ఇంకారక్తం ఆగిఆగి వస్తూ వుంది. వెంటనే లేచివెళ్ళి చేతిగుడ్డని తడుపుకుని వచ్చి వేలి చుట్టూ చుట్టాడు. తర్వాత ఆర్ద్రంగా చూస్తూ అన్నాడు.
"ఏమైనా తప్పు అన్నానా?"
కాదన్నట్టు తలూపింది.
"బాధగా వుందా?"
లేదన్నట్లు తలూపింది.
"మరి......."
"ఏమీలేదండి....."
"కాదు చెప్పాలి"
"నా చిన్ననాటి సంఘటన గుర్తుకువచ్చింది"
"చెప్పు"
"నేను పదేళ్ళు వయసులో వుండగా కూరగాయలు తరగటం అదీ నాకే ఒప్పజెప్పిందిమా పిన్ని, ఓరోజు పొరపాటున కూరగాయలు తరుగుతూ వేలు కోసుకుంటే మాపిన్ని నన్ను దయతల్చటంమాని వేలు కోసుకుని నన్నల్లరిపెడదామని చూస్తున్నావా అంటూ సాధించింది"
"అవును.......మనిషికి అనురాగం విలువ తెలియకపోతే అంతే అవుతుంది ప్రేమగా చూడటం, మాట్లాడటం అనేది ఇతర్లని పోషించటానికి కాదు-దయ తలచటానికీ కాదు-మన మనస్సుశాంతంగా వుండటానికి అంతే. ఆ విషయం మరచిపోయి అందరూ సాధించటంలో గొప్ప వుందనుకుంటారు......పోనీలే ఆ విషయం......మరిచిపో-అవన్నీ ....అదృష్టం చేతికి అందించి-మావదినగారి చల్లనిపందిట్లోకి వచ్చినవారికి ఎవరికీ బాధ అనే ఎండ సోకనే సోకదు"
ఒక్కక్షణం ఆగి అన్నాడు:
"కానీ......ఆలెక్క చేసేయ్......"
చదువులో మునిగిపోయారిద్దరూ.......
ఆదరాబాదరా డాక్టర్ అనంతంగారి నర్సింగ్ హోమ్ లో ప్రవేశించారు, మధురం, సారధీ, గీతాంజలి. నేరుగా డాక్టరుగారి కన్సల్టింగ్ రూము వద్దకి వెళ్ళారు. బాయ్ లోపలికి వెళ్ళిచెప్పాడు ఎవరితోనో అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్న డాక్టరుగారి అతని విడిచిబయటికి వచ్చారు. డాక్టరుగారిని చూస్తూనే అడిగింది ఆమె.
"ఏమైందండీ? ఏం జరిగింది? అంత తరగారమ్మని కబురంపారు"
"అవునమ్మా"
డాక్టరుగారు సరైన సమాధానం ఇవ్వలేదు. భయంతోకూడిన ఆలోచనలో మునిగింది ఆమె.
ఉన్నట్టుండి సాయంకాలం నాల్గుగంటలకి డాక్టర్ గారి వద్దనుంచి మనిషి వచ్చాడు.
"ఏమిటని" అడిగితే-
"వెంటనే పిలుచుకుని రమ్మన్నాడు" అన్నాడు అర్ధం అవనిఆవేదన మనసులో కలిగి వెంటనే సారధికి కబురు పంపింది-అతనూ మధురం వెంటనే వచ్చేశారు. ముగ్గురూ కలిసి అర్ధంకాని విషయాన్ని గురించి తలబద్దలు కొట్టుకుంటూ వచ్చారు-ఇక్కడి తిరిగి డాక్టరుగారు గాంభీర్యాన్ని మౌనాన్ని చూసి భయపడింది గీతాంజలి. ఆదుర్దాతో అడిగింది.
"ఏమైనా ప్రమాదం జరిగిందా డాక్టర్"
మెల్లిగా కన్సల్టింగ్ రూమ్ లోకి దారితీస్తూ వాళ్ళని రమ్మని సైగ చేశాడు. లోపలవున్న ఆయనతో కొంచెం అలా బయటికి వెళ్ళి ఓ గంటా రెండుగంటల తర్వాత మళ్ళీ రమ్మన్నారు.
