మరో పదిరోజులూ గడిచాయి. చైత్రం వెళ్ళి వైశాకం వచ్చేసింది. ప్రయాణం దగ్గర పడింది.
తిరిగి వెళుతున్న తన ఇష్హ్త సఖీకి ఏమేం ఇవాలో రోజు ఆలోచిస్తూ ఆజ్ఞలు జారి చేస్తోంది సీతమ్మ తల్లి.
ఆరోజు చింతమొక్కని చూసిన ఆమె మనసులో ఏదో ఉహ మెరిసింది.
శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మ వారూ కూర్చుని ఉన్నారు. వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు కంసాలి. విశ్వకర్మ ప్రతి రూపంగా పిలబడే అయన ఆ రాచ కుటుంబానికి ఆభరణాలు తయారుచేస్తాడు.
చింతాకురూపం.......ఆ చిన్ని ఆకు అందం వాటిని మాలగా మార్చి మధ్యన పతకం వేసి చేసి హారం రూపకల్పన జరిగిపోయింది. శ్రీరామ చంద్రులవారు చిదిలాపంగా నవ్వుతున్నారు.
"రాజులు కొత్తదనం కోరతారు. అంటారే కానీ ఆడవారికే కొత్తదనం పై కోరికలు మెండు "అయ్యగారి మాటలు అమ్మగారికి అనందం కల్గించాయి.
"నగఎప్పటికయ్యెను?
"చిత్తం! రేపిపాటికి......' తలూపాడు శ్రీరామచంద్రుడు 'రాణి' తలుచుకుంటే నగలకు కొదవా?"
"జంటహారాలు చేయండి!' సీతాదేవి అంది.
శ్రీరామచంద్రులవారి కనుబొమలు అలా కలిసి, ఇలా విడిపోయి మనస్సులోని భావం పెదాల మీద మందహాసం వెలిసింది.
"అయితే నాలుగు- లేదా ఒకటి అనాలి. కానీ....." తన మనసులోని సందేహాన్ని మదిలోనే త్రుంచేసుకున్నాడు విశ్వకర్మ.
"సీతామహాలక్ష్మి! దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అత్తారింటికి ఆంధ్రదేశం వెళ్తున్నావు. కానుకల్తో పంపడం రాచధర్మం. శాశ్వతంగా ఉండేది. తీయని గుర్తుగా మిగిలేది ఏమిటా అని ఆలోచిస్తున్న నాకు అంతపురంలో మొలిచినచింత మొక్క సరికొత్త ఆలోచనని మొలిపించింది. విశ్వకర్మ చింతాకు పతకం తయారించాడు.
ఇప్పుడీ ఆ జనాభ దేశంలో ఈ చింతాకు పతకాలు రెండే! ఒకటి జనకరాజు పుత్రి శ్రీరామ చంద్రపత్ని అయిన ఈ సీత మెళ్ళో! మరోటి ఈ సీత మనస్సు చూరగొన్న ఈ చిన్ని సీతామహాలక్ష్మి మెళ్ళో! నాపేరు పెట్టినందుకు.
నాతో కలిసి మెలసినందుకు ఈ చిహ్నం శాశ్వతం కావాలి. సీతా! నీ బావ తెచ్చిన చింతకాయల్లోని విత్తనం మొలకెత్తింది. అది పెరిగి పెద్దదై పూచి , కాస్తే--- ఆచిగురు తింటూ ఆ కాయలు తింటూ ఉంటె మాకు మిరే గుర్తుకొస్తారు.
మరిమేం గుర్తుండేదేలా?
అందుకే ఈ చింతాకుపతకం.....
సుఖంగా జీవించేందుకు ఏర్పాట్లు చేశారు ప్రభువులు. పిల్ల పాపలతో వర్ధిల్లండి.
రామన్న, సీతామహాలక్ష్మి ఇద్దరూ ఆ ఇద్దరికీ సాగిలబడి నమస్కరించారు.
ఆంధ్రుల తరించారు. చింతాకు ధన్యమైంది.
ఈనాడు అయోధ్యలో చింత చెట్లున్నాయో లేదో నాకు తెలిదు కానీ ఓ చింతాకు పతకం మాత్రం భద్రగిరిలో సీతమ్మ వారి మెడలో వెలుగు చిమ్ముతోంది. ఆ పతకం తయారికి అలనాటి చింతాకు పతకమే ఆధారమేమో కూడా నాకు తెలిదు.
