లోపల అడుగుపెట్టగానే మల్లెల గుబాళింపు .... ఎదురుగా శోభనపు మంచంలా అలంకరించబడిన బెడ్...ముచ్చెమటలు పోస్తుంటే ముందుకు నడిచాడు.....దేవాలయం మీద బూతుబొమ్మల్లా గోడల నిండా శృంగారానికి సంబంధించిన చిత్రాలున్నాయి...చౌదరి పంపింది ఒకందుకైతే వచ్చింది మరెందుకో అన్నట్టు అక్కడి వాతావరణం ఆందోళన పుట్టిస్తుంతే ద్వారం గడియపెట్టిన చప్పుడు వినిపించింది.
గభాలున వెనక్కి తిరిగిన విస్సు రెండు నిముషాల దాకా చూపు మరల్చుకోలేకపోయాడు.
పరిమళపు ప్రభంజనంలా, స్వప్న రంభాపరీరంభపు కైపుతో వినీల శిరోజ తమస్సముద్రంలో ఉద్భవించిన నందివర్ధనంలా నడిచి వస్తూంది దేవి. కళ్ళతో కాంక్షల మేలుచాందినీలు.....పరతెంచే పుష్పపరాగం.....కాలాన్ని స్తంభింపచేసి 'గిరులకీ జరులకీ అర్ధం నేనే' అన్న అహాన్ని ప్రదర్శించే అదిరే ఆనందపు నెలవంకల అధరాల సవ్వడి...
"మిమ్మల్ని మెచ్చాం భక్తా" గళాన సౌందర్య మధూళిని చిందిస్తూ నవ్వింది దేవి... అతడు నివ్వెరపోయి చూస్తుండగానే ఆమె శరీరంపై ఉన్న ఉల్లి పొరలాంటి చీర నేల జారింది.
ఆమె ఒంపుల్లో ఇంద్రధనస్సులూ, అదృశ్యస్వర్గాలూ అశ్రుతగాంధర్వాలూ యిప్పుడు బహిర్గతమై మొగలిపొదలో పడగవిప్పి ఆడ త్రాచును గుర్తు చేస్తున్నాయి.
ఏకాంత సేవలో ఆనవాయితీగా వుండే స్నానం గురించి ఆమె విస్మరించింది. ఇప్పుడు అలాంటి ఆలస్యం సైతం ఆమెకు భరింపశక్యం కానట్టు "రా... మాలో ఐక్యంకా..." అంది మగతగా.
చెమట్లు పట్టేయి విస్సుకి.
"నిన్నే భక్తా...జ్ఞానాకారమిదం సర్వం...ఇప్పుడు మాలో ఐక్యం కావడమూ జ్ఞానమే - రా" విరహంతో కాగిపోతూందామె.
"నేను....బ.....బ్రహ్మచారిని..." అదో అనర్హతలా వ్యక్తం చేశాడు కంగారుగా.
"మాకు మరింత ఆసక్తికరమైన విషయం" అతడి ముందుకు వచ్చి బాట చూపుతున్నట్టు నేలపై పడుకుంది.
"ఇంతవరకూ నాకు అలవాటు లేదు" ఉన్న వాస్తవం చెప్పేశాడు "అందుకే చేతకాదంటున్నా."
"పిచ్చి భక్తా...." గొణిగింది స్వగతంలా "కర్మజ్యాయోహ్య కర్మణః అని వినలేదా"
"ఇదే తొలిసారి వినడం..." ఏ ఆడదైనా ఆఖరికి వేశ్యయినా గాని ఈ రేంజ్ ఉన్మాదం ప్రకటించగలదని అతడికి తెలీదు.....ఇప్పుడెలా తప్పించుకోవడం.....సీరియస్ గా అన్నాడు.
"మీ బాధ అసలు అర్ధం కావడం లేదు"
ఆమె వివరించింది వెల్లకిలా పడుకునే కర్మజ్యాయోహ్య కర్మణః ఏదన్నా కర్మని నిర్వహించకపోవడం కన్నా కర్మని నిర్వహించడమే మిన్న అన్నది ఆర్యోక్తి....ఉపదేశించటానికి మేం సిద్దంగా వున్నాం...ముందు మానసికంగా సిద్దంకా..."
