Previous Page Next Page 
శృంగారపురం ఒక కిలోమీటరు పేజి 22


    ద్వారం దగ్గరికి వచ్చి చూశాను.

 

    వీధిలోగానీ, ఇళ్ళ బయటగానీ ఒక్కరూ కనిపించలేదు. అందరూ తలుపులు బిడాయించుకుని లోపల వుండిపోయారు.

 

    నేనూ లోపలికి  వచ్చి తలుపు కొద్దిగా  మూసాను.

 

    ఇక  భయంలేదని సుధీర్  పక్కన కూర్చున్నాను.

 

    అవ్వ  తలుపువైపు తిరిగి పడుకోవడం వల్ల ఆమె వీపు  మాకు కనిపిస్తోంది.

 

    నేను తగులుతుండడంతో సుధీర్  ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. మనసు మరేదో కోరుకుంటున్నట్లు ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాయి.

 

    "ఏమిటీ పిచ్చి పిచ్చిగా  మాట్లాడుతున్నావ్?" అని అతని అవస్థ చూసి కిలకిలా నవ్వాను.

 

    "నీలాంటి అందమైన అమ్మాయిని పక్కన వుంచుకుని ఊరకనే వుంటే  పిచ్చి పట్టకుండా వుంటుందా?"

 

    "ఏం కావాలి?"

 

    అతను నావైపు తిరిగాడు. కళ్ళు కోరికతో ఎర్రగా చెర్రీస్ పళ్ళలా తయారయ్యాయి. శ్వాస బరువుగా వదలడంవల్ల ఛాతీ ఎగిరెగిరి పడుతోంది.

 

    "ప్లీజ్! ఒకసారి  ముద్దు పెట్టుకుంటాను" అభ్యర్థిస్తున్నట్లు అడిగాడు.

 

    సుధీర్ చాలా సెన్సిటివ్ గనుక అలా ప్రతిదానికీ పర్మిషన్ అడుగుతాడు. నిజానికి అలాంటప్పుడు ఆడపిల్లను పర్మిషన్  అడగకూడదు. మరీ అబ్జెక్షన్ చెప్పేవరకు తనపని తాను చేసుకుపోవడం ఉత్తమం.

 

    నేను మౌనంగానే వుండిపోయాను.

 

    నా ముఖం ప్రసన్నంగా వుండటంతో  మౌనం అంగీకారమణి గ్రహించి నా తలను పూర్తిగా రెండుచేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.

 

    మొత్తం నా శరీరం మధురంగా కంపించింది.

 

    గ్రహణం కనుక ఎవరూ అటు రారన్న ధైర్యంతో తలను వదిలి గట్టిగా  కౌగిలించుకున్నాడు. నాలో ఎత్తయిన భాగం అతని ఛాతీలోకి చొచ్చుకు పోతోంది.

 

    ఇంకాస్త...... ఇంకాస్త..... నాలోకి కలిసిపోవాలన్న ఆరాటంతో నన్ను హత్తుకుంటున్నాడు. ఎముకలు విరిగిపోతాయేమోననిపించింది నాకు. ఊపిరి అందడం లేదు. అంతవరకు అలాంటి సుఖమెరుగని శరీరం మత్తులో మూర్ఛనలు పోతోంది.

 

    అతని బరువుకి మెల్లగా అలా దిండుమీద వాలిపోయాను. అతను నడుం వరకు నా మీదకు ఒరిగి పెదవుల్ని నోటిలోకి తోశాడు. చిన్నప్పుడు ఎంగిలి అని మనం ఇతరులు ఇచ్చింది తినం. కానీ ఇప్పుడు అతని ఎంగిలి అమృతప్రాయంగా తోచింది. అతని వేళ్ళు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. అంతవరకు ఆ అవయవాలు అంత సుఖాన్ని ఇస్తాయని తెలియదు. ఈ సుఖం నాకు ఇవ్వడానికే అవి పెరిగాయేమోననిపించింది.

 

    అతను మరింత ముందుకు ప్రొసీడ్ కావడానికి సర్దుకుంటున్నాడు.

 

    అప్పుడు తట్టింది నాకు రానున్న ప్రమాదం. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించాను. చిన్నప్పట్నుంచీ అమ్మ, అమ్మమ్మా, సినిమాలు, టీ.వీ. పుస్తకాలూ బోధించిన పాతివ్రత్యం నన్ను వెనక్కి లాగింది.

 

    సుతారంగా అతనిని తప్పించడానికి ప్రయత్నించాను.

 

    అంతవరకు వచ్చి అర్థాంతరంగా వెనక్కి మళ్లడం కష్టంగా వుంది అతనికి. అందుకే నాకళ్ళలోకి ప్రార్థనా పూర్వకంగా చూస్తూ ప్లీజ్! కరుణించవా?' అని అడిగాడు.

 

    కరుణించడం దేనికో తెలుసు కానీ వంద భయాలు నన్ను అతని నుంచి దూరంగా లాగుతున్నాయి.

 

    "ఇప్పుడు కాదు - ఇంకెప్పుడైనా."


