Previous Page Next Page 
నేను పేజి 9


    అంత అందగత్తెనా నేను?


    కళ్ళలో కెంపు నీలం రంగులు వెదుక్కోటానికి నా చూపులు ఆరాటపడుతున్నాయి.


    చేతులప్రయత్నంగా కదుల్తూ దుస్తులు ఒదులవుతున్నాయి.


    స్నానం చేస్తోన్నప్పుడు మురిసిపోతూ, ప్రేమగా స్పర్శించుకొనే సౌందర్యాలే.


    మిల మిల మెరిసే బుల్లి బుల్లి ఎత్తులు.


    ఇది చిత్రమైన నా భాగ్యం. ఒక్కో స్త్రీకి ఒక్కో విధంగా అమరుతుంది. లేకపోతే ఒక్కో స్త్రీ ఒకో రకంగా అలంకరించుకున్నట్లు కనులవిందు చేస్తాయి.


    బహుశా ఎదిగీ ఎదగని ఈ వయసు ప్రమాద పూరితమైనది. ఒక్కోసారి మనసు వయసు కంటే ముందు పరిగెడుతుంది. ఇంకోసారి మనసు వయసు కంటే వెనకబడుతుంది. రెండూ ప్రమాదమైనవే.            


    నా అందం, అందాలు చూసుకుంటూ ముగ్ధురాలినై చాలాసేపు నిలబడి పోయాను.


    ఆ స్థితిలోనే మిళితమైపోతూ. ఆత్మ విమర్శ కూడా చెలరేగిపోతోంది.    


    మనిషి మంచి వైపు కంటే చెడువైపు ఆకర్షితుడవుతూ ఉంటాడు. ఆ చెడు గురించి పశ్చాత్తాపపడడు. పైగా అదో వ్యక్తిత్వంలా గర్వంతో మురిసిపోతాడు. ఇతరుల కర్థంకాని గొప్పతనం తనలో ఉన్నదన్న ఆత్మవంచనకు గురవుతాడు.    


    అసలు.... ఎవరిదార్న వాళ్ళు జీవించకుండా ఎవరో ఒకరు ఏదో హక్కున్నట్లు దూసుకు రావడమేమిటి!


    ఉన్నట్లుండి కళ్ళు మూసుకున్నాను. తలెందుకో గిర్రున తిరుగుతూన్నట్లు అనిపించింది.


    ప్రేమ, సెక్స్.... వీటి కన్నా విశిష్టమైన జీవితముంది. దాన్ని పట్టుకోవాలి. చదువు, విజ్ఞానం, ఉన్నత స్థానాన్ని అధిరోహించటం.... ఈ లక్ష్యంవైపుగా పయనించాలి. అందంగా ఉన్నంతమాత్రాన, అది దుర్వినియోగం  ఎందుకు చెయ్యబడాలి?


    మూసుకున్న కనుల వెనక ఏవేవో దృశ్యాలు గోచరిస్తున్నాయి.


    ఏవేవో విలువలతో, అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్న జీవితం, రంగు రంగుల పదవులు, ర్యాంకులు, కీర్తి శిఖరాలు....   


    నో.... ఇదికాదు. ఇది కాదు. నేను తప్పటడుగు వేస్తున్నాను. గొప్ప ఊరట కలిగించినట్లనిపించింది.    


                                                                 *    *    *


    రెండు రోజుల తర్వాత ముఖేష్ కలిశాడు. ఎంత తప్పించుకుని తిరుగుతున్నా ఇంటికొస్తూన్నప్పుడు సందు మలుపులో కాపలా కాసి పట్టుకున్నాడు.


    "నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు.


    "చెప్పు"


    "ఇక్కడ కాదు. ఇంటికి వెళదాం"


    "నేను రానుగా"


    "దెబ్బ తిన్నట్లు కనిపించాడు. "ఎందుకని?"