"అది కాదు మేడమ్..."
ఆమె కళ్ళు అరుణిమని పుంజుకున్నాయి....చూపు మాత్రంగానే మగాళ్ళని శాసించి పాదాక్రాంతం చేసుకోగల ఆమె శక్తి ఇక్కడ విఫలమవుతున్నట్టు కోపంతో ఆమె కంపించిపోతుంది "మయి బుద్దిం నివేశయ...."
"ఇదీ నాకు అర్ధం కాలేదు"
"మాలో బుద్దిని మనసుని నిలుపుకొమ్మని ఆదేశిస్తున్నాను."
"నిలుపుకోవడం కష్టంగా వుంది"
"ఏకాగ్రతగా ప్రయత్నించు"
"ప్రయత్నించడానికి నాకు అభ్యంతరం లేదు"
"మరి ఏమిటి నీ సమస్య...." ఉక్రోషంగా అడిగింది.
"జఫాఠా కృషి నా కఠోరలఫాకిట్" విభ్రమంగా చూసింది "ఏమిటి నీవు చెప్పింది"
"జఫాఠా కృషి నా కఠోరలఫాకిట్"
"ఇది ఏ వేదములందూ మేం వినలేదు"
"అవకాశం లేదు.....ఎందుకంటే అది లాటిన్ భాష కాబట్టి."
"ఆ భాషని మా ముందు వల్లించడంలో మీ వుద్దేశం."
"సర్వజ్ఞులు మీకు తెలియనిదేముంది" నిజాయితీగా అన్నాడు. మొహంలో సాధ్యమైనంత బాధని రంగరించుకుని.
"నేను ఆ జబ్బుతో బాధపడుతున్నాను"
దేవి ఉలికిపాటుగా చూసింది "మీరు రోగగ్రస్తులా"
"హు" ఆర్ద్రతగా అన్నాడు "శాపగ్రస్తుడ్ని మేడమ్....లేకపోతే ఈ వయసులో ఎంచక్కా మీలాంటి వాళ్ళ ఆఫర్ ని కాదనడమేమిటి చెప్పండి - ఈ పాటికి వాత్స్యాయునిడి పుస్తకం పక్కన పెట్టుకుని మిమ్మల్ని ఓ ఆట ఆడించేవాడ్నిగా....కాని ఓ జబ్బు మూలంగా యీ అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోతున్నాను"
ఆ శ్లోకం మననం చేసుకోబోయింది గాని విస్సు చెప్పిన జబ్బు గుర్తుకు రాలేదు.
దేవి ఇబ్బందిని గుర్తించినట్టు మళ్ళీ తనే చెప్పాడు విస్సు.
"జఫాఠా కృషి నా కఠోరల ఫాకిట్ అనే ఈ జబ్బుని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. కాని లాటిన్ భాషలో దీనికి అర్ధం ఫటాఫట్ లాడించే వయసులో కఠినమైన నిగ్రహంతో వ్యవహరించూ అని....ఇది నాకెలా వచ్చిందీ మరలా ఎంతకాలం వుంటుందీ అన్నవి మీ తర్వాత ప్రశ్నలనుకుంటాను"
సాధికారంగా తలపంకించి అంది నగ్న దేవతలా కూర్చుని "అవును"
"ఓసారి పందెం కాసి చార్మినార్ మీద నుంచి దూకాను... అంతే జారిపోయింది"
"ఏమిటి" టక్కున అడిగింది.
