"నోర్ముయ్! ఆ నా కొడుకులు ఎస్సై గారిని సై అనిపించుకున్నారు. అయిదారొందలిచ్చి- దాంతో కేసు కుమ్మక్కు చేయబోయినందుకు మీ పై ఇరుచుక పడినాం. ఏదో కొంత రాల్తే మేం ఎళ్ళిపోతాంలేదా వీడు కడ్డిల వెనకపడతాడు. నువు నీ పిల్లలూ బజార్న పడతారు! లోక రీతి , నీతి న్యాయం న్యాయం ఖరీదు విడమరిచి ఎక్కట్లు చెప్పినంత తేలిగ్గా చెప్పాడు హెడ్డు.
'ఓ' సులభంగా నేర్చుకున్న పసిపాపలా కొంగున ముడి వేసుకున్న నుర్రుపాయల నోట్లు విప్పి ఇచ్చింది నర్సమ్మ నిర్లిప్తంగా.
"ఇంకఫరాలే! తొందరగా బుడ్చేయ్యండి. ఏడ్పులు మళ్ళీ ఎడ్చవచ్చు.....ఇంద ఖర్చుకి....." అని శవం మీద ఒక రూపాయి వేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
"ధర్మ పెబుల్లారా! సూడండి నా మనవడ్ని! ముదనష్టపోళ్ళు పొట్టన పెట్టుకున్రు. యిడిని బుడ్చానికి కూడా డబ్బుల్లేవు. మీరు తాగే కాఫీ, మీరు కాల్చే సిగరెట్టూ అంత కూడా కాదు యీని యిలువ. మీరు చెయ్యిదిలిస్తే యిన్ని మట్టి సేస్తాం!"
సెంటర్లో మనవడికి గుడ్డలు కప్పి అడుక్కోంటోంది ముసల్ది. పైసలు, పది పైసలు యాభై పైసలు రూపాయలు రాల్తున్నాయి శవం మీద.
"అమ్మగారూ వాడు నా కడుపు తోలిపంట! భద్రాది రామన్న మా ఇంట్లో పుట్టాడనుకున్నాను. అయితే, యమధర్మరాజుకు వాడి మీద మనసవుతుందనుకోలేదు నేను, చుచేవాళ్ళకు ముద్దొచ్చేవాడు. టాక్సీకి మొద్దోచ్చాడు. వాడిని మట్టిలో కలిపే ముందు నోట్లో చల్లటానికి ఒక్క బియ్యపు గింజయినా లేదు. నా జీతంలోంచి ఓ పది రూపాయలియ్యండి!" కన్నీళ్ళతో కాలిన కడుపుతో యాచిస్తుంది నర్సమ్మ.
"భగవంతుడు నిర్ధయుడే, నర్సమ్మ ఆడేపాడే వాళ్ళంటేనే వాడి కిష్టం చూడు మీ ముసలిదాన్ని తీసుకునిపోరాదు! లేదు మా అత్తముండని తిసుకపోరాదు. వాళ్ళు వాడి కంటికి కనిపించరే! మాయదారి ముండా కొడుకు.
ఇదిగో యీ యిరవై తీసుకో. జీతంలోకి కాదులే! బంగారం లాంటి పిల్లవాడు. ఎప్పుడైనా ఇంటికి వస్తే మా చంటిది చంకనేక్కేది!
ప్రాణాలకి విలువకట్టినట్లుగా డబ్బు తీసుకుంది నర్సమ్మ.
"అయ్యాగారు! నా కొడుకుని టాక్సీ గుదేసింది. నా కొడుకులు వాడ్ని చంపి పారిపోయినారు. దొరికితే అళ్ళ రక్తం కళ్ళ చూదును. వాడిని కాటికి తీసుకుపోవాల! దీపావళికి బోనసు వొద్దు. ఇప్పుడు లేక్కియ్యండి!" యాచించాడు యాదయ్య.
"ఒరే యాదయ్య! కష్టాలేవరికయినా వస్తాయి. దీపావళి బోనస్ మాట యిప్పుదేందుకులే! నా కొడుకు పోయాడు. ఇరవయ్యేళ్ళయినా ఇంకా నాకు మరుపు రాలేదు. అప్పుడు నాకు మా యజమాని డబ్బు ఇచ్చాడు. ఇదిగో యాభయి రూపాయలు. ఆ పని చూడు ఈరోజు రేపు పన్లోకి రావద్దులే!" అంటూ డబ్బు యిచ్చాడు ఫాక్టరీ యజమాని.
యునియన్ వాళ్ళు తలా కొంత చందా యిచ్చారు. వంద రూపాయలు తీసుకుని ఇంటికి మళ్లాడు యాదయ్య.
"మా అన్న చచ్చిపోయాడు. ధర్మం చెయ్యండి!" అని వీధి వీధి తిరిగారు పిల్లలు. చిల్లర డబ్బులు వర్షపు చినుకుల్లా రాలేయి.
సాయంకాలం ఆరు గంటలైంది.
గంట క్రితం రాముడిని భూమాత వడిలో దాచి స్నానం చేసి వచ్చాడు యాదయ్య. తల తుడుచుకుంటూ ఏడుస్తుంది నర్సమ్మ.
