Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 27

 

    కానీ...........అలాగని బ్రాహ్మణులలో ప్రతివాళ్ళు టాప్ కెళ్ళిపోతున్నారనీ , పోగలరనీ చెప్పలేం!


    జనాభాలో అత్యల్ప శాతం ఉన్న బ్రాహ్మణులలో మళ్ళీ ముప్పాతిక ముడోంతుల మంది చావలేక బ్రతుకుతున్న బడుగు జీవులే! బక్కప్రాణులే! పూటకి పట్టెడన్నం కూడా దొరకని బ్రాహ్మణ కుటుంబాల సంఖ్యే చాలా ఎక్కువ!" అన్నాడు క్లాయివ్.


    "అవును! బ్రాహ్మణుల్లో కూడా ఒక "క్రిమీలేయర్" ఉంటుంది. పాల మీద ఉండే మీగడలా పైస్థాయికి చెందిన వాళ్ళన్నమాట - ఆ మీగడ మనుషులే అన్ని అవకాశాలు సొంతం చేసేసుకుంటారు. " అన్నాడు జస్వంతరావు. "ఆ క్రీమీలేయర్ మనుషులు తమ కులం వాళ్ళే అయిన బీదవాళ్ళని పట్టించుకోరు. ఆ "పై" వాళ్ళ వల్ల కింది స్థాయిలో ఉన్న వాళ్ళకేమీ ఒరగదు! పైనున్నది "మావాడు" అని గొప్ప చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు" అన్నాడు జస్వంతరావు.


    "ఆ మాటకి వస్తే, ఏ కులంలో అయినా అంతే!" అన్నాడు రాజా. "ఎక్కడ ఎలాంటి లాభం కలిగే సూచన ఉన్నా కూడా, ఆ కులంలోని "పై తరగతి' మనుషులే ఆ అవకాశాలని ఎగరేసుకుపోతారు! కాబట్టి ఎవరు ఏ కులానికి చెందినా కూడా పెదలందరూ ఒక్కటే - కాని కులగజ్జి వల్ల ఎవరూ ఈ విషయం గ్రహించరు. గ్రహించనివ్వరు నాయకులు ."


    "మళ్ళీ బ్రాహ్మల్లో కూడా తమిళ బ్రాహ్మలదే డామినేషన్! ఎక్కడ ఏ టాప్ పోస్టులో చూసినా అయ్యరో, అయ్యంగారో ఉంటాడు." అన్నాడు జస్వంతరావు నవ్వుతూ.


    "రైట్! రైట్! అన్నాడు క్లయివ్.


     "ఇందాక జస్వంతరావు సినిమా తారలని గురించి చెప్పాడు. దానిని గురించి ఇంకొంచెం చేపుకుందాం. "అని చెప్పడం మొదలెట్టాడు క్లయివ్.


    "ఎవరైనా మీ బాలివుడ్ హిందీ సినిమాల్లో హీరోగా షైనవ్వాలంటే -


    అతను ఖన్నా అన్నా అయి వుండాలి - లేదా ఖాన్ అన్నా అయివుండాలి!


    అంటే-


    పంజాబీ గాని - లేదా పఠాన్ ముస్లిం గాని గాకపోతే బాలీవుడ్ హీరోగా నెగ్గలేరు.


    ముందుగా పంజాబీ సంగతి చూద్దాం!


    పృద్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, షమ్మికపూర్, రణదీర్ కపూర్, రిషికపూర్, కరిష్మాకపూర్, కరణ్ కపూర్, రవికపూర్ (జేతేంద్ర) అనిల్ కపూర్, సంజయ్ కపూర్, శక్తి కపూర్, దేవానంద్, ధర్మేంద్ర, సునీల్ దత్, సంజయ్ దత్, జూహే చావ్లా.......ఇలా టాప్ ఆర్టిస్టులంతా పంజాబీలు అయి ఉంటారు.


    అలాగే పటాన్ లు-


    యూసుఫ్ ఖాన్ (దీలిప్ కుమార్) ఖాదర్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, సంజయ్ ఖాన్, అక్బర్ ఖాన్, అర్భాజ్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సయిఫ్ ఖాన్ -


    ఇక ఆంధ్రాకి వస్తే -


    ఇక్కడ సినిమా రంగంలో అంతా చౌదరీస్ డామినేషన్ ఎక్కువ -


    రాజకీయాల్లో చూడబోతే -


    అదంతా రెడ్ల రాజ్యం - టాప్ పోజిషన్స్ లో అంతా రెడ్లే ఉంటారు.


    కాదా?


    కాదంటే , ఇంకో పార్టీ వస్తే అది కమ్మరాజ్యం.


