పిరుదుల దాకా ప్రవాహం లాగావ్రేలాడే కురులు-
ఇంకా-ఇంకా-
నీవు చూశావా?"
అతను బిత్తపోయి 'ఆ-ఆ' అన్నాడట.
వెంటనే అతన్ని ఇంకాస్త దగ్గరగా లాక్కుని అన్నాడట.
"అఆలు ఇ ఈలు అన్నీ తర్వాత చదువు కుంధువుగానీ.....వెళ్ళి ఆవిడని పిలుచుకునిరా" అంతవరకూ ఇక్కడి నుంచికదిలేది లేదు........ఫో....."
"అదీ సంగతి సారధిగారూ-అతనాస్థలంనుంచి ఇంతవరకూ కదల్లేదు-నిన్నటినుంచీ ఏమి తిండితినలేదు. అన్నిటికన్నా నాకు బాధకలిగించేది అదే-మేము ఎవరం ఆ ప్రాంతాలకి వెళ్ళేందుకు వీలులేదు-నేవెడితే ఆవిడ ఏదనిఅడుగుతాడు.
ఈసారి వెడితే నన్నూ కొడతాడే మో? మిగతా వాళ్ళని బాదుతున్నాడు. ఆ స్పెషల్ రూములోని సామానంతా అటూ ఇటూ సర్ది పారేశాడు-అలంకరణ ఏమీ బాగాలేదట-రేపు ఆవిడవచ్చాక ఇద్దరూ కలిసి అలంకరణ పూర్తిచేయాలట-"
ఆయన మాటలకి అడ్దొస్తూ అంది.
"అతన్ని చూసివద్దాం రండి"
డాక్టరుగారు లేచారు
గీతాంజలి వెంట లేవబోయివాళ్ళిద్దర్నీ చూసి అన్నాడు డాక్టర్:
"మీరిక్కడేవుండండి-మీరు వచ్చారంటే అతను మళ్ళీ రేగిపోతాడు ఏమైనా చేయొచ్చు"
మౌనమే సమాధానంగా కూర్చున్నారు ఇద్దరూ.
ఆమెని అంతదూరం నించేచూసి మూతి బుంగగా చేసి కోపంగా చూసి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు అటువేపు తిరిగి.
డాక్టరుగారి వేపు చూసింది.
"వెళ్ళమ్మా"
చప్పుడు కాకుండా వ్రేళ్ళమీద నడుస్తూ వెళ్ళింది.
డాక్టర్ గారు బయటే వున్నారు.
దగ్గరగా వచ్చి నిలుచున్నది గమనించాడు-
హఠాత్తుగా లేచి-
"వచ్చావా?రా! ఇంతకీ డ్రైవరు మంచివాడు కదూ-నీవునిన్నటి నుంచీ రాలేదని నేను ఏడుస్తున్నాడు -పోవయ్యా ఇక నీవు పో"
డాక్టరు కదిలి వెళ్ళాక అన్నాడు.
"నిన్నటి నుంచీ రానందుకు శిక్ష యేమిటో తెలుసా?'
అడ్డంగా వూపింది తల-
బుగ్గని మెల్లిగా వెళ్ళతోసాగదీస్తూ అన్నాడు.
"ఇది"
కంగారుగా డాక్టరుగారి గదిలో ప్రవేశించింది.
దగ్గరగా వెళ్ళి డాక్టర్ గారి చేయిపట్టుకుని అంది.
"డాక్టరు గారూ? ఏమిటిది? ఆయనన్నిలా వేధిస్తున్నారేమిటి? ఏదో సానుభూతితో పిచ్చివాడు కదా అని దయతలిస్తే నన్నిలా వేధించటమేమిటి?"
ఆమెకిక్కడ ఏడుపు ఒకటే తక్కువ.
"ఏమైందమ్మా?"
డాక్టరుగారి ప్రశాంతమైన వాణి ఆమె మనసులోని ఆందోళనని తగ్గించింది.
ఇంకా ఆమెలో ఆ ఆవేదనా ఛాయలు తగ్గకపోవటం చూచిదగ్గరగా వెళ్ళి తలమీద చేయివేసి నిమురుతూ అడిగాడు.
"ఏమైందో చెప్పమ్మా"
"......."
"స్థిమితంగా కూర్చోమ్మా"
కుర్చీలో కూర్చుంటూ అంది.