డబ్బంతా లెక్క పెట్టాడు యాదయ్య.
రెండొందల అరవై! ఖర్చయింది నలభై!
మళ్ళీ మళ్ళీ లెక్కించి అన్నాడు నర్సమ్మతో- ఇదిగో నర్సి! ఈ లోకం కట్టపడతామంటే పని చుపియ్యదు! పని చేసినా సరిగా డబ్బియ్యదు! సమంగా చూడదు శ్రమ జీవనానికి యిలవ లేదు లోకంలో! అడుక్కుంటే డబ్బులిసుర్తాది. చూడు- యియ్యాల మనింటికి లచ్చిమి మూడు నుర్లలో వచ్చింది. దీనితో మన మందరం మూడు నెలలు బతకొచ్చు.
బతుకుతా మంటే తిండి పెట్టదు. చస్తే దానం చేస్తుంది. మనది కర్మ బూమి. దరమ బూమి, పుణ్యబూమి మనోల్లకి దానదర్మాల్లో నమ్మకం జాస్తి.
సుస్తంటే మన తొమ్మిది మంది పిల్లలూ , మాయమ్మా వారానికో నెలకో అర్నేల్లకో ఒక రొకరు సస్తంటే మన తిండికి గడిసి పోద్దేమోననిపిస్తుంది!"
యాదయ్య మాటలకి నివేరపోయింది నర్సమ్మ.
ఆమె గుండెలో చిచ్చురేగింది. గుండె భగభగామండసాగింది.
మరో మనిషి.
పకపక నవ్వింది శైవాలిని. అతని మాటలకి. ఆ నవుకి సిగ్గుపడ్డాడు నరేంద్రనాద్. ఆ నవుకే కాదు, ఆ విషయం చెప్పడానికే అతను సిగ్గుపడ్డాడు. "నిజం శైవి! నేను కిళ్ళి వేసుకొను!" అన్నాడతను మళ్ళీ. తను నవుటాలకి అలా అన్నానని ఆమె అనుకుందేమోనని రెట్టించాడతను.
తెరలు తెరలుగా వస్తున్న నవుని అపుకుంది. శైవాలిని. నరేంద్ర ఉరికే చూస్తూ వుండిపోయాడు. అతనికి డిఫెండ్ చేసుకోవాలనిపించలేదు. కొద్ది సేపు అలా నవ్వి "ఎక్స్ క్యుజ్ మి! యింకా యీ రోజుల్లోనూ కిళ్ళి వేసుకుని వాళ్లున్నారంటే నమ్మలేక నవోచ్చింది!" అందామె.
"అవును శైవా! నేను యింతదాకా కిళ్ళి వేసుకోలేదు. నా పెళ్ళి రోజున మాత్రం మా మరదలు కారా కిళ్ళి యిస్తే వేసుకున్నాను. అందులో ఆ అమ్మాయి నిజంగానే కారం వేసింది!"
"ఊ అయితే వ్రత భంగం అన్నమాట? పోన్లే అది యిక్కడే యీ పూటే ప్రారంభించు" అంది కిళ్ళి అందించబోతూ. ఇబ్బందిగా ఫీలయ్యాడు.
"డైరెక్ట్ ఏ.సి.టి.వో.వి........సొసైటీలో పేరున్న వాడిని. అప్టరాల్ కిళ్ళి వేసుకుందుకే జంకితే రేపు ఎవరయినా డిన్నర్ ఎరేంజ్ చేస్తే ఏం చేస్తావ్? ముందుగా విస్కోయో, రమ్మో, కాక్ టైలో, షాంపైనో యిస్తారే అదెలా?" అంది శైవాలిని.
నిరుకారిపోయాడు నరేంద్ర "నిజమా" అన్నట్టు చూశాడతను.
"యస్! మన సి.టి.ఓ సారధి గారు చూడు రంగు , రుచి, వాసన అన్నీ తెలుసుకున్న మహానుభావుడు! నరేన్! అయన జీతం మొత్తం బ్యాంక్ లో వేస్తారు. నెలనెలా యింటికి కావలసినవి అన్నీ జవాన్లు ఫాపులో పట్టుకోస్తారు. ఇంకొక విషయం తెలుసా? ఇంటికి ఖాళీ జేబులతో వెళితే ఆవిడ అన్నం పెట్టదట షేం! షేం!
"లంచాలు పుచ్చుకుంటారా?"
"పుచ్చుకోరు! బలవంతంగా రక్తం పిండినట్టు పిండుతారు. ఇంకో న్యూస్ చెప్పనా? ఆవిడికి భర్త సండే ఆఫీసు కెళ్ళాడని కోపం. అందుకే యిబ్బడిగా సోమవారం తీసుకెళ్ళాలి. ఈ మధ్య శాటర్ డే అయిపొయింది. "లేవబోయాడు నరేంద్ర నాద్.
"కూర్చోండి! మనకి బంధుత్వం వుంది. ఒకే ఆఫీసులో వర్క్ చేస్తున్నాం. జంకుతారేం?"