Previous Page Next Page 
జైలు పేజి 33


    నిద్రపోతున్న సత్యభామ ఉలిక్కిపడి లేచి తలుపు తెరిచింది.

 

    ఇంటి చూరుకింద నిలబడ్డాను నేను.

 

    "ఈరోజు రావనుకున్నాను. వెళ్ళిన పని అయిందా? లాస్ట్ బస్ కు వచ్చావా?" అంది కళ్ళు నులుముకుంటూ.

 

    నా ఉపాయం ఫలించింది నన్ను చూసి నన్నే వచ్చాడనీ ఆమె అనుకోవాలనే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. మా నాన్నలాగే మధ్య పాపిటి తీసుకున్నాను. ఆయన చొక్కా పంచె తొడుక్కున్నాను. ఆయన ఎప్పుడు మెడకు చుట్టుకున్నట్టే దుబ్బు దువ్వాలను మెడకు చుట్టుకున్నాను.

 

    ఆమె లోపలికి అడుగుపెట్టింది.

 

    ఓమూల బాగా తగ్గించివున్న దీపం వెలుగు చుక్కలా వుంది.

 

    అటు వెళ్ళినట్టు వెళ్ళి సత్యభామ చూడకుండా తువ్వాలుతో ఆర్పేశాను.

 

    "ఏం ఒక రాత్రి కూడా నేను లేకుండా ఉండలేవా? రెక్కలు కట్టుకుని వచ్చేశావ్" ఆమె అద్భుతంగా నవ్వుతూ అంది.

 

    నేను ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిని పట్టుకుని నామీదకు గుంజాను.

 

    "రోజు రోజుకి కుర్రాడయిపోతున్నావ్. నీ దూకుడు చూస్తుంటే నీకు వయసొచ్చిన కొడుకు వున్నాడంటే నమ్మబుద్ధి కాదు" అని మళ్ళీ నవ్వింది.

 

    నేను ఆమె జాకెట్ మధ్యలో చేయివేసి లాగాను. హుక్స్ తెగిపోయిన చప్పుడు. మసక వెలుతురులో ఆమె స్తనాలు సెక్స్ సముద్రపు ఒడ్డున వుండే లైట్ హౌసుల్లా అనిపించాయి.

 

    ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.

 

    మరో పావుగంటకు చల్లబడ్డాను.

 

    ఇక వెళ్ళడానికి తలుపు తీశాను.

 

    ఎదురుగ్గా మా నాన్న.

 

    నైఫ్ చెప్పడం ఆపాడు.

 

    ఆ తరువాత ఏమైందని వింటున్న ముగ్గురూ అడగలేదు. అతనూ చెప్పలేదు. వాళ్ళంతా అదో విధమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. సెక్స్ కోరిక ప్రతినరాన్ని ఉబ్బిస్తోంది. రక్తాన్ని చిలుకుతోంది. ఎర్రగా రక్తాన్ని పీల్చుకుని పూచిన పుల్లల్లా అయిపోయాయి.

 

    నైఫ్ నెమ్మదిగా లేచాడు. అతని కళ్ళముందు సత్యభామ నగ్నస్వరూపం పరుచుకుంది. నరాల రాపిడిలోంచి పుట్టిన అగ్ని రక్తాన్ని మరిగిస్తోంది.

 

    ఇన్ని రోజులూ తనను వూరించి, ఉడికించిన ఉత్తరుడివేపు నడిచాడు.

 

    నీతిపురుగు కదలడంవల్ల నీళ్ళల్లో ఏర్పడే గీతల్లాగా శరీరంమీద ఏదో పాకుతున్నట్టనిపించి మెలకువ వచ్చింది ఉత్తరుడికి.

 

    చుట్టూ చీకటి ఏమీ కనిపించడంలేదు.

 

    కళ్ళు చిలకరించాడు.

 

    ఇప్పుడు అస్పష్టంగా కనిపిస్తోంది.

 

    తనకింద రెండు మూడు ఆకారాలు కదులుతున్నట్టు తోచింది.

 

    మళ్ళీ శరీరం మీద ఎవరో రాస్తున్నట్టు భావన.

 

    నగ్నంగా వున్న నైఫ్ తనమీదకు వస్తున్నట్టు పసికట్టాడు.

 

    తనను చుట్టేస్తున్న ప్రమాదం ఏమిటో తెలిసింది.

 

    గట్టిగా అరవబోయాడు.

 

    అప్పటికే ఆలస్యమైపోయింది. రెండు బలమైన చేతులు అతని నోటిని మూశాయి.

 

    తల తెగిన మేకలా గింజుకున్నాడు.

 

    మరికొంతసేపటికి అతను బోర్లా పడుకున్నాడు. మొత్తం ఆరుచేతులు అతనిని కదలకుండా పట్టుకున్నాయి.