    కానీ కులపెద్దల వల్ల అదే కులంలో ఉన్న పేదలకు మాత్రం ఏమి ఒరగదు. ఎప్పుడూ కూడా!


    "ఇంతకీ నువ్వు చెప్పబోతున్నపాయింటు ఏమిటి?" అన్నాడు రాజా కొద్దిగా అసహనంగా.


    "మీ ఇండియాలో ప్రజలకి ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా "మనమంతా ఒక్కటే" అన్న స్పృహ లేదు. సపోజ్ ఒక కులం లోని వాళ్ళు ఒక రంగంలో పైకి వస్తే తమ కులస్తులనే ముఖ్యస్థానాల్లో ఉంచుతారు తప్ప మిగతా కులాలకి చోటు ఇవ్వరు! అగ్రవర్ణాలేకాదు- రేపు మీ వెనుకబడిన తరగతులవాళ్ళు, దళితులూ అధికారంలోకి వచ్చినా జరిగేది ఇదే తంతు! అప్పుడు వాళ్ళు అగ్రవర్ణలని తొక్కేస్తారు! అంటే ఏమిటి - ఈ కుల పోరాటాలకి అంతు ఉండదన్నమాట!" అన్నాడు క్లయివు.


    "సో?" అన్నాడు రాజా.


    క్లయివు చెప్పాడు. "మనం ఇంకా వెనక్కి వెళ్తాం - మరిచిపోయిన కులాలని, మతాలని మళ్ళీ వెలుగులోకి తెస్తాం! వుదాహరణకి శైవులూ, వైష్ణవులూ ఉన్నారు. ఒకప్పుడు శివుడిని ఆరాధించే శైవులూ, విష్ణువుని కొలిచే వైష్ణవులూ వేరేవేరే మతస్తులుగా చెలామణి అయ్యేవాళ్ళు! ఇప్పుడు మరుగునపడ్డ మతాలకి మనం మళ్ళీ ప్రాణం పోస్తాం!"


    "ఇంకా ఈ కాలంలో శైవులేమిటి? వైష్ణవులేమిటి?" అన్నాడు రాజా.


    "అలా అనకు - తమిళనాడులో ఇంకా ఆర్యులు, ద్రావిడులు అన్న పోట్లాట జరుగుతూనే ఉంది గదా" అన్నాడు క్లయివ్.


    "పాయింటే!" అన్నాడు రాజా సాలోచనగా.


    "అలాగే బ్రాహ్మణులలో వైదీకులు, నియోగులు ఉన్నారు! వైదిక విద్యలు, అభ్యసించిన వాళ్ళు వైదీకులుకాగా, రాజుల కొలువులో చేరి మంత్రులుగా ఉద్యోగులుగా ఉన్నావారు నియోగులు అయ్యారు.


    యాభై ఏళ్ళ క్రితం దాకా వైదీకులకి, నియోగులకి బద్దవైరం ఉండేది. ఆ భేదాలు మళ్ళీ ఇప్పుడు రేపుతాం! అంతేకాదు "


    "ఇంకేమిటి?" అన్నాడా రాజా.


    "చరిత్రలో ఇంకా వెనక్కి పోతాం మనం! నీకు పిశాచాలు తెలుసా రాజా?"


    "ఎందుకు తెలిదు?"


    "పిశాచాలంటే దయ్యాలు, భూతాలు, లాంటి దుష్టశక్తులు కావు! పిశాచాలంటే మనుషుల్లోనే ఒక జాతి! ఒక పిశాచాన్ని చూస్తావా? పిలిపిస్తాను" అన్నాడు క్లయివ్.


    అంతలోనే -


    ఘల్లుమనే శబ్దంతో గజ్జెలు వచ్చి డైమండ్ రాజా మీద పడ్డాయి. అతని గుండె ఝల్లుమన్నట్లయింది.


     తిరిగి చూశాడు .


    ఆఠీన్ రాణీ మీనాక్షి, అలవోకగా నవ్వుతూ కనబడింది.


    తనమీద పడిన గజ్జెల వైపు చూశాడు డైమండ్ రాజా.


    అతి సున్నితమైన నగిషి చెక్కి వున్న వెండి గజ్జెలు అవి!


    డైస్ మీద డాన్సు ఆపి, ప్రతిమలా నిలబడి ఉన్న ఆఠీన్ రాణీ మీనాక్షి "ప్లీజ్! అని ఇలా తెచ్చి ఇవ్వరూ!" ప్రాదేయపుర్వకంగా చూస్తోంది.


    గజ్జేలని చేత్తో పట్టుకుని లేచాడు రాజా. డైస్ దగ్గరికి నడిచాడు. మీనాక్షికి అందించాడు.


