Previous Page Next Page 
షా పేజి 25

 

    "హోటల్ వైజాగ్ సీషోర్" పట్టణానికి చాలా దూరంలో బీచ్ రోడ్ మీద డ్రైడాక్ కి దగ్గరగా ఉంది. ఆ వీధి ఇరుగ్గా ఉన్నా, వీధి మొత్తం చిన్న చిన్న షాపులు, హోటళ్ళతోనే నిండి వుంది. ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే అన్నీ పట్టపగలులా తెరచే ఉన్నాయ్. ఉదయం ఆరున్నరకే మధ్యాహ్నం మార్కెట్ లా బిజీగా వుంది! చాలా మంది విదేశీనౌకలలో వచ్చిన నౌక సిబ్బంది రకరకాల దుస్తులలోనూ, రకరకాల భాషలు మాట్లాడుతూ తిరుగుతున్నారు.
    "వైజాగ్ సీషోర్" హోటల్ ఆవరణలోకి నడిచాడతను. లోపల చాలా కోలాహలంగా వుంది. రిసెప్షన్ రూమ్ లోనే చాలా మంది విదేశీయులు కూర్చుని ఉన్నారు. గట్టిగా ఏదో అర్ధం కాని బాషలో మాట్లాడుకుంటూ, వారి మధ్యలో నలుగురు అమ్మాయిలున్నారు. ఆ యువతులందరూ చాలా సెక్సీగా ----శరీరమంతా కనబడే విధంగా ఉన్నారు. వారి శారీరాన్ని తాకుతూ, అసభ్యకరమైన చేష్టలు చేస్తూ వాళ్ళు నవ్వుకుంటుంటే ఆ యువతులు తెలుగులో వారిని గురించి వెకిలిగా మాట్లాడుకుంటున్నారు.
    "వీడు మరీ సెక్స్ పిచ్చాడే! కిందటిసారి వచ్చినప్పుడు చాలా అసహ్యకరమైన పనులన్నీ చేయించాడు వాడు" అంది ఒకామె.
    "పోనీ డబ్బెమయినా ఎక్కువిచ్చాడా?" అడిగింది ఇంకొకామె-
    "పదిరూపాయలు ఎక్కువిచ్చాడు."
    "ఇస్తే ఫర్లేదులే. ఏం చేయమన్నా చేయవచ్చు" అంది ఇంకొకామె. నలుగురూ ఘోల్లుననవ్వారు ఆమె మాటలకు. విదేశీయిలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు అర్ధం అడిగారు ఒకామెను. ఆమె వచ్చీ రాని ఇంగ్లిష్ పదాలు వాడుతూ తమ సంభాషణ గురించి వివరిస్తోంది.
    కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తీ ఒకేసారి తన చుట్టూ నిలబడ్డ నలుగురు వ్యక్తులతో వేర్వేరు విషయాలు మాట్లాడుతున్నాడు.
    సృజన్ చాలా సేపు నిలబడ్డాడు కౌంటర్ ముందు. పావుగంట తర్వాత వాళ్ళ సంభాషణ ముగిసింది. అతని దగ్గర నిలబడ్డ వ్యక్తుల్లో ముగ్గురు వెళ్ళిపోయారు. అప్పుడు చుసాడతను సృజన్ ని.
    "ఏం కావాలి?" అడిగాడతను హటాత్తుగా.
    "ఒక చిన్న ఇన్ ఫర్మేషన్, కావాలి"
    "ఏమిటది?"
    సృజన్ చెప్పబోయేంతలో ఓ రూమ్ బాయ్ వచ్చాడు.
    "సార్! పదహారో నెంబర్ రూమ్ లో ఆ పోర్చుగీసోడు తాగి గొడవ చేస్తున్నాడు."
    "ఏమిటంట?"
    "ఇంకో అమ్మాయ్ కావాలంట-"
    "మనం రాత్రి పంపించిన సావిత్రికి డబ్బిచ్చాడా?"
    "దానికి ఇవ్వనంటున్నాడు. రాత్రి అది పోట్లాడిందంట వాడితో."
    "అయితే దానికి డబ్బిచ్చేవరకూ ఇంకో అమ్మాయి రాదని చెప్పు."
    "వినటం లేద్సార్- నన్ను కొట్టబోతున్నాడు--"
    కౌంటర్ దగ్గర వ్యక్తీ ఓ క్షణం ఆలోచించాడు. "ఒరే స్వామీ" గట్టిగా పిలిచాడు వెనకవేపున్న గదిలోకి చూస్తూ.
    "ఆ" అంటూ సమాధానం వినిపించింది గదిలో నుంచి.
    "ఆ పోర్చుగీసువాడెవడో గొడవ చేస్తున్నాడంట చూడు...."
    ఓ నిమిషం తర్వాత బాగా బలిష్టంగా వున్న ఓ వ్యక్తీ , టీషర్టు పాంట్ తో బయటికొచ్చాడు.
    "ఏ రూమ్?" అడిగాడతను చాలా నిర్లక్ష్యంగా.
    "పదహారో నెంబరు ---"
    అతను కౌంటర్ చుట్టూ తిరిగి బయటికిచ్చి మేడమెట్ల వేపు వెళ్ళాడు.
    మరో ఇద్దరు కుర్రాళ్ళుచ్చారు హడావుడిగా.
    "సార్! ఇరవై ఆరోనెంబర్ రూమ్, ముప్పయ్ రెండో నెంబర్ రూమ్ ఖాళీ చేస్తున్నారు.
    "మన దగ్గర అడ్వాన్సుఉందిలే! చేసేయనీ-"
    వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ సృజన్ వైపు చూసాడతను.
    "ఏం కావాలన్నావ్? రూమా?"
    "కాదు ఓ చిన్న పనుండి వచ్చాను--"
    "ఏమిటది?"
    "పదిరోజుల క్రితం మా అన్నయ్య శ్రీధర్ మీ హోటల్లో గది తీసుకున్నాడు---"
    "అయితే?"
    "ఆయనను రెండురోజుల క్రితం ఎవరో మర్డర్ చేశారు."
    కౌంటర్ దగ్గరున్న వ్యక్తీలోని నిర్లక్ష్యం మాయమయిపోయింది హటాత్తుగా.
    "అవును. పోలీసులు చెప్పారు మొన్నే-"
    "మా అన్నయ్య నీ గదిలో ఉన్నాడో నేను చూడాలి--"
    "ఎందుకు?"
    "మా అన్నయ్య సామాను గానీ, ఇంకేమయినా వస్తువులు గానీ"
    "సామానేమీ లేదు. ఒకే ఒక్క సూట్ కేస్ అంతే- అది పోలీసులు తీసుకెళ్ళారు."
    "అయినా ఆ గది నేనోక్కసారి చూస్తాను.'
    అతని ముఖంలో చిరాకు కనిపించింది.
    "పోలీస్ ఇన్ స్పెక్టర్ గారు చెప్పారు ------ఎవ్వరినీ ఆ గదిలోకి వెళ్ళనీయవద్దని.
    "నేను వెళ్ళి అయన పర్మిషన్ తీసుకొస్తాను కావాలంటే ......." ఆతను ఓ క్షణం ఆలోచించాడు.

 Previous Page Next Page