అంతేకాదు....
శేఖర్ అంతసేపూ ఫోన్ లో మాట్లాడింది....అదే నగరంలో వున్న రమేష్ మిత్ర బృందం వుపయోగించే గెస్ట్ హౌస్ నుంచి.
* * * *
ప్రేమ్ చంద్ చెప్పే మాటలను సీరియస్ గా వింటున్నారు రమేష్ మిత్ర బృందం.
ఆ రోజు....
"నేను వ్తెస్ చాన్స్ లర్ గారి గదిలోకి ఏదో పనిమీద వెళ్ళబోతూ లోపలనుంచి వినిపించిన మాటలు విని ఆశ్చర్యంతో బయటనే ఆగిపోయాను.....తీరా లోపలకు తొంగిచూస్తే .....ఆయనతోపాటు వున్నది ఆర్కియాలజీ లెక్చరర్ సుధాకర్ ఏం మాట్లాడుకుంటారోనని చాలా సేపు బయటనే వుండిపోయాను...."
ఒకనిమిషం చెప్పడం ఆపాడతను.
ఆ రోజు గదిలో జరిగిన సంభాషణ అతని మదిలో మెదిలింది.
"సర్.....ముకుందరావు ఏ ఉద్దేశంతో ఫోన్ చేసి వుంటాడంటారు?"
"ధీరజ క్లుప్తంగా మాట్లాడడంబట్టి చూస్తుంటే, బహుశా వాళ్ళ అబ్బాయి అనిల్ పరిస్ధితి చెప్పడం కోసమే అయివుండవచ్చుననిపిస్తుంది."
"అలాగే అనుకుందాం! ఆ విషయం పోలీసులకు చెప్పాలని ఎండుకనుకుంటాడు....ఎవరయినా డాక్టర్లకు ఫోన్ చేసి ముందు కొడుకు ఆరోగ్యాన్ని బాగుచేసుకోవడం మీద శ్రద్ధ చూపుతారు. కానీ ప్రత్యేకంగా ధీరజను బంగ్లాకు రమ్మనడం నా కెందుకో అనుమానాన్ని కలిగిస్తుంది...." సుధాకర్ తన సంశయాన్ని వెలిబుచ్చాడు.
"నా అనుమానం కూడా అదే సుధా! అసలే ధీరజ ఆవులిస్తే ప్రేగులు లెక్కపెట్టెరకం అని అర్ధమవుతోంది. ఏ చిన్న క్లూ దొరికినా మనలను నవాలక్ష ప్రశ్నలతో వేధించక మానదు" వ్తెస్ చాన్స్ లర్ గొంతులో అందోళన ధ్వనించింది.
"అసలు ధీరజ ఎందుకొచ్చిందిక్కడకు?"
"లెక్చరర్ నీలిమ మూడు రోజుల పాటు అదృశ్యమ్తె ఎక్కడ వుంది? ఏం చేసింది? దానికి కారకులు ఎవరు అనేది పరిశోధించడం కోసం....ఏమయినా ఇన్ ఫర్ మేషన్ దొరుకుతుందేమోనని."
"అంటే....లెక్చరర్ నీలిమ బ్రతికేవుందని ఆమె నమ్మకం...." ఆదోలా చూస్తూ కామెంట్ చేశాడు సుధాకర్.
"అలానే అనుకోవలసి వస్తుంది. మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే వుందిగా."
"మరి ఆ రమేష్ అండ్ కో వాళ్ళంతా ఆమెను చూసి దయ్యం అని తెగ భయపడిపోతున్నారు. ఇంతకూ నీలిమ చనిపోయి దెయ్యమ్తెందనుకో వాలా? లేక చనిపోకుండా బ్రతికేవుండనుకోవాలా మనం అంతా సస్పెన్స్ గా వుంది."
సుధాకర్ గొంతులో విసుగుదల....