    "రావాలనిపించటం లేదు కాబట్టి"


    "మొన్న.... మనం చాలా దగ్గరకు వచ్చాం"


    "అవును"


    "మరి.... ఆ తర్వాత నీకేమనిపించటం లేదా?"


    మాట్లాడకుండా ఊరుకున్నాను.


    "నేనైతే.... చాలా చాలా వైబ్రేషన్స్ కు గురయ్యాను. ఆ రాత్రంతా అస్సలు నిద్రపట్టలేదు. ఆ స్వీట్ కిస్.... అబ్బా! నన్ను వెంటాడి వెంటాడి వదిలి పెట్టింది."    


    నేనప్పటికి మౌనంగా ఊరుకున్నాను.


    "అసలంతటితో ఎందుకూరుకున్నానో అర్థం కావటం లేదు. ఇంట్లో ఎవరూ లేరు. బెడ్ రూమ్ వెక్కిరిస్తూ ఒట్టిగా మిగిలిపోయింది. రెండు చేతుల్తో నిన్నెత్తుకుని వెళ్ళి మంచం మీద పడవేసి ఎందుకనుభవించలేకపోయాను అని...."


    "తెగ బాధపడిపోతున్నావా?"


    "అవును"


    నాకు నవ్వొచ్చింది. చేతికందిన అవకాశాన్ని జార విడుచుకున్నప్పుడు మగాడు పడే బాధ అతని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది.


    మేమిద్దరం రోడ్డుమీద ఓ ప్రక్కగా నిలబడి మాట్లాడుకుంటూ ఉండటం అటువైపుగా నడిచి వెళ్ళేవాళ్ళు, ఆ చుట్టుప్రక్కల ఇళ్ళలోని వారూ చోద్యంగా, ఆసక్తిగా చూడటం కనిపెట్టాను.... ఇక్కడ పెద్ద వ్యవహారమో, గొప్ప వ్యభిచారమో జరిగిపోయాయన్నట్లు. పోలీసు దృష్టిలో ప్రతివారూ నేరస్థులే అయినట్లు, ఈ డర్టీ సిటిజన్స్ ప్రతి ఒక్కరినీ పతితుల్లాగానో, భ్రష్టులుగానో చూస్తుంటారు.     


    "ఒక ప్రశ్నడుగుతాను. జవాబు చెబుతావా?" అన్నాడతనే మళ్ళీ.


    తల ఊపాను.


    "ఆ రోజు నిన్ను అనుభవిస్తే ఏం చేసేదానివి? ఒద్దనే దానివా? ఒప్పుకునే దానివా?"


    "బహుశా ఒప్పుకునే దాన్నేమో. ఆ పరిస్థితిలో కాదనే శక్తి నేను కోల్పోయి ఉండేదాన్ని. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలన్నీ ఇష్టమో అయిష్టమో తెలుసుకునే లోపల జరిగిపోతూ ఉంటాయి.


    ఎంత పొరపాటు జరిగిపోయింది అన్న వేదనతో కూడిన భావన అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతోంది.


    "రేపు మధ్యాహ్నం ఇంటికి రా ఎవరూ ఉండరు"


    "రానని చెప్పాను"


    "ఎందుకని?"


    "ఒక్కో సన్నివేశానికి చాలా బలముంటుంది. అది మనుషుల్ని బలహీనుల్ని చేస్తూ ఉంటుంది. ఇప్పుడందులోంచి బయటపడ్డాను. తిరిగి ఇరుక్కోవాలన్న కోరికాలేదు. ప్రబోధమూ లేదు."   


    "కాని మనిద్దరి మధ్యా కొంత జరిగింది. దాని ప్రభావం నీ మీద ఏం లేదా?"


    "అంటే.... పెదాల మీద పెదాలు ఆన్చి గట్టిగా ముద్దు పెట్టుకోడం, కౌగిలించుకోటం, ఎక్కడెక్కడో చేతులేసి స్పర్శించటం.... వీటి గురించేనా నువ్వు చెబుతూన్నది."

 Previous Page Next Page