వజీవనం
"ఏం బతుకేమంది? సచ్చి సెడి నువు నెలకు పద్దేస్తే రోజు పాసిందో పులిసిందో గిన్నేడన్నం తెస్టంటే ఎట్లానే బతికేది?
ఇంతమంది నా కొడుకులున్నారు. ఈల్లకి తిండి బెట్టెదేట్టా? అడక్కరమ్మని పంపిస్తే ఒక్క నా కొడుకు పైస తేలేడు. పిడికెడు తిండి, జానెడు బట్ట అడుక్కోలేరా? ధూ!ధూ! కాండ్రించి వుమ్మాడు యాదయ్య.
గుడ్ల నీరు కక్కుకుంది నర్సమ్మ.
దాని మనస్సంతా పాడై పోయింది. వాడి మాటలకి. చుట్టూ ఉన్న పిల్లల వేపు దీనంగా చూసింది.
వెన్నెల మసక వెలుతుర్లో అందర్నీ తేరిపార చూసింది. పదిమంది పిల్లలు! ఎనిమిది మగ, ఇద్దరాడ!
అందరూ తన కడుపున పుట్టిన పిల్లలే-- కాదంటే వీడికి పుట్టినోళ్ళు ఆరుగురు! తను తన మొగుడితో అయిగా కాపరం చేసుకుంటూ పిల్లలతో పిల్లలకోడిలా బతుకుతూ ఉండేది. కిట్టిగాడు అటాత్తుగా లారీ కిందపడి చస్తే యిడు మారు మనువు కట్టుకున్నాడు.
మొదటి మొదట్లో బాగానే ఉండేవాడు. తనను, తన పిల్లల్ని బాగానే చూసుకునేవాడు. తనకు మళ్ళీ కాన్పులు మొదలై మూడేళ్ళకిద్దర్లాగా పుట్టారు. తనను అందరూ గుమ్మడి పాదనేవారు. పిల్లలు పుట్టడం మొదలైన కాడ్నించి యాదయ్య బుద్దిమారిపోయింది.
ఎప్పుడూ ఆ పిల్లల్ని చిదరించుకునేవాడు. బాలింతగా నేలనాళ్ళు తను విడిగా ఉండేది. మళ్ళీ కాపరం. అప్పుడె పిల్లల్ని యిసుక్కుని తిట్టేవాడు. మల్లెపొదలా ఉండే తను గోగురెమ్మలా అయింది. తన అందం తరిగింది. యవనం కరిగింది.
ఎప్పుడూ ఆపరేషన్ చేసుకోమనేవాడు. కాదు కాబట్టే ఆపరేషన్ వద్దు, కష్టపడి ఎవడి కూలి వాడు సంపాదించుకుంటాడులే అనేది. దాంతో యాదయ్యకి మందిపోయేది.
ముఖ్యంగా తిండి, సుఖం దూరమైనప్పుడు మరీ పెట్రేగి పోయేవాడు. అందరికి ఎండ్రిన్ పోస్తాననేవాడు. తను దీనంగా చూస్తే నీకూ తాపీ, నేనూ తాగుతాన్లెయే అనేవాడు ఏడుస్తూ.
అప్పుడు వాడి కళ్ళల్లో దుఃఖం , బాధ ఎక్కువగా కనిపించేవి. పిల్లల విషయం వస్తే క్రౌర్యం కనిపించేది.
"పెద్దోడయినా పన్లోకి పోలేదా?"
యాదయ్య మాటలతో వుహల్లోంచి బయటపడి-- "వూ మనకూ పనికి పోవాలన్నా వాళ్ళు పిల్చుకోవద్దు. పండెండు, పదమూడు ఏండ్లున్నాయని మాటే కానీ కండ ఎక్కడుంది?
బక్క పేగులోడు! అంది.
"నే తిండి పెట్టడంలేదనే గదా నువనేది?"
"అట్లానేనేమన్లేదు!"
"అట్లన్నా! బక్క పెగులోడంటే యామని? అయినా నీకు కిట్టిగాడన్నా , వాడి పిల్లలన్నా యావ చావలా! ఆడు సచ్చి నా పానానికి తెచ్చినాడు. ఆ పిల్లల మీదే నీకు ప్రేమ జాస్తి!" కసిగా అన్నాడు యాదయ్య.
"అవును! వాడి మీద ప్రేమ ఎక్కువయ్యే నీకు ఆరుగురు పిల్లల్ని కన్నాను," మాటకు మాట సమాధానం చెప్పింది నర్సమ్మ.