 

    ఎవరు ఏం చేస్తున్నారో అతనికి తెలియడం లేదు. తెలుస్తున్నదల్లా ఒక్కటే - అందరూ కలిసి నన్ను రేప్ చేస్తున్నారని.

 

                                *    *    *    *

 

    ఎక్కిళ్ళు కలిసిపోయిన ఏడుపు వినపడడంతో మెలకువచ్చింది తిలక్ కి. మెల్లగా కళ్ళు విప్పాడు.

 

    బ్యారెక్కంతా నిద్రపోతోంది. గచ్చకాయ రంగు చీకటి దోమ తెరలా వేలాడుతోంది. బాగా తెల్లవారడానికి మరో రెండుగంటలు పడుతుందనుకున్నాడు.

 

    ఇంతకీ ఎవరు ఏడుస్తున్నారో తెలియడం లేదు.

 

    అతను లేచి కూర్చున్నాడు. పరిశీలనగా బ్యారెక్కంతా చూశాడు ఏడుస్తోంది ఉత్తరుడేనని గ్రహించాడు. చప్పుడు కాకుండా పైకి లేచి ఉత్తరుడు దగ్గరకెళ్ళాడు. పక్కన కూర్చుని మెల్లగా పేరుపెట్టి పిలిచాడు.

 

    ఉత్తరుడు ఠక్కున లేచాడు. ఏడుస్తున్నందుకు సిగ్గుగా అనిపించి తల వంచుకున్నాడు. దుఃఖాన్ని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వీలు కావడం లేదు. ఆత్మీయుడన్నవాడు ఎదురుగ్గా వుండటంతో ఏడుపు మరింత ఎక్కువవుతోంది.

 

    "ఏమిటిది చిన్నపిల్లాడిలా?" తిలక్ ఓదారుస్తూ అతన్ని గట్టిగా పొదివి పట్టుకున్నాడు.

 

    "ఏం చేయను బాసూ. నాకు తెలియకుండానే బాధ మనసును మెలి పెట్టేస్తుంటే కళ్లు దానిని ఓదారుస్తున్నట్టు కన్నీళ్ళను స్రవిస్తోంది" అని తిలక్ ను మరింతగా కౌగిలించుకున్నాడు.

 

      ఆ రాత్రి నైఫ్, మరి ముగ్గురు రేప్ చేయడంతో అతను శారీరకంగానూ, మానసికంగానూ దెబ్బతిన్నాడు. మరుసటిరోజు ఇదంతా జైలర్ కి ఫిర్యాదుచేస్తే సాక్ష్యాలు కావాలన్నాడు.

 

    వార్డర్లంతా జోక్ లేసుకుని నవ్వుకున్నారే తప్ప కనీసం సానుభూతి కూడా చూపించలేదు.

 

    ఏకాంబరం మాత్రం ఉత్తరుడ్ని ఓదార్చాడు. ఇప్పుడు ఆయన చాలా మారిపోయాడు. ప్రతి ఖైదీని పేరుపెట్టి మర్యాదగా పిలుస్తున్నాడు. కన్నతండ్రిలా కష్టనష్టాలు అడిగి తెలుసుకుంటున్నాడు. వీలైనంతవరకు సహాయం చేస్తున్నాడు. ఈ మార్పుని ఖైదీలందరూ గుర్తించారుగానీ అదెలా జరిగిందో వూహించలేకపోయారు. ఆయనకు చూసినప్పుడంతా లాలస ఇచ్చిన షాక్ ట్రీట్ మెంటు గుర్తుకొచ్చేది తిలక్ కి.

 

    దాదా అతని అనుచరులు ఉత్తరుడ్ని చూసి హేళన చేయడం, కన్ను గీటడం అవన్నీ గమనిస్తూనే వున్నాడు తిలక్. తాము కూడా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. తన మనుష్యులనే బ్యారెక్కులో వేసుకొని సాక్ష్యం లేకుండా నైఫ్ ఎలా దెబ్బ కొట్టాడో అదే పంథాలోనే తాము కూడా దెబ్బ తీయాలని అతను అప్పుడే ఎత్తు వేశాడు. సమయం కోసం యెదురు చూస్తున్నాడు.

 

    "ఉత్తరా! బాధపడకు నిన్ను చూసి ఆ నైఫ్ గాడు యెలాంటి కామెంట్ చేయకుండా నేను బుద్ధి చెబుతాను. అప్పుడే నీ కసి తీరుతుంది. మరిక జన్మలో ఏ ఖైదీమీదికి పోకుండా వాడికి గుణపాఠం నేర్పుతాను బాధపడకు... నిద్రపో" అని తన సీట్లోకి వచ్చి పడుకున్నాడు తిలక్. 

 Previous Page Next Page