ఇంతేలా వచ్చిందన్న అనుమానమూ రెండూ కనబడుతున్నాయి. అమ్మ ముఖం మాత్రం బంగారాన్ని చూడగానే చేటంతయింది. "నా బంగారు తండ్రి గొప్పవాడై పోతాడని, నన్ను బంగారంలో ముంచేస్తాడని నా కేప్పుడో తెలుసు" అంది.
నేను తెచ్చిన రెండు బంగారం బిస్కెట్ల కే ఆమె అంత ఇదై పోతుంటే అక్కడ గదిలో ఉన్న మిగతా బంగారం చూస్తె ఆమె కళ్ళు చెదిరి పోవచ్చుననిపించింది. ఆమె కోరిక నిజమే కాబోతోంది. నేను అమ్మను బంగారంలో ముంచేసే రోజు దగ్గరలోనే ఉంది.
చెల్లాయి క్కూడా నా సంపాదన గురించి అంత సంతృప్తి కరంగా వున్నట్లు లేదు. తోచిన అబద్దాలు కల్పించి చెప్పాను కానీ నాకూ అంత తృప్తిగా లేదు. అందుకే అంత సంతోష సమయంలోనూ ఎక్కువసేపు ఇంట్లో గడపలేక పోయాను. చెప్పవలసింది చెప్పాక మరి ముళ్ళ మీదున్నట్లుంది. మధ్యాహ్నం వచ్చిన వాడిని చీకటి పడకుండా తిరుగు ప్రయాణం పట్టాను.
మా ఊర్నించి నగరానికి గంటన్నర బస్సు ప్రయాణం. అయినా ఈ మధ్య కాలంలో అనగా చిత్ర పరిచయం లభించేక ఇంటి ముఖం చూసిన పాపాన పోలేదు. ఒక్క సారి ఇంత డబ్బు నా చేతికి వచ్చేక నా బాధ్యతలు నాకు గుర్తొచ్చాయి.
నా గది చేరుకున్నాను. తలుపు తాళం తీసి ఉలిక్కిపడ్డాను. లోపల మనిషి వున్నాడు. అతను గూండూ రావ్.
నన్ను చూసి గుండూ రావు తలుపులు వేయమని సంజ్జ చేశాడు. దగ్గరగా రమ్మన్నాడు. వెళ్ళాను. నెమ్మదిగా అన్నాడు. 'చస్తున్నాను నీ గదికి కాపలా కాయలేక - ఎక్కడికి పోయావ్?"
ఏకవచన ప్రయోగం నాకు నచ్చలేదు. "కాపలా కాయమన్న దేవరు?"అన్నాను.
"ఎవరైతే నేంలే . ఇది నా డ్యూటీ కాదు. ఎక్స్ ట్రా పని."
"నాకు తిరగడం బాగా అలవాటు. నన్నని ప్రయోజనం లేదు. కానీ ఒక్క మాట . ఇలా నా గదిలోకి మారు తాళం చెవితో ప్రవేశించడం నాకు నచ్చదు "అన్నాను.
"మారుతాళం కర్మ నాకేం పట్టింది' అంటూ గుండూ రావ్ తన షర్టు జేబులోంచి ఒక తాళం చెవి తీసిచ్చాడు. అందుకున్నాను. అది నా దగ్గరున్న తాళానికి డూప్లికేటు- ఇదివరలో నా గదిలోనే ఉండేది. ఎప్పుడో దాన్ని చిత్ర సంగ్రహించిఉండాలి. అవును, అసలు నేనాలించించనే లేదు. బంగారం ప్లస్ డబ్బు నా గదిలో కేలా వచ్చాయి?" అప్పటికే ఈ తాళం వాళ్ళ పరమైందన్న మాట!
చాలా పెద్ద గూడుపుఠాణీ నా చుట్టూ నడుస్తోంది. ఫలితంగా నేనేమవుతానో నాకు తెలియదు. తాత్కాలికంగా నా దగ్గర డబ్బుంటుంది.
"వస్తాను' అంటూ గుండూ రావు లేచాడు.
"మళ్ళీ ఇప్పుడే . నేను బయటకు పోతానేమో . మరి గదికి కాపలా ఎవరు కాస్తారు?' అన్నాను.
గుండూరావు మాట్లాడకుండా ముందు నడిచాడు.
