Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 35


                                             ఆడమళయాళం

తెల్లవారు ఝామునే లేచారు ముగ్గురూ. మొహాలు కడిగి, ఇన్ స్టెంట్ కాఫీతాగి, స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ నడక మొదలెట్టారు.
భూతాలరాజు ముందు దారితీస్తూ ఉంటే, వెనకగా అనుసరిస్తున్నారు సందీప్, స్వప్నా. భూతాలరాజు నీడకూడా తన మీద పడకుండా జాగ్రత్తపడుతూ, సందీప్ ని ఆనుకుని నడుస్తోంది స్వప్న.
"చాలా చలిగా ఉంది" అంది తను వణుకుతూ. పొగలాగా వ్యాపించి ఉంది మంచు. ఒక పువ్వుమీద నుంచీ మంచు కరిగి ముత్యంలా స్వప్న ముక్కు మీదకు జారింది.
ఒక్కక్షణం సేపు స్వప్న ముక్కుమీద ముక్కు పుడకలా మెరిసింది అది. మరుక్షణంలో ఇంకా కిందికిజారి, ఆమె ఎత్తు గుండెల మధ్య ఉన్న లోతైన లోయలో పడి, ఆ వెచ్చదనానికి ఆవిరైపోయింది.
'ఎంత అదృష్టం ఈ నీటి చుక్కది ? కొద్ది క్షణాలసేపే ఉండినా, సార్థకమయి పోయింది దాని ఉనికి!' అనిపించింది సందీప్ కి.
అతని ఊహలని చదివేస్తున్నట్లు చిరుకోపంగా నును సిగ్గుగా చూసింది స్వప్న. రొమాంటిక్ గా ఉంది వాతావరణం. ఎక్కడో ఒక చిన్న పిట్ట శ్రావ్యంగా కూస్తోంది.
"ఏం పిట్ట అది ?" అంది స్వప్న.
చెవులు రిక్కించి విన్నాడు సందీప్, విడవకుండా, ఆగి ఆగి కూస్తోంది ఆ పిట్ట.
నుదురు చిట్లించాడు.
"కుక్ ... కూకూ ... కూకూ ... కూకూ ... కుక్!"
మెర్సుకోడ్ లో సంకేతాలు పంపుతున్నట్లు అనిపిస్తోంది ఆ కూత వింటుంటే.
ఎంతో అలర్టుగా ఉంటేగానీ, ఆ పిట్ట కూత అసహజంగా ఉందని గ్రహించలేరు ఎవ్వరూ.
స్వప్ననీ, భూతాలరాజునీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు సందీప్.
కొంతసేపటి తర్వాత, చాలా దూరం నుంచీ మరో కూత వినబడింది - సమాధానంలా.
చటుక్కున తలఎత్తి చెట్లకొమ్మల వైపు చూశాడు సందీప్.
అప్పటికే ఆలస్యం అయిపోయింది. సాలెగూడులా ఉన్న వల ఒకటి వేగంగా వాళ్ళమీదకు దిగుతోంది. తప్పించుకునే సావకాశం కూడా లేదు.
ముగ్గురూ వలలో చిక్కుకున్నారు. వల పైకి లేచి, భూమికి ఆరడుగుల ఎత్తులో వేలాడుతూ ఆగింది.
స్వప్న మృదువైన జుట్టు, నల్లటి పట్టుతెరలా సందీప్ కళ్ళకి అడ్డం పడుతోంది. దాన్ని తొలగించి చూశాడు సందీప్.
ఎదురుగా నిలబడి ఉంది ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి. ఆరోగ్యంతో, యవ్వనంతో మిసమిసలాడి పోతోంది. నగ్నంగా ఉంది వక్షం. నడుముకి పూలతో అల్లిన స్కర్టు లాంటిది వేసుకుంది. మెడలో కూడా పూలదండలు.
ఆమె వెనుకగా మరో పదిమంది అమ్మాయిలు నిలబడి ఉన్నారు.అందరికీ పదమూడు నుంచీ పాతికేళ్ళ మధ్య వయసే!
వాళ్ళందరి చెంపమీదా ఒక కీటకం బొమ్మ పచ్చబొట్టు పొడిచివుంది.
దాని పేరు 'అడల్ట్ మే ఫ్లై' అని తెలుసు సందీప్ కి. చిత్రమైన కీటకం అది. దానికి నోరూ, కడుపూ ఉండవు. ఒకే ఒక్క రోజు బతుకుతుంది అది. ఆ ఒక్క రోజు డాన్సూ, శృంగారమే దాని జీవితం. జీవితకాలం అత్యల్పం కాబట్టి దానికి కడుపు ఉండదు. అందుకని నోరుకూడా వుండదు.
కేవలం శృంగారానికి కావలసిన అవయవాలు మాత్రం డెవెలప్ అయిఉంటాయి.
ఆ కీటకం బొమ్మ వీళ్ళందరి చెంపలమీదా ఎందుకుంది ?
చూస్తూ ఉండగానే మరొక వందమంది అమ్మాయిలు అక్కడికి చేరుకున్నారు. అందరిలోనూ మూడు లక్షణాలు మాత్రం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. యవ్వనం, ఆరోగ్యం, పొడుగు.

 Previous Page Next Page