    
    ఆ మాటతో అతను మంత్రించినట్టు ఆగిపోయాడు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడానికి కూడా సాహసించడని తెలుసు.

 

    నేను అతని పట్టును విడిపించుకుని లేచి స్టూలు మీద కూర్చున్నాను.

 

    అతనిని డైవర్ట్ చేయడానికి ఏవేవో ప్రశ్నలు అడిగాను. అతను అన్యమనస్కంగానే సమాధానాలు చెప్పాడు. చివరికి సురక్షితంగా బయటపడ్డాను.

 

    ఇక అప్పట్నుంచి ఎప్పుడయినా మేం కలుసుకున్నప్పుడు ముద్దులు పెట్టుకున్నాక 'ఇప్పుడైనా కరుణింఛవా?' అని అడిగాడు.

 

    'ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా' అని స్టాక్  సమాధానమే చెబుతుండేదాన్ని.

 

    అతను ఫైనల్ ఇయర్ లో వుండగా  నాకు పెళ్ళిసంబంధం వచ్చింది.

 

    నా ప్రేమేకాదు, చాలామంది ప్రేమలు యిలా అర్థాంతరంగా ఆగిపోయేవి. ఏదీ పెళ్ళి వరకు వచ్చేదికాదు. దీనికి చాలా కారణాలు.

 

    మా ఊర్లో అమ్మాయిల్లో తొంభైశాతం మంది ప్రేమలోపడేవాళ్ళే, కొందరు చూపులతో పుల్ స్టాప్ పెట్టేస్తే, మరికొందరు ఉత్తరాల వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు. ఇంకొందరు సినిమాలకు పోవడం వరకు వస్తే, ఎవరో ఒకరు  మంచం వరకు వెళ్ళేవాళ్ళు. ఇక పెళ్ళివరకు వెళ్ళడమనేది చాలా  రేర్. కులాలు, ఆస్తీ - అంతస్తులు యిలా ఎన్నో అడ్డుగోడలు వుండడంతో పాటు ప్రేమించినవాడ్నే పెళ్ళి  చేసుకోవాలన్న పరిణితి రాకపోవడం కూడా ఓ కారణం. ఏదైనా  ఫ్రీగా చర్చించే స్వేచ్ఛనివ్వని తల్లి తండ్రులకు భయపడే చాలామంది అమ్మాయిలు మధ్యలోనే టాటా  చెప్పేసేవాళ్ళు.

 

    నేనూ అంతే. మానాన్న మంచివాడే కానీ ఈ  విషయంలో మాత్రం  చండశాసనుడు. నేను సుధీర్ ను చేసుకుంటానంటే ఇంట్లో ఎంత రభస జరుగుతుందో తెలుసు కాబట్టి అమ్మా వాళ్ళు తెచ్చిన సంబంధమే చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను.

 

    పెళ్ళి చూపులయ్యాయి. అందరికీ అన్నీ నచ్చాయి. గనుక ఆ రాత్రి ఇరువైపులా పెద్దలంతా కట్న కానుకల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

 

    పెళ్ళి  చేసుకునే  వాళ్ళ ముందు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్చల్లో మునిగిపోయారు.

 

    పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులూ కట్నకానుకల దగ్గర కనబరిచిన లేకిబుద్ధిని చూస్తుంటే పెళ్ళి కుదిరిందన్న సంతోషం స్థానే దిగులు ప్రారంభమైంది. నేనేదో మొసళ్ళ మడుగులోకి అడుగుపెడుతున్నట్లనిపించింది.

 

    "విస్తర్లుగా అరిటాకులే వేయాలి......" అని కండిషన్ పెట్టాడు కాబోయే మామయ్య.

 

    "పాయసం  దొన్నెలు బాగా పెద్దవి కుట్టించండి. మా బంధువులంతా  పెద్ద మహారాజులు. చిన్న దొన్నెలు పెడితే నామోషీగా వుంటుంది" అంది మా అత్తమ్మ.

 

    "పెళ్ళి అట్టహాసంగా జరిపించాలి. నా ఫ్రెండ్స్ చాలామందే వస్తారు పెళ్ళికి" అని ప్రగల్భాలు పలికాడు పెళ్ళికొడుకు.

 

    ఇలాంటి కండిషన్ లతో బాటు  ముప్ఫైవేల రొక్కం, పాతికసవర్ల బంగారానికీ బేరం సెటిలైంది.

 

    ఇక లేస్తారేమో అనుకుంటూ వుండగా పెళ్ళికొడుకు మరోమారు తన  టేస్టును తెలియజేస్తూ కోర్కెల చిట్టా విప్పాడు.

 

    "సీకో వాచీ, వైట్ డయల్, డే, డేటూ వుండాలి" అన్నాడు.

 

    "కాశీ ప్రయాణం అప్పుడు గొడుగు పెడతారు కదా. లేటెస్ మోడల్ కొరియా గొడుగైతే బావుంటుంది" అని సూచించాడు.

 Previous Page Next Page