"అతన్ని తప్పించుకుని రావాలంటే ప్రళయమైంది నన్ను నమ్మటంలేదు-వస్తానని వెడతావు- రానేరావు-నేను నీకోసం పడిగాపులు కాచి కాచిచావాలి అంటున్నాడతను-తప్పకవస్తా నంటే గుర్తుగా ఏదైనా వుంచి పొమ్మన్నాడు. మళ్ళీ తనకైతానే ఉంగరం ఇవ్వమన్నాడు ఇచ్చేశాను-అంతటితో ఆగక నా రవికని కూడా ఇవ్వమని ఏడిపించుకుని తీసుకున్నాడు."
డాక్టరు గారిగుండె కరిగిపోయింది.
"ఎందునా! ఏమి సంబంధంలేని అమ్మాయిని అనవసరంగా చిక్కుల్లో ఇరికించి బాధ పెడుతున్నానేమా" అనుకున్నాడు.
"ప్రపంచంలో సుఖంకంటే కష్టమే ఎక్కువగా వుందమ్మా! అందులో నలుగురికి మంచిగా వుండాలని నిస్వార్ధమైన సేవ చేయాలని కాంక్షపడే నీలాంటివారికి ముఖ్యంగా కష్టాలెక్కువేనమ్మా"
ఒక్కోసారి మానవుడు తనమనసులో ఆలోచించుకునేదానికి బయటికి వెలువరించేదానికి సంబంధమే వుండదు-
ఆయన ఊహించేది ఒకటి-
బయటికి చెప్పింది ఒకటి-
నిజమే-
అలా చెప్పుకుంటే ఆయన నిర్ణయించుకున్న పనిసాగదు-
డాక్టరుగారి ఒక్కోమాట ఆమె హృదయాన్ని కదలించి వేస్తున్నాయ్-
గదిలో పైన తిరిగే ఫేన్ లాగే ఆమె మనస్సు సంచలించిపోతోంది.
సారధి అడిగాడు.
"ఇప్పుడు మేము ఏం చేయాలి డాక్టరుగారూ"
ఆయని ఏమీ సమాధానం చెప్పలేదు-
గీతాంజలి అడిగింది.
"చెప్పండి డాక్టర్.....నా తల పగిలిపోతోంది......ఆలోచనలతో అస్తవ్యస్తమైన అభిప్రాయల తోభారంగా వుంది మనస్సు.....చెప్పండి......త్వరగా చెప్పండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ మేమేదో పోగొట్టుకున్నట్టు అందుకు ముందుగా వెనక ఎంతగానో బాధపడుతున్నట్టు అనుభూతి పొందుతున్నాం......"
ఏదో నిశ్చయం చేసినట్టుగా అన్నాడు డాక్టరు.
"నేను మొన్ననే ఒకటి అనుకున్నాను......నిన్న అది దృఢమైంది.
ఈరోజు నిశ్చయం చేసుకోవాల్సివచ్చింది.
ఆయన మాటని పూర్తి కానివ్వకుండా అన్నాడు సారధి
"అదేమిటో చెప్పండి ముందు-"
మధురం మెల్లిగా మందలించాడు.
"ఆయన్ని చెప్పనీవు సారధీ"
"అతనికి డాక్టర్లంటే ద్వేషం ఏర్పడింది అని మనం అనుకున్నది అక్షరాలానిజం అయింది. ఈరెండు రోజులు అనుభవంతో మందులంటే చెప్పరాని మంట బయల్దేరింది-అతనికి హాస్పిటల్సులో కానీ నర్సింగ్ హోమ్ లలోకానీ ఆ పిచ్చినయమయ్యే అవకాశం లేదు"
"అయ్యో" అంది గీతాంజలి.
మళ్ళీ అందుకున్నారు డాక్టర్.
ఎప్పుడూ వేడి వేడి ఇనుముమీద కొడితేనే సాగుతుందనే విషయం తెలుసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేవారిలో ప్రధముడు డాక్టరు అనంతం. మనిషిమనసులో మెదులుతున్న బాధ బహిర్గతమయ్యే సమయాల్లోనే కొన్ని కొన్ని విషయాలు చెప్పివాళ్ళతో ఒప్పించవచ్చు.
"కానీ....."
ఆయన ముందుకు సాగక గీతాంజలి ముఖంలోకి చూశాడు.