Previous Page Next Page 
పాదాభివందనం పేజి 26

"ఊ"

"యిప్పుడు ఆఫీసు వదలగానే యింటికి వెళ్ళ బుద్ది పుట్టదు. నేరుగా నీ గదికి వచ్చేయ్యాలని వుంటుంది!"

'కానీ మా యింటి వోనర్స్ గుసగుసలు పోతున్నారు'

"యిల్లు మారితే సరి!"

"ఏ యిల్లయినా అంతే"

"మరేం చేద్దాం"

"దూరదూరంగా వుందాం. గాసిప్స్ ఆగిపోతాయి. నేను రూం చేంజ్ చేస్తాను. లోకాలిటి మారుతుంది. ఓ నెల రెండు నెలలో గడిచాక తిరిగి కలుసుకుందాం!"

"అమ్మో! రెండు నెలలు నీకు దూరంగా వుండాలా?"

నవ్వింది శైవాలిని "రోజు ఆఫీసులో చూస్తూనే వుంటావుగా?"

"శైవా!"

"మాయింటికి వచ్చేయ్!"

"సిస్టర్!"

"నధింగ్ డూయింగ్, వైజయంతి అడ్డు చెప్పదు."

"యూ నువెంత అమాయకుడివి, ఆడవాళ్ళు అలా పంచుకోలేరు?"

"నేనోప్పిస్తాగా?"

"ఒప్పిస్తావా? నొప్పిస్తావా?"

"ఉహూ సాధ్యం కాదు!"

"ఉహూ వీలు కాదు. ఎవరో అమ్మాయి మన యింటిలో వుండటమేమిటి? ఇన్నాళ్లూ ఎలా ఉందో అలాగే ఉంటుంది./ మైడియర్ హస్బెండ్ . అత్తా మామలే బాదరబందీ అనుకుని మనం ఫ్రీగా ఉంటె మధ్యన ఈ మరో మనిషి ఎవరు?" తల వంచుకున్నాడు నరేంద్ర.

అతని కంతా చెప్పేయాలనిపించింది. "జయా! అన్నాడు వణుకుతున్న గొంతుకతో"

"ఎందుకండి అంతగా యిదవుతారు? ఎవరో ఏమిటో మనకెందుకు గొడవ? హాయిగా జాయిఫుల్ గా ఉండకుండా?"

"జయా! నీకు తెలియదు!"

"ఏమిటి?"

"జయా! నీకు తెలియదు!"

"ఏమిటి?"

"జయా! నేను మారిపోయానా?"

"అవుననుకొండి. కారా కిళ్ళి వేస్తున్నాను. సిగరెట్ కాలుస్తున్నాను. అప్పుడప్పుడు డిన్నర్స్ కి వెళుతున్నారు! మాములు టెంటి ఫస్ట్ సెంచరి మగాడిలా వున్నారు. దానికేం?"

"దానికేం అని కాదు. యివన్నీ ఎలా అలవాటయ్యాయనుకుంటున్నావు?"

"నలుగురితో తిరుగుతున్నారు. కంపెని కోసం అలవాటయ్యాయి."

"ఉహూ కాదు!"

"మరీ"

ఎటో చూస్తూ అన్నాడు వీటికి కారణం శైవ!

ఉలిక్కిపడింది వైజయంతి.

"అవును! శైవాలిని మా మామయ్యకూతురు. మాకూ వాళ్ళకి మధ్య చాలా సంవత్సరాలుగా రాకపోకలు లేవు. అందుకే మాన్ పెళ్ళికి వాళ్ళు రాలేదు. కానీ జయా! ఈ ఆఫీసుకి ఆవిడ ఈ మధ్యే ట్రాన్స్ ఫర్ అయి వచ్చింది. తొలిసారిగా టీ పార్టీలో నాతో టీ తాగించి కిళ్ళి వేయించింది. తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కించింది! తనలో అనుకున్నట్టుగా అన్నాడు."

