Previous Page Next Page 
నేను పేజి 8


    "ఈ ఎదిగి ఎదగని వయసంటే.... ఇదే.... ఇదే చాలామందిలో గొప్ప సొగసులు విరజిమ్ముతూ ఉంటుంది. నీ జుట్టులో, కనుబొమ్మలలో, నవ్వే పెదాలలో, పలువరసలో ఓ ప్రత్యేకత ఉంటుంది. స్పష్టతతో కూడిన ప్రత్యేకతతో కన్నా అస్పష్టతతో కూడిన ప్రత్యేకతలో ఓ ఆకర్షణ ఉంది. నీ కళ్ళలో కాంతి.... ఆ రంగు నలుపు కాదు నీలమూ కాదు. బహుశా కెంపు నీలమై ఉంటుంది. అదొక్కటి చాలు నిన్ను లక్షమందిలో విలక్షణంగా నిలబెట్టటానికి. ఇంక నీ చిన్ని అందాలు...."


    ఉలికిపడి ఆసక్తిగా చూశాను.


    ఏదో పేరు ఉచ్చరించాడు.


    ఆశ్లీల పదం కాదు కాని ఎందుకో సిగ్గనిపించింది.


    "ఛీ అన్నాను."


    అతని ముఖం నా ముఖానికి దగ్గరగా జరిగింది.


    "ముద్దు పెట్టుకోనా?"


    మళ్ళీ ఉలిక్కిపడి ఏం చెయ్యాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయాను.


    "ఈ ఏం చేయాలో తెలీక" అన్నదే అనేక విపరీతాలకు దారితీస్తూ ఉంటుంది. ప్రపంచంలో జరిగే అనర్థాలలో చాలావరకూ పూర్తి అంగీకారంతో జరిగినవి కావు. అసలు అంగీకారానికి స్పష్టమైన రూపం లేదు.        


    ఇంకా దగ్గరకు....


    నా పెదవుల మీద అతని పెదవులానాయి. ఓ అందమైన సన్నివేశంతో జీవితాన్ని అలంకరించినట్లయింది.


    రెండు మూడు నిమిషాల వ్యవధిలో నాలో ఉన్న రకరకాల ప్రవృత్తుల వింతరూపం నాకే ఆశ్చర్యంగా సాక్షాత్కరిస్తోంది.     


    నా తొలి ముద్దు అందుకునే అపూర్వావకాశాన్ని అతనికిచ్చాను.


    ఎక్కడో.... ఇంత కన్న లోతులకు పోయిన ఓ సంఘటనని పురస్కరించుకుని, ఓ మహారచయిత రాసిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆమెను, అలా తాకుతున్నందుకు, దేవతలు కూడా స్పర్శించటానికి నోచుకోని ఆ వొంపులు, రహస్య స్థావరాలు స్పర్శించగలుగుతున్నందుకు అతనెంత అదృష్టం చేసుకున్నాడో ఇలా ఇంకేమేమో....  


    "నా పెదవుల్నాస్వాధించే అదృష్టం అంత సులభంగా అతనికెలా దక్కింది" అంత గొప్పవాడా? ఆ అర్హతలు తనకున్నాయా?


    చాలా సందర్భాలలో సంఘటనకూ అర్హతకూ సంబంధం ఉండదు.


    అంతేగాకుండా మనిషిలేని అర్హతలను ఆపాదించుకుని జీవిస్తుంటాడు. ఆధ్యాత్మికత్వంతో కొన్ని అమూల్యమైన విషయాలను బహిరంగపరస్తూ 'రహస్యం రహస్యం' అని అభివర్ణిస్తూంటారే..... అలాంటిదే ఈ పరమ రహస్యం.    


    ప్రతి చిన్న విషయాన్నీ ఇంత విశ్లేషించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే....  


    ఇది నా స్వగతం.