తర్వాత మౌనంగా వారిని కుర్చీల్లోకూర్చోమని సైగచేసి తనూ వారికి ఎదురుగా కూర్చున్నాడు. కుర్రాడు వచ్చి ఫేస్ వేసి వెళ్ళాడు గదిలో గడియారం టక్ టక్ మని శబ్దం చేస్తూ సాగి పోతోంది. కాలపురుషుని కర్కశ హస్తాల్లో ని సమ్మెటపోటుల్లా ధ్వనిస్తున్నాయా శబ్దాలు గీతాంజలి.
నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ప్రారంభించారు డాక్టరుగారు. ఆయన చేతిలోని పేపరు వెయిట్ గుండ్రంగా తిరుగుతోంది. అయనతలలో తిరుగాడుతున్న ఆలోచనల్లాగే-
"ఇది నా సర్వీసులో అతి చిత్రమైన కేసు-ముందు అతి మేధావి, విధి వశాత్తు పిచ్చివాడైనాడు-అయినా మేధస్సు మాత్రం వంకర బోలేడు-మనసు వంకరబోయినా-బుద్దివంకరబోయినా ఏనాటికైనా దిద్దుకోవచ్చు-కానీ-మేధస్సు వంకరబోతే-తర్వాత చెప్పటం కష్టం-ఆమనస్చాంచల్యపు బాధనుండి తేరుకోకముందే అతి ఘోరమైన ప్రమాదం జరిగింది. అది బ్రెయిన్ మీద చాలా దెబ్బతీసింది-అనుకోని పరిణామాలు కలుగవలసింది.
కానీ అతన్లో ఓ చిత్రమైన మార్పు మాత్రం వచ్చింది "లౌ ఎట్ ఫస్ట్ సైట్" అన్నట్లు అతనికి ప్రమాదం తర్వాత స్పృహవచ్చాక ఎవర్నై తే చూశాడో వాళ్ళు తప్ప మిగతావాళ్ళ పొడ గిట్టడం లేదు.
నిన్నరాత్రి నీవు అక్కడినుంచి వెళ్ళావు కదమ్మా......నీవు వెళ్ళాక మా హెడ్ నర్స్ అటుగా వెళ్ళింది.....నీవేననుకుని దగ్గరగా రమ్మనిపిలిచాడు-సామాన్యంగా నేను క్రొత్త పేషెంట్లవద్దకి ఎవర్నీ ఒంటరిగా వెళ్ళనివ్వను. అందుకని భయంభయంగా వెళ్ళిందామె-దగ్గరగా వచ్చాక ముఖంలోకి పరీక్షగా చూసి ఒక్క దెబ్బ వేశాడు-బయటికి త్రోశాడు-మళ్ళీ ఆ ప్రాంతాలకి వస్తే గొంతుపిసికేస్తా నన్నాడట-దాంతో నాకున్న ఒక్క ఆశా పోయిందనిపించింది. అది తెలిశాక-ఆ అమ్మాయి కీనీకూ కొన్ని పోలికలున్నాయి-అసలు వైద్యం ప్రారంభించాలని-నిశితంగా చూస్తే తప్ప-ఒక్క ముఖం తప్ప-అన్నిటా ఆమెకీనీకు భేదం ఏమీలేదు- కానీ ఏం చేయను" "మరి రాత్రి అతనికి భోజనం అదీ" గీతాంజలి గొంతుకలు ధ్వనిస్తున్న ఆతురతకి నవ్వుకున్నాడు.
"అదేకదమ్మా వచ్చిన చిక్కు-రాత్రి ఎనిమిదిగంటలు-ఆ ప్రాంతంలో అతనికి భోజనం తీసుకుని వెళ్ళారు-విసరికొట్టాడు- ఆ తలుపు దగ్గరికి ఎవరైనా సరే వస్తే చంపేస్తానన్నాడట-నాకువచ్చి రిపోర్టు చేశారు ఏం చేయాలా అని?" గుండెలు బిగపట్టుకుని వింటోంది గీతాంజలి.
"అప్పుడు నేనే స్వయంగా వెళ్ళాను-నేను అతని దగ్గరకు వెళ్ళేసరికి మంచంమీద కూర్చున్న వాడు అమాంతం లేచిదగ్గరగా వచ్చి అన్నాడు-డ్రైవర్-ఆ అమ్మాయి నాతో ఇక్కడికి వచ్చిందే గీతాంజలి అని-ఆమె ఎక్కడ? ఏమని సమాధానం చెప్పను? ఒక్కక్షణం ఆగి అన్నాను. ఆవిడ సినిమాకి వెళ్ళారు సార్.....రాత్రి ఒంటిగంటకి కానీ రారు.....మిమ్మల్ని భోజనం అదీ చేయమని చెప్పారు. అతనికి చాలా కోపం వచ్చింది. మరీ దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టిచూస్తూ అన్నాడు.