"వెన్నుపూస....కొంతకాలం వీపులో వట్టి నొప్పిలే అని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నాలో మగాడికుండే సహజమైన స్పందన పోయిందని.....చాలా మంది డాక్టర్లకు చూపించాను.....చూపించిందేమిటి అని అడక్కండి. వాడుక భాషతో చూపించడమంటే జబ్బు లక్షణాల గురించి చెప్పడమేగా.....ఆ ప్రోసెస్ లో చాలా టెస్టుల తర్వాత తేలిందేమిటంటే యిదో అరుదైన జబ్బని - ఆ తర్వాత ఏడాదిగా మందులు వాడుతున్నాను... ఇప్పుడు మొత్తం అంతా మామూలుగానే వుంది కాని మరో పదిరోజులు మందులు వాడాలి. అంతే.. అప్పుడు మీతోనే బోణీ ప్రారంభిస్తాను..." అబద్దాల్ని ఆర్డర్ లో అందంగా చెప్పిన విస్సు దేవి అహాన్ని చల్లార్చేటట్టుగా మంచి భావుకతనీ ప్రయోగించాడు "ఇది హామీ యివ్వడం కాదు దేవీ.....సముద్రంలా పరుచుకున్న మీ శృంగార తనూలతని చూస్తూ దిక్సూచి పని చెయ్యని ఓడలా నిలబడిన నా దుర్విధికి బాధపడుతున్నాను. ఆకాశ ద్వారంలో అడుగుపెట్టమని పాలపుంత తోరణాలుకట్టి స్వాగతం చెప్పినా నక్షత్రాల్ని కోసి మీ సిగలో పెట్టాల్సిన నేను పువ్వులా కాక మొగ్గలా మిగిలినందుకు కుమిలిపోతున్నాను.....క్షణం సేపు స్వప్నంలోకి జారిన నేను పది రోజుల వ్యవధిలో మళ్ళీ మీ ముందుకు రావాలని వువ్విళ్ళూరుతున్నాను"
దేవి నేత్రాలు అరమోడ్పులయ్యాయి....అర్జునుడి కోసం ఎదురు చూసిన నాగకన్య ఉలూచిలా బుసకొడుతూ అతడి మాటల తూణిరాలు మనసుని స్పందింప చేస్తుంటే భారంగా కనురెప్పల్ని మూసుకుంది.
"నేను చెప్పింది నిజమో కాదో దివ్య దృష్టితో పరికిస్తున్నట్టున్నారు" అన్నాడు మరింత ఆర్ద్రంగా.
"అవును" అంది కాని దేవి ఆ క్షణాన ఆలోచిస్తున్నది పదిరోజుల తర్వాత అతడితో సాగించబోయే ప్రణయపోరాటం గురించి. జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభవం ఎదురైనందుకేమో ఓడిన బాధతో ఆ బాధపై సాధించాల్సిన గెలుపుకోసం సీరియస్ గా ఆలోచిస్తుంది.
ఆశించింది జరిగిపోతే దాని ఆయుష్షు అయిదు నిమిషాలే కాని ఇప్పుడు జరగాల్సిందాని కోసం ఆశించడం, ఆశిస్తూ ఎదురు చూడడం వింతగా వుంది. విరహం ఆమెకు అర్ధం కాని పదం.
"నీ కోసం ఎదురు చూస్తుంటాం" అంది తమకంగా.
ఆ తర్వాత ఆ రోజు సాయంకాలం కృషి మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు ఏకాంత సేవలో అందించిన టెండర్ జిరాక్స్ కాగితాన్ని విస్సు కిచ్చింది. "ఎప్పుడో భార్యని హత్యచేసిన జనరల్ మేనేజరు సుబ్బారాయుడు దానిని ఆత్మహత్యగా నిరూపించటానికి మా సహాయాన్ని అందించాడు అలా మా సహకారం పొందాక మా భక్తుడిగా మారి అప్పుడప్పుడూ మాలో ఐక్యం కావాలని వస్తూంటాడు - చౌదరి కోరింది దృష్టిలో వుంచుకుని ఈ రోజు సుబ్బారాయుడి నుంచి యిది సంపాదించాం. జాగ్రత్తగా రాయుడికి అప్పజెప్పండి.
విస్సు నిశ్చేష్టుడై చూశాడు ఆ కాపీలోకి...అందులో ఉపాధ్యాయగారు 'కోట్' చేసిన రేటుని తగ్గించి టెండరు పెడితే చాలా కోట్ల ఖరీదు చేసే ఆర్డరు మరొకరి సొత్తయిపోతుంది.
"పది రోజులలో రావాలి విశ్వనాథ్ - మిమ్మల్ని మాలో ఐక్యం చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతూంది" బయటికి వెళ్తున్న విస్సుతో మరోసారి ఓ షరతులా చెప్పింది.