"ఇప్పుడు నేరుగా యింటికి వస్తానంటుంది అవునా!"

"తను అన్లేదు? నేనే రమ్మన్నాను. నేను ఆఫీసు వదిలాక తనతో కలిసి తన గదికి వెళ్ళి వస్తున్నాను. నీతో ఆఫీసు పని అంటున్నాను. నువు నమ్మేవు. నేను రోజు తన గదికి రావటం ఆ యింటి వాళ్ళకి యిష్టం లేదంది శైవి. అందుకే నేను మనింటికే రమ్మన్నాను?"

రవరవమంటోంది వైజయంతికి, వళ్ళంతా కారం రాసి నిప్పు సెగ చూపినట్టుగా ఉంది. ఎంతకు తెగించాడు! అనుకుంది. యిక లాభం లేదు అని అనుకుంది. హద్దుల్లో పెట్టేయ్యాలని కూడా అనుకుంది. చూడండి! మీరు అంతా యాదర్ధమే చెప్పారనుకుంటున్నాను!" ఆమె మాటకి అడ్దోస్తూ యస్! సెంట్ పర్సెంట్ కరెక్ట్! అన్నాడు.

"కానీ మీ సిన్సియారిటి మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను, మీ నిజాయితీకి నొచ్చుకుంటూ కూడా వున్నాను. నేను నా భర్త ఫ్రీగా ఉండాలనుకున్నాను. సోషల్ గా ఉండాలనుకున్నాను. అంతేకాని మరో ఆడదానికి బానిసగా వుండాలనుకోలేదు. యింట్లో పంచ భక్ష్యపరమాన్నాన్ని వదిలి వీధిలో హోటల్లో టిఫిన్ తినే మనస్తత్వం మగాళ్ళదనేది మా అత్తయ్య. చచ్చి ఎక్కడుందో కానీ యాదార్ధం చెప్పింది.

"మీరు నేనూ కలిసి నిర్మించుకున్న స్వర్గం యిది. ఈ స్వర్గంలో డెవిల్స్ కి స్థానం లేదు. భార్యా భర్తల మధ్య మరో మనిషి చోటు చేసుకోనటం నా కిష్టం లేదు. నేను మరో స్త్రీ వాసననే సహించలేను. "దృడంగా నిశ్చలంగా కఠిన కంఠంతో అంది వైజయంతి.

"కానీ జయా! నేను నేను కమిట్ అయ్యాను!" తడబడుతూ అన్నాడు నరేంద్ర.

"చూశారా మీ తడబాటు? మీ అశక్తత? అదేనండి యిల్లిగల్ కనెక్షన్ లోని బలహీనత? మీరు నావారు. మీ మనస్సు తనువు అంతా నాకే స్వంతం. యిందులో యితర్లకి షేర్ లేదు. కాదని ఎవరైనా దోచుకుంటే పాతకాలం నాటి సుమతిలాగా ఉండను. నరికేస్తాను అడ్డంగా. భర్తని యింట్లో బంధించి, నా కొంగున ముడి వేసుకుంటాను. అప్పటికి సాధ్యం కాకపోతే ఉరేసుకుంటాను. అంతే కానీ కలిసి పంచుకోలేను!" ఉద్వేగంగా అంది వైజయంతి.

చప్పున ఆమె భుజాలు పట్టుకున్నాడు నరేంద్ర.

మరుసటి వారం వీకెండ్ లో టీ పార్టీ అరేంజ్ చేశారు. సి.టి.వో సీట్ కారా తీసుకుని టీ తిరస్కరించాడు. కిళ్ళి ఆఫర్ చేశారు. ఎవరో. మృదువుగా తిరస్కరించి టీ కాఫీ కిళ్ళి సిగరెట్ అన్ని మానేశాను. నేను పాత లైఫ్ కి ది ఎండ్ చెప్పేశాను! అన్నాడు నవ్వుతూ.

 Previous Page Next Page