"నన్ను విడిచి సినిమాకు పోయిందా? ఎలా పోయిందీ? నేను ఇంత బాధతో ఉన్నానే? ఇంత కష్టంలో వున్నానే?......పోతేపోనీలే......పోనీ.......పోనీ......అంతనిర్దయ అయితేపోనీ-తనకేనా పై శ్రద్ద లేకపోయాకనాకేం డ్రైవర్? అన్నంవద్దు.......యేమి వద్దు......పస్తుపడుకుంటాను......తలుపువేసుకుంటూ.......లోపలే పడుకుంటా......తలుపు తీయనే తీయను.....డ్రైవర్ ఆవిడని రాత్రం తా నీ కార్ లోనే పడుకోనివ్వు. ఇంట్లోకి రానివ్వకు......పో....." మెల్లిగా అన్నాన్నేను ఆయనకి ఆవిడ పైగల అనురాగానికి చలించిపోతూ- సామాన్యంగా డాక్టర్లకి అలాంటి బీద హృదయం వుండకూడదు-కానీ-కానీ-విధిచిత్రమైంది.
"అదికాదు సార్......తప్పని సరై వెళ్ళింది.......ఎంతోబాధతో వెళ్ళింది. మిమ్మల్ని క్షమాపణకూడా వేడుకుంది"
"బాధ......బాధ.....ఆడవాళ్ళకి బాధ ఎక్కడుంది? వాళ్ళకి ఏడవటం మాత్రం తెలుసు. అదీ ఎందుకో తెలుసా మగవాళ్ళని ఏడ్పించటానికే......ఇంకేం చెప్పను.....నాతలతిరిగిపోతోంది. బాధతోపగిలి పోతుందేమో......వెళ్ళు"
మౌనంగా బయటికి వచ్చాను.
"అయితే డాక్టర్.....నిన్నటినుంచి తలుపు తీయనేలేదా?" ఆత్రుతగా అడిగాడు సారధి.
"నో....నేడుమళ్ళీ రాత్రి ఒంటిగంటకు వెళ్ళి నిద్రలేపాను. కళ్ళు నులుముకుంటూ వచ్చి ......"హ్యావ్ యూ నాట్ హర్డ్ హర్ సైలెంట్ స్టెప్స్ షికమ్స్......షికమ్స్....."అన్నారు లేదు సార్ రాలేదు. ఆవిడ ఫోన్ చేశారు.....ఎవరో గొప్పవాళ్ళు రానివలేదని.....క్షమించమన్నారు" అన్నాను తలపు గట్టిగా మూసేస్తూ అరిచాను.
"గెటవుట్......పోవోయ్......పో.......మళ్ళీ ఎందుకు వచ్చావ్.....ఆవిడ ఓ తప్పు చేసేది-నీవు సమర్ధించి క్షమాభిక్ష ఆర్జించేవాడివీను-హాయిగా నిద్రపోతున్న వాళ్ళని నిద్రచెడేట్టు లేపటం నీ వంతులా వుంది-పోపో-ఆవిడై ఆవిడ వచ్చి ప్రత్యక్షంగా క్షమాపణ వేడుకునే వరకూ తలుపు తీసేది లేదు-లేదు-తీయనే తీయను-" అన్నారు.
రాత్రంతా అలానే వున్నారు-
తిరిగి ఉదయం తొమ్మిది గంటలవరకూ ఎవరూ ఆ ప్రాంతాలకి వెళ్ళలేదు-
తొమ్మిది దాటాక ఓ సారి మా కాంపౌండర్ అలా పోతోంటే-
దగ్గరగా రమ్మని పిలిచాడట కిటికీలోంచి.
దగ్గరగా వెళ్ళాక స్టెతస్కోపు పట్టుకుని అన్నాడట.
"ఓ పాము లబ్బీ-
ఇలా ఓ అమ్మాయి-
పదహారేళ్ళ పడుచు కుర్రి-
నాఅంత ఎత్తు వుంటుందో-లేదా ఓ వ్రేలెడు.
తక్కువవుంటుందో అంతే-