Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 26


    
    "నా వేపునుంచి ఓ. కె. అంటే నేనెప్పుడూ రెడీనే" అంది కైరవి అతని మెడమీద ముద్దుపెట్టుకుంటూ.


    అతను ఆమె కళ్ళలోకి చూశాడు.


    అంతులేని ఆరాధన.


    వెలకట్టలేని అభిమానం!


    పొంగి పొర్లుతున్న ప్రేమ!


    అతనికి ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి.


    "నాట్ నౌ డార్లింగ్" అన్నాడతను చిరునవ్వుతో.


    అతని మాటకి ఆమె విస్తుపోయింది.  అతనికేసి అదోలా చూసింది.


    "నాట్ నౌ డార్లింగ్" అంటున్నాడతను.


    అంటే ఏమిటి? ఎందుకని? కారణం ఏమిటి? తనెంత దగ్గరవటానికి ప్రయత్నించినా దూరంగా వుంచుతాడేందుకు?


    అన్నీ ప్రశ్నలే!


    "మరి ... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు....?" కళ్లు పెద్దవి చేసి చూస్తూ అడిగింది కైరవి.


    "డార్లింగ్ కైరవీ!


    నా చదువు పూర్తికావాలి. నాకు ఉద్యోగం దొరకాలి.


    మన పెళ్లి కావాలి


    దెన్  ఓన్లీ డార్లింగ్"


    అన్నాడు అతను.


     కైరవి అదోలా నవ్వింది.


    "ఇదంతా జరిగేనా?" అంది అయోమయంగా.


    "అంటే?"


    " నీ చదువు అన్నావ్. పూర్తవుతుంది కానీ ఉద్యోగం?"


    దొరకదు......


    అది నీకు దొరికేలోగా మనం ముసలివాళ్లం అయిపోతాం!


    అప్పుడు నాట్ నౌ డార్లింగ్ అనికాదు. 'ఇంతే సంగతులు డార్లింగ్' అని ఏడుస్తావ్" అంది కైరవి.


    "నేను ఎవర్ గ్రీన్ హీరోని" అన్నాడతను.


    "ఏడ్చావులే! ఆడపిల్ల ఎగిరొచ్చి ఒళ్ళో వాలితే ఏం లేదటగానీ... .ఎవ్వర్ గ్రీనట! గ్రీన్....


    నా కసలు నిన్ను చూస్తుంటే అనుమానంగా వుంది" అంది కైరవి.


    "ఏమిటా అనుమానం?"


    "పువ్వుల పున్నయ్య...." అని గలగలమని నవ్వడం మొదలుపెట్టింది కైరవి.


    "ఏయ్ ...నిన్ను.... నిన్ను...." అని లేవబోయి -


    " అమ్మో" అన్నాడు.


    "బాగా తిక్క కుదిరింది."


    "నేను లేచిన తర్వాత నీకు జాతర చేస్తాను"


     "నువ్వు ఏం చేసినా చేయించుకోడానికి నేను రెడీగా వున్నాను. కానీ నీకే ఏమీ చేతకాదని కన్ ఫర్మ్ అయిపోయింది. లేత చెక్కిళ్లు, ఎర్రని అధరాలు,  హిమాలయశిఖరాల చిరువులనీ, ఎత్తుపల్లాలనీ, లోయలనీ కలిపి యింత అందాన్ని మోసుకొస్తే చలనం లేని బండరాయివి. నీకో నాకు టైం వేస్ట్.


    నేను వెళ్తున్నా" అంది కైరవి వస్తున్న నవ్వును ఆపుకుంటూ.


    "చూద్దూగాని! శోభనం రాత్రి నిన్ను చిత్రీ పట్టేస్తాను"అన్నాడు ఫ్లయింగ్ కిస్ ఆమె కేసి పంపుతూ.


    ఆ ఫ్లయింగ్ కిస్ దగ్గరగా  వస్తున్నట్టు ఫీలవుతూ చేత్తో గాలిలోనే ఆ ఫ్లయింగ్ కిస్  ని తిప్పికొట్టింది కైరవి.


    "ఉత్తుత్తివి నాకేమీ వద్దు"


    నీ కోటా నీ కోసం రిజర్వ్ చేసే వుంచాను"


    "కోటానా?" అర్దం కానట్టుగా అడిగింది.

 
    "మిలియన్ ముద్దులు.....


    కోటి కౌగిళ్ళు.....


    లక్ష శోభనాలు...." అన్నాడతను.


    అతనికేసి మురిపెంగా చూసింది కైరవి.


    అతను నవ్వుతున్నాడు.


    "ను్వవు ఆశపెడుతున్నావేకానీ నువ్విచ్చినా అవన్నీ పుచ్చుకోడానికి నా జీవితకాలం  చాలదేమో......"
    "ఎన్ని జన్మలెత్తినా నీ కోటాని పూర్తిచేస్తాను...."


    "థాంక్యూ"


    "కైరవీ!"


    "ఊఁ....."


    "నిన్నునేను ప్రేమించాను!


    నిన్ను నేను ప్రేమిస్తున్నాను.


    నిన్ను నేను ప్రేమిస్తాను!


    నిన్ను నేను ప్రేమిస్తూనే వుంటాను!


    ఈ జన్మలోనే కాదు....


    ప్రతి జన్మలోనూ ప్రేమిస్తాను కైరవీ....."


    అతని గొంతులోని మార్దవానికి ఆమె మంత్రముగ్దురాలవుతోంది.  అతనికి తనంటే ఎంత యిష్టమో అతని మాటల్లో తెలుస్తూనే వుంది.


    కైరవి లేచి నించుంది గుమ్మం బయట  చప్పుడు వినబడి.


    అతని కోసం కమల్, పూర్ణ, దాసు, సిద్దార్ద బయట నిరీక్షిస్తున్నారని ఆమెకి అర్దమైంది.


    "వెళ్ళిపోతున్నావా?"


    అభినయ్ నీరసంగా అడిగాడు.


    "వెళ్ళక ఏం చేయను?


    నేను లోపలున్నానని, రావడం బాగోదని బయట నీ స్నేహితులు పడిగాపులు కాస్తున్నారు"


    "అదేం! లోపలికి రావచ్చుగా?"


    "అదే నీకు తెలియంది, వాళ్ళకి తెలిసిందీ!


     ఓ అమ్మాయి తమ స్నేహితుడి కోసం గదిలోకొచ్చిందీ అంటే ప్రైవసీ కోసం అని వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు లోపలకెలా వస్తారు? అయినా వాళ్లకేం తెలుసు?


     నువ్వేదో దుకాణం పెట్టావని బయట వుండిపోయారు.

 Previous Page Next Page