"నిలిమను మనం చూస్తూనే వున్నాం కాబట్టి చనిపోయిందనుకోవడానికి వీల్లేదు."
"మరి ఆ మిత్రులు ముగ్గురూ...." ఎలా పూర్తిచేయాలో అర్ధంకాక మధ్యలోనే మాటలను ఆపేశాడు సుధాకర్.
"రమేష్ ,అనిల్, వెంకట్ లు ఎలాంటి వాళ్ళో....వాళ్ళు ముగ్గురూ ఏం చేశారో మనకు తెలుసు. నీలిమప్తె వాళ్ళ కన్ను పడిన విషయమూ తెలుసు. అ మూడు రోజులు నీలిమ ఎందుకు అదృశ్యమయింది....దానికి కారకులు ఎవరో కూడా మనం తేలిగ్గానే వూహించవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించల్సింది అదికాదు.... నీలిమ మనిషా లేక దయ్యమా?"
"అవును సర్! ఒకో సందర్భంలో మనిషి ప్రవర్తనలా లేదు ఆమె ప్రవర్తన. అలా అని ఆమె చచ్చిడయ్యమ్తేందని నిరూపించలేము.కాదు- చనిపోలేదని నమ్మి సరిపెట్టుకోలేం"అన్నాడు సుధాకర్.
"ఎస్! ఇప్పుడు మనం చేయవలసిదదే అసలు ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోంది...మనిషా లేక దయ్యమా....ఆ విషయాన్నీ గట్టిగా నిరూపించగలిగితే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం."
"ముకుందరావువల్ల ఈలోపు వచ్చే ప్రమాదమేమీ వుందడంటారా? ఎప్పటినుంచో తన మనసులో మెదులుతున్న అనుమానాన్ని బయట పెట్టాడు సుధాకర్.
"అవును!అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏమిటో....అతను దిర్జను కలుసుకోవాలనుకోవడమూ ముఖ్యమే. సుధా....నువ్వేలాగాయినా ఆ ఇన్ ఫర్ మేషన్ సంపాదించు....అప్పుడు ఆలోచిద్దాం ఇన్స్ పెక్టర్ ధీరజ నుంచి వచ్చే ప్రమాదం గురించి" దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు వ్తెస్ చాన్స్ లర్.
"ఓకే సర్! ఆ విషయం నాకు వదిలెయ్యండి. నేను చూసుకుంటాను. నీలిమ మిస్టరీ వెనుక వున్న వ్యక్తులు రమేష్ మిప్రబృందం అన్నక్లూ ఎలాగోలా ఇన్స్ పెక్టర్ దిరజకు అందించినందువల్ల ఏదయినా ప్రయోజనం వుంటుందేమో."
"మంచి ఐడియ ఇచ్చావు సుధాకర్! ముందు ఆర్జేంట్ గా ఆ పని చేయి."
మతాబులాగా వెలిగిపోతున్న ముఖంతో సుధాకర్ ను మెచ్చుకుంటూ అన్నాడు యూనివర్శిటి వ్తెస్ చాన్స్ లర్.
తరువాత వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.
అది గమనించి వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రేమ్ చంద్.
"ఇది అసలు విషయం...." అంటూ గతంలో తను విన్న మాటలను పూసగుచ్చినట్టు ఆ ముగ్గురికి వివరించాడు ప్రేమ్ చంద్.
మిత్రులు ముగ్గురూ ముఖముఖాలు చ్జూసుకున్నారు.
"ఆ ఇద్దరి సంభాషణవల్ల మీరే నిలిమను ఏదో చేశారని....ఆమె అదృశ్యనికి కానీ, ఆమె మిస్టిరియాస్ బిహేవియర్ కు కానీ మీరే కారకులని నాకనిపించింది. ఆ విషయమే ఇన్స్ పెక్టర్ ధీరజకు కూడా చెప్పాను."
"అంటే...."అనుమానంగా అడిగాడు.