    కేవలం కవే కాదు. కథలో కదిలే ప్రతి సంఘటనకూ.... సారీ.... ఈ పదాన్నెక్కువగా వాడాల్సి వస్తోంది. మనకి తెలీకుండానే ఓ అమూల్యమైన విశ్లేషణ ఉంటుంది. ఉండి తీరుతుంది. అది తెలుసుకోలేకపోతే బాహ్య నేత్రానికి కేవలం చౌకబారు దృశ్యంలా, మనో హరత్వం కోల్పోయి, రూపాంతరం చెంది కన్పిస్తుంది.  


    అదలా ఉంచి....


    ఆ స్థితిలో, అతనంతకంటే చొరవ చేసి ఉంటే కాదనలేకపోయి ఉండేదాన్నేమో. "అవును" ఆ నడక ఎంత సులభం కాదో, కాదు అనడం కూడా అంత సులభం కాదు.


    కాని ఎందుకనో.... బహుశా ధైర్యం చాలి ఉండదు. అంతకన్నా ముందుకు పోలేదు.


    ఆ రాత్రి ఇంచుమించు రెండుగంటల దాకా నిద్రపట్టలేదు. మరీ వేసవికాలంలో తప్ప వంటినిండా దుప్పటి కప్పుకుని పడుకోవటం నా కలవాటు.


    ఎందుకో బరువుగా అనిపించి దుప్పటి తీసివేశాను. ఒక స్థితిలో ఒంటిన ఉన్న దుస్తులు కూడా బరువుగా అనిపించాయి. అవి కూడా తీసి విసిరి కొడదామనిపించింది. చాలా అసహనంగా అటూ ఇటూ కదుల్తున్నాను.


    నాలో ఏదో భావోద్రేకమూ, ఇంకేవో సెగలూ విరజిమ్ముతున్నాయనుకుంటే, అది పొరపాటే అవుతుంది.    


    బాధ అంతకన్నా కాదు.


    చిత్రమైన అలజడి. జవాబులేని ప్రశ్న.


    మనిషి.... పురుషుడైనా కాని, స్త్రీ అయినా కానీ తన జీవితం మీద నిర్దుష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తనకేది కావాలో అది తెలుసుకోవాలి. ఎటు గాలి వీస్తే అటు వారికి లొంగకూడదు.     


    అసలిలా ఎందుకు జరుగుతుంది? ఏదో సంఘటన సమయమొస్తే విరుచుకుపడటానికి ఎప్పుడూ ఎందుకు సిద్ధంగా ఉండాలి?       


    అసలు నేనేమిటి?


    దుస్తులు మరీ బరువుగా ఉన్నట్లు తోచాయి.


    అమ్మ రాత్రులు వేసుకోవటానికి అనువుగా కుట్టించిన డ్రెస్.


    ఊపిరాడనట్లు అనిపించి ప్రక్కమీద నుంచి లేచి, చీకట్లో తడుముకుంటూ వెళ్ళి తలుపులు వేసి గడియపెట్టాను.


    లైటు లేని అద్దం ముందు నిలబడ్డాను. పాతకాలం నాటి నిలువుటద్దమది. నాకు ఊహ వచ్చినప్పట్నించి మా ఇంట్లో ఉండటం తెలుసు. అంతకు ముందు ఎన్నో సంవత్సరాల బట్టీ మా ఇంట్లో ఉండి ఉంటుంది. మా ఇంట్లో అమ్మగా మిగిలిన వస్తువుల్లో అదొకటి.  


    మనిషి అద్దం కనిపించగానే తనరూపం చూసుకోటానికి ఉబలాటపడతాడు.


    అప్పుడద్దం ముందు కావాలని నిల్చున్నాను.


    ఇంకా పదహారేళ్ళ వయసు నిండని వయసు నాది.


    ముఖేష్ అన్న మాటలు మనసులో మెదుల్తూ నా రూపం చూసుకోటానికి ఉవ్విళ్ళూరుతున్నాను.      


    ఈ డ్రెస్ లో నా అందం మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నట్టనిపించింది.

 Previous Page Next Page