* * * *
"ఇప్పుడు మెషినరీని అర్జెంటుగా ఇంపోర్ట్ చేయాల్సిన ఆగత్యమేముంది" అడిగింది కృషి ఉపాధ్యాయగార్ని చూస్తూ.....అనారోగ్యంతో రోజురోజుకీ మరిన్ని సమస్యల్లో ఆయన కూరుకుపోవడం ఆమెకు ఇష్టం లేకనే ఆ మాటంది తప్ప ఫ్యాక్టరీ విస్తరణ ఆమెకు ఇష్టం లేక కాదు. "అంతకన్నా ఉన్న వనరుల్ని సద్వినియోగ పరుచుకునే ప్రోడక్టివిటీ గురించి ఆలోచించడం బెటరనుకుంటాను"
కృషి ఆర్గ్యుమెంట్ నచ్చలేదు ఉపాధ్యాయగారికి - మారుతున్న పారిశ్రామిక ప్రపంచంలో ఆధునికత కూడా చాలా అవసరమన్నది అయన ఉద్దేశ్యం....అందుకే పదికోట్లు ఖర్చుచేసి మెషిన్ టూల్ ఫ్యాక్టరీకి యంత్రాల్ని దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఉదయం ఎనిమిది గంటల సమయాన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని యిద్దరూ చర్చించుకుంటుండగా వచ్చాడు విస్సు అక్కడికి. అతడ్ని చౌదరి మనిషిగా భావించే కృషి విస్సు సమక్షంలో యిదంతా చర్చించడం ఇష్టం లేక టాపిక్ మళ్ళించబోతుంటే ఉపాధ్యాయగారే కదిపాడు విషయాన్ని - నిజానికి వారి చర్చ అంతా అప్పటికి విన్న విస్సు ఆయన చెబుతున్న దానిపై ఆసక్తిని ప్రదర్శించాడు. తెలివున్నవాడు చర్చని ఏ కోణంలో అయినా కొనసాగించగలడు అనటానికి ఉదాహరణ విస్సు చెప్పిన జవాబు ఇక్కడ విస్సు లక్ష్యం ఉపాధ్యాయగార్ని సమర్ధించడమే...."వ్యాపారంలో ఎక్కువగా డబ్బు సంపాదించడమెలా అని ఓ సగటు వ్యాపారవేత్తని ప్రశ్నిస్తే అతడిచ్చే జవాబు కార్మికులకి తక్కువ డబ్బు చెల్లించి ఎక్కువ పని చేయించుకోవడం అని! కాని వ్యాపారం చేసేది మనకోసం కాదు వినియోగదారుడి కోసం అని ఆలోచించే ఆధునిక భావాలు గల వ్యాపారవేత్త తన ఘన విజయానికి ప్రాతిపదికలా ఫ్యాక్టరీని మోడర్ నైజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో కొత్త యంత్రాలని దిగుమతి చేస్తాడు...కార్మికుల తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి చేసే వినూత్నమైన పద్ధతులకి అనుగుణంగా అలా దిగుమతి చేసి అటు తను ఎక్కువ లాభాల్ని ఆర్జించడమేగాక వినియోగదారుల్నీ సంతృప్తి పరుస్తాడు తక్కువ ధరలకి సరుకుల్ని అమ్ముతూ..."
"మీరు చెప్పేది థియరీ" అంది కృషి రోషంగా.
"నేను చెప్పిన థియరీ ప్రాక్టికల్ గా నిరూపించబడింది మేడమ్. ఆరు వందల రూపాయలకి కెమిస్టుగా ఉద్యోగం చేసిన కార్పన్ భాయ్ పటేల్ యీ రోజు వందల కోట్ల రూపాయల టర్నోవర్ గల 'నిర్మ' వాషింగ్ పౌడర్ ని మార్కెట్ చేస్తున్నది అదే థియరీపై...అటు బిర్లాలకి ఇటు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన హిందుస్తాన్ లీవర్ కి ప్రత్యర్ధిగా నిలబడ్డ పటేల్ కి 'నిర్మా' పేకట్ పై వస్తున్న లాభం చాలా తక్కువ. కాని ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఎక్కువ లాభాల్ని పొందగలుగుతున్నాడు. ఈ రోజు అతడి వ్యక్తిగత ఆస్తులే సుమారు వందకోట్ల దాకా వున్నాయి. అంటే ఆధునికమైన పద్దతులు ఆ పద్ధతులకి అతడుపయోగించే యంత్రపరికరాలే"