తలతిప్పి ప్రశ్నార్థకంగా చూశాడు సవ్యసాచి.
"మనం మీనంబాకం వెళ్ళడంలేదు" అన్నాడు శతృఘ్న.
సవ్యసాచి మొహంలో ఆశ్చర్యం కనబడింది."
"మరి?"
"ఇక్కడకు దగ్గర్లోనే ఒక చిన్న ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఇప్పుడది వాడకంలో లేదనుకుంటాను. అక్కడ దిగుతున్నాం మనం!"
* * * *
ఈ పల్లెటూళ్ళో ఎయిరోడ్రోమ్ ఉండటం ఏమిటయ్యా!" అన్నాడు రెడ్డి ఆశ్చర్యంగా మెహబూబ్ తో.
"అవున్సార్! ఇదంతా ఒకప్పుడు పెద్ద జమిందారీ సార్! రాజాగారు ఉండేవారు. ఆయన కొడుకు కుమార్రాజాగారికి షోకు లెక్కువ. ఆయన దగ్గర చిన్న విమానం కూడా ఉండేది. దానికోసం కట్టించారు చిన్న ఏరోడ్రోము. ఆయనకీ బ్రిటీషోళ్ళకి గొప్ప దోస్తీలెండి! కుమార్రాజాగారేది అడిగితే అది చేసిపెట్టేవోళ్ళు బ్రిటీషోళ్ళు! ఎర్రతేళ్ళలాంటి ఆ తెల్ల తోళ్ళు ఏం చెబితే అది తొత్తులా చేసేవాడాయన!" అన్నాడు మహబూబ్ వ్యంగ్యంగా.
"ఎయిరోడ్రోమ్ ఇంకా పాడయిపోకుండా ఉందా?"
"బిల్డింగు మాత్తరం సగం కూలిపోయింది సార్! కానీ ఇమానాలు దిగడానికి సిమెంటు రోడ్డు పోత్తారు సూడండి! అది మాత్తరం సెక్కుసెదర్లేదు సార్!" అన్నాడు మహబూబ్.
* * * *
"ఏమిటీ! ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్ మీద దీన్ని దింపాలా? యూ ఆర్ జోకింగ్" అన్నాడు సవ్యసాచి అపనమ్మకంగా, శతృఘ్నతో.
"నో! ఐయామ్ వెరీ సీరియస్!"
"అలా అయిన పక్షంలో నీకు మతిస్థిమితం తప్పి ఉండాలి. రాజాధి అయినా, మహారాజాధి రాజు అయినా సరే, ప్రైవేటు ఎయిరుస్ట్రిప్స్ బీచ్ క్రాఫ్ట్ లాంటి చిన్న చిన్న విమానాలు దిగడానికి మాత్రమే వీలుగా కడతారు. మహా అయితే, విశ్వప్రయత్నం మీద, ఫోక్కర్ ఫ్రెండ్ షిప్, వైకౌంట్ లాంటి ఓల్డు మోడల్సుని దింపగలిగి ఉండేవారేమో! కానీ ఇది, గుడ్ గాడ్, ఇది ఎయిరు బస్!" అన్నాడు సవ్యసాచి, ఎదుటిమనిషి మూర్ఖత్వాన్ని అంచనా వెయ్యలేని ఆశ్చర్యం వినబడుతోంది అతని గొంతులో.
"మిస్టర్ సవ్యసాచీ!" అన్నాడు శతృఘ్న కూల్ గా. "అది నీ ఏడుపు! విమానం అక్కడ దిగి తీరాల్సిందే! ఎలా దింపుతావో నీ ఇష్టం!"
అతని రివాల్వర్ బారెల్ సవ్యసాచి మెడని చల్లగా తాకుతోంది.
కష్టంమీద గుటకమింగాడు సవ్యసాచి, "సరే! నీ ఇష్టం!" అన్నాడు మెల్లిగా.
వడివడిగా ఆలోచిస్తోంది సవ్యసాచి మనసు. ఇతనెవరో పరమ మూర్ఖుడని అర్థమవుతూనే ఉంది. ఇతనికి ఇప్పుడు ఎదురు తిరిగి తుపాకిగుళ్ళకి బలైపోవడం తెలివైన పనికాదు. అలా చేస్తే తనూ అతనిలాంటి మూర్ఖుడే అవుతాడు.
పైగా, తనతోపాటు పాసెంజర్సు అందరూ కూడా నిశ్చయంగా చనిపోతారు.
ఒకవేళ-విమానాన్ని కిందకు దింపితే?
చాలా రిస్కు ఉంది అందులో!
కానీ ఆ రిస్కులోనే ఛాన్సు కూడా ఉంది. ఏమో తను సర్కసు ఫీటు చేసినట్లు విమానాన్ని భద్రంగా దింపగలడేమో!
అలా చెయ్యలేని పక్షంలో తనతోబాటు అందరూ ముక్కలు ముక్కలై, మాడి మసైపోతారు.
విమానం దిశ మార్చాడు సవ్యసాచి.
కొద్దిసేపటి తర్వాత వేగంగా ఆ ఎయిరుస్ట్రిప్ ని సమీపించింది విమానం. పైన చక్కర్లు కొట్టడం మొదలెట్టింది.
ఆ చిన్న ఎయిరుస్ట్రిప్ మీద దిగాలి ఇప్పుడు!
ఇంత పెద్ద విమానాన్ని మూడు నాలుగు కిలోమీటర్లు పొడుగు ఉన్న రన్ వేమీద కూడా దింపడం ఎప్పటికప్పుడు ఛాలెంజ్ గానే ఉంటుంది.
అలాంటిది....
సవ్యసాచికి తన ఎయిర్ ఫోర్సు రోజులు గుర్తొచ్చాయి. కమర్షియల్ పైలట్ గా చేరకముందు అతను చాలా సంవత్సరాలు ఎయిర్ ఫోర్సులో ఉన్నాడు. పాకిస్తాన్ యుద్ధంలో జెట్ బాంబర్సులో శత్రుస్థావరాల మీదకి ఎన్నో సార్టీస్ వెళ్ళాడు. శత్రువిమానాలను 'డాగ్ ఫైట్స్'లో తరుముతూ వెళ్ళి ధ్వంసం చేశాడు.
ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవాలలో స్టంట్ పైలటింగ్ చేశాడు కూడా.
ఆ ఎక్స్ పీరియన్స్ ఇప్పుడు పనికి వస్తుందా?
అతని అరచేతుల్లో చెమట పోసింది.
సాహసం చేస్తున్నాడు తను!
అనుకోకుండా ప్రమాదంలో పడి, వళ్ళు తెలియని ఆవేశంలో దాన్ని ఎదుర్కోవడం కాదు ఇది! కోల్డ్ బ్లడెడ్ గా, ప్రమాదంలోకి దిగుతున్నాడు!
విమానం ఆ ప్రాంతం మీదే చక్కర్లు కొడుతోంది.
అంత ఎత్తులో నుంచి ఆ ఎయిర్ స్ట్రిప్ కత్తిరించి పడేసిన చిన్న రిబ్బను ముక్కలా కనబడుతోంది?
అతను కిందికి దృష్టి సారించాడు.
వెంటనే అతనికి ఆశ్చర్యం కలిగించే దృశ్యం కనబడింది.

ఎయిర్ స్ట్రిప్ చిన్నదిగా కనబడుతోంది కానీ, దానికి ఎక్స్ టెన్షన్ లా, తారు రోడ్డు ఒకటి కనబడుతోంది.ఎయిర్ స్ట్రిప్ చిన్నదిగా కనబడుతోంది కానీ, దానికి ఎక్స్ టెన్షన్ లా, తారు రోడ్డు ఒకటి కనబడుతోంది.