"మళ్ళీ గదిలోకి రావాలంటే తాళాలున్నాయా" అన్నాను.
"ఎన్ని తాళాలు కావాలేమిటి, నా దగ్గరో తాళం చెవి వుంది" అంటూ తన జేబులోంచి తాళం చెవి తీసి చూపించి వెళ్ళిపోయాడు. ఆప్రయట్నంగా నా చేయి జేబులోకి పోయింది. అందులో ఇందాకా గుందూరావిచ్చిన తాళం చెవి లేదు.
నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది. గుండెలు తీసిన మొనగాళ్ళంటే వీళ్ళేనన్నమాట!
తలుపులు గడియ వేసుకుని ఆలోచిస్తూ మంచం మీద నడుం వాల్చాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసినట్లుంది. ఎవరో తలుపు దబదబా బాదుతున్న చప్పుడై లేచాను. టైము చూసుకుంటే పన్నెండున్న రయింది. ఇంత రాత్రి వేళ ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపులు తీశాను.
పోలీసులు!
ఆశ్చర్యంలో నాకు నోట మాట రాలేదు. "మీ గది సోదా చేయాలి!" అన్నాడు వాళ్ళలో ఒకడు. నేనవాక్కయి అలాగే చూస్తున్నాను. చిత్ర ఇచ్చిన వజ్రాలతో పాటు నా బంగారం కూడా పోతుంది. ప్లస్ నాకు జైలు శిక్ష.
మొత్తం అయిదుగురు మనుషులున్నారు. ఒకడు నాకు కాపలా కాస్తున్నాడు. మిగతా నలుగురు గదిలో అన్ని వైపులా చూస్తున్నారు. చిత్ర నాకిచ్చిన సూట్ కేస్ వారిలో ఒకతను తెరిచాడు. మళ్ళీ మూసేశాడు. మరొకడు నా బంగారముండవలసిన పెట్టెను తెరిచి చూసి మూసేశాడు. మొత్తం పదిహేను నిముషాల్లో గది సోదా ముగించి "ఆయామ్ వేరీసారీ! అనవసరంగా మీకు ట్రబులిచ్చాం. మాకు వచ్చింది రాంగ్ రిపోర్టనుకుంటాను" అని వాళ్ళలో ఒకడన్నాడు. అయిదుగురు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళేక నాలో చలనం వచ్చింది. వెళ్ళి తలుపులు వేసి, నా ఆస్తి చూసుకుందుకు వెళ్ళాను. నిజంగానే వజ్రాల పెట్టి, బంగారం పెట్టి ఖాళీగా వున్నాయి. నా గుండె గుభేలు మంది. మంచం మీద కూలబడ్డాను. నిరుత్సాహంగా .
"ఇప్పుడెం జరుగుతుంది?"
'ఇదే ప్రశ్న నన్ను కలవర పెడుతోంది. అప్పుడే నాకు చిత్ర మాటలు గుర్తుకొచ్చాయి. పెట్టె భద్రత విషయంలో నాదేమీ బాధ్యత లేదని చెప్పిందామె. నాలుగురోజులు నా గదిలో ఆ పెట్టె ఉంచుకోవడం వరకే నా భాద్యత. ఈ సమాచారాన్ని రేపు చిత్రకూ అందజేయాలి.
మనస్సు స్థిమితంగా లేకపోయినప్పటి కీ నాకు మళ్ళీ నిద్ర పట్టింది. నిద్రలో రకరకాల అర్ధం లేని కళలు వచ్చాయి. లేచేసరికి ఉదయం ఏడున్నర యింది. త్వరత్వరగా ముఖం కడుక్కుని స్నానం చేసి గదికి తాళం వేసుకుని బయట పడ్డాను.
దగ్గరలో ఉన్న హోటల్లో టిఫినూ, కాఫీ తీసుకుని రోడ్డు మీదకు వచ్చాను. ఇప్పుడు నేను చిత్రను కలుసుకోవాలి. అయితే ఎక్కడ కలుసుకోవాలో , ఎలా కలుసుకోవాలో నాకు తెలియదు. ఇంతవరకూ ఆమె నాకు అనుకోకుండానే కనిపించడం వల్లనే కలుసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఆమె అవసరం నాకు బాగా కనబడుతోంది. ఎలా వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు-------" ఆమెను కలుసుకునేందుకు.