    "థాంక్స్!" అంది మీనాక్షి.


    మీనాక్షి కావాలనే ఆ గజ్జేలని తనమీద పడేలా వేసిందేమోనన్న అనుమానం వచ్చింది రాజాకి. అతను అక్కడ నిలబడ్డ కొద్దిక్షణలు ఆమె వంటిమీద వస్తున్న సువాసన అతనికి మత్తెక్కించినట్లయింది. "పాయిజన్" అనే ఫ్రెంచి పెర్ ఫ్యూమూ, ఆమె వంటి సహజ పరిమాణము కలిసిపోయి, మృదువుగా అతని నాసికాపుటాలకు సోకుతోంది.


    మీనాక్షి కళ్ళు నవ్వుతున్నాయి.


    "థాంక్స్ ఏ లాట్!" అంది. "ఇంక మీరిక్కడ నిలబడితే బాగుండదేమో!" అన్న అర్ధం స్పురించేలా.


    అర్ధం చేసుకున్న రాజా తన టేబిల్ దగ్గరికి వచ్చేశాడు.


    టేబుల్ దగ్గర కూర్చోగానే క్లయివుని అడిగాడు రాజా.


    "పిశాచాన్ని చూపిస్తానన్నావు ఏదీ?"


    "బయట ఉన్నాడు" మనం బయటికెళ్ళినప్పుడు చూడొచ్చు!" అన్నాడు క్లయివు.


    ఈలోగా జస్వంతరావు రాజాతో అన్నాడు. "రాజా! చిన్న వ్యవహారం ఒకటి చక్కబెట్టి రావాలి నేను! నువ్వు క్లయివుతో మాట్లాడుతూ ఉండు - క్లయివు మనవాడే. ఫ్రీగా అన్ని మాట్లాడేయ్యొచ్చు" అన్నాడు.


    "ఓ.కే!" అన్నాడు రాజా.


    "పని పూర్తీ అయ్యాక పాలెస్ కి వచ్చేస్తావుగా!"


    "బై అల్ మీన్స్"


    "టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్!"


    నవ్వాడు రాజా.


    "ఐ కెన్ లుక్ ఆప్టర్ మై సెల్ఫ్! డోంట్ వర్రీ!"


    జస్వంతరావు "వెళ్ళొస్తా" అన్నట్లు క్లయివు భుజం మీద తట్టి కదలబోయాడు.


    "ఒక్క నిమిషం!" అన్నాడు రాజా.


    ఆగి ఏమిటన్నట్లు చూశాడు జస్వంతరావు.


    "డ్రైవరుని కూడా వెళ్ళిపొమ్మనండి!" అన్నాడు రాజా.


    "ఎందుకు?"


    "నేను కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసి వస్తాను. పాపం అతన్ని కూడా నాతోబాటు మేల్కొని ఉండమనడం ఎందుకూ?"


    ఏదో అనబోయి మానేశాడు జస్వంతరావు. "సరే కారు కీస్ కెప్టెన్ కి ఇవ్వమని చెబుతాను" అని వెళ్ళిపోయాడు జస్వంతరావు.


    జస్వంతరావు వెళ్ళాక సిగరెట్ అంటించి, చెప్పడం మొదలెట్టాడు క్లయివు.


    "పిశాచాలంటే అవేవో దుష్టశక్తులు కాదు - మనుషులలో ఒక జాతే అని చెప్పాను కదా! చరిత్ర ప్రకారం చూస్తే, ఆ పిశాచాలు అనే జాతి వాళ్ళు తెలుగువాళ్ళలో కలిసిపోయారు. ఒరిజనల్ గా వాళ్ళ భాష పైశాచి, ఒక్క పిశాచాలే కాదు - నాగులు, యక్షులు మొదలయిన వాళ్ళందరూ మానవజాతులే -. వాళ్ళు కూడా తెలుగువాళ్ళతో కలిసిపోయారు."


    ఆసక్తిగా వింటున్నాడు రాజా.


    "అలాగే రాక్షసులు - వానరులు! రామాయణం అంటే ఏమిటి? ఉత్తరాదిన ఉండే ఆర్యులు దక్షిణాదికి వచ్చి ఇక్కడి అనార్యులని జయించడం - అలా జరిగిన యుద్దాలతో తమకి లొంగక ఎదురు తిరిగి పోట్లాడిన వాళ్ళని రాక్షసులన్నారు. ఇందాకే మహాపండితుడు, పరమశివభక్తుడు అయిన రావణాసురుడు రాక్షసుడిగా పరిగణించబడ్డాడు.

 Previous Page Next Page