ఏం మాట్లాడతాడు? రవి గురించేనా? రవి మళ్ళీ తన విషయంలో ఇంట్లో పేచీ పెట్టుకొన్నాడా?
రవి గురించి మాట్లాడాలి. ముఖ్యమైన విషయం. ఆ గదిలోకి వెళ్దాం పద" అంటూ పక్క గదిలోకి ముందు తనే దారి తీశాడు. అదే అరుణ గది ఆ సంగతి కూడా గౌతమ్ కు తెలుసు.
అతడి వెనకే అరుణ కూడా గదిలో ప్రవేశించింది. రవిని గురించిన ఆల్కహనల్లో మునిగిపోయి ఉంది.
అతడు తలుపు గడియపెట్టటం కూడా ఆమె గమనించలేదు.
అకస్మాత్తుగా అతడు తన రెండు బలమైన చేతులతో ఆమెను బంధించి, గుండెలకు గట్టిగా అదుముకున్నాడు. అరుణ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నది.
గౌతమ్ నుంచి అలాంటి ప్రవర్తనను ఊహించని అరుణ కొయ్యబారి పోయింది.
గౌతమ్ ఆమె జడ పట్టుకొని తలను వెనక్కు విరిచి ముఖం మీదకు వంగుతున్నాడు.
అరుణ ఒక్కసారిగా అతడి ముఖం మీద కొట్టింది. అయినా అతడు తన పట్టు వదల్లేదు.
"వదులు. నన్ను వదులు!" అరిచింది అరుణ.
ఒక చేత్తో ఆమె నోరు మూసి, రెండో చేత్తో ఆమె బ్లౌజును సర్రున చించాడు. తెల్లటి వీపుమీద ఎర్రటి వాత తేలింది.
ఆమె నోటిమీద చెయ్యితీసి, ఆమెను రెండు చేతులతో ఎత్తి మంచం మీద పడేశాడు. ఆమె కెవ్వున అరిచింది.
చీరె కుచ్చెళ్లు లాగాడు.
"వద్దు....వద్దు" అని అరుస్తూ అతణ్ణి అందిన చోటల్లా రక్కసాగింది.
ఆమె మళ్ళీ కెవ్వున అరిచింది.
తలుపు ఏదో దడదడ బాదుతున్నారు.
గౌతమ్ లక్ష్యపెట్టనట్టే ఆమె ముఖం మీదకు వంగాడు.
అరుణ బలం కొద్దీ అతణ్ణి తోసేసింది.
అతడు తలుపు తెరిచాడు.
ఎదురుగా నిలుచున్నా వంటమనిషి వెంకటమ్మను ఓ క్షణం చూశాడు ఆవిడ విద్యుత్ ఘాతం తగిలినట్టుగా నోరు తెరిచి బొమ్మలా కొయ్యబారి నిలుచుండిపోయింది.
"ఏయ్! ఈ విషయం ఎవరితోనైనా చెప్పావా చంపేస్తాను. జాగ్రత్త అంటూ చరచర వెళ్ళిపోయాడు.
స్కూటర్ స్టార్ట్ అయినప్పుడుగాని వెంకటమ్మ తెరిచిన నోరు మూతపడలేదు.
స్కూటర్ గేటు బయటకు వెళ్లిపోయింది.
ఆమెకు తను చూసింది వాస్తవం అనిపించడం లేదు. గిచ్చుకొని చూసింది. కలగాదు. నిజంగానే ఇదంతా జరిగింది.
తల తిప్పి గదిలోకి చూసింది.
మంచంమీద అరుణ గిలగిల కొట్టుకొంటున్నది. పిడికిళ్ళు బిగిసిపోయి ఉన్నాయి. మంచం దగ్గరకు పరుగుతీసింది.
"అరుణమ్మా! అరుణమ్మా!" దాదాపు ఏడుస్తూనే పిలిచింది.
అరుణ ఈ లోకంలో లేదు.
వెంకటమ్మ లోపలకు పరుగు తీసింది. మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది నీళ్ళు ముఖం మీద చల్లింది. అప్పటికే అరుణ కొట్టుకోవడం ఆగిపోయింది అరుణ తలమీద చెయ్యిపెట్టి లేవదీసి నీళ్ళ గ్కాసు నోటికి అందించింది నీళ్ళన్నీ గటగట తాగేసింది.
"ఇంకా కావాలా?"
అరుణ తల ఊపింది.
వెంకటమ్మ దోసకాయచెంబుతో నీళ్ళు తెచ్చింది. అరుణ ఆ నీళ్ళన్నీ గటగట తాగేసింది. వెంకటమ్మ అరుణను పడుకోబెట్టింది. అరుణ చూస్తోంది. కాని ఆ చూపుల్లో గుర్తింపులేదు.
వెంకటమ్మకు భయం వేసింది.
స్టూలు లాక్కుని మంచం పక్కనే కూర్చుంది.
ఉండి ఉండి అరుణ గజగజ వణికిపోతూంది.
మధ్య మధ్య "వద్దు. వద్దు" నన్ను వదులు అని అరుస్తోంది.
వెంకటమ్మ కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.
కాలు కాలిన పిల్లిలా లోపలకు బయటకు తిరుగుతోంది.
ఉన్నట్టుండి అరుణ కెవ్వున అరిచింది.
బయట నిలుచుని సునంద కోసం ఎదురు చూస్తున్న వెంకాయమ్మ లోపలకు పరుగుతీసింది.
అరుణ గిలగిల కొట్టుకుంటున్నది. కడుపు మీద చెయ్యి పెట్టుకొని మూలుగుతోంది. ఆమె చెయ్యీ కాలూ ఆడటం లేదు.
గంట గడిచింది. రోడ్డుమీద ఎవరూ కనిపించడం లేదు. పక్కింటికెళ్ళి చెప్పాలంటే అరుణను ఆ స్థితిలో ఒంటరిగా వదల్లేదు.
అంతలో వాకిట్లో ఆటో ఆగింది.
సునంద ఆటో దిగి ఆటో వాడికి డబ్బు ఇస్తోంది.
"అమ్మా! త్వరగా రండి." గావుకేక పెట్టింది వెంకాయమ్మ. అంత వరకూ ఆమెలో వున్న టెన్షన్ సునందను చూడగానే రిలీజ్ అయింది.
సునంద లోపలకు పరుగు తీసింది.
"ఏమైంది?" ఆత్రంగా అడిగింది.
మూగదానిలా చేత్తో అరుణ గది వైపు చెయ్యి చూపించింది. ఏడుస్తోంది వెంకటమ్మ.
సునంద గాబరాగా అరుణ మంచం దగ్గరకు పరుగుతీసింది. అరుణమూలుగుతోంది. అరుణ చీర కుచ్చేళ్ళు రక్తంతో తడిసి ఎర్రగా ఉన్నాయి.
సునందకు అర్ధం అయింది. అరుణకు అబార్షన్ అయిందని అర్ధం చేసుకుంది. గబగబా ఫోన్ దగ్గర కెళ్ళి లేడీ డాక్టర్ కు ఫోన్ చేసింది.
అరుణ మంచం దగ్గరకు పరుగు తీసింది.
"వెంకటమ్మా!"
"అమ్మా!"
"ఏం జరిగింది? అరుణ పడిపోయిందా?"
"పడిపోలేదమ్మా. లక్షణంగా ఉన్న పిల్ల...." కళ్ళు ఒత్తుకుంది.
"అరుణా! అరుణా!"
"అరుణ కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె చూపులు నిలకడగా లేవు. అరుణ షాక్ లో ఉందనీ, తనను గుర్తించే స్థితిలో లేదనీ అర్ధం చేసుకున్నది.
"అసలు ఏం జరిగింది? అకస్మాత్తుగా ఏమైంది?"
"ఏం చెప్పమంటారమ్మా?"
ఆమె ధోరణికి సునంద త్రుళ్ళిపడింది.
"ఏమిటి? ఏం జరిగింది?"
"జరక్కూడనిదే జరిగిందమ్మా!"
"అదేమిటి? రవి వచ్చాడా?"
"రవి రాలేదు."
"మరెవరైనా వచ్చారా?"
సమాధానం ఇవ్వలేదు వెంకటమ్మ.
"మాట్లాడవేం?" గట్టిగా అరిచింది సునంద.
"నేను చెప్పలేనమ్మా!"
"చెప్పు! ఎవరొచ్చారు? గద్దించింది సునంద.
"చెప్తే చంపేస్తానన్నాడమ్మా." ఒక్కసారిగా బావురుమంది వెంకటమ్మ.
డాక్టర్ సుమతి కారు దిగింది.
సునంద సుమతికి ఎదురు వెళ్ళింది.
ఇద్దరూ అరుణ గదిలోకి వచ్చారు.
సుమతి ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది.
"సుమతీ! త్వరగా చూడు. అబార్షన్ అయినట్టుంది."
"ఏం జరిగింది?" సుమతి సునంద ముఖంలోకి లోతుగా చూసింది.
"నాకూ తెలియదు. నీకు ఫోన్ చేసినప్పుడే వచ్చాను. అది పిచ్చిగా అరుస్తోంది. రక్తం చూడగానే నాకు మతి పోయినట్టయి వెంటనే నీకు ఫోన్ చేశాను."