వెచ్చదనం తెచ్చిన మచ్చ
"ఉహ్హని హోమాగ్ని వూదమంటారు నాన్నారు! మనకెక్కడ తీరిక! విరహంతో జ్వరతాపంతో వుస్సురనగలం కాని! ప్రొద్దున్నేలేచి సంధ్యా వందనం చెయ్యమంటుంది అమ్మ! అంత పొద్దున్నే నిద్దరెలా లేస్తాను... బాగా ప్రొద్దు పోయేదాకా వెలివాడల్లో విటవాదాలు తీర్చివచ్చి పడుకుంటానా వెర్రివాళ్ళు వేదాంత చర్చలకు రమ్మంటారు! తీర్ధం పుచ్చుకోరా అంటుంది అమ్మ! వారవనితా జనతా మానస సూనసాయకుడ్ని అధరామృతంలోని ఆనందం.... హాయి తీర్ధంలో ఎక్కడుంది. శంఖు చక్రాంకితాలో--- మరేవో వేసుకోమంటారు నాన్న.... వెలియాలి గోరుగిచ్చులతో (నఖక్షతాలు!) పవిత్రం అయిన శరీరానికి ఈ వైష్ణవ చిహ్నాలెందుకో--- వెర్రివాళ్ళు--- వెర్రి చేష్టలు---
మా తాత ముత్తాబు ఎంతో కూడపెట్టారు. దాన్ని మనం జల్సాగా ఖర్చు చేస్తున్నాం! అయినా నాకు పంటదిగులు ఇంటి దిగులు ఎందుకు? మా నాన్న గారున్నారు అన్నీ చూస్తారు. మనకేం గొడవ!మనమంటే అందరికీ గౌరవం! మంచివాడని మంచి నడత గలవాడని త్యాగశీలుడనీ---అంతేనా - మనం నోరెత్తి మాటాడ్తూవుంటే అంతా చెవులు రిక్క పొడుచుకుని వింటారు. అదంతా మా నాన్న సభాపతిగారి చలవేలెండి!
మా కళింగ సీమలో పిఠాపురం సీమాభరణం. అది ఘనతకూ, మాన్యతకూ వన్నె తెచ్చింది! పులు కడిగిన ముత్యంలా తెల్లని అంగీ ధోవతి పై పంచె సింగారించి నేను రాచబాటలో నడుస్తూ వుంటే సఖులు పరిహాసకులు ఎప్పుడూ వెంటే వుంటారు.
మా అమ్మా నాన్నా ఎప్పుడో చిన్నప్పుడే నా పెళ్ళి జరిపించారు. అయినా నాకు మా ఆవిడ ముఖం చవితి చందురుడే! విదియ నాటి చంద్రుడిలా వేశ్యాలలామ ఉండగా ఆవిడెందుకు మరి! అయినా ఈ వెల యాళ్ళున్నారే-అమ్మ బాబోయ్ వాళ్ళెంత అందగత్తెలో వాళ్ళ తల్లులు (వేశ్యమాతలు) అంత జగజంతలు! దిన వెచ్చమని నా ఒంటి మీదున్న సొమ్ములు తీసేసుకున్నారు. మా అమ్మ ఆభరణాలు లాగించారు. మా నాన్నగారు కుదువ పెట్టుకున్న పత్రాలు తీసికెళ్ళి ఎంతకో కొంతకు అమ్మి తెమ్మన్నారు. అంతేనా! మిండవడ్డికి అప్పు చేయించారు.
అలా మనం ఓ వెలుగు వెలిగాం!
వెలుగు తగ్గి - కూటికి గుడ్డకు వీళ్ళనూ వాళ్ళనూ అడుగుతూ వుంటే పూలమ్మిన చోట కట్టెలమ్ముతున్నాడ్రాఅని కలకల నవ్వారు.
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు!
ఎక్కడ ఖాళి అయినా ఇల్లు ఖాళి కాదుగా! ఎంత పొమ్మన్నా ఇల్లూ ఇల్లాలు పొమ్మనరుగా! అందుకే కొంపకు చుక్క తెగిపడిన రీతిన చేరేసరికి అక్కడికి అప్పటికే మా అక్క వొచ్చింది. మా అక్కకు నేనంటే యెంత ప్రేమ! సీమంతపు పెండ్లి కొడుకువు కమ్మని హేతు గర్భితంగా ఆశీర్వదించింది. ఆమె కను సైగతో మా ఆవిడ "ణా శ్రీపాద ద్వయము కడిగి" ఆహ్వానించింది. ఆ మీదట నేను మా బావగారు మానాన్న అందరం కలసి భుజించం.
ఆ మీదట మా అక్కగారు 'పద్మ కర్ణిక కొలువున్న పద్మవోలే'కూర్చుండి బిడ్డకు చను గడుపుతూ నన్ను రమ్మని నా సిగ విడదీసి దువ్వుతూ, నన్నూ దువ్వుతూ అంది.
"వేదా పాఠానికి భంగం అవుతుందని మావూరు రాలేదా? నిన్ను చూడాలని "చక్షూ రాజీవ యుగం" వాచిపోయింది. మీ బావ కూడా చంద్రు పోడుపునకు చకోరుంలా వేచివున్నాడు - అయినా సాలగ్రామ ఖనిన్ జనించునె కదా జాత్యల్ప పశాముల్ అన్నట్లు నువ్వు చేసేవేం బావోలేవు రా బాబూ!" అంది.
అలా అలా ముక్కు చీవాట్లు పెట్టింది.
వీరావేశము దాల్చి సర్వధనమున్ వేచ్చింటు కీకేమి?ము
క్కారుంబందు నాఖండ సేతు వ్రుతముల్ కాశ్మీర ఖండంపుకే
దారంబుల్ తెగ నమ్మ చనునే నిర్దారున్డవే? వెన్ననె
వార్పున్ లేరె సహోదరాదులు కుల్వధ్వసంబు నీ కర్హమే!-
అంది అంతటితో ఆగకుండా కావాలంటే - కామ వికార మాత్మనవగాదట దాల్చిన ఏని - విప్ర కన్యామణులన్ సహస్ర యయినన్ వారించరాదే!" అంది వెర్రిది శృంగారానికి ఇల్లాలా చెల్లుతుంది! అదంతా వేశ్యలకే చెల్లు!
అయినా అక్కగారి ముందు నోరెత్తలేకా మళ్ళి మామూలుగా రాజాలయానికి రాకపోకలు చేస్తూ - కుల వధూరత్నాన్ని గుస్తారిస్తూ - మా నాన్న ఉద్గామనీయం నేనే ఉదుకుతూ అంగడికి వెళ్ళి గ్రామ కార్యం తీరుస్తూ గడిపాను. అదంతా జనం నిజం అనుకున్నారు.
ఓ రాత్రి ఇంట్లో వున్నదంతా పూడ్చి-పడు పడుకకు కూడా చెప్పక గాధాతర తమోయంలో ఇల్లు విదిచాను. నే వెళ్ళాక. వారెంత ఎడ్చాడో నాకెందుకు అయితే ఇంట కష్టపాడి దోచిన దాన్ని దారి దోపిడీ గాళ్ళు దోచుకుని నన్ను చావగొట్టి వెళ్లారు.
అప్పుకు ఓ కాపు కొడుకు నన్ను చూసి ఇంటికి తెచ్చి చికిత్స చేయించి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంట్లో అడ్డం లేకుండా తిరగానిచ్చాడు.
వాడి భార్య వుందే అది! అదేంట అందగాత్తో! నేనంటే ఎంత ప్రాణమో అందుకే తేరకు తేర దక్కె నితులీ బంగారు కుందని చంకలు కొడ్తూ- ఓ రాత్రి దాని మగడు నిద్రపోతున్న వేళ ఇంట్లోంచి నాతొ వచ్చింది- కాపు కోడలు తన కంచంత కాపురాన్ని పాలవంటి కులాన్ని పాడు చేసింది.
నాతొ కొన్నాళ్ళు సంసారం చేసింది. ఆ మీద పరలోకం ప్రాప్తించింది.
వ్యాపారంబున - ఒండు వాద రూపా జీవ రాజాననన్ తాపింఛచ్ఛద గుచ్ఛ సచ్ఛవి మదాంధన్ - బంభర శ్రోణి, వీణా పాణిందాపు వాణి నొక్కప్లవ కన్యన్ కూడి క్రీడింపగా-
ఆ కళత్రం వల్ల పుత్రా లాభం కలిగింది. సంసారం ఈదడానికి ఓ రోజు నేను ఇల్లు విడిచి వెళ్ళినపుడు "అగ్ని ప్రమాదా"నికి లోనై ణా భార్య, పిల్లలు, ఇల్లు అన్నీ భస్మమై పోయాయి.
అప్పుడు నా బాధ ఏం చప్పమంటారు. మీరే చెప్పండి?
ఎల్లరు ఏళ్ళ చోధనము లిచ్చి మృగాక్షుల కొంద్రు కాని యో
పల్లవ పాణీ! ఏ పరమ పావన వంశము ఇచ్చి కొంటి నీ
నల్లని రూపు నిక్కమణి నమ్మి! ధ్రువంబదికాక నేడు వి
ద్యుల్లతి కాధికాభినయ ధూర్వహమౌట ఎరంగ నింతయున్.
కాదంటారా? డబ్బిస్తారు - ఇల్లిస్తారు - పొలం - నగలు ఇస్తారు. కానీ నేనో - ణా పరమ పావన వంశం ఇచ్చాను.
ఎందుకని?? దీని నల్లని రూపు నిక్కమని నమ్మడంవల్ల? కానీ అది ఈరోజు మెరుపు తీగలా మెరిసీ విరిసి మాయమై పోయింది! అదేంట బాధ కాదు? అంతేనా? చూసే వాళ్ళంతా-
ఈ కడ జాతి నాటి కిహిహీ మహిదేవుడు చిక్కెనంచునన్
రాకకు పోకకున్ జన పరంపర కేమ్పగు చూడ్కి చూచి అం
బూకృత మాచారించుటకు బుద్ధి తలంక-కలంక ముక్తచం.
ద్రాకృతి బొల్చు నీ ముఖము నంద మృత స్థితి గాంచి మించుటన్-
అలా ఎంత వగస్తే నేం!పోయినా వాళ్ళు తిరిగి రారు కదా! ఆ బాధతో వ్యధ గడిచి వూరూరూ తిరుగుతూ విష్ణువు దశావతారాలెత్తినట్లు అన్ని బాధలుపడ్డాను ఆ మీద పస్తులతో ప్రాణం విదిచాను.
అప్పుడు యమ దూతలు వచ్చారు. విష్ణుదూతలు వచ్చివాళ్ళ నుండి నన్ను రక్షించారు.
స్వర్గానికి తీసికెళ్ళారు. ఇంతకూ నేనెవరంటారా? నిగను శర్మను - ణా కధ ఇంకా విపులంగా కావాలంటే పాండురంగ మహాత్మ్యం అని తెనాలి రామకృష్ణ కవి రాసిన పుస్తకంలో మూడో ఆశ్వాసంలో చూడండి!
అయిపోయింది
----*---