శ్రీకృష్ణుడు, ధర్మరాజు వచ్చి ఉభయులను శాంతపరిచినారు.
రెండవ అధ్యాయమునందు 42, 43, 44 శ్లోకములలో వేదమును నిరసించాడు. ఇక్కడ వేదమును అనుసరించమంటాడు. దేనికైనా సమయ సందర్భాలే కారణం.
విశేషములు చాలా వున్నవి. కొన్నింటినే తెలుసుకొన్నాము.
1. ధర్మరాజునకు భీష్ముడు తన మరణోపాయము తెలియపరచలేదు. ఇధీ రక్తసంబంధము. పాండవులే గెలువవలెనని ఆయన ఆకాంక్ష అయినను, కౌరవపక్షమున యుద్దము చేయుట అతని కర్తవ్యము. అతడు లక్ష్యముకన్న కర్తవ్యమునకు ప్రాధాన్యము నిచ్చినాడు.
2. ద్రోణుడు ఆచార్యుడు తాను మరణించుట గురించి చెప్పినాడు. పాండవ జయమునే కోరినాడు. ఐనను, పాండవ సైన్యమును ఊచకోత కోసినాడు. అది సందర్భము ద్రోణుడు చావకున్న పాండవసేన వినాశమగునట్లున్నది. కృష్ణుని సలహా ప్రకారము ధర్మరాజు అబద్దమాడినాడు. ఇది ధర్మమే అన్నాడు.
3. మహాత్ముడు అహింసా వాది! 1942 సం|| క్విట్ ఇండియా సమరములో 'కరో యమరో' అన్నాడు. ఇది హింస. సందర్భము అట్టిది. గాంధీని తప్పుబట్టజాలము. ఇదీ అంతే!
న మే పార్దాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నా నవాస్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి 22
అర్జునా! యీ ముల్లోకములందు, నాకు కర్తవ్యము లేదు. నాకు కావలసినది లభించుచున్నది. ఐనను నేను కర్మలను ఆచరించుచున్నాను.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః
మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్ధ! సర్వశః 23
సర్వదా నేను సావధానుడను. కర్మలను ఆచరించుచుందును నేను అట్లు చేయకున్న మహా హాని సంభవించును. జానూలందరు నన్నే ఆదర్శముగా తీసుకొందురు. కర్మలను ఆచరించరు.
ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మచేదహమ్
సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యా మిమాః ప్రజా 24
నేను కర్మలను ఆచరించనిచో లోకమున కల్లోలము చెలరేగును. ప్రాణనష్టము జరుగును. నేనే బాధ్యత వహించవలసి వచ్చును.
సక్తాః కర్మణ్య విద్వంసః యథా కుర్వన్తి భారత!
కుర్యాద్విద్వాం స్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహమ్ 25
అజ్ఞులు కర్మలను ఆచరింతురు. అట్లే విద్వాంసులు లోకహితార్ధము కర్మలను ఆచరించవలసి యున్నది.
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్ 26
భగవానుడు నిరంతరము కర్మ చేయించుట యందు శ్రద్ద కలిగియుండును అట్లే విద్వాంసులు ప్రజలకు కర్మయోగమగు సాధుమార్గమును ఉపదేశించవలసియున్నది.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః
అహంకార విమూఢాత్మా కర్తాహ మితి మన్యతే 27
కర్మలన్నియు ప్రకృతి గుణముల ద్వారానే జరుగుచున్నవి. అయినను మూర్ఖుడు తనను కర్తగా చెప్పుకొనుచున్నాడు.
దీపిక:
వేదమున యజ్ఞము నిర్వహించువానిని కర్త లేక యజమాని అనుచున్నారు.
తత్త్వవిత్తు మహాబాహో! గుణకర్మ విభాగయోః
గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే 28
అర్జునా! గుణమును, కర్మను తెలుసుకొన్న యోగి గుణములే గుణమునందు ప్రవర్తించునని భావించును. అందువల్ల ఆసక్తుడు కాడు.
ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మను
తానకృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ 29
ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితుడైనవాడు వుంటాడు. అతడు గుణముల యందు కర్మలయందు ఎక్కువ ఆసక్తి చూపుతాడు. అతడు అటువంటి వారికి విద్వాంసుడైనవాడు. ఊగిసలాటకు గురిచేయరాదు.
మయి సారవాని కర్మాణి సన్న్యస్సాధ్యాత్మ చేతసా
నిరాశీ ర్నిర్నమో భూత్వాయుధ్యస్వ విగతజ్వర 30
కర్మములన్నియు నాకే సమర్పించుము. ఆధ్యాత్మచేతసుడవగుము. మనస్సన్యాసి వగుము. నిర్వాసిని నిర్మమోభూతుడవు అయి జ్వరమును విడచి యుద్దము చేయుము.
యే మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః
శ్రద్దావంతో -నసూయంతః ముచ్యంతే తే -పి కరభిః 31
ఎవడు యీ పద్దతిని ఆచరించునో, నిత్యము అనుష్టించునో, శ్రద్దావంతుడు, అసూయలేని భావము గలవాడు అగుచున్నాడో అట్టివాడు కర్మలనుంచి విముక్తుడు అగుచున్నాడు.
యే త్వేత దభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతనః 32
ఎవడు నాయందు దోషారోపణ చేయునో, ఎవడు నా సిద్దాంతమును అనుసరించడో వాడు అజ్ఞానియై మోహితుడై, భ్రష్టుడై నష్ట కష్టముల పాలయ్యెదరని ఎరుంగుము.
సదృశం చేష్టతే స్వాస్యాః ప్రకృతేః జ్ఞానవానపి
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి 33
సమస్త ప్రాణులు సహజ గుణముల ననుసరించియే కర్మలు చేయుచుందురు. అట్లయిన ఎవ్వడైనను, పట్టుబట్టి కర్మలను చేయించగలరా?
ఇంద్రియస్యేంద్రియస్వార్దే రాగద్వేషౌ వ్యవస్థితౌ
తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ 34
ప్రతి ఇంద్రియములోను రాగద్వేషములు దాగి యున్నవి. మానవుడు వాటి వశము కాగూడదు. అది అతని శ్రేయస్సుకు భంగము కలిగించుచున్నది. వాటిని మహాశక్తులుగా తెలియునది.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్టితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః 35
పరధర్మములకంటే గుణహీనములైనను, స్వధర్మమునే ఆచరించవలెను. స్వధర్మము నందు మరణమే శ్రేయము. పరధర్మము భయంకరమైనది.
దీపిక:
1. స్వామి అవతారమున ఉన్నాడు. అట్టి స్వామి మనవ రూపమున మనవధర్మమునే అనుసరించవలసి యున్నది. అందువలననే స్వామి కర్మలు చేయవలసినదని ప్రవచించినాడు. తాను కర్మలు చేయకున్నా లోకము గూడా కర్మలు చేయదు అట్లగుటవలన లోకము వినాశనమగును.
2. మనిషికి సహజాత గుణములు వుండును. అట్టి గుణములను సాధారణుడు అధిగమించజాలడు.
3. ఒక రామాయణ వృత్తాంతము: సుందరకాండ. రావణుడు సీత దగ్గరకు వచ్చినాడు. అతనిని వరించమని కోరినాడు.
సీత: "మేము దంపతులము, అనన్యులము కాన నీవు యీ విషయము తెలిసికొని ప్రవర్తించుట మేలు. మా యిద్దరి సంబంధములు సూర్యుని వెలుగు వంటివి.
నిన్ను నీవుగా ఉదాహరణ తీసుకొనుము. నీ భార్యలతో రమింపుము" అన్నది సీత అమ్మవారు. రావణుడు మహాకోపమున మండోదరి వద్దకు చేరినాడు.
మండోదరి బహు ఉపచారముల వలన అతనిని శాంతింపచేసినది. అడిగినది. ఒక పరాయి స్త్రీని అపహరించి తెచ్చుట దోషమని తెలియదా? 'తెలియదు'. రావణుని జవాబు.
మండోదరి : రాముడు మహా బల పరాక్రముడని తెలియదా?
రావణుడు : తెలియును
మండోదరి : లంక నాశనమగునని తెలియదా?
రావణుడు : తెలియును
మండోదరి : రాక్షస జాతి వినాశనమగునని తెలియదా?
రావణుడు : తెలియును
మండోదరి : అయిన ఇట్లు ఎట్లు ప్రవర్తింతువు?
రావణుడు : "ఏషయే సహజో దోషహ, స్వభావో దృఢతిక్రమః
ఇది నా పుర్రెకుపుట్టిన దోషము, స్వభావమును అతిక్రమించుట అసాధ్యము. కాబట్టి యీ సహజాతము మంచి కావచ్చును, చెడు కావచ్చును. ఇది మనిషిని బట్టి యుండును. సంస్కారమును బట్టి వుండును.
స్వామి ప్రకృతి అనే పదమును వాడినాడు.
4. స్వధర్మము : అనగా మతము, కులము, సిద్దాంతములు కావు. అతడు చేయుచున్న పని. 'ఒక'డు ఒక పనిలో నిష్ణాతుడు అగును. ఆ పనిని వదలుట చచ్చుటయగును. వేరే పనికి పోవుట భయంకరము అగుచున్నది.
ఒక ఇంజనీరును, డాక్టరుగా వర్తించమన్న, ఒక మంగలిని చాకలిగా వర్తించమన్న భయపడుదురు. కావున అసౌకర్యమైనను తన ధర్మమునే నిర్వహించమనుచున్నాడు స్వామి. "స్వధర్మే నిధనం శ్రేయః" స్వధర్మమందు చావు గూడా మంచిదియే అనుచున్నాడు.
అర్జున ఉవాచః
అథ కేన ప్రయుక్తో -యం పాపం చరతి పూరుషః
అవిచ్చన్నపి వార్ ష్ణేయఁ బలాదివ నియోజితః 36
కృష్ణా! ఒకడు అనుకోకున్నను, పాపములు చేయుచున్నాడు. దీనికి అతడు ఎందుకు పాల్పడుచున్నాడు?
భగవానువాచః
కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్ 37
రజోగుణమునుండి కామక్రోధములు కలుగుచున్నవి. ఇది మహాశన భోగానుభవముతో తగ్గునది కాదు. అంతులేని పాపకర్మలకు ఇదియే కారణము. దీనిని పరమ పాపముగా గుర్తింపుము.
ధూమేనా - వ్రియతే వహ్నిః యథా -దర్శోమలేన చ
యథోల్భే నావృతో గర్భః తథా తేనేద